yeruvuవిమానాన్ని కనిపెట్టకపోయినా ఈ ప్రపంచం ఆగదు... రాకెట్లను పైకి పంపక పోయినా ఈ ప్రపంచానికేమీ కాదు. చంద్రబాబు కంప్యూటర్లను కనిపెట్టకపోయినా, హైటెక్‌ సిటీని కట్టించకపోయినా ఈ సమాజం ఆగిపోదు. కాని రైతులంతా ఒక్క సంవత్సరం పంట వేయకపోయినా ఈ ప్రపంచం ఆకలితో అల్లాడిపోతుంది. అలాంటి రైతుకు ఈ ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి?

వ్యవసాయం అన్నది పండుగ అనే స్థాయి నుండి దండగ అనే స్థాయికి దిగజా రింది. సేద్యం చేయాలంటే ప్రతిచోటా ఖర్చుతో కూడిన పనే! దుక్కిదున్నే దగ్గర్నుండి నాట్లు, కలుపు, నారు ఏత, నీళ్ళు, కరెంట్‌, పిండి, మందులు, కోతలు... ఇలా ప్రతి చోటా పెట్టుబడే! బ్యాంకులున్నా సక్రమంగా అప్పులిస్తాయా అంటే బడాబాబులకు ఇచ్చి నంత ఉదారంగా అవి రైతులకు ఇవ్వవు కదా! బయట మార్కెట్‌లో రెండు నుండి నాలుగు రూపాయల వరకు వడ్డీలతో అప్పులు చేసి సేద్యం చేయాలి. పంటను పండించాలి. ఇంత చేసి తీరా పంట చేతి కొచ్చే టైంకు మార్కెట్‌లో పంటకు గిట్టు బాటు ధర ఉండదు.

పెరిగిన పెట్టుబడులతో రైతు సత మతమవుతుంటే గోరుచుట్టు మీద రోకటి పోటులాగా ఇప్పుడు యూరియా ధరలను అమాంతం పెంచేసి రైతుపై అదనపు భారం మోపారు. ఇంతవరకు టన్ను డిఏపి ఎరువు 21,852 రూపాయలుండగా, దానిపై 2600 రూపాయలు పెంచారు. కాంప్లెక్స్‌ ఎరువు టన్ను 17వేల రూపాయ లుండగా 2240 రూపాయలు పెంచారు. పెరిగిన ధరల మూలంగా ఒక్క జిల్లా రైతాంగం మీదే 21.50కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లా అంతటా దాదాపు 5లక్షల ఎక రాలలో వరిసాగవు తుంది. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లకు సంబం ధించి ఎరువుల విని యోగం ఎక్కువుగానే వుంటుంది. అన్నీ కలిపి ఎకరాకు 35వేల దాకా ఖర్చవుతుంది. పెరిగిన ఎరువుల ధరలతో పెట్టుబడి వ్యయం మరింత పెరిగి రైతుకు భారం కానుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter