fire accident2016 పోతూ పోతూ నెల్లూరుజిల్లాలో ఓ 17 కుటుంబాలలో చీకటి నింపి పోయింది. ఇక కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా, కొందరికి కొత్త సంవత్సరాన్ని చూసే ఆశ, అవకాశం లేకుండా చేసింది. అనునిత్యం ప్రజల సంతోషాలలో భాగమైన బాణాసంచాను తయారుచేసే కార్మికుల బ్రతుకుల్లో చీకటిని చిమ్మింది.

పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, కొందరు వ్యాపారుల దురాశ... వెరసి ఒక పెను ప్రమాదానికి దారి తీసాయి. 2016 డిసెంబర్‌ 31వ తేదీన నెల్లూరుజిల్లా చరిత్రపుటలో పెద్దప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు సమీపంలోని పెన్నా పొర్లుకట్ట వద్ద వున్న బాణాసంచా గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, గురువారానికి ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మరో 8మంది మరణించారు. మిగిలినవారు 80శాతం గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మొదట బాధితులను పెద్దాసు పత్రికే తీసుకెళ్లారు. కాని అక్కడ వైద్య సదుపాయాలు ఎంత ఘోరంగా అఘో రిస్తున్నాయో తెలిసిందే కదా! అక్కడ వారికి సరైన వైద్యసదుపాయం అందించే అవకాశం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చొరవ తీసుకుని వారిని వెంటనే నారాయణ ఆసుపత్రికి తర లించారు. ప్రమాదం సంభవించింది అనుమతి లేని బాణాసంచా గోడౌన్‌లో! 50గజాల గోడౌన్‌లో 17మంది కార్మికులు పని చేస్తుండడమే ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. యం.వి.రమణయ్యశెట్టి అనే అతను ఈ బాణాసంచా గోడౌన్‌ నిర్వ హిస్తుండగా భాస్కర్‌ అనే గుమస్తా దీని వ్యవహారాలు చూస్తుంటాడు. నూతన సంవత్సర వేడుకలతో పాటు, సంక్రాంతి సంబరాలకు బాణాసంచా అమ్మకాలు ఎక్కువుగా వుంటాయనే ఉద్దేశ్యంతో కూలీ లను పెట్టి బాణాసంచా తయారు చేయిస్తు న్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్వాహకుడు భాస్కర్‌ అక్కడే వున్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువుగా ఉండడంతో అతను పరారుకాగా తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎక్కువమంది యువకులే...

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది పాతికేళ్ళలోపు యువకులే ఉండడం విచారకరం. నూనూగు మీసాల వయస్సులోనే వారికి నూరేళ్ళు నిండాయి. అందరూ గిరిజన యువకులే! ఇతర పనులకు పోవడంకంటే ఇక్కడైతే నీడపట్టున కూర్చుని పనిచేయవచ్చనే బాణాసంచా గోడౌన్‌లకు వస్తుంటారు. రోజు కూలీ కూడా రూ.500లు ఇస్తుండడంతో ఇక్కడ పనిచేయడానికి ఆసక్తితో వస్తారు. కడుపు నింపుకోవ డానికి ఏదో ఒక పని అని వస్తే... ఆ పనే వీరి పాలిట మృత్యువుగా మారింది.

ఎస్‌బి హెచ్చరికలు బేఖాతరు...

దీపావళి సమయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు నెల్లూరు సమీపంలోని అన్ని బాణాసంచా గోడౌన్‌లలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బాణాసంచా గోడౌన్‌లను గుర్తించి, వాటిని తొలగించాల్సిందిగా ఆయా పోలీస్‌స్టేషన్‌లకు సమాచార మిచ్చారు. ఆ గోడౌన్‌లలో ప్రమాదం జరిగిన భాస్కర్‌ గోడౌన్‌ కూడా వుంది. అయితే మూడో నగర పోలీసులు దీనిపై పెద్దగా స్పందించలేదు. వూరికే హెచ్చరించి వదిలేసారని తెలిసింది. ఇప్పుడు అదే గోడౌన్‌లో ప్రమాదం సంభవించడంతో మూడోనగర పోలీసుల మెడకు చుట్టుకుంది. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అప్పటి త్రీటౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణను సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రస్తుత సిఐ రామారావు సస్పెండ్‌కు సిఫారసు చేస్తూ ఐజికి లేఖ వ్రాసారు.

మొత్తానికి అధికారులు, పోలీసుల వైఫల్యం వల్ల, విధి నిర్వహణలో ఉదాసీనత వల్ల ప్రజలు ఎంతగా మూల్యం చెల్లిస్తున్నారనడానికి చితికి చిధ్రమైన ఈ బడుగుజీవుల బ్రతుకులే ఓ ఉదాహరణ.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter