pandugaపర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం పొడవునా పర్యాటకులు రావడానికి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా?

2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈ పండుగను ప్రారంభిం చారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ అయిపోయింది. పక్షుల పండుగ పేరుతో ఏటా కోట్లు తగలేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలంటూ సినిమా యాక్టర్లను తీసుకొస్తున్నారు. గత ఏడాది ఈ పండుగ రసాభసాగా మారింది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని వర్గపోరుకు ఈ పండుగ ఒక వేదికగా మారుతోంది. పక్షుల పండుగ పేరుతో మూడురోజులు హడావిడి చేసి పర్యాటకంగా మమ అనిపించడం, ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం షరా మామూలైపోయింది.

సంవత్సరంలో మూణ్ణాళ్ళ ముచ్చటగా కాకుండా సంవత్సరం పొడవునా పర్యాటకులు వచ్చేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది. నేలపట్టు, పులికాట్‌ సరస్సులతో పాటు 180 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతాలు వున్న బీచ్‌లను, సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లను, పెంచలకోన, ఉదయగిరి వంటి పర్వతకేంద్రాలను పర్యాటక అభివృద్ధికి నమూనాలుగా మార్చడంపై శ్రద్ధ చూపాలి.

flemingoమొత్తమ్మీద ఒక పెద్ద హడావిడి ముగి సింది. జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగిన పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టి వల్‌) సందర్శకులకు ఎంతో ఆనందాన్ని చ్చింది. విహంగాల విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.

అయితే, పక్షుల రాను పురస్కరించు కుని సూళ్ళూరుపేటలో ఓ రెండు రోజులు పండుగ జరిగినా, ఆ తర్వాత రోజుల్లో కూడా పక్షులు ఇక్కడికి వచ్చే పర్యాటకు లను ఆకట్టుకుంటూనే వుంటాయి. పక్షుల పండుగ కోసం విచ్చేసిన నాయకులు, అతిరధులంతా వచ్చి వెళ్ళిపోయినా.. ఈ ప్రాంతానికి అతిధులుగా వచ్చిన ఆ విదేశీ వలస పక్షులన్నీ ఇక్కడే వున్నాయి. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకుల వర్గ విభేధాలూ, ఆధిపత్య ప్రదర్శనలకు కూడా ఈ పండుగే వేదిక కావడం విమర్శ లకు దారితీసింది. అందులోనూ అందరూ ఆనందంగా పాల్గొనాల్సిన ఈ పక్షుల పండుగలో కూడా నాయకులు ఎవరికి వారే పులికాట్‌ తీరే.. అన్నట్లుగా వుండ డంతో, పండుగలో ఆశించిన ఆనందం వెల్లివిరియలేదనే విమర్శలు వచ్చాయి. కానీ, ఆ పక్షులు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా సందర్శకులను అలరి స్తూనే వున్నాయి. మార్చి నెలాఖరుదాకా కూడా అవి ఈ ప్రాంతాల్లోనే వుంటాయి. వాటికి విడిది ఇక్కడే... ఆహార విహారా దులన్నీ ఇక్కడే. అందులోనూ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజులు కనుక.. పాఠశాలలకు సెలవులు రావడంతో కన్నుల పండుగ జేసే ఆ పక్షుల సోయ గాలను తిలకించడానికి చిన్నారులు, సందర్శకులు నేలపట్టు తదితర ప్రాంతా లకు పెద్దసంఖ్యలో వస్తూనే వున్నారు. రంగు రంగుల రెక్కలతో, అందాల ముక్కు లతో కిలకిలారావాలు చేస్తూ..ఆ పక్షులు అలా ఆనందంగా ఎగురుతూ వుంటే చిన్నా రులు సంతోషంతో కేరింతలు కొడుతు న్నారు. పక్షుల అందచందాలు, వాటి విహారాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో పక్షుల విహార ప్రాంతా లైన పులికాట్‌ సరస్సు, నేలపట్టు, తడ తదితర ప్రాంతాలన్నీ పర్యాటకులతో నిత్యం రద్దీగానే వుంటున్నాయి. కాగా, పక్షుల పండుగను పురస్కరించుకుని ప్రత్యే కించి సూళ్ళూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణంలో పక్షుల పండుగ సంబరాలను రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ ప్రారంభించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో వివిధ శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్ర మాలు అందరినీ అలరించాయి. జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎం.జానకి నేతృ త్వంలో అధికారయంత్రాంగం ఈ పండుగ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దఎత్తున చిన్నారులు, విద్యార్థులు, యువత, సందర్శకులు విచ్చేసి ఈ పక్షుల పండుగలో పాల్గొని అందాల పక్షుల సోయగాలను, వాటి విహారాలను కన్ను లారా తిలకించి పులకించిపోయారు. అధికారయంత్రాంగం ఇక్కడే వుండి పర్య వేక్షణ చేస్తూ పక్షుల పండుగను విజయ వంతం చేస్తున్నారు.

పర్యాటక ప్రగతికి మరింత ప్రాధాన్యం

- మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి సూళ్ళూరుపేటలో జరిగిన పక్షుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీరప్రాంతాలతో పాటు సూళ్ళూరుపేట నియోజకవర్గం పరిధిలోని పులికాట్‌ సరస్సు తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా, సూళ్ళూరుపేట, తడ, నేలపట్టు ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. భీములవారిపాళెం పడవల రేవులో రిసార్ట్‌ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నేలపట్టు చెరువును హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి, చిన్నారుల కోసం ఇక్కడ పార్కును నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, సూళ్ళూరుపేటలో జరిగే ఈ విశిష్టమైన పండుగను రాష్ట్రస్థాయిలో విస్తరించాలన్నారు. ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ, షార్‌ నిధులతో సూళ్లూరుపేట అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మెన్‌ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. శ్రీహరికోటలోని షార్‌ ద్వారా 50 రాకెట్‌ ప్రయోగాలను పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ను ఘనంగా సత్కరించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎం.జానకి, సూళ్ళూరుపేట ఎంపిపి షేక్‌షమీమ్‌, మునిసిపల్‌ ఛైర్మెన్‌ విజయలక్ష్మి, షార్‌ కంట్రోలర్‌ జెవి రాజారెడ్డి, నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, శోభారాణి, ఆలేఖ్య, ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

flemingoప్రతి యేడాది సంక్రాంతి, దీపావళి, రంజాన్‌, క్రిస్‌మస్‌ పండుగలు వచ్చినట్లే నెల్లూరుజిల్లాలో ప్రత్యేకంగా పక్షుల పం డుగ వస్తుంది. 1999 ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌గా వున్న కె.ప్రవీణ్‌కుమార్‌ ఈ పండుగను మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరు పుతూ వస్తున్నారు. ప్రతియేటా జనవరిలో పెడుతుంటారు. ఈ సంవత్సరం కూడా జనవరి 9, 10తేదీలలో జరపాలని నిర్ణ యించారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

సైబీరియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుండి వచ్చే పక్షులకు నేలపట్టు చెరువు విడిది ప్రాంతం. పులికాట్‌ సరస్సు ఆహార కేంద్రం. పులికాట్‌లో చేపలను వేటాడడం, నేలపట్టు చెరువు మధ్యలో ఉండే చెట్లపై సేద తీరడం ఈ పక్షుల దైనందిన కార్య క్రమం. ఇక్కడ గుడ్లు పెట్టడం, గుడ్లు పొదిగి పిల్లలు కావడం, ఆ పిల్లలకు రెక్కలు వచ్చాక తిరిగి వచ్చిన దేశాలకే పోవడం... ఇదంతా కూడా ఎంతో అద్భుతమనిపిస్తుంది. గుంపులు గుంపు లుగా వున్న విదేశీ పక్షులను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. పక్షుల పండుగను మొదలుపెట్టాకే ఈ పక్షులను చూడడానికి వచ్చే పర్యాటకులు పెరిగారు.

ఇంతవరకు ఒక సబ్జెక్ట్‌ అయితే, జిల్లాలో పర్యాటక రంగానికి సంబంధించి ఈ రెండు మూడు రోజులు ప్రాధాన్యత నివ్వడం తప్ప మిగతా సంవత్సరం పొడ వునా దాని ఊసే ఎత్తడం లేదు. రెండు రోజులు పక్షుల పండుగ జరపడంతో పర్యాటక ప్రగతిని మమ అనిపిస్తున్నారు. ఆ రెండురోజులు తప్పితే మిగతారోజుల్లో పర్యాటక ప్రాంతాలకు పోవడానికి పర్యాట కులకు ఎలాంటి సదుపాయాలు ఉండడం లేదు. మూడు నెలలు పక్షుల సీజన్‌. నేల పట్టు పక్షుల కేంద్రం వద్దకు మిగతా రోజుల్లో వెళ్లాలంటే వాహన సౌకర్యం లేదు. చాలా మందికి అసలు నేలపట్టు ఎక్కడ వుందో కూడా తెలియదు. కనీసం పక్షుల సీజన్‌లోనైనా సెలవురోజుల్లో అక్కడకు సూళ్లూరుపేట, నాయుడుపేట వంటి ప్రాంతాల నుండి ప్రత్యేక వాహ నాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చొరవ చూపాలి. జిల్లాలో పులికాట్‌ సరసుతో పాటు కోడూరు, మైపాడు, తూపిలిపాలెం బీచ్‌లు, సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లు, పెంచలకోన, సిద్ధేశ్వరం, ఉదయగిరి వంటి పర్యాటక కేంద్రాలను ఒక టూరిజం ప్యాకేజీగా ఏర్పాటు చేసి సెలవు దినాలలో వాహనాలను ఏర్పాటు చేస్తూ పర్యాటకులకు వాటిని చూపిస్తుంటే జిల్లాలోనూ టూరిజం క్రమక్రమంగా అభివృద్ధి చెందే అవకాశముంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter