flemingosకొందరు గోవుల్ని పూజిస్తారు..మరికొందరు చెట్లను పూజిస్తారు. ఇంకొందరు నాగుల్ని దేవుళ్ళుగా కొలుస్తారు. అయితే, ప్రకృతినీ, పర్యావరణాన్నీ మరింతగా ప్రేమించే ఈ జిల్లావాసులు మాత్రం..వాటన్నిటితో పాటు ప్రత్యేకించి పక్షులను మరింత అభిమానంతో చూస్తారు. వాటిని దేవతలుగా కూడా ఆరాధిస్తారు. ఇప్పటికీ నేలపట్టు, తడ, దొరవారిసత్రం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ పక్షులను దేవతా పక్షులనే పిలుస్తారు. రంగురంగుల రెక్కలతో, ఎంతో ఆహ్లాదం కలిగించే ఈ విదేశీ వలస పక్షుల విహారాన్ని చూడడం అందరికీ ఎంతో ఇష్టం కూడా. అందుకే ప్రభుత్వం ఆ ఆహ్లాదాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో ఏడాదికోసారి పెద్దఎత్తున 'పక్షుల పండుగ' నిర్వహిస్తుండడం ఎంతో అభినందనీయం. అందులోనూ ఇలాంటి విశిష్టమైన పక్షుల పండుగ ఈ జిల్లాకే సొంతం కావడం జిల్లా అదృష్టమనే చెప్పాలి. జిల్లా అధికారయంత్రాంగం ఈ నెల 9,10 తేదీల్లో సూళ్ళూరుపేటలో ఎంతో వేడుకగా.. కనువిందుగా ఈ పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టివల్‌) నిర్వహిస్తోందన్నారు. మరోవైపు పర్యాటకులు, పక్షిప్రేమికులు, బాలబాలికలు, విద్యార్థులు, పిల్లలు-పెద్దలు, ప్రముఖులు అందరూ పక్షులను తిలకించేందుకు విచ్చేస్తారు కనుక, ఆయా ప్రాంతాల్లో పక్షుల సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.

పండుగకు అతిధులంతా విచ్చేశారు.. ఇక పండుగ సందడి సంగతి వేరే చెప్పాలా?.. అందులోనూ పక్షుల పండుగ అంటే సంబరం అంతా ఇంతా కాదు. ఈ పక్షులు కూడా అత్యధికం విదేశాల నుంచి వచ్చే వలస పక్షులే. ఎంతెంతో దూరం నుంచి.. దూరదేశాల నుంచి సము ద్రాల మీదుగా ఎగురుతూ ఇక్కడికి వచ్చే ఫ్లెమింగోలు, ఫెలికాన్‌లు వగైరా పక్షులన్ని టికీ ఈ జిల్లా ఒక విడిది ప్రాంతం కావడం విశేషం. నేలపట్టు అంటేనే పక్షులకు ఆట పట్టుగా వుంటుంది. ఇక పులికాట్‌ సర స్సంటే పక్షులకు ఆహార విహార సరస్సేనని చెప్పవచ్చు. ఆసియా ఖండంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్‌. ఇది ఆంధ్ర-తమిళ నాడు సరిహద్దుల్లో వుంది. దాదాపు 6 వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వుంది. ఎక్కువగా ఈ పక్షులు తడ, దొర వారిసత్రం, సూళ్ళూరుపేట మండలాల ప్రాంతాల్లో విస్తరించివున్న పులికాట్‌ సరస్సులో విహరిస్తుంటాయి. 'పక్షుల పేరడైజ్‌'గా పేరొందిన ఈ సరస్సులో దిగి చేపలను, క్రిమికీటకాదులను ఆహారంగా స్వీకరిస్తుంటాయి. అందుకే పులికాట్‌ సరస్సు విదేశీ వలసపక్షుల ఆహారభాండా గారంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఈ పక్షు లన్నీ ఆ ప్రాంతాల్లో ఆహార విహారాదులు పూర్తిచేసుకుని తిరిగి దొరవారిసత్రం మండలంలోని నేలపట్టుకు వెళ్ళి అక్కడున్న మడ చెట్లపై నివసిస్తుంటాయి. ప్రతి ఏటా అక్టోబర్‌ నుంచి మార్చి నెలాఖరు దాకా దేశ విదేశాలకు చెందిన దాదాపు లక్ష లాది పక్షులు ఈ ప్రాంతాలకు వస్తుం టాయి. అందువల్ల సూళ్ళూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాల్లోని ఆ ప్రాంతాలన్నీ ఈ పక్షుల కిలకిలారావాలతో కళకళగా వుంటాయి. అవన్నీ ఇక్కడే ఆహారం స్వీకరించి.. తమ విహారంతో అందరినీ అలరించి ప్రతిఏటా కొద్దికాలం పాటు ఇక్కడే నివసిస్తాయి. ఇక్కడే గుడ్లు పెట్టి..వాటిని పొదిగి పిల్లలను చేసి, ఆ పిల్లలకు రెక్కలొచ్చేదాకా ఇక్కడి చెట్లపైనే వుండి, తమ సంతతిని వృద్ధి చేసుకుని, అవి పెద్దవయ్యాక ఆ పిల్లలతో సహా ఇక్కడినుంచి తిరిగి తమ స్వస్థలాలకు ఎగిరి వెళ్ళిపోతుంటాయి. ఈ విశేషమైన పక్షులను ఇక్కడి గ్రామాల్లో ప్రజలు నేటికీ 'దేవతా పక్షులు'గానే పిలుస్తుంటారు. వీటి రాకను గ్రామస్తులు అదృష్టంగా భావిస్తుంటారు. అంతేకాదు, ఆ పక్షిదేవతలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వాటికి ఎలాంటి హానీ జరగకుండా చూస్తారు.

ఫ్లెమింగో, పెలికాన్‌ల సోయగాలు :

ఈ ప్రాంతాలకు దాదాపు 150 రకాల పక్షులు వచ్చి సందర్శకులను కను విందు చేస్తుంటాయి. వీటిలో అత్యధి కంగా వచ్చే ఫ్లెమింగో పక్షులు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా సైబీరియా-నైజీరియాల నుంచి గూడబాతులు(పెలికాన్‌లు) పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. వీటి అందాలు అందరినీ అలరిస్తుంటాయి. ఈ పక్షుల ఆవాస, విహార ప్రాంతాలుగా వున్న పులి కాట్‌, నేలపట్టు ప్రాంతాలు పక్షుల రక్షిత ప్రాంతాలుగా కూడా గుర్తింపులోకి వచ్చాయి. దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు ప్రాంతం ఈ వలస పక్షులకు నివాస స్థానం. ఇక్కడ ప్రకృతి వాతా వరణం కూడా ఎంతో ఆహ్లాదంగా వుం టుంది. ఇక్కడున్న మంచినీటి చెరువులో పెరిగిన మడ చెట్లు ఈ పక్షులకు గూళ్ళు కట్టుకుని నివసించేందుకు వీలుగా వుంటాయి. ఆహారానికీ ఎలాంటి లోటూ వుండదు. ఎక్కువగా గూడబాతు కొంగలు ఇక్కడ నివసిస్తుంటాయి. సమీపంలోని వెదురుపట్టు ప్రాంతం ఎర్రకాళ్ళ కొంగ లకు శీతాకాలపు విడిదిగా వుంటుంది. ఇంకా తడ, అటకానితిప్ప, భీమునివారి పాళెం, ఇరకం దీవి, సూళ్ళూరుపేట, దొర వారి సత్రం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పక్షులు విహరిస్తుంటాయి. ఈ పక్షులతో పాటు ఇక్కడి స్వాతి కొంగలు, తెల్ల కంకణాయిలు, పాలపిట్టలు వగైరాలన్నీ కూడా కలసి విహరిస్తుంటాయి. అటు ప్రకృతిని శోభాయమానం చేస్తూ, ఇటు పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తూ.. అనాదిగా ఈ జిల్లాకు వస్తున్న ఈ వేలాది విహంగాల విహారాలను కళ్ళారా చూడడం, వాటి కిలకిలాారావా లను చెవులారా వినడం నిజంగానే ఒక అదృష్టం. అందుకే వాటి రాకే ఒక సంబ రంగా జిల్లాలో పక్షులపండుగ భారీగా జరుగుతోంది. ప్రత్యేకించి సూళ్ళూరుపేట లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవ రణం ఈ పండుగ వేదికగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ పండుగను పురస్క రించుకుని శాఖలవారీగా వివిధ రకాల స్టాల్స్‌ ఏర్పాటుచేశారు. అందరినీ అల రించే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్‌ షోలు, నవ్వుల బజార్‌ తదితర కార్యక్రమా లన్నీ ఏర్పాటు చేశారు. చిన్నారులు, విద్యార్థులెంతో మంది ఈ సందర్భంగా పక్షుల గురించి ఎంతో ఆసక్తితో తెలుసు కుంటూ వుంటారు కూడా. 'పక్షుల పం డుగ' అంటే.. అదొక ప్రకృతి ఆరాధన.. సాటి ప్రాణులైన పక్షుల పట్ల ఎనలేని ప్రేమారాధన. అందుకే, ఈ పండుగతో.. ఈ సంక్రాంతి రోజుల్లో జిల్లాకు ముందస్తు పెద్దపండుగ వచ్చినట్లయింది. పక్షుల పండుగ పెద్దపండుగలా ఇంటిల్లి పాదీ అందరూ కలసి ఆనందంగా జరుపు కుంటూ ఈ అందమైన పక్షుల విహారాన్ని చూడగలగడం ఎంతైనా ఒక మధురాను భూతి. పిల్లలు పెద్దలూ అందరూ ఎంతో ఇష్టపడే ఈ పక్షుల పండుగకు మనమూ వెళ్దామా!...

flemingoప్రతి యేడాది సంక్రాంతి, దీపావళి, రంజాన్‌, క్రిస్‌మస్‌ పండుగలు వచ్చినట్లే నెల్లూరుజిల్లాలో ప్రత్యేకంగా పక్షుల పం డుగ వస్తుంది. 1999 ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌గా వున్న కె.ప్రవీణ్‌కుమార్‌ ఈ పండుగను మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరు పుతూ వస్తున్నారు. ప్రతియేటా జనవరిలో పెడుతుంటారు. ఈ సంవత్సరం కూడా జనవరి 9, 10తేదీలలో జరపాలని నిర్ణ యించారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

సైబీరియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుండి వచ్చే పక్షులకు నేలపట్టు చెరువు విడిది ప్రాంతం. పులికాట్‌ సరస్సు ఆహార కేంద్రం. పులికాట్‌లో చేపలను వేటాడడం, నేలపట్టు చెరువు మధ్యలో ఉండే చెట్లపై సేద తీరడం ఈ పక్షుల దైనందిన కార్య క్రమం. ఇక్కడ గుడ్లు పెట్టడం, గుడ్లు పొదిగి పిల్లలు కావడం, ఆ పిల్లలకు రెక్కలు వచ్చాక తిరిగి వచ్చిన దేశాలకే పోవడం... ఇదంతా కూడా ఎంతో అద్భుతమనిపిస్తుంది. గుంపులు గుంపు లుగా వున్న విదేశీ పక్షులను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. పక్షుల పండుగను మొదలుపెట్టాకే ఈ పక్షులను చూడడానికి వచ్చే పర్యాటకులు పెరిగారు.

ఇంతవరకు ఒక సబ్జెక్ట్‌ అయితే, జిల్లాలో పర్యాటక రంగానికి సంబంధించి ఈ రెండు మూడు రోజులు ప్రాధాన్యత నివ్వడం తప్ప మిగతా సంవత్సరం పొడ వునా దాని ఊసే ఎత్తడం లేదు. రెండు రోజులు పక్షుల పండుగ జరపడంతో పర్యాటక ప్రగతిని మమ అనిపిస్తున్నారు. ఆ రెండురోజులు తప్పితే మిగతారోజుల్లో పర్యాటక ప్రాంతాలకు పోవడానికి పర్యాట కులకు ఎలాంటి సదుపాయాలు ఉండడం లేదు. మూడు నెలలు పక్షుల సీజన్‌. నేల పట్టు పక్షుల కేంద్రం వద్దకు మిగతా రోజుల్లో వెళ్లాలంటే వాహన సౌకర్యం లేదు. చాలా మందికి అసలు నేలపట్టు ఎక్కడ వుందో కూడా తెలియదు. కనీసం పక్షుల సీజన్‌లోనైనా సెలవురోజుల్లో అక్కడకు సూళ్లూరుపేట, నాయుడుపేట వంటి ప్రాంతాల నుండి ప్రత్యేక వాహ నాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చొరవ చూపాలి. జిల్లాలో పులికాట్‌ సరసుతో పాటు కోడూరు, మైపాడు, తూపిలిపాలెం బీచ్‌లు, సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లు, పెంచలకోన, సిద్ధేశ్వరం, ఉదయగిరి వంటి పర్యాటక కేంద్రాలను ఒక టూరిజం ప్యాకేజీగా ఏర్పాటు చేసి సెలవు దినాలలో వాహనాలను ఏర్పాటు చేస్తూ పర్యాటకులకు వాటిని చూపిస్తుంటే జిల్లాలోనూ టూరిజం క్రమక్రమంగా అభివృద్ధి చెందే అవకాశముంది.

tourismఏడాదికోసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చెమట కార్చుతూ కృషి చేస్తూన్నామని చెప్పుకోవడం ప్రజాప్రతినిధులకు పరిపాటయ్యింది. జిల్లాలో పర్యాటక అంకమంటే ఏడాదికోసారి పక్షుల పండుగ నిర్వహించడమే అన్నట్లుగా పరిస్థితి వుంది. సంవత్సరానికోసారి పర్యాటకులు రావడం, పర్యాటక కేంద్రాలను చూడడం కాదు. సంవత్సరం పొడవునా పర్యాటకులు వచ్చే విధంగా సౌకర్యాలు ఉంటేనే అవి మంచి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ సీజన్ లో నేలపట్టు, పులికాట్ లకు విదేశీ విహంగాలు వస్తుంటాయి. కాబట్టి జనవరిలో వీటి కోసం ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే పక్షులను చూడగలం. పులికాట్ సరస్సుకు ఈ ఫ్లెమింగో ఫెస్టివలం జరిగే రెండురోజుల్లో మాత్రమే పర్యాటకులు వస్తుంటారు. ఏడాది పొడవునా ఇక్డ బోటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంటుంది.

జిల్లాలో సోమశిల, కండ్లేరు రిజర్వాయర్ లను మంచి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. రిజర్వాయర్ లలో బోటింగ్, అతిథిగృహాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. అలాగే పెంచలకోన ప్రకృతి రమణీయంగా వుంటుంది. ఉదయగిరి కొండ, మైపాడు, కొత్తకోడూరు బీచ్ వంటి వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై జిల్లా మంత్రి దృష్టిపెట్టాలి.

Page 2 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter