pandugaపర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం పొడవునా పర్యాటకులు రావడానికి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా?

2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈ పండుగను ప్రారంభిం చారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ అయిపోయింది. పక్షుల పండుగ పేరుతో ఏటా కోట్లు తగలేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలంటూ సినిమా యాక్టర్లను తీసుకొస్తున్నారు. గత ఏడాది ఈ పండుగ రసాభసాగా మారింది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని వర్గపోరుకు ఈ పండుగ ఒక వేదికగా మారుతోంది. పక్షుల పండుగ పేరుతో మూడురోజులు హడావిడి చేసి పర్యాటకంగా మమ అనిపించడం, ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం షరా మామూలైపోయింది.

సంవత్సరంలో మూణ్ణాళ్ళ ముచ్చటగా కాకుండా సంవత్సరం పొడవునా పర్యాటకులు వచ్చేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది. నేలపట్టు, పులికాట్‌ సరస్సులతో పాటు 180 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతాలు వున్న బీచ్‌లను, సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లను, పెంచలకోన, ఉదయగిరి వంటి పర్వతకేంద్రాలను పర్యాటక అభివృద్ధికి నమూనాలుగా మార్చడంపై శ్రద్ధ చూపాలి.

fleming fesపక్షుల పండుగ పేరుతో ఈసారి 3కోట్ల రూపాయలు పులికాట్‌ నీళ్లలో పోసారు. పక్షులు లేకుండానే ఈసారి పక్షుల పండుగ జరిపించారు. ఇది మరీ విచిత్రం. ప్రతి ఏడాది మాదిరిగానే 2016 డిసెంబర్‌27, 28, 29తేదీలలో సూళ్లూరుపేట కేంద్రంగా పక్షుల పండుగను పెట్టారు. దీనికోసం 3కోట్లు కేటాయించారు. అయితే ప్రతి ఏటా జరుపుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం జరపకపోతే బాగుండదన్నట్లు ఈ పండుగ నిర్వహించారు. కాని ఏ పక్షుల పేరుతో అయితే పండుగ నిర్వహించారో, ఈసారి ఆ పక్షులే లేకుండాపోయాయి. గత ఏడాది వర్షాలు లేవు. దీంతో నేలపట్టు, పులికాట్‌లలో నీళ్లు తగ్గాయి. నవంబర్‌ నెలకల్లా పక్షులు రావాలి. కాని ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల విదేశీ పక్షులు రాలేదు. జిల్లా అధికారులు మాత్రం చెప్పిన టైంకు పండుగ ఏర్పాట్లు చేసారు. పెద్దఎత్తున పబ్లిసిటీ చేసారు. పండుగ ప్రారంభం రోజున స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్యను వేదిక మీదకు పిలవలేదు. అలిగివెళ్లిన సంజీవయ్యను ఎమ్మెల్సీ వాకాటి తీసుకొచ్చి స్టేజీ ఎక్కించారు. మూడోరోజు ముగింపు సభను కూడా అదరా బదరా నిర్వహించారు. ముగింపుసభకు ముగ్గురు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు వచ్చారు. అదరాబదరా వచ్చి ప్రసంగాలు ముగించారు. అసలు పక్షులు పండుగ ఎందుకు చేస్తున్నారని గాని, పర్యాటక పరంగా పులికాట్‌, నేలపట్టుల అభివృద్ధికి తీసుకునే చర్యలు గురించిగాని వాళ్లు మాట్లాడలేదు. సిద్ధడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా మంత్రులు ముగింపుసభకు వచ్చి వెళ్లి పోయారు. ఆ తర్వాత సినీ యాక్టర్లు, సింగర్ల చేత సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించి పక్షుల పండుగను 'మమ' అనిపించారు.

జిల్లాలో పర్యాటక ప్రగతి అన్నది నేతల మాటల్లో, పత్రికల రాతల్లో తప్పితే ఆచరణ రూపం దాల్చడం లేదు. ప్రతి సంవత్సరం కూడా పక్షుల పండుగ జరిపించడంతోటే ఏదో పర్యాటక రంగాన్ని ఉద్ధరిస్తామనుకుంటున్నారు. అసలు ప్రతి ఏటా పక్షుల పండుగ పేరుతో తగలేస్తున్న డబ్బులతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వున్నా కొంతలో కొంత పర్యాటక అభివృద్ధి జరిగి ఉండేది.

flemingoమొత్తమ్మీద ఒక పెద్ద హడావిడి ముగి సింది. జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగిన పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టి వల్‌) సందర్శకులకు ఎంతో ఆనందాన్ని చ్చింది. విహంగాల విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.

అయితే, పక్షుల రాను పురస్కరించు కుని సూళ్ళూరుపేటలో ఓ రెండు రోజులు పండుగ జరిగినా, ఆ తర్వాత రోజుల్లో కూడా పక్షులు ఇక్కడికి వచ్చే పర్యాటకు లను ఆకట్టుకుంటూనే వుంటాయి. పక్షుల పండుగ కోసం విచ్చేసిన నాయకులు, అతిరధులంతా వచ్చి వెళ్ళిపోయినా.. ఈ ప్రాంతానికి అతిధులుగా వచ్చిన ఆ విదేశీ వలస పక్షులన్నీ ఇక్కడే వున్నాయి. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకుల వర్గ విభేధాలూ, ఆధిపత్య ప్రదర్శనలకు కూడా ఈ పండుగే వేదిక కావడం విమర్శ లకు దారితీసింది. అందులోనూ అందరూ ఆనందంగా పాల్గొనాల్సిన ఈ పక్షుల పండుగలో కూడా నాయకులు ఎవరికి వారే పులికాట్‌ తీరే.. అన్నట్లుగా వుండ డంతో, పండుగలో ఆశించిన ఆనందం వెల్లివిరియలేదనే విమర్శలు వచ్చాయి. కానీ, ఆ పక్షులు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా సందర్శకులను అలరి స్తూనే వున్నాయి. మార్చి నెలాఖరుదాకా కూడా అవి ఈ ప్రాంతాల్లోనే వుంటాయి. వాటికి విడిది ఇక్కడే... ఆహార విహారా దులన్నీ ఇక్కడే. అందులోనూ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజులు కనుక.. పాఠశాలలకు సెలవులు రావడంతో కన్నుల పండుగ జేసే ఆ పక్షుల సోయ గాలను తిలకించడానికి చిన్నారులు, సందర్శకులు నేలపట్టు తదితర ప్రాంతా లకు పెద్దసంఖ్యలో వస్తూనే వున్నారు. రంగు రంగుల రెక్కలతో, అందాల ముక్కు లతో కిలకిలారావాలు చేస్తూ..ఆ పక్షులు అలా ఆనందంగా ఎగురుతూ వుంటే చిన్నా రులు సంతోషంతో కేరింతలు కొడుతు న్నారు. పక్షుల అందచందాలు, వాటి విహారాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో పక్షుల విహార ప్రాంతా లైన పులికాట్‌ సరస్సు, నేలపట్టు, తడ తదితర ప్రాంతాలన్నీ పర్యాటకులతో నిత్యం రద్దీగానే వుంటున్నాయి. కాగా, పక్షుల పండుగను పురస్కరించుకుని ప్రత్యే కించి సూళ్ళూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణంలో పక్షుల పండుగ సంబరాలను రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ ప్రారంభించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో వివిధ శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్ర మాలు అందరినీ అలరించాయి. జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎం.జానకి నేతృ త్వంలో అధికారయంత్రాంగం ఈ పండుగ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దఎత్తున చిన్నారులు, విద్యార్థులు, యువత, సందర్శకులు విచ్చేసి ఈ పక్షుల పండుగలో పాల్గొని అందాల పక్షుల సోయగాలను, వాటి విహారాలను కన్ను లారా తిలకించి పులకించిపోయారు. అధికారయంత్రాంగం ఇక్కడే వుండి పర్య వేక్షణ చేస్తూ పక్షుల పండుగను విజయ వంతం చేస్తున్నారు.

పర్యాటక ప్రగతికి మరింత ప్రాధాన్యం

- మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి సూళ్ళూరుపేటలో జరిగిన పక్షుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీరప్రాంతాలతో పాటు సూళ్ళూరుపేట నియోజకవర్గం పరిధిలోని పులికాట్‌ సరస్సు తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా, సూళ్ళూరుపేట, తడ, నేలపట్టు ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. భీములవారిపాళెం పడవల రేవులో రిసార్ట్‌ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నేలపట్టు చెరువును హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి, చిన్నారుల కోసం ఇక్కడ పార్కును నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, సూళ్ళూరుపేటలో జరిగే ఈ విశిష్టమైన పండుగను రాష్ట్రస్థాయిలో విస్తరించాలన్నారు. ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ, షార్‌ నిధులతో సూళ్లూరుపేట అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మెన్‌ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. శ్రీహరికోటలోని షార్‌ ద్వారా 50 రాకెట్‌ ప్రయోగాలను పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ను ఘనంగా సత్కరించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎం.జానకి, సూళ్ళూరుపేట ఎంపిపి షేక్‌షమీమ్‌, మునిసిపల్‌ ఛైర్మెన్‌ విజయలక్ష్మి, షార్‌ కంట్రోలర్‌ జెవి రాజారెడ్డి, నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, శోభారాణి, ఆలేఖ్య, ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter