autosనెల్లూరు నగరంలో ప్రజలకు సమస్యగా, పోలీసులకు సవాల్‌గా వుండేది ట్రాఫిక్‌. భారత్‌కు చైనాతో డోక్లామ్‌ సరిహద్దు వివాదమన్నా పరిష్కారమవుతుందేమోగాని, ఈ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం అంత సులభంగా లభించదు.

నెల్లూరు నగరంలో 70శాతం ట్రాఫిక్‌ అయ్యప్పగుడి, ఆత్మకూరు బస్టాండ్‌ల మధ్య వున్న ట్రంకురోడ్డు పైనే నడుస్తుంది. ఇటీవలకాలంలో మినీబైపాస్‌ రోడ్డు మీదకు ట్రాఫిక్‌ డైవర్ట్‌ కాబట్టి ట్రంకురోడ్డుపై కొంత ఒత్తిడి తగ్గింది. లేకుంటే ట్రంకురోడ్డులో ట్రాఫిక్‌ ఇంకా నరకంగా వుండేది. నెల్లూరులో ట్రాఫిక్‌కు ప్రధాన కారణం ఆటోలు. గతంలో దాదాపు 200 టౌన్‌బాస్సులుండేవి. ఆటోలు పెరిగి అవి తగ్గిపోయాయి. ఇప్పుడు నెల్లూరులో వున్నన్ని ఆటోలు మెట్రోసిటీలో కూడా వుండవేమోననిపిస్తుంది. ట్రంకురోడ్డులో ఎప్పుడు చూసినా ఆటోల ర్యాలీ జరుగుతున్నట్లుగా వుంటుంది. ట్రాఫిక్‌ను సరిదిద్దడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆటోలపై దృష్టిపెట్టారు. ఆటోలకు కొన్ని ఆంక్షలు విధించారు. ఆటోలకు పోలీసుస్టేషన్‌ల వారీగా నెంబర్లు ఇస్తారు. ప్రయాణీకులను పరిమితికి మించి ఎక్కించుకుంటే ఇక భారీ జరిమానాలు కట్టాల్సిందే! ఆటో కెపాసిటి ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే. కాని, ఏ ఆటోలోనూ ఐదారు మందికి తక్కువ వుండరు. ఇక నిర్మాణ పనులకు కూలీలను తీసుకెళ్లే ఆటోలలో అయితే పదిమందికి తక్కువ వుండరు. దీనిపై పోలీ సులు ఇక గట్టిగా వుంటారు. పరిమితికి మించి ఎక్కిస్తే కేసులే! నగరంలో ఆటోలకు ఒక పద్ధతి పాడూ లేకుండా నడుస్తుంటాయి. ప్రయాణీకుడు చెయ్యెత్తితే నడిరోడ్డు మీద కూడా ఆటోలను ఆపేసి ఎక్కించుకుంటుంటారు. దీనివల్ల వెనుకవైపు ఎంతో ట్రాఫిక్‌ ఆగిపోతుంది. ఇకనుండి నిర్ణీత స్టాపింగ్‌లలో మాత్రమే ఆటోలను నిలిపి ప్రయాణీకులను ఎక్కించుకోవాల్సి వుంటుంది. ఆటో యజమానులు తమ ఆటోలను లైసెన్స్‌ లేని వారికి ఇచ్చినా, మైనర్లకు ఇచ్చినా యజమానులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలైన ముత్తుకూరు, టి.పి.గూడూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, బుచ్చి, నెల్లూరురూరల్‌ మండలం, వెంకటాచలం, పొదల కూరు మండలాలలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజూ వేలసంఖ్యలో ఆటోలు ప్రయాణీకులతో నెల్లూరు నగరంలోకి ప్రవేశిస్తుంటాయి. నగరంలోని ట్రాఫిక్‌పై ఇవి అదనపు భారం. ఈ ప్రాంతాల ఆటోలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా మండలాల వైపు నుండి వచ్చే ఆటోలను నగర శివార్లలోని ప్రాంతాల వరకే అనుమతిస్తారు. పరిధి దాటి లోపలకు వస్తే చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ట్రంకురోడ్డుపై కొంతవరకన్నా ఆటోలు తగ్గుతాయి. ఈ నిబంధ నలను ఖచ్చితంగా అమలు చేస్తే కొంతవరకన్నా నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

ramaraoరాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే! ఈ కేసులో ప్రధాన సూత్రధారులు ఉదయగిరి ప్రాంతానికి చెందిన తెలుగు దేశం, వైకాపా, బీజేపీ నాయకులు. వీళ్ళే దళారుల అవతారమెత్తి బయట జిల్లాల నుండి పెద్దఎత్తున పసుపు కొనుగోలు చేసి

ఉదయగిరి కొనుగోలు కేరద్రంలో మద్దతు ధరకు అమ్ముకుని లక్షలాది రూపాయలు సంపాదించారు. అధికారులు, విఆర్‌ఓల మీద ఒత్తిళ్లు తెచ్చి ఉదయగిరి ప్రాంతంలోనే పసుపు సాగు చేసినట్లుగా సర్టిఫికేట్లు ఇప్పించుకున్నారు. అధికార పార్టీ నాయ కుల అండ వుంది కదా, ఏమొచ్చిన వాళ్ళు చూసుకుంటారనే ధైర్యంతో పసుపు సాగు చేయకున్నా చేసినట్లు సర్టిఫికేట్లు ఇచ్చారు. విఆర్‌ఓల సర్టిఫికేట్ల ఆధారంగా మార్క్‌ఫెడ్‌ వాళ్ళు పసుపు కొనుగోలు చేసారు. మీడియాలో దీని గురించి రాకుంటే సైలెంట్‌ గానే వుండేది. మీడియాలో వచ్చాక రచ్చరచ్చయ్యింది. ఎవరి పాటికి వాళ్ళు దీని నుండి బయటపడే ప్రయత్నం చేయసాగారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగి సర్టిఫికేట్లు ఇచ్చిన పాపానికి 19మంది విఆర్‌ఓలు సస్పెండయ్యారు. మరికొంతమంది అధికా రుల మీద చర్యలు తీసుకున్నారు. వైసిపి నాయకులతో పాటు ఈ పసుపు దందాలో ప్రధానపాత్ర పోషించిన ఉదయగిరి ప్రాంత తెలుగుదేశం నాయకుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్లంతా కూడా స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మీద ఒత్తిడి తెచ్చారు. ఈ మాత్రం మమ్మల్ని కాపాడలేకపోతే మీ వెనుక మేం తిరగడం దండగ కదా అని బొల్లినేనిని ఎత్తిపొడవ సాగారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డాడు. ఈ కేసుల్లో

ఉన్నోళ్లంతా రేపు తనకు దూరమైతే పోలింగ్‌ బూత్‌ దగ్గర పని చేసే నాయకుడు వుండడని భావించి, వాళ్లను ఈ కేసు నుండి కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే పసుపు దందాపై 8వ తేదీ తొలిసారిగా నోరు విప్పాడు. కలిగిరిలో విలేకరుల సమావేశం నిర్వహించి తప్పందా అధికారులదేనని చెప్పారు. పసుపు కొనుగోలు విచారణ పక్కదారి పట్టిందని, దీనిపై సక్రమంగా విచారణ జరిపి దోషు లను పట్టుకుని శిక్షించాలని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఆయన చివరికి తేల్చిందేందంటే రాజకీయ నాయకులు ఆడే గేమ్‌లో అధికారులు ఎప్పుడూ బకరాలేనని!

bollineni ramజిల్లాలో పసుపు కొనుగోలు అక్రమాల సంగతేమోగాని దీనిమూలంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు పెద్ద చిక్కొచ్చిపడింది.

పసుపు కొనుగోలు వ్యవహారాన్ని పెద్దకుంభకోణంగా చిత్రించిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విచారణకు ఆదేశించి భారీ ఎత్తున ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. ఈ భాగోతంలో అసలు పాత్రధారులు ఉదయగిరి ప్రాంతానికి చెందిన తెలుగు దేశం, బీజేపీ, వైసిపి నాయకులు. అధికా రంలో లేరు కాబట్టి వైకాపా నేతలను కేసుల నుండి బయటపడేసే పరిస్థితి లేదు. కాని, తెలుగుదేశం నాయకుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై అధికారపార్టీ నాయకులు మండి పడుతున్నారు.

మేమేమన్నా దొంగతనం చేసామా? దోపిడీలు చేసామా? లేని వస్తువును వున్నట్లు చూపించి ప్రభుత్వ నిధులను దోచేసామా? పసుపును రైతుల వద్ద తక్కువ ధరకు కొని ఇక్కడ మద్దతుధరకు అమ్ముకుని నాలుగు రూపాయలు సంపా దించుకున్నాం. కాకపోతే ఇక్కడే పసుపును సాగు చేసినట్లు విఆర్‌ఓల దగ్గర సర్టి ఫికేట్లు తీసుకున్నాం. అధికారపార్టీలో వున్నాం. ఎలక్షన్‌లలో పార్టీ జెండాలు మోసాం, ఓటర్ల చుట్టూ తిరిగి పార్టీకి ఓట్లేయించాం, పార్టీ కోసం మేం ఇంత చేస్తే చివరకు మా మీదే కేసులు పెడ తారా? ఇందుకేనా మేం పార్టీలో వుండేది అంటూ ఉదయగిరి తెలుగుదేశం నేతలు స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావును నిలదీస్తున్నారు.

దీంతో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయా రయ్యింది. ఓ పక్క ప్రభుత్వమేమో పసుపు వ్యవహారంపై సీరియస్‌గా వుంది. ఎవర్నీ వదిలే ప్రసక్తేలేదని, పసుపు నిందితులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఈ చంద్ర బాబు చంఢశాసనుడని, అన్యాయాలను, అక్రమాలను సహించడని చాటుకోవాలను కుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే పసుపు అక్రమాలపై దృష్టి పెట్టి చర్యలకు ఆదేశించడంతో జిల్లాలో మంత్రులు తమ పార్టీ వారిని కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. మంత్రులకే సీన్‌లేకపోతే ఇక ఎమ్మెల్యేగా బొల్లినేని ఏం చేయగలడు? అలాగని తన వర్గీయులను ఈ కేసుల నుండి కాపాడుకోలేకపోతే, ఇక అతనిని నమ్మి నాయకులెవరూ వెనుక నడిచే పరి స్థితి లేదు.

బొల్లినేనిలో ఇదే ఆందోళన కనిపి స్తోంది. ఈ కేసుల నుండి తన వర్గీయు లను కాపాడుకోలేకపోతే నియోజకవర్గంలో ఇది ఆయనకు పెద్ద డామేజ్‌ అవుతుంది. అలాగని ఇక్కడ నాయకులపై చర్యలు తీసు కోకపోతే రాష్ట్రస్థాయిలో ప్రతిపక్షానికి ఇదో ప్రచార అస్త్రమవుతుంది. కాబట్టి ఉదయ గిరి తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడం ఎమ్మెల్యే బొల్లినేనికి తలకు మించిన పనే! కేసులు నమోదై ఇక్కడ తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకుంటే మాత్రం ఉదయగిరి రాజకీ యాలలో మున్ముందు పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

Page 1 of 42

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • వీడుతున్న సంకెళ్ళు
  రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter