reddysరాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఏ పార్టీ ప్రభంజనం కూడా పని చేయలేదు. కేవలం నాయకుడి సమర్ధతకు ప్రజలు పెద్దపీట వేసారు.

ఉదయగిరి నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ బలమైన సామాజికవర్గాలు. ఈ రెండువర్గాల నుండే ప్రధానపార్టీల అభ్యర్థులు రంగంలోకి వస్తుంటారు. ఆ వర్గాలవాళ్ళే ఎమ్మెల్యేలవుతుంటారు. 1978 నుండి తీసుకుంటే వెంకయ్యనాయుడు రెండుసార్లు, మాదాల జానకిరాం ఒకసారి, బొల్లినేని రామారావు ఒకసారి కమ్మ సామాజికవర్గం నుండి గెలిచారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఒకసారి, కంభం విజయరామిరెడ్డి రెండుసార్లు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మూడుసార్లు(2012 ఉపఎన్నికతో కలిపి) విజయం సాధించారు.

రాబోయే ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎలాగూ మేకపాటి కుటుంబం నుండే ఎవరో ఒకరు పోటీలో వుంటారు. టీడీపీ తరపున ఎవరు రంగంలోకి వస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత వుంది. అయితే ఈ వ్యతిరేకత అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లో, భూకబ్జాలు, దౌర్జన్యాలు చేయించడం వల్లో, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద కమిషన్లు తీసుకోవడం వల్లో వచ్చింది కాదు, ఆయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్‌, అక్కడ ఆయనపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. కాని ఉదయగిరి నియోజకవర్గంలో అటువంటి ఆరోపణలు లేవు. కేవలం అతను నిత్యం అందుబాటులో ఉండడు. వారానికి ఒకట్రెండురోజులొస్తాడు... మండలస్థాయి నాయకులకు మాత్రమే కనిపిస్తాడు... నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా వుండడు. జనాలకేంటంటే తమ ఇళ్లలో చావయినా, శుభమైనా ఎమ్మెల్యే వచ్చిపోవాలి. ఈ నియోకవర్గంలో ప్రజల ఆలోచనా ధోరణి ఆ విధంగా ఉంటుంది. దీనికి బొల్లినేని రామారావు విరుద్ధం. అతను దొరకడం కష్టం. దీనివల్లే అతని మీద వ్యతిరేకత! అందుకనే బొల్లినేని ప్రత్యామ్నాయంగా 'రెడ్డి' సామాజికవర్గం నుండి ఈసారి అభ్యర్థిని గాలిస్తున్నట్లు తెలుస్తోంది. 'రెడ్డి' అభ్యర్థి అయితే అదే సామాజికవర్గం వారిలో చీలిక తేవొచ్చు. కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఎలాగూ చంద్ర బాబుకే ఓట్లేస్తారు. కాబట్టే ఈసారి తెలుగుదేశంలో ఈ సామాజికవర్గం వారికే అవకాశం చిక్కొచ్చు. ఈ నేపథ్యంలోనే మాజీఎమ్మెల్యే కంభంపాటి విజయరామిరెడ్డి పేరుతో పాటు వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా ప్రచారంలో వుంది.

cheruvuవేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు. వేసవి సెలవుల్లో మనం తరచూ పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం... 'చెరువులో ఈతకు వెళ్ళి విద్యార్థుల దుర్మరణం' అని. ప్రతి వేసవి సెలవుల్లోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి అరా చోటు చేసుకుంటూనే వుంటాయి.

చెరువుల్లో నీళ్లు వుంటే కదా పిల్లలు ఈత కొట్టడానికి అనే అనుమానం కూడా రావచ్చు. నిజమే... గత ఏడాది వర్షాలు లేవు. చెరువులు నిండలేదు. కాని చెరువు ల్లోని గుంటల్లో వున్న నీళ్ళే ప్రమాద కరం. జిల్లాలోని అన్ని చెరువుల్లో అక్ర మంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరిగివున్నాయి. పెద్దపెద్ద గుంటలు ఏర్పడ్డాయి. వర్షాలప్పుడు ఈ గుంటల్లోనే నీళ్ళు నిలిచిపోతు న్నాయి. ఈ గుంతలు ఎంత లోతుంటాయో తెలియదు. వేసవి సెలవులలో ఇళ్ళ దగ్గర వున్న పిల్లలు స్నేహితులతో సరదాగా ఈతకని వెళ్లి ఈ గుంటల్లో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి వుంచడం మంచిది. దుర్ఘటనలు జరిగిపోయాక ఏడ్చి లాభం వుండదు.

battinaబత్తిని విజయకుమార్‌... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక గుర్తింపు ఉం టుందని, ఆ గుర్తింపు ఇచ్చేది కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. 2014లో వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌కు పాశం సునీల్‌కుమార్‌, బత్తిని విజయకుమార్‌ పేర్లు వినపడ్డాయి. ఆ ఎన్నికల్లో వైసిపి టికెట్టు పాశం సునీల్‌కు ఇవ్వడం జరిగింది. ఆనాడు నిరాశకు లోనైనా కూడా బత్తిని విజయకుమార్‌ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీకోసం పని చేసాడు. దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన సమక్షంలోనే బత్తిని విజయకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నాయ కత్వంలో వైసిపిలో పనిచేస్తూ గూడూరు నియో జకవర్గంలో వైయస్సార్‌పార్టీ తలపెట్టిన బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలలో ఆనాటి నుండి ఈనాటి వరకు పాల్గొంటున్న నాయకుడు బత్తిని విజయ కుమార్‌.

2014లో టీడీపీలోని కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీ తరపున గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని బత్తిని విజయకుమార్‌పై ఒత్తిడి తెచ్చినా అతను మాత్రం వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని వీడిరానని అన్నారు. 2019లో అయినా గూడూరు వైసిపి టిక్కెట్‌ జగన్మోహన్‌రెడ్డి కరుణించి ఇవ్వక పోతాడా అనే ఆశతో పార్టీలో ఉంటూ అందరితో కలసి పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు బత్తిని.

మరి ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీ పదవిని ఇస్తారా లేక ఏకంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Page 1 of 51

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter