battinaబత్తిని విజయకుమార్‌... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక గుర్తింపు ఉం టుందని, ఆ గుర్తింపు ఇచ్చేది కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. 2014లో వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌కు పాశం సునీల్‌కుమార్‌, బత్తిని విజయకుమార్‌ పేర్లు వినపడ్డాయి. ఆ ఎన్నికల్లో వైసిపి టికెట్టు పాశం సునీల్‌కు ఇవ్వడం జరిగింది. ఆనాడు నిరాశకు లోనైనా కూడా బత్తిని విజయకుమార్‌ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీకోసం పని చేసాడు. దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన సమక్షంలోనే బత్తిని విజయకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నాయ కత్వంలో వైసిపిలో పనిచేస్తూ గూడూరు నియో జకవర్గంలో వైయస్సార్‌పార్టీ తలపెట్టిన బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలలో ఆనాటి నుండి ఈనాటి వరకు పాల్గొంటున్న నాయకుడు బత్తిని విజయ కుమార్‌.

2014లో టీడీపీలోని కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీ తరపున గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని బత్తిని విజయకుమార్‌పై ఒత్తిడి తెచ్చినా అతను మాత్రం వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని వీడిరానని అన్నారు. 2019లో అయినా గూడూరు వైసిపి టిక్కెట్‌ జగన్మోహన్‌రెడ్డి కరుణించి ఇవ్వక పోతాడా అనే ఆశతో పార్టీలో ఉంటూ అందరితో కలసి పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు బత్తిని.

మరి ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీ పదవిని ఇస్తారా లేక ఏకంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

reservationనిత్యం రద్దీగా ఉండే గూడూరు రైల్వేజంక్షన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌ సమయాల్లో విజయవాడ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ కొంత మార్పు చేశారు. ఇంతకుముందు ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటల వరకు రిజర్వేషన్‌ కౌంటర్‌ వుండేది. ఈ సమయాన్ని ఇప్పుడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 4గంటల వరకు కుదిం చారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇంతకుముందు ఉన్న సమయం చాలా అనుకూలంగా ఉంటుండేది. నెల్లూరు మరియు ముఖ్యమైన అన్ని రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్‌ కౌంటర్‌ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంది. కాని గూడూరు రైల్వేజంక్షన్‌ అయ్యుండి కూడా రిజర్వేషన్‌ కౌంటర్‌ సమయాన్ని కుదించడం చాలా బాధాకరంగా వుందని ప్రజలు వాపోతున్నారు. విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ స్పందించి ఇంతకు ముందు ఉన్న సమయాన్నే కొనసాగించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

gudurరాష్ట్రంలో 21మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వారిలో నెల్లూరుజిల్లా నుండి ఒక ఎమ్మెల్యే మాత్రమే వున్నాడు. అతనే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌. మొదటనుండి తెలుగుదేశంలో వుండి, ఆ పార్టీ తరఫునే గూడూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా కూడా పనిచేసిన సునీల్‌ తర్వాత కాలంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీలో చేరినందుకు ప్రసన్నే అతనికి 2014 ఎన్నికల్లో గూడూరు సీటిప్పించాడు. అప్పుడు గూడూరు వైసిపి టిక్కెట్‌కు భలే డిమాండ్‌ ఉండింది. అయినా పార్టీలోకి మొదటే వచ్చాడని భావించి సునీల్‌కు సీటిచ్చారు. తెలుగుదేశంలో నెలకొన్న వర్గపోరుతో పాటు వైయస్‌ గాలి ప్రభావంతో సునీల్‌ గెలిచాడు. రెండేళ్ల తర్వాత తెలుగుదేశం అధిష్టానంతో ఏం ఒప్పందం కుదిరిందో ఏమో వైసిపిని వదిలి ఆ పార్టీలో చేరిపోయాడు. వైసిపిలోనే ఉండుంటే వచ్చే ఎన్నికల్లోనూ గూడూరు సీటు సునీల్‌దే! ఇప్పుడాయన తెలుగుదేశం పార్టీ. వచ్చే ఎన్నికల్లో సునీల్‌కు సీటు గ్యారంటీ లేదు. సునీల్‌ మీద వ్యతిరేకత వుంది. వైసిపి నుండి గెలిచి టిడిపిలో చేరడం ఇందుకు ఒక కారణం.

ఇక పార్టీలో సీనియర్‌ నాయకుడిగా మాజీఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌, 2014 ఎన్నికల అభ్యర్థి డాక్టర్‌ బి.జ్యోత్స్నలతలు కూడా వున్నారు. నియోజకవర్గాల పునర్విభజన లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లోనూ ఇది రిజర్వుడ్‌ సీటే! కాబట్టి సీటు కోసం వీళ్ల ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ వుండబోతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఈ ముగ్గురు కూడా ఎవరికి వారే అన్నట్లుగా వుంటున్నారు. ఎన్నికల నాటికి ఇవి తీవ్రం కావడం తప్పితే తగ్గడం అంటూ ఉరడదు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter