battinaబత్తిని విజయకుమార్‌... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక గుర్తింపు ఉం టుందని, ఆ గుర్తింపు ఇచ్చేది కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. 2014లో వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌కు పాశం సునీల్‌కుమార్‌, బత్తిని విజయకుమార్‌ పేర్లు వినపడ్డాయి. ఆ ఎన్నికల్లో వైసిపి టికెట్టు పాశం సునీల్‌కు ఇవ్వడం జరిగింది. ఆనాడు నిరాశకు లోనైనా కూడా బత్తిని విజయకుమార్‌ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీకోసం పని చేసాడు. దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన సమక్షంలోనే బత్తిని విజయకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నాయ కత్వంలో వైసిపిలో పనిచేస్తూ గూడూరు నియో జకవర్గంలో వైయస్సార్‌పార్టీ తలపెట్టిన బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలలో ఆనాటి నుండి ఈనాటి వరకు పాల్గొంటున్న నాయకుడు బత్తిని విజయ కుమార్‌.

2014లో టీడీపీలోని కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీ తరపున గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని బత్తిని విజయకుమార్‌పై ఒత్తిడి తెచ్చినా అతను మాత్రం వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని వీడిరానని అన్నారు. 2019లో అయినా గూడూరు వైసిపి టిక్కెట్‌ జగన్మోహన్‌రెడ్డి కరుణించి ఇవ్వక పోతాడా అనే ఆశతో పార్టీలో ఉంటూ అందరితో కలసి పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు బత్తిని.

మరి ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీ పదవిని ఇస్తారా లేక ఏకంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

gdr mlsరాజకీయాలు పేకాటలాంటివి. ఇక్కడ కింగ్‌ వచ్చిన వాళ్ళు కింగ్‌లు కాలేరు, జోకర్‌ వచ్చినవాళ్లే కింగ్‌లవుతారు. అలాంటి జోకర్‌ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు వచ్చింది. ఒక్కసారిగా గూడూరు రాజకీయాల్లో కింగ్‌ అయిపోగా, ఎంతో కాలంగా జోకర్‌ కోసం ఎదురు చూస్తున్న బల్లి దుర్గాప్రసాద్‌, బి.జ్యోత్స్న లతలు మాత్రం ఈ పేకాట్లో అంతా పోగొట్టుకుని... ''అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే... జేబులు ఖాళీ ఆయనే' అని పాడుకుంటున్నారు.

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా గూడూరులో బల్లి దుర్గాప్రసాద్‌, జ్యోత్స్నలతల మధ్య నెలకొన్న వర్గపోరును పాశం సునీల్‌కుమార్‌ తీర్చాడు. చంద్ర బాబు అభివృద్ధికి విపరీతంగా ఆకర్షితుడై సునీల్‌కుమార్‌ తెలుగుదేశంలో చేరడం తెలిసిందే! ఆయన చేరీ చేరగానే గూడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను కూడా తెలుగుదేశం అధిష్టానం ఆయనకే అప్ప గించేసింది. ఇప్పటిదాకా పార్టీని కనిపెట్టు కుని వున్న బల్లి దుర్గాప్రసాద్‌, జ్యోత్స్నలత లను పక్కన పెట్టేసింది.

గూడూరుకు చాలా పాతకాపు బల్లి దుర్గాప్రసాద్‌. 2014ఎన్నికల్లో సీటు అతని కివ్వకుండా డాక్టర్‌ జ్యోత్స్నలతకిచ్చారు. బల్లి దుర్గాప్రసాద్‌ ఇండిపెండెంట్‌గా నిల బడ్డాడు. ఈ ఇద్దరి మధ్య ఓట్లు చీలి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన పాశం సునీల్‌కుమార్‌ గెలిచాడు. ఎమ్మెల్యే అయిన రెండేళ్ళకే సునీల్‌ తెలుగుదేశంలోకి వచ్చాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం ఇక అధికారిక కార్యక్రమాలన్నింటిలో సునీల్‌కే ప్రాధాన్యత. మరి బల్లి, జ్యోత్స్న లతల నోట్లో మట్టేనా?

gudur junctionగూడూరు రైల్వే జంక్షన్‌లో సమస్యలు అధికంగా ఉన్నాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణీకులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్లాలంటే ఇక్కడ నుంచే దారి మళ్లేది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న రైల్వేస్టేషన్‌లో పలు సమస్యలు తిష్ట వేశాయి. గూడూరు రైల్వే జంక్షన్‌ మీదుగా నిత్యం స్పెషల్‌ సర్వీసులతో కలిపి 150 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, షుమారు 30వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించు కునేందుకు వేలాదిమంది యాత్రికులు, భక్తుల రాకపోకలకు గూడూరే కేంద్రంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణీ కులకు ప్రధాన రైల్వేజంక్షన్‌ కూడా ఇదే. దాదాపు పదిహేనేళ్ల కిందట ఈ స్టేషన్‌ ఆధునీకరణకు నోచుకుంది. మౌలిక వసతులు కల్పించకుండా కేవలం భవనం ఆధునీకరణ, పార్కింగ్‌ ఇతర ఏర్పాటుతో సరిపెట్టుకున్నారని ప్రయాణీకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. గూడూరు రైల్వే జంక్షన్‌కు విజయవాడ వైపు నుంచి వచ్చే రైళ్లను సమీపంలోని చల్లకాలువ వంతెనపై అవుటర్‌లో నిలిపి వేస్తున్నారు. దీనికి కారణం స్టేషన్లో తగినన్ని ఫ్లాట్‌ఫారాలు లేకపోవడమే. అలాగే చెన్నై నుంచి వచ్చే రైళ్లను దివిపాళెం ప్రాంతంలో నిలిపేస్తు న్నారు. మరోవైపు తిరుపతి, బెంగుళూరు, కేరళ నుంచి వచ్చే రైళ్లను కూడా గూడూ రులో ఫ్లాట్‌ఫారాలు లేకపోవడంతో సమీపంలోని గాంధీనగర్‌ ప్రాంతం అవు టర్లో పగలు, రాత్రి తేడా లేకుండా నిలుపు తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళుతున్న ప్రయాణీకులు రక్షణపరంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలా రైళ్లను రాత్రి సమయాల్లో నిలిపి ఉండ టంతో దోపిడీ దొంగలు చోరీలు, దాడు లకు పాల్పడుతున్న సంఘటనలు అనేక మున్నాయి. రైల్వే అధికారులు స్పందించి ఫ్లాట్‌ఫారాలు పెంచాలని, మౌలిక వసతులు కల్పించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter