tada roadనెల్లూరు - తడ మధ్య జాతీయ రహదారి నిర్వహణ అధ్వాన్నంగా మారు తోంది. కొన్నేళ్ళ క్రితం వరకు కూడా నెల్లూరు - తడ మధ్యే జాతీయ రహదారి నిర్వహణ ఎంతో బాగుండేది. ఎక్కడ రోడ్డు గుంతలు పడినా, దెబ్బతిన్నా అప్పటి కప్పుడు బాగుచేస్తుండేవాళ్ళు. కాని, గత కొంతకాలంగా రహదారి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదు. నెల్లూరు - సూళ్లూరుపేటల మధ్య రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్ళే వాహనాలు గతుకుల రోడ్డు వద్ద సడెన్‌ బ్రేకులు వేస్తే ఎంత ప్రమాదమో తెలుసు. రహదారి మధ్యలో డివైడర్ల నిర్వ హణ కూడా సరిగా లేదు. నెల్లూరు-తడ మధ్య వెంకటాచలం, బూదనం, సూళ్లూరు పేట టోల్‌ప్లాజాలున్నాయి. ఒక్కో టైంలో వీటి వద్ద భారీఎత్తున వాహనాలు నిలిచి పోతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా అన్ని కౌంటర్లు ఓపెన్‌ చేయకపోతుండ డంతో వాహనాలు 'క్యూ' కట్టాల్సి వస్తోంది.

ఆరులైన్‌లయ్యేనా..?

కోవూరు నుండి విజయవాడ దాకా నాలుగులైన్లను ఆరులైన్లుగా విస్తరించారు. కాని కోవూరు-తడ మధ్య నాలుగులైన్ల రహ దారిని ఆరులైన్లుగా విస్తరించే పని పెం డింగ్‌లో పడింది. విజయవాడ - కోవూరు మధ్య పనులు చేస్తున్నప్పుడే ఇక్కడ కూడా పనులు మొదలుపెట్టి వుంటే ఇప్పటికి ఆరులైన్ల రహదారి పూర్తయ్యి రాకపోకలు బ్రహ్మాండంగా వుండేవి. ప్రతి క్రాసింగ్‌వద్ద అండర్‌ పాసింగ్‌ వచ్చి ప్రమాదాలు తగ్గి వుండేవి. అయితే 2001లో ఈ రహదా రిని పిపిపి విధానంలో తీసుకున్న మలే షియా కంపెనీ ఆరులైన్ల విస్తరణకు మొగ్గు చూపకపోవడంతో పెండింగ్‌లో పడింది.

కాగా, సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న రహదారి ప్రతి పాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వం విర మించుకున్నట్లు తెలుస్తోంది. దాని బదులు నెల్లూరు-తడల మధ్య జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం ఆమోదం లభిస్తే త్వరలో నెల్లూరు-తడ రహదారి ఆరులైన్లుగా విస్తరించడం జరుగుతుంది.

highwayశ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కాని దాదాపు ఈ రైల్వేలైన్ ప్రతిపాదిత మార్గానికి దగ్గరలోనే రోడ్డు మార్గం ఏర్పడుతుండడం పట్ల నెల్లూరుజిల్లా పడమర ప్రాంతాలలోని ప్రజల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరుజిల్లా ఏర్పేడు నుండి గుంటూరుజిల్లా మాచర్ల వరకు 250కిలోమీటర్లపైగా పొడవున జాతీయ రహదారి మంజూరైంది. నెల్లూరుజిల్లాలో ఈ రహదారి వెంకటగిరి, పెంచలకోన, కలువాయి, ఆత్మకూరు, దుత్తలూరు, పామూరు, కనిగిరి వంటి ప్రాంతాల మీదుగా వెళ్లి హైదరాబాద్ కు ప్రధాన రహదారిగా వున్న మాచర్ల జాతీయ రహదారిలో కలుస్తుంది. ఏర్పేడు నుండి పెంచలకోన వరకు రోడ్డు పనులు మొదలయ్యాయి. ఈ రహదారి కోసం దాదాపు 80శాతం భూసేకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.

ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రధానంగా హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రాంతాలకు ప్రయాణం సులభమవుతుంది. పామూరు, ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల వాళ్లు చెన్నై లేదా తిరుపతి లేదా బెంగుళూరు నగరాలకు పోవాలంటే నెల్లూరు దాకా వచ్చి ఇక్కడ నుండి 5వ నంబర్ జాతీయ రహదారిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల అనవసర వ్యయంతో పాటు ప్రయాణకాలం పెరుగుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే నెల్లూరుకు వెళ్లకుండానే పెంచలకోన, ఏర్పేడుల మీదుగా అటు తిరుపతికి గాని లేదంటే నేరుగా చెన్నైకి గాని వెళ్లొచ్చు. బెంగుళూరుకు వెళ్లే వారికి కూడా ఈ మార్గం సౌకర్యవంతంగా వుంటుంది.

ఇక వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల నుండి హైదరాబాద్కు వెళ్లాలంటే నెల్లూరుకు వచ్చి 5వ జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వెళ్లి అక్కడ నుండి అద్దంకి మార్గంలోకి వెళ్లాల్సివస్తుంది. ఈ కొత్త రోడ్డు ఏర్పడితే నెల్లూరుకు పోయే పని లేకుండానే నేరుగా మాచర్ల రహదారిలో కలవచ్చు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, వింజమూరు ప్రాంతాల వారికి ఈ మార్గం సరుకు రవాణా పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ మెట్టభూముల ధరలు కూడా పెరిగి రైతులు ఆర్ధికంగా ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి.

6lineరాష్ర్టంలో తడ నుండి ఇచ్ఛాపురం దాకా ఇప్పటివరకు 4లైన్ల జాతీయ రహదారి వుంది. దీనికి ఆసియా హైవే 45గా కూడా గుర్తింపు వచ్చింది. ఎన్డీఏ హయాంలో ఎన్హెచ్-5ను 4లైన్లుగా అభివృద్ధి చేయగా, యూపిఏ హయాంలో దానిని ఆరులైన్లుగా మార్చడానికి సంకల్పించారు. రాష్ర్టంలో ఇచ్ఛాపురం నుండి మన జిల్లాలోని కోవూరు వరకు కూడా ఆరులైన్లుగా వున్నప్పుడు చాలా గ్రామాల వద్ద రోడ్డు మీదే క్రాసింగ్ లు ఉండేవి. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి క్రాసింగ్ వద్ద కూడా అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ప్రతిచోటా వీటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామాలు వచ్చినప్పుడు ఆరులైన్ల రహదారితో పాటు సర్వీస్ రోడ్డును కూడా వేసి రహదారి నిర్మాణం పూర్తయిన చోట రోడ్డుకిరువైపులా కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పశువులు హైవే మీదకొచ్చి ప్రమాదాలకు కారణయ్యే పరిస్థితి వుండదు.

రాష్ర్టంలో అంతటా ఆరులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నా నెల్లూరు – తడల మధ్య మాత్రం ఈ పనులు మొదలుకాలేదు. ఆరులైన్ల విస్తరణ కోసం సర్వే, ల్యాండ్ మార్కింగ్, నష్టపరిహారం ఇవ్వడం వంటవి జరిగిపోయాయి. కాని పనులే మొదలుకాలేదు. ప్రభుత్వానికి స్వర్ణ టోల్ వే వారికి ఇంకా ఒప్పందం కుదరకపోవడం వల్లే అరులైన్ల పనులు మొదలుకానట్లుగా తెలుస్తుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • కృష్ణ పోటెత్తింది
  కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేషస్పందన లభించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జిల్లాల్లో కొన్ని వైకాపాకు కంచుకోటలు కాగా, ఇంకో రెండు జిల్లాల్లోనూ బలంగానే వుంది. కాని, అసలు…
 • వేమాలశెట్టి బావిలో... వేలుపెట్టిన వేమిరెడ్డి పట్టాభి
  నెల్లూరు, దర్గామిట్టలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వున్న వేమాలశెట్టి బావి సత్రం స్థలం మరోసారి వివాదంలో కెక్కింది. మంగళవారం రాత్రి ఈ స్థలంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వివాదానికి…

Newsletter