gslvసతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఏప్రిల్లో  జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌09, జిఎస్‌ఎల్‌వి-మార్క్‌3, పిఎస్‌ఎల్‌వి-సి38 ప్రయోగాలను నిర్వహించేం దుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 15న 104 ఉపగ్రహాల ప్రయోగంతో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడురాకెట్ల అనుసంధాన పనులు చేస్తున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ భవనం(వీఏబి)లో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌09 అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సాలిడ్‌ స్టేజి అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌(ఎస్‌ఎస్‌ఏబి)లో జిఎస్‌ఎల్‌వి-మార్క్‌3 రాకెట్‌ అనుసంధాన పనులు కూడా ముమ్మరంగా జరుగు తున్నాయి. దీనికి సంబంధించి ఎస్‌-200, ఎల్‌-110, సి-25 అనే మూడు దశలకు భూస్థిర పరీక్షలను నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు. జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌09 రాకెట్‌ ద్వారా రెండు టన్నుల బరువైన జీశాట్‌-9, జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 రాకెట్‌ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జిశాట్‌-19 సమాచార ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ప్రయోగ వేదికపై వారంరోజుల్లో పిఎస్‌ఎల్‌వి-సి38 పనులను ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో దూర పరిశీలన ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలు ఉండే అవకాశం వుంది.

pslv c37మన కళ్ళ ముందే పుట్టిన బిడ్డ... తప్పటడుగులు వేస్తూ పెరిగి... ఆటుపోట్లను ఎదుర్కొంటూ చదివి... ఎన్నో స్థాయిలను దాటుకుని ఎత్తుపల్లాలు అధిగమిస్తూ ఐఏఎస్‌ ర్యాంక్‌ను కొడితే ఎంత ఆనందిస్తామో... ఈరోజు మన దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధిస్తున్న విజయాలను చూస్తే కూడా అంతే ఆనందమేస్తుంది. మన 'ఇస్రో' అంతర్జాతీయంగా ఎదిగినందుకు మనసు ఉప్పొంగుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలు సాధించలేని ఘనతను మన ఇస్రో సాధించినందుకు ఛాతి గర్వంతో ఉప్పొంగుతుంది.

స్వాతంత్య్రానంతరం ఈ ఏడు దశా బ్దాలలో భారతదేశం ఎన్నో రంగాలలో విజయాలు సాధించింది. అయితే ఇతర రంగాలలో అనుకున్న ప్రగతిని అందు కోవడం కష్టంగానే వుంది. దీనికి కారణం మిగిలిన రంగాలన్నింటికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ వ్యవస్థలతో సంబంధముండడమే! మన రాజకీయ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయి వున్నాయో చూస్తూనే వున్నాం. ఇలాంటి రాజకీయ వ్యవస్థలున్న చోట ఆశించిన అభివృద్ధిని సాధించడం కూడా కష్టమే!

అయితే రాజకీయ వ్యవస్థలతో ఏ మాత్రం సంబంధాలు పెట్టుకోకుండా ప్రతిభనే వేదికగా మలచి, దేశ ప్రతిష్టనే లక్ష్యంగా పెట్టుకుని అగ్రరాజ్యాలకు ధీటుగా దూసుకుపోతున్న ఏకైక వ్యవస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). అమెరికా, జపాన్‌, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకు అంతరిక్ష ప్రయోగాలలో ధీటుగా సమాధానమిస్తున్న మన ఇస్రో మరో అంతరిక్ష అద్భుతాన్ని మనకు కానుకగా అందజేసింది. ఒకే రాకెట్‌ ద్వారా 104ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. అంతరిక్ష ప్రయోగాలలో వరల్డ్‌ రికార్డును సృష్టించింది. ఇంతవరకు ఏ అగ్రదేశం కూడా ఒకే రాకెట్‌ ద్వారా ఇన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపలేదు. రష్యా మాత్రం 2014లో ఒకే రాకెట్‌ ద్వారా 37 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. 104 ఉపగ్రహాల ప్రయోగంతో ఇస్రో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

ఇంతటి అద్భుత ప్రయోగానికి నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. 15వ తేదీ ఉదయం 9.28 గంటలకు తన కడుపులో దాచుకున్న 104 ఉపగ్రహాలతో పిఎస్‌ఎల్‌వి-సి37 నింగికి దూసుకుపోయింది. 28నిముషాల పాటు 524 కిలోమీటర్లు ప్రయాణించాక ఉప గ్రహాలన్నింటిని కూడా వాటివాటి కక్ష్యల్లో జాగ్రత్తగా చేర్చింది. ఈ 104 ఉపగ్రహా లలో మన దేశానికి చెందిన కార్టోశాట్‌-2, ఐఎన్‌ఎస్‌-1ఏ, ఐఎన్‌ఎస్‌-1బి ఉప గ్రహాలున్నాయి. మిగిలిన 101 ఉపగ్రహా లలో 96 అమెరికావి కాగా, ఇజ్రాయిల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఇ దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒక్కోటి లెక్కన ఉన్నాయి.

ఈ చరిత్రాత్మక ప్రయోగంతో ఇస్రో ప్రపంచ దేశాలకే సవాల్‌గా నిలిచింది. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయో గాలను విజయవంతం చేస్తున్న ఖ్యాతి ఇస్రో సొంతమవుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో మనం అగ్ర దేశాలకు పోటీగా మారడం కాదు, ఆ దేశాలే మనతో పోటీ పడే పరిస్థితి కల్పించాము. ముఖ్యంగా నిన్న జరిపింది వాణిజ్య ప్రయోగం. సాధించింది వాణిజ్య విజయం. అతితక్కువ ఖర్చుతో అత్యంత నమ్మకంతో మీ ఉపగ్రహాలను మేం కక్ష్యలోకి చేరుస్తామన్న భరోసాను ఇస్రో ప్రపంచ దేశాలకు ఇవ్వగలిగింది. ఇక ఏ దేశమైనా తమ ఉపగ్రహాల ప్రయోగాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చేది ఇస్రోకే! ఎందుకంటే ఇస్రో ప్రయోగాలు తక్కువ ఖర్చుకే కాదు, విజయాలకు కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది కాబట్టి!

పెద్దనోట్ల రద్దుచేసినా, దేశ రాజకీయాలు ఎలా వున్నా, నాయకులు, మన పాలకులు ఎంత రోతగా తయారైనా... ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ అగ్రదేశాలకు ధీటుగా నిలుస్తున్న ఏకైక సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. అత్యంత తక్కువ కాలంలోనే అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాల సరసన నిలిచింది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఒకటికి నాలుగుసార్లు ప్రయోగాలు జరిపి విజయవంతమైన ఉపగ్రహాలను ఇస్రో ఒకే ఒక్క ప్రయోగంతో విజయవంతం చేసింది. అంతే కాదు, ఖర్చులోనూ ఎంతో పొదుపుగా ఉపగ్రహాలు తయారు చేస్తూ పెద్ద దేశాలకు గట్టి సవాలు విసురుతోంది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తూ, విదేశీ అంతరిక్ష వాణిజ్యాన్ని సైతం ఆకర్షిస్తోంది. ఈ పరంపరలోనే మరో అనితర సాధ్యమైన విజయం వైపు ఇస్రో అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఏ దేశం ప్రయోగించని విధంగా ఒకే రాకెట్‌ ద్వారా 103ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి సన్నా హాలు చేస్తోంది. మొదట 83 ఉపగ్రహాలను ప్రయోగిం చాలనుకున్నప్పటికీ సెంచరీ కొట్టాలన్న లక్ష్యంతో ఆ సంఖ్యను 103 ఉపగ్రహాలకు పెంచింది. ఫిబ్రవరి నెలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ దేశవ్యాప్తంగా యువత ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు. ఈ అరుదైన అంతరిక్ష ప్రయోగానికి మన నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదిక కావడం నెల్లూరీయులుగా మనకు గర్వకారణం.

Page 1 of 8

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter