jagan'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని చెప్పుకునే నాయకుడికి...

''ఊరన్నాక అందరూ కలిసిమెలసి ఉండాలి, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుండాలి, మీరు లేకుండా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా మీరు లేరు... ఒకొరికొకరు సహకరించుకుని ముందుకు సాగితేనే మనిషి జీవితం'' అని చెప్పిన నాయకుడికి ఎంత తేడా?

మొదటి నాయకుడిది నలభై ఏళ్ల రాజకీయ అనుభవమైతే, రెండో నాయకుడి వయసు నాలుగు పదులు దాటిందంతే! నాయకుడు హూందాగా ఆలోచించడానికి, మంచి జరగాలని కోరుకోవడానికి అనుభవంతో... వయసుతో పని లేదు, మనసుంటే చాలని నిరూపించాడు ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి.

1978లో అంజయ్య కేబినెట్‌లో చంద్రబాబు మంత్రయ్యే నాటికి జగన్‌ది చెడ్డీలు తొడుక్కునే వయసు. చంద్రబాబు రాజకీయ అనుభవంతో పోలిస్తే జగన్‌ వటవృక్షం ముందు వేరుముక్క లాంటోడు. అయినా ఆయన అనుభవం సమస్యలు సృష్టిస్తుంటే, చాలా అనుభవం తక్కువ వున్న జగన్‌ ఎంతో సమయస్ఫూర్తితో సమస్యలను చల్లారుస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య రావణకాష్టంలా రేగిన కుల దావాగ్నిని జగన్‌ ఎంతో ఓర్పుతో, నేర్పుతో చల్లార్చిన తీరు రాజకీయ విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకొంది.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతి ష్టించే విషయంలో దళితులకు, అగ్రవర్ణాల వారికి మధ్య వివాదం రాజుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఈ వివా దంలో తల దూర్చాయి. నానాటికీ సమస్య తీవ్రమవుతున్నా, గతంలో జరిగిన కారం చేడు, చుండూరు వంటి సంఘటనలు కళ్లముందు కదలాడుతున్నా ప్రభుత్వం ఆ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. ఆ వివాదంలో దిగి ఒకరి పక్కన మాట్లా డితే ఇంకొకరి ఓట్లు పోతాయనే భయంతో అధికారపార్టీ కిమ్మనకుండా ఉండిపోయింది.

కాని ప్రతిపక్ష నేతగా జగన్‌ సైలెంట్‌ కాలేదు. ఈ వివాదంలో తలదూరిస్తే కొం దరు దూరమవుతారని పార్టీ నాయకులు సలహా ఇచ్చినా జగన్‌ వినిపించుకోలేదు. గరగపర్రు వెళ్లాడు. దళితులతో కలిసి నేలపైనే కూర్చున్నాడు. వారు పెట్టింది తిన్నాడు. వారు చెప్పింది విన్నాడు. వారిలో అగ్రవర్ణాల వారిపై తిరగబడండంటూ విద్వేషం నూరిపోయలేదు. ఊరన్నాక అందరూ కలిసిమెలిసి వుండాలని చెప్పి, వారిలో వున్న ఆవేశాన్ని తగ్గించాడు. అలాగే ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారి తోనూ ఆయన మాట్లాడాడు. దళితులను మీ వాళ్ళుగా చూడాలని, అంబేద్కర్‌ అందరివాడని, జాతీయ నాయకుడని చెప్పారు. ఇలా ఇరువర్గాల వారిని శాం తింపజేసి సమన్వయ పరచి, ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేతగా తాను చేసి చూపించాడు. ఈ మొత్తం వ్యవహా రంలో ఆయన ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. అదే ఈ పొజిషన్‌లో చంద్ర బాబు ఉండుంటే అరగంట తన గురించి చెప్పుకుని, అరగంట ప్రతిపక్షాన్ని తిట్టి అరనిముషం సమస్య గురించి మాట్లాడి వుండేవాడు.

గరగపర్రు వివాదంలో జగన్‌ వ్యవహ రించిన తీరుపై ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా మెచ్చుకుంటున్నారు. శెభాష్‌ జగన్‌ అని అభినందిస్తున్నారు.

adinethaluఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రకు సంబంధించి 2014, 2015... రెండు సంవత్సరాలు కూడా చీకటి జ్ఞాపకాలనే మిగిల్చాయి. 2014లో సమైక్య రాష్ట్రం రెండు ముక్కలైంది. సవాలక్ష సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ నడిరోడ్డు మీద నిలబడింది. విభజన తర్వాత ఏపి పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆర్ధిక సమస్యలన్నీ అలాగే వున్నాయి. రాజధాని లేని రాష్ట్రంలో పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. విభజన సమయంలో ఏపికిచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఏపి పట్ల కేంద్రం సహాయనిరాకరణోద్యమం చేస్తున్నట్లుగా వుంది. ఏపికిస్తామన్న ప్రాజెక్టుల విషయంలో పెద్దగా కదలిక లేదు.

అన్నింటికంటే ముఖ్యమైంది రాష్ట్రానికి ప్రత్యేకహోదా. పార్లమెంటులో కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇచ్చిన హామీ ఇది. ఇప్పుడు కేంద్రం దీనిపై మాట మారుస్తోంది. నిబంధనలు ఒప్పుకోవంటోంది. రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని చంద్రబాబు శంకుస్థాపన చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ఢిల్లీ నుండి తెచ్చిన మట్టి, నీళ్లు అందించి వెళ్లాడు. రాష్ట్ర ఆర్ధిక స్థితి అంతంత మాత్రంగా వుంది. రాజధాని కట్టుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూపోవాలి. ఋణమాఫీ వంటి ఆర్ధిక భారమైన హామీలను అమలు చేయాలి. రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ స్థబ్దుగా వుంది. తగినన్ని నిధులు లేవు. పథకాలు, ప్రాజెక్టులు అమలు చేయడానికి నిధులు కొరత వెంటాడుతోంది. స్థూలంగా చూస్తే ఇదే రాష్ట్ర పరిస్థితి.

అయితే సమస్యలెన్నో వున్నా సమర్ధవంతమైన ప్రభుత్వం, అధికార పార్టీ తప్పు చేస్తే చీల్చి చెండాడే ప్రతిపక్షం రాష్ట్రంలో వుంటే ఇలాంటి సమస్యలన్నింటిని కూడా అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదు. అయితే మన దురదృష్టం కొద్దీ రెండూ కూడా అలాంటివి లేవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ కంపెనీలాగా నడుస్తోంది. పరిపాలనలో ఒక పద్ధతి, పాడూ లేదు. ప్రతిదీ వక్రమార్గమే. అమరావతి రాజధాని ఎంపికే రాంగ్‌. పచ్చటి పైర్లు పండే పొలాలను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చాలనుకుంటున్నారు. రాజధాని వ్యవహారమంతా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలానే వుంది. రైతుల కడుపుకొట్టి విలువైన భూములను సింగపూర్‌ కంపెనీల పేరుతో కబ్జా చేసే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు సింగపూర్‌ కంపెనీలు ఇచ్చే మాస్టర్‌ ప్లాన్‌లను చూపిస్తూ ఎల్లో మీడియా 'అహో అమరావతి' అంటూ బాకా వూదుతోంది. ఈ రాజధాని వల్ల భవిష్యత్‌లో అక్కడి రైతులకు జరిగే నష్టాన్ని ఎవరూ తలకెక్కించు కోవడం లేదు. ఇక అధికారుల బదిలీలను మొదలుకొని ఇసుక మాఫియా, ఇరిగేషన్‌ పనులు... సెజ్‌ల కేటాయింపులు, భూసేకరణ వంటివన్నీ కూడా వ్యాపార కోణంలోనే జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా గెలిచింది దోచుకోవడానికే అన్నట్లుగా అధికారపార్టీ నాయకుల వ్యవహార శైలి వుంది. గతంలో పారదర్శక పాలనతో, అంతో ఇంతో నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈ దఫా మాత్రం ఒంటికంతా అవినీతి మలినాన్ని అంటించుకున్నాడు. కనీసం ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రానికి పట్టిన అరిష్టం కొంతన్నా వదులుతుందనుకుంటే, చంద్రబాబు దాని కోసం చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. సరే, ప్రభుత్వం ఇంత అవినీతికరంగా వుంది... కనీసం దానిని అదిలించే ప్రతిపక్షమన్నా గట్టిగా వుందా... అంటే అదీ లేదు. అధికార పక్షానికి ఏ మాత్రం తీసిపోనట్లుగా ప్రతిపక్షం వుంది. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఎదురుదాడికి రెండే వేదికలు. ఒకటి చట్ట సభలో, రెండోది ప్రజా సభలో. చట్ట సభలలో ప్రజా సమస్యలపై చర్చించే రోజులు పోయాయి. సభ్యులు తన్నుకోవడానికే టైం సరిపోవడం లేదు. ఇక ప్రజాసమస్యలపై మాట్లాడే తీరిక వాళ్లకు ఎక్కడుంది. ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రజల్లోకి పోవాలి. ప్రజాసభలలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. కాని ప్రతిపక్ష నేతలో అంతటి చొరవ కనిపించడం లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అటు చట్ట సభలలోనూ, ఇటు ప్రజా సభలలోనూ ఎండగట్టేవాడు. కాబట్టే అప్పుడు చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశాడు. ఇప్పుడు జగన్‌ అంటే లెక్కలేనితనం అయ్యిందాయనకు. కాబట్టి తాను అనుకున్నవి అడ్డదిడ్డంగా చేసుకుపోతున్నాడు. ఆయన అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రతిపక్షనేత ఆ విషయంలో దూకుడు చూపలేకపోతున్నాడు.

చంద్రబాబు అడ్డగోలు వ్యవహారాలు, జగన్‌ అడ్డుకోలేని వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోంది. ఇద్దరు నేతలు కూడా తమ పంథా మార్చుకోకపోతే 2016లో కూడా రాష్ట్రంలో కష్టాలు, కన్నీళ్ళు తప్పవు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter