jaganవైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప పాద యాత్ర ఈనెల 20వతేదీన నెల్లూరుజిల్లా లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఆయన రాకకోసం వైసిపి అభిమానులు, కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వైయస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ నుండి మొదలైన జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా సాగి ప్రస్తుతం సీఎం చంద్రబాబు సొంత గడ్డ చిత్తూరుజిల్లాలో జరుగు తోంది. ఇప్పటివరకు పర్యటించిన అన్ని జిల్లాలో జగన్‌ పాదయాత్రకు జనం జాతర మాదిరిగా వచ్చారు. పాదయాత్రలో ఇప్ప టికే 700 కిలోమీటర్ల మైలు రాయిని ఆయన అధిగమించాడు. ఖచ్చితంగా వెయ్యో కిలోమీటర్‌ మైలురాయికి నెల్లూరు జిల్లానే వేదిక కాగలదు.

ఈ నెల 20 లేదా ఒకరోజు ముందు వెనుక అయినా జగన్‌ జిల్లాలోకి ప్రవేశించే అవకాశముంది. శ్రీకాళహస్తి తర్వాత జగన్‌ జిల్లాలోకి ప్రవేశించనుండడంతో జిల్లా వైసిపి శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. జగన్‌ పాదయాత్రలో జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించేలా వీలైనంత ఎక్కువ పల్లెలను పలుకరించేలా పార్టీ నాయకులు ప్లాన్‌ చేస్తున్నారు.

cm jaganమేం అధికారంలోకి వస్తే ఫ్రీ బియ్యం... ఫ్రీ కరెంట్‌... ఫ్రీ గ్యాస్‌... చదువు కునేవాళ్ళకు ల్యాప్‌టాప్‌లు... మహిళలకు మిక్సీలు, సీరియల్స్‌ చూడడానికి ఉచిత టీవీలు... రూపాయికే చపాతి... పావలాకే దోశ... గత తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఓ పార్టీ వారి వరాలు.

మరి ఇంకో పార్టీ వాళ్ళు వూరుకుంటారా? ఫ్రీగా బియ్యమిస్తే సరిపో తుందా? కూరలు పల్లేదా? మేం అధికారంలోకి వస్తే కూరగాయలు ఫ్రీ, ఉప్పు, పప్పుదినుసులన్నీ ఫ్రీ... ప్రభుత్వ క్యాంటీన్‌లలో టిఫిన్‌ ఫ్రీ... సీలింగ్‌ ఫ్యాన్‌లు, ఏ.సి.లు, రిఫ్రిజరేటర్లు ఫ్రీ అన్నారు.

రాజకీయపార్టీల శృతిమించిన హామీలు ఇవి. మనం ఇప్పటివరకు తమిళనాడు ఎన్నికల ప్రచారాలలో మాత్రమే ఇలాంటి హామీలు చూసాం. ఇప్పుడు ఆ రాష్ట్ర సరిహద్దునే వున్న మన రాష్ట్రానికి కూడా ఆ గాలి సోకినట్లుంది. మన రాష్ట్ర నాయకులకు కూడా అక్కడి నాయకుల హామీలు వంటబట్టినట్లున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలపై వరాల జల్లు కురిపించడానికి ప్రధానపార్టీలు సిద్ధమవుతున్నాయి.

2014 ఎన్నికలలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నోటికి అడ్డు అదుపు లేకుండా హామీలిచ్చాడు. వాటిలో లక్షకోట్ల పైనే వున్న ఋణమాఫీ ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా కొన్ని వందల హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చాక వాటిలో అమలు చేసినవి చాలా తక్కువ. చంద్రబాబులాగా నోటికి ఏదొస్తే అది చెప్పకపోవడం వల్లే జగన్‌ ప్రతిపక్ష నేతగా మిగిలిపోవాల్సివచ్చింది. జగన్‌ నోటి నుండి ఒక్క ఋణమాఫీ వాగ్దానం వచ్చివున్నా ఈరోజు చంద్రబాబు, జగన్‌లు ఆపోజిట్‌ పొజిషన్‌లలో ఉండేవాళ్ళు. కాని, జగన్‌ అలా హామీలు ఇవ్వకపోవడం, చంద్రబాబు నోటికేదొస్తే అది ఇవ్వడం వల్లే తెలుగుదేశం అధికారంలోనూ, వైసిపి ప్రతిపక్షంలోనూ వుంది. 2014లో చేసిన తప్పులు జగన్‌ మరోసారి చేయవద్దనుకుంటున్నాడు. ఎన్నికల్లో గెలుపోటములపై హామీలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనిని జగన్‌ వంట బట్టించుకున్నాడు. మొన్న నంద్యాల ఉపఎన్నికలప్పుడు 'నవరత్నాలు' పేరుతో పలు హామీలు గుప్పించిన జగన్‌, ఇప్పుడు ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ హామీల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, తాత్కాలిక ఉద్యోగులు, వృద్ధులు, కార్మికులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్‌లు... ఇలా ఎవరినీ వదలకుండా వారిని ఆకట్టుకునే రీతిలో హామీలు ఇస్తున్నాడు. 2014లో ఋణమాఫీ అన్నది అసాధ్యమైన పని అని తెలిసి ఆయన ఆ వాగ్ధానం చేయలేదు. చంద్రబాబు అది సాధ్యం కాదని తెలిసి కూడా అధికారం లక్ష్యంగా చేసుకున్నాడు కాబట్టి చెప్పేసాడు. అధికారంలోకి వచ్చాక దానిని ఎంత అవతారంగా అమలు చేస్తున్నాడన్నది చూస్తూనే వున్నాం. ఋణమాఫీ లాంటి అసాధ్యమైన హామీనే ఇచ్చిన చంద్రబాబు రేపటి ఎన్నికల్లో ఇంకా పెద్దపెద్ద వాగ్ధానాలే చేస్తాడు తప్ప, వెనక్కి తగ్గడు. కాబట్టి వచ్చే ఎలక్షన్‌లలో రాష్ట్ర ప్రజలు ఇరు పార్టీల నేతల హామీల వర్షంలో తడిసి ముద్దవడం ఖాయం.

jaga lokదొడ్డిదారిన వచ్చి వెన్నుపోటు పొడిచి గెలిచిన వాడిని 'వీరుడు' అనరు. ఓడినా, ప్రాణాలను వీడినా ఎదురొడ్డి నిలిచి పోరాడిన వాడినే వీరుడంటారు. దొడ్డిదారిన వచ్చింది విజయం కాదు. శత్రువును నిస్సహాయుణ్ణి చేసి గెలిచింది గెలుపూ కాదు. శత్రువును ధర్మయుద్ధంలో ఓడించడమే అసలైన విజయం. అది యుద్ధమైనా రాజకీయ యుద్ధమైనా?

రాష్ట్ర రాజకీయాలలో ధర్మయుద్దాలకంటే అదర్మ యుద్ధాలనే ఎక్కువుగా చూస్తుంటాం. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ధర్మంగా వుంటే గెలవడం కష్టం కూడా! ఇలాంటి ధర్మయుద్ధం చేసే 2014 ఎన్నికల్లో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారానికి దూరం కావడం చూసాము.

ఇటీవల చంద్రబాబు స్కోత్కర్షను జనం భరించ లేకపోతున్నారు. ఏపికి నేనే బ్రాండ్‌నంటూ ఆయన వేస్తున్న బ్యాండ్‌ను భారంగా భరించాల్సి వస్తోంది. ఇప్పటివరకు చంద్రబాబే అనుకుంటే, ఇప్పుడు ఆయన తలదన్నేలా ఆయన కొడుకు లోకేష్‌ తయారయ్యాడు. తనను తాను రాష్ట్ర నాయకుడిగా చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మాటికొస్తే జగన్‌ మీద పడి ఏడుస్తున్నాడు. అసలు జగన్‌తో లోకేష్‌కు పోలికేంటి? అసలు జగన్‌కు చంద్రబాబుతోనే పోలిక లేదు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీనే ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వాళ్ళు చంద్రబాబు, లోకేష్‌లు. వీళ్ళు సొంతంగా పార్టీని పెట్టలేదు. పార్టీకి కేడర్‌ను నిర్మించలేదు. ఎన్టీఆర్‌ పుణ్యాన రాజకీయ భవిష్యత్‌ లభించింది. అధికారం అనుభవించారు. ఎన్టీఆర్‌ నుండి పార్టీని లాక్కున్నారు. చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చాక రెండుసార్లు గెలిచింది. అది కూడా 1999లో వాజ్‌పేయి ఇమేజ్‌తో, 2014లో మోడీ ప్రభంజనంతో అధికారం సంపాదించుకున్నారు. అంతకుమించి చంద్రబాబుకు సొంతంగా పార్టీని గెలిపించిన ఇమేజ్‌ లేదు. ఇక తండ్రి రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన లోకేష్‌ ఈ మూడే ళ్లలో చూపించిన అద్భుత పెర్ఫార్మెన్స్‌ ఏమీ లేదు. కనీసం ప్రజాక్షేత్రంలో తనను తాను ప్రజానాయ కుడిగా నిరూపించుకోలేకపోయాడు. ప్రత్యక్ష ఎన్ని కల్లో పోటీచేసి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, లేదంటే ఎమ్మెల్సీగానే చట్టసభలలో అడుగుపెట్టే అవకాశం వున్నా, దొడ్డిదారిన శాసనమండలిలోకి ప్రవేశించాడు. తండ్రి కొలువులో మంత్రిగా కుర్చీ వేయించుకున్నాడు.

జగన్‌ ఆ పంథాలో పోలేదు. తన తండ్రి మరణానంతరం సొంత కాంగ్రెస్‌పార్టీ అధినేత్రే అతని మీద కత్తి కట్టింది. ప్రజల్లోకి పోవద్దంది. ప్రజలే తనకు లోకమన్న జగన్‌పై కేసులు పెట్టింది. 16నెలలు జైలులో పెట్టించింది. కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చిన జగన్‌ అన్నీ భరించాడు. జైలు జీవి తాన్ని అనుభవించాడు. ఓ పక్క ఢిల్లీతో తలపడ్డాడు. ఇంకోపక్క రాష్ట్రంలో అభ్యర్థులను ఎదుర్కొన్నాడు. సొంతంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించాడు. సెకండ్‌ క్యాడర్‌లో వున్న కార్యకర్తలను లీడర్లుగా చేసాడు. 2014ఎన్నికల్లో ఒక్కడే పోరాడాడు. ఎన్టీఆర్‌ అంత సినిమా గ్లామర్‌ లేకున్నా తన స్వయం కృషితో 8మంది ఎంపీలను, 68మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. నాలుగు పదులు నిండిన వయసులోనే జగన్‌ సాధించిన ఘనవిజయమిది. చంద్రబాబు ధర్మంగా పోరాడివున్నా, జగన్‌ అధర్మయుద్ధం చేసున్నా 2014 ఎన్నికల్లో జగన్‌దే అధికారం. కాని జగన్‌ ఒక సైద్ధాంతిక విలువల పరిధిని దాటలేదు కాబట్టే ప్రతిపక్షనేతగా మిగిలిపోయాడు.

ఈరోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో చూస్తున్నాం. చిరంజీవి లాంటి వాడే పార్టీ పెట్టిన రెండో సంవత్సరమే కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నాడు. కాని, జగన్‌ తన పార్టీని నిలబెట్టాడు. మూడేళ్లుగా ధీటైన ప్రతిపక్షనేతగా రాణిస్తున్నాడు. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పుడూ ప్రజల ముందుంటున్నాడు.

ఈరోజు జగన్‌ మీద వై.యస్‌. బ్రాండ్‌ లేదు. జగన్‌ తనను తాను నాయకుడిగా నిరూపించు కున్నాడు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రత్యర్థులతో అలుపెరుగని పోరాటం చేస్తూనే ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రజామోదం పొందిన అలాంటి జగన్‌ ఎక్కడ? వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్‌ ఎక్కడ? ఆయనతో ఈయన పోటీ పడడం నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter