jakka venkఆదర్శజీవి, ప్రజాపోరాటయోధుడు, సిపిఎం సీనియర్‌ నేత..జక్కా వెంకయ్య కన్నుమూశారు. ఉద్యమాలే ఊపిరిగా జీవితాంతం పేదల సంక్షేమం కోసం, పేదప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన అలుపెరుగని కృషి చేశారు.రాజకీయాల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా, ఆయన తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి రాసిచ్చి, పార్టీ ఇచ్చే గౌరవవేతనంతోనే జీవించారు. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా ఉంటూ ఆయన ప్రజాసేవా రంగంలో ఉత్తమనాయకునిగా..పేదల పక్షపాతిగా...ప్రజానాయకునిగా రాణించారు.

ఉద్యమాలే ఊపిరిగా.. పేదల సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాడిన యోధుడు..కామ్రేడ్‌ జక్కా వెంకయ్య. సుమారు 70ఏళ్ళ సుదీర్ఘరాజకీయ జీవితంలో ఆయనెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తొలితరం కమ్యూనిస్టు యోధునిగా, ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ, పేదల కష్టాలు తీర్చడం కోసం అహరహం పోరాడేవారు. 1985, 1994లో అల్లూరు ఎమ్మె ల్యేగా గెలిచి నియోజకవర్గ అభ్యున్నతికి బాటలు వేశారు. అటు పార్టీకీ, ఇటు ప్రజలకూ ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆయన మృతితో జిల్లా ఒక మంచి నాయకుడిని కోల్పోగా,. సిపిఎం పార్టీ ఒక ప్రముఖ పోరాట యోధుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అస్వస్తులుగా ఉన్న జక్కా వెంకయ్య మే 29వ తేది ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సింహపురి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమ ప్రియతమ నాయకుని మృతితో దామరమడుగు..కన్నీటిమడుగే అయింది. అక్కడి ప్రజలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని తలచుకుని కంటతడి పెట్టారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ ప్రియతమ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఉద్యమాలే ఊపిరిగా...

జక్కా వెంకయ్య స్వస్థలం పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉన్న దామరమడుగు గ్రామం. ఆయన 1930లో జన్మించాడు. చిన్నతనం నుంచి ఆయనకు పేదలన్నా, పేదల సమస్యల పరిష్కారమన్నా ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తే ఆయన్ను కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) చెంతకు చేర్చింది. పేదలకు న్యాయం చేయాలనే జీవితాంతం కృషి చేశారు. కార్మికుల కర్షకుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం పోరాడేవారు. ఒక్క మాటలో చెప్పా లంటే.. ఉద్యమాలే ఊపిరిగా..పోరాటమే జీవితంగా ఉండేవారు. ప్రత్యేకించి రైతాంగ సమస్యలపై ఆయన కెంతో అవగాహన ఉండేది. జిల్లాలో సాగునీటి సౌకర్యాల తీరు తెన్నులపై ఆయనకున్న పరిజ్ఞానం అమోఘం. పార్టీకి, పేదప్రజ లకు పెద్దదిక్కుగా.. ఒక విలక్షణమైన నాయకునిగా ఉంటూ జిల్లా స్థాయిలోనే కాక, రాష్ట్ర స్థాయిలోనే పేదల పక్షపాతిగా, పోరాటయోధునిగా పేరొందా రాయన. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జక్కా వెంకయ్య మరణవార్త వినగానే జిల్లా నలుమూలల నుంచి సిపిఎం కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజలు విచ్చేసి ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి కడసారి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా సిపిఎం నాయకుల పర్యవేక్షణలో బుధవారం ఆయన అంత్యక్రియలు నెల్లూరులో జరిగాయి.

ప్రముఖుల నివాళి

జక్కా వెంకయ్య మృతి తీరని లోటని, జిల్లా ఒక ప్రజా పోరాటయోధుని కోల్పోయిందని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. జక్కా వెంకయ్య మరణవార్త వినగానే అనేకమంది నాయకులు, అధికారులు, పెద్దసంఖ్యలో అభిమానులు సింహపురి ఆసుపత్రికి తరలివచ్చి జక్కా వెంకయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తదితరులంతా విచ్చేసి నివాళులర్పించారు.

పోరాటయోధునికి..కన్నీటి వీడ్కోలు

వేలాదిమంది సిపిఎం కార్యకర్తలు ఎర్రజెండాలతో వచ్చి తమ ప్రియతమ నాయకునికి కడసారి కన్నీటి నివాళులర్పించారు. బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయం నుంచి జక్కా వెంకయ్య అంతిమయాత్ర బయలుదేరగా, వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు ఎర్రజెండాలతో వచ్చి ఆయనకు జోహార్లర్పించారు. ఈ సందర్భంగా ఎంతోమంది అభిమానులు, నాయకులు ఆయ నతో తమకున్న అనుబంధాన్ని తలచుకుంటూ కన్నీరుమున్నీ రయ్యారు. సిపిఎం అగ్రనాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఎం జిల్లా నాయకులు చండ్ర రాజగోపాల్‌ తదితరులంతా విషణ్ణవదనాలతో కార్యక్రమాలను పర్యవేక్షించారు.

తరలివచ్చిన నేతలు

జక్కా వెంకయ్య మరణవార్త విని ఎంతోమంది నాయకులు ఆయన భౌతికకాయ్యాన్ని సందర్శించేందుకు నెల్లూరుకు తరలి వచ్చారు. అనేకమంది నాయకులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబు రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డి.సుబ్బా రావు, వెంకటేశ్వర్లు, కేంద్రకమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్రపార్టీ నాయకులు బి.వెంకట్‌, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసరావు, విఠపు బాలసుబ్ర హ్మణ్యం, అఖిలభారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలతో పాటు, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర పురపాలక మంత్రి డా.పి.నారాయణ, జడ్పీఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తాళ్ళపాక రమేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సిపిఐ శాసనసభాపక్ష నాయకుడు చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకటస్వామినాయుడు, సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, బిజెపి నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, మిడతల రమేష్‌, డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, గోగుల శ్రీనివాసులు, అన్నపూర్ణమ్మ, నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వైద్యులు డాక్టర్‌ రవీంద్రరెడ్డి, డాక్టర్‌ ఎం.వి.రమణయ్య, పి.అజయ్‌కుమార్‌ సిబ్బంది తదితరులంతా విచ్చేసి జక్కా వెంకయ్యను కడసారి సందర్శించి నివాళులర్పించారు.

రాష్ట్ర వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన సంతాప సందేశంలో సిపిఎం నేత జక్కా వెంకయ్య జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా మెలిగేవారని, రాజకీయవ్యవస్థలోనే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొంటూ, జక్కా వెంకయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పేదల మనిషి, ప్రజల మనిషి కామ్రేడ్‌ జక్కా వెంకన్న మృతికి 'లాయర్‌' నివాళులర్పిస్తోంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter