saraswathiప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, అపర శంకరాచార్య, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, కంచి కామకోటి పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శివసాయుజ్యం పొందారు. హిందూ ధర్మాన్ని జగజ్జేయమానం చేస్తూ, ప్రత్యే కించి శంకరమఠం ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు జీవితాంతం అహర్ని శలు నిర్విరామంగా శ్రమించారు జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ. ఆయనకు 83 ఏళ్ళు. తమిళనాడులోని కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 27 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామీజీ, అనంతరం తన గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భక్తులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయి స్తుండగా, ఉదయం గుండెపోటు వచ్చి స్వామివారు మహానిర్యాణం చెందారు. జయేంద్ర సరస్వతి స్వామీజీ పార్ధివ దేహానికి మఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు చేశారు. స్వామిజీ నిర్యాణం చెందడంతో భక్తులు కన్నీరుమున్నీరయ్యారు.

జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవన్‌. మన్నార్‌గుడి సమీపంలోని ఇరుళ్‌నీక్కి అనే కుగ్రామంలో ఆయన జన్మించారు. వేద విద్యాభ్యాసం చేసిన తరువాత 1954లో అప్పటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నుంచి సన్యాసం స్వీకరించారు. ఆ పీఠానికి బాల శంకరాచార్యులుగా అప్పట్లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 40ఏళ్ళకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణం చెందడంతో 1994లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కంచికామకోటి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జనకల్యాణ్‌, జనజాగరణ్‌ల పేరుతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావపరంపరలను పెంపొందించారు.

మాధవ సేవ... మానవ సేవే ధ్యేయంగా.....

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆధ్యాత్మిక బోధలు చేసి, ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తిభావాలను పెంపొందింప జేశారు. అనేక ఆసుపత్రులు, వేదపాఠశాలలు, విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు, చిన్నారులకు వైద్యాలయాలు నెలకొల్పి మానవాళికి, సమాజానికి నిర్విరామ సేవలందించారు. గోశాలలు నెలకొల్పి మూగజీవాలకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు, 1993లో కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీవారు ఏర్పాటు చేశారు. సైన్స్‌, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ తదితర కోర్సులన్నీ అభ్యసించేందుకు వీలుగా ఈ విద్యాలయాన్ని రూపుదిద్దారు. ఇలా ఎన్నో మహత్కార్యాలను నిర్వహించి శ్రీ జయేంద్ర సరస్వతిస్వామీజీ జగద్గురువుగా అందరి పూజలందుకున్నారు. జగద్గురువు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణంతో అశేష భక్తజనులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు.

దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను కోల్పోయింది - రాష్ట్రపతి

శ్రీ జయేంద్ర సరస్వతి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను, సమాజ సంస్కర్తను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జయేంద్ర సరస్వతి లక్షలాది భక్తుల మనసుల్లో జీవించే వుంటారని ప్రధాని తన సంతాపంలో తెలిపారు. గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ఎన్‌ నరసింహంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కెసీఆర్‌లు జయేంద్ర సరస్వతి మృతికి విచారం ప్రకటించారు. ఆయన మరణం మానవాళికి తీరని నష్టమన్నారు. ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ కంచి పీఠాన్ని బలమైన సంస్థగా తీర్చిదిద్దారని, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, కంటి ఆసుపత్రులు, చిన్నపిల్లలకు ఆసుపత్రులు నిర్వహింపజేస్తూ మానవసేవలో తరించారని వారు కొనియాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ తన సంతాపం ప్రకటిస్తూ, ధార్మికత, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబో ధించిన గురువుగా, జగద్గురువుగా జయేంద్ర సరస్వతి ఖ్యాతిగారచారని కొనియాడారు.

rocksవిజయవంతమైన ఉపగ్రహాల ప్రయోగానికి 'ఇస్రో' కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇటీవల కాలంలో ఇస్రో వరుసబెట్టి వదులుతున్న రాకెట్లన్నీ కూడా సూపర్‌హిట్లే! అంతరిక్ష ప్రయో గాలలో ఒక్కో రాకెట్‌ ఒక్కో మలుపుగా ఉంటోంది. ఈమధ్య వరుస రాకెట్ల ప్రయోగాలతో నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) సందడిగా ఉంటోంది. మొన్నటికి మొన్న జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ సక్సెస్‌ మరుగున పడక ముందే తాజాగా జూన్‌ 23వ తేదీ పిఎస్‌ఎల్‌వి-సి38ను ప్రయోగించి విజయపరంపరను కొన సాగించింది. 23వ తేదీ ఉదయం 9.29 గంటలకు షార్‌ సెంటర్‌ నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి38 పూర్తిగా విజయవంతమైంది. 23.20 నిముషాల ప్రయోగకాలంలో మొత్తం 31ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలలో ప్రవేశపెట్టింది. వీటిలో రెండు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు 29 విదేశీ ఉపగ్రహాలు న్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో అంతరిక్ష వాణిజ్యావకాశాలు మెరుగుపడ్డాయి. ఇస్రో ప్రయోగాలపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగింది. అతితక్కువ ఖర్చుతో ఆయా దేశాల ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే సంస్థగా ఇస్రో గణతికెక్కింది. ఈ ప్రయోగంతో 'ఇస్రో' అంతరిక్షంలోకి పంపించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 209కి చేరడం విశేషం.

advaniలాల్‌కిషన్‌ అద్వానీ... ఆయన లేకుంటే బీజేపీ లేదు. ఆయన రథయాత్ర చేయకుంటే బీజేపీకి మనుగడ లేదు, ఆయన సారధ్యం వహించకుంటే బీజేపీకి విజయప్రస్థానం లేదు. ఆయనే అండగా నిలవకపోయి వుంటే ఈరోజు ప్రధానమంత్రి పీఠంపై నరేంద్ర మోడీయే ఉండేవాడు కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తుం దన్నా, కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నా దాని క్రెడిట్‌ అంతా కూడా అద్వానీదే! ఆయన లేవనెత్తిన రామమందిరం అంశందే! బీజేపీని ఆయన నిలబెట్టాడు. ఆయన లేనిదే ఈరోజు బీజేపీ లేదు, ఉన్నా ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆయన నిలబెట్టిన పార్టీలో అందరూ ఆయన భుజాల మీద నుండే పాదాలు పెట్టి ప్రధానులు, రాష్ట్రపతులు అవుతు న్నారు. కాని, ఆయన మాత్రం ఆ పదవు లను అందుకోలేకపోతున్నాడు. ఏ రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదమైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రాభవానికి పునాదిగా నిలిచిందో... అదే వివాదం అద్వానీ పదోన్నతికి ప్రతిబం ధకంగా నిలిచింది.

1996, 1998, 1999... మూడు సార్లు కేంద్రంలో బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలొచ్చాయి. మిత్ర పక్షాలన్నీ కూడా అతివాదిగా ముద్రవున్న అద్వానీ కాకుండా మితవాద ముద్ర వున్న వాజ్‌పేయినే ప్రధానిగా కోరుకున్నాయి. కాబట్టి ఆ మూడుసార్లు అవకాశం వాజ్‌పేయికి పోయింది. 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ మట్టి కరిచింది. ఆ రెండు ఎన్నికల్లో ఏ ఒక్కసారి పార్టీ అధికారంలోకి వచ్చున్నా, అద్వానీయే ప్రధాని. కాని అదృష్టం, అవకాశం రెండూ కలసిరాలేదు.

2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ తెరమీదకొచ్చాడు. వాస్త వంగా ఆ ఎన్నికల్లో యూపిఏ మీద వున్న వ్యతిరేకత కొద్ది ప్రజలు బీజేపీ సంకీర్ణ కూటమికే అధికారం కట్టబెట్టుండేవాళ్లు. మోడీగా ప్రదాని అభ్యర్థిగా ప్రచారం చేయకపోయి వున్నా బీజేపీ కూటమిదే అధికారం. ఇందులో సందేహం లేదు. కాకపోతే సీట్లు తగ్గేవంతే! మోడీ ఇమేజ్‌ వల్ల వూహించని విధంగా సీట్లు పెరి గాయి. అద్వానీ ప్రధాని కావడానికి వున్న చివరి అవకాశం 2014 ఎన్నికలే! మోడీ రూపంలో అక్కడా బ్రేకు పడింది.

దేశంలో అద్వానీ స్థాయికి సరితూగ గల పదవి ఇక రాష్ట్రపతి పదవే! అన్ని అర్హతలున్నా ప్రధాని కాలేకపోయాడా యన! కనీసం రాష్ట్రపతిగానైనా ఎన్నుకుని ఆ జాతీయ నాయకుడిని, రాజకీయ యోధుడిని గౌరవించుకోవాలని బీజేపీలోని ఆయన సానుభూతి పరులు భావించారు. అయితే బాబ్రీ మసీదు విధ్వంసం కేసు

ఉరుములేని పిడుగులా పైన పడింది. రాష్ట్రపతి ఎన్నికకు టైం దగ్గర పడుతున్న కొద్దినెలల ముందే బాబ్రీ కేసు విషయంలో సిబిఐ ఆయనపై ఛార్జిషీట్‌ దాఖలుచేసింది. దీంతో రాష్ట్రపతి కావడానికి ఆయనకున్న దారులు మూసుకుపోయాయి. ప్రధాని నరేంద్రమోడీయే ఈ కేసును తిరగదోడా డని, గురువును ముంచిన, మించిన శిష్యు డనిపించుకున్నాడనే ఆరోపణలు వినవస్తు న్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమి షన్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. జూలై 17న పోలింగ్‌, 20వ తేదీ కౌంటింగ్‌ వుంటుంది. ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీలోపు నామినేషన్లు వేయవచ్చు. 30వ తేదీ నామినేషన్ల పత్రాల పరిశీలన జరుగుతుంది. జూలై 1వ తేదీ నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చు.

ఇక ఎన్డీఏ కొద్దిరోజుల్లోనే తమ అభ్య ర్థిని ప్రకటించవచ్చు. అద్భుతాలు జరిగితే తప్పితే రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీకి దాదాపు అవకాశం లేనట్లే! ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్‌ గవర్నర్‌గా వున్న ద్రౌపతికుర్ము పేరు ప్రధానంగా వినిపి స్తోంది. ఈమె గిరిజన మహిళ! బీజేపీలో కార్యకర్త స్థాయి నుండి ఎదిగిన నాయకు రాలు. ఈమెను రాష్ట్రపతిగా ఎన్నుకుంటే గతంలో అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిగా చేసి ఒక ముస్లింను రాష్ట్రపతిని చేసిన ఖ్యాతిని పొందినట్లే, ఒక గిరిజన మహిళను రాష్ట్ర పతిని చేసామన్న పేరు కూడా బీజేపీ ఖాతాలో పడుతుంది. ఈమెను అభ్యర్థిగా ప్రకటిస్తే విపక్షాలు కూడా పోటీ అభ్యర్థిని పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. ఒకవేళ టైం కలిసొచ్చి అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఎన్డీఏతర ప్రాం తీయ పార్టీలు కొన్ని ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter