jc brosఈరోజు ఇంట్లో వున్న టీవీలు చేయలేని పని చేతిలో వున్న సెల్‌ఫోన్‌లు చేస్తున్నాయి. మీడియాకు పక్షపాతం ఉంటుందేమో... కాని సెల్‌ఫోన్‌లకు ఎవరైనా ఒకటే కదా... ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఎలక్ట్రానిక్‌ మీడియా కన్నా సోషల్‌ మీడియానే శక్తివంతంగా మారిందంటే అతిశయోక్తి కాదేమో! సోషల్‌ మీడియాలో ఒక్కో వ్యక్తి తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డిని తిడుతున్న బూతులు చూస్తుంటే... చెవుల్లో దూది పెట్టుకోవాలనిపిస్తుంది. ఆయనను అంత చంఢాలంగా, అంత అసహ్యంగా తిడుతు న్నారు. ఆ బూతులు గాని ప్రభాకర్‌రెడ్డి విన్నా డంటే ఇక జన్మలో నోరు తెరచి మాట్లాడడేమో!

కృష్ణాజిల్లాలో ఇటీవల దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో 11మంది ప్రయాణీకులు మృతిచెందడం, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్ళడం, ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడం, ఈ సందర్భంలో బస్సు డ్రైవర్‌కు పోస్టుమార్టం చేయకుండా అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలైన జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే! అధికారపార్టీ నాయకులకు చెందిన ట్రావెల్స్‌ కంపెనీ బస్సు కావడంతో ఈ ప్రమాద ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ 'సాక్షి' మీడియాలో కథనాలు వచ్చాయి. 'సాక్షి'లో కథనాలు వచ్చినంత మాత్రాన జేసీ బ్రదర్స్‌ కొంపలేమీ అంటుకుపోవు. దివాకర్‌ ట్రావెల్స్‌ను కాపాడడానికి ఎలాగూ చంద్రబాబు ఉన్నాడు. మరి జేసీ ప్రభాకర్‌రెడ్డి బాధ్యతాయుత శాసనసభ్యుని హోదాలో వుండి, సభ్యత, సంస్కారం మరచి అనంతపురం 'సాక్షి' కార్యాలయం ఎదుట టెంట్‌ వేసి ధర్నాకు దిగి జగన్‌ను వ్రాయలేని భాషలో తిట్టాడు. తాగుబోతులు కూడా ఇంత నీచంగా మాట్లాడరు. జేసీ ప్రభాకర్‌ తిట్లపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రాజకీయాలకతీతంగా ఆగ్రహించారు. ఎక్కువుగా మహిళలే స్పందించి జేసీకి తమదైన భాషలో బుద్ధి చెబుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ఇంకొందరు యువకులు, వై.యస్‌. అభిమానులైతే జేసీ బ్రదర్స్‌ను పచ్చిబూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లలోనూ విన్యాసం చేస్తున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకటి అంటే... అతనిని లక్షలాది మంది తిడుతున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంత దిగజారి విమర్శలు చేసినా జగన్‌ ఎంతో హూందాగా వ్యవహరించి ప్రజల మన్ననపొందారు. గజరాజు పోతుంటే కుక్కలు మొరగడం సహజమేనంటూ జేసీ సోదరుల స్థాయిని చెప్పకనే చెప్పాడు. అయితే మొత్తం ఎపిసోడ్‌లో బాధ్యత విస్మరించిన అధినేతగా చంద్రబాబు మిగిలిపోతాడు. ఎందుకంటే తన పార్టీ ఎమ్మెల్యే హద్దుమీరి ప్రవర్తించినా చంద్రబాబు అతనిని పిలిచి మందలించలేదు. ఇది సంస్కారవంతుల పని కాదని చెప్పలేదు. ఇలాంటివి ఇక ముందు జరిగితే సహించనని హెచ్చరించలేదు. రాజకీయాల కొక భాష, రాజకీయ నాయకులకొక పద్ధతి వుంటుంది. ఏ పార్టీ వారయినా సరే, ఎప్పుడు కూడా అది శృతిమించకూడదు. కాని, తన పార్టీ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడంటే, వారికి అంటుకుని వున్న బురదను తాను కూడా పూసుకోవడానికి సిద్ధపడినట్లేనా?

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • వీడుతున్న సంకెళ్ళు
    రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter