tree lover

-      కె.గోపాలరావు, నెల్లూరు. 9652174640

విచక్షణా రహితంగా

చెట్లను కొట్టేసేవాళ్ళ తలకొట్టేసినట్టు

ఈయనెవరో గాని...

వరండా స్లాబుల్లోంచే రంధ్రం చేసి

చెట్టు నట్టాగే పైకి వదిలేశాడు

పార్టీ జెండా నెగరేసినట్టు

ఇంటికి పచ్చటి తలపాగా చుట్టినట్టు.

ఆదిశేషుడు

విష్ణువుకి పడగపడుతున్నట్టు

పచ్చదనానికి పెద్ద పీటేసే

పర్యావరణశాఖ ప్రధాన కార్యాలయంలా

ఆ ఇల్లు అచ్చం ఆయన గారి

ఎదరిల్లులా వుంది.

కొట్టేస్తే స్థలం కలిస్తొందికదాని

మా స్నేహితుడంటే,

భీష్ముడు స్ర్తీని ముట్టనన్నట్టు

చెట్టుని కొట్టనని

ఒట్టేసుకున్నాడేమోనని అన్నాను.

ఏది ఏమైనా

పచ్చగా ఎదగాలనుకునేవాళ్ళంతా

గుండెలపై పెట్టుకొని

చెట్టుకలా పట్టాభిషేకం చెయ్యాలి

కొట్టేసి పొట్టన బెట్టుకోకుండా...

- -      గుర్రాల రమణయ్య, నెల్లూరు. 99639 21943

పెన్నా

నీ చిరునవ్వుల హెన్నా

నా గుండెలకు పూసుకున్నా

ఇప్పుడు

జీవితమంతా ఎరుపే

నీ గలగల గీతాల లయ

కలంలో నింపుకొని

ఎన్ని కవితలకు ఊపిరిపోశానో

పచ్చటి చేలలో

పాటకచ్చేరీలా

మడవల్లో పారే నీ పాటని

పలవరించిన కవిని నేను

చినుకులజల్లులో తడుస్తూ

కొంగ్రొత్త ఉత్సాహంతో

నువ్వు పరుగులెత్తుతూంటే

దిశమొలతో నేను

మునకలేసింది అదిగో

ఆ ఒంపులోనే అనుకుంటా

ఒకానొక సాయంకాలం

నేను కట్టిన పిచ్చుకగూళ్ళని

అర్థరాత్రి దొంగలించావు

నేనలిగి నీతో కచ్చి పెట్టుకొని

వెళ్ళిపోయిన రోజే కాదూ

నువ్వు మా యింటి వెనుకదాకా

వచ్చావు వరదపొంగులతో

అప్పుడు నీ ముందు నేను

పిన్నీసు గుచ్చిన నిక్కర్లో బచ్చాని

డెబ్బై ఏళ్ల తర్వాత యిన్నాళ్ళకి

నీ ఒడ్డుపైన మళ్ళీ కుర్చున్నా

ఇప్పుడూ నేను తలనెరసిన బచ్చానే

- -      మోపూరు పెంచలనరసింహం, నెల్లూరు. 9346393501

కోయిలపాట

ఆకుపచ్చని తోట

ఆమని ఆట

              కనిపించని

              తీరపు అడుగులు

              బాల్యస్మృతులు

చీకటితెరపై

వెండి సంతకము

పున్నమి రేయి

              ఆకాశం నుండి

              శరపరంపర

              వర్ష బాణాలు

కొమ్మకొమ్మలో

పిట్టల సరాగాలు

స్మృతుల గ్రంథం

              గుప్పుమంటున్న

              పరిమళాల వాన

              పూల నవ్వులు

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter