tree lover

-      కె.గోపాలరావు, నెల్లూరు. 9652174640

విచక్షణా రహితంగా

చెట్లను కొట్టేసేవాళ్ళ తలకొట్టేసినట్టు

ఈయనెవరో గాని...

వరండా స్లాబుల్లోంచే రంధ్రం చేసి

చెట్టు నట్టాగే పైకి వదిలేశాడు

పార్టీ జెండా నెగరేసినట్టు

ఇంటికి పచ్చటి తలపాగా చుట్టినట్టు.

ఆదిశేషుడు

విష్ణువుకి పడగపడుతున్నట్టు

పచ్చదనానికి పెద్ద పీటేసే

పర్యావరణశాఖ ప్రధాన కార్యాలయంలా

ఆ ఇల్లు అచ్చం ఆయన గారి

ఎదరిల్లులా వుంది.

కొట్టేస్తే స్థలం కలిస్తొందికదాని

మా స్నేహితుడంటే,

భీష్ముడు స్ర్తీని ముట్టనన్నట్టు

చెట్టుని కొట్టనని

ఒట్టేసుకున్నాడేమోనని అన్నాను.

ఏది ఏమైనా

పచ్చగా ఎదగాలనుకునేవాళ్ళంతా

గుండెలపై పెట్టుకొని

చెట్టుకలా పట్టాభిషేకం చెయ్యాలి

కొట్టేసి పొట్టన బెట్టుకోకుండా...

-      విహారి, హైదరాబాద్. 9848025600

స్వప్రయోజనం ఎప్పుడూ

నిలువెత్తు హింసావాది

ఉనికి కోసం చేసే ఉద్ఘాటన

పరిపరి ఉపరి స్పర్శే

పొరలు త్రచ్చుతూ మూలాలకి

పోకపోవటం కళ్లకు మకమ్మిన పొర

బోలు మాటల దొంతర్లలో

సత్యం హత్య చేయబడుతుంటే

రాజకీయం రంగుల వలని విసురుతూనే వుంటుంది

ఇవ్వాళ పట్టుబడిన దౌష్ట్యం

నిన్న మట్టుబెట్టినవి ప్రాణాలు కావంటుంది

దుర్మార్గపు నిబద్ధత తన చట్టం వేరంటుంది

పావురాల్ని కొట్టేవాడు తనకు మాత్రమే

కన్నీళ్ళు కోరటం – దయ్యపు అభ్యర్థన

ఒకరి బతుకు పచ్చదనాన్ని నిప్పచ్చరం చేసేవాడు

తన నీడనూ శిథిలం చేసే కాల రహస్యాన్ని మరిస్తే...

గీతలూ, రాతలూ కలగా పులగమైపోతాయి

radham

-      డా. సి.భవానీదేవి, హైదరాబాదం. 9866847000

శత సహస్త్ర బాహువులు చాచి

స్వాగతించే అరుణుని పాదస్పర్శతో

పులకాంకిత సూర్యరథ విన్నాణమిది

ఇరవైనాలుగు గంటల దినాలు చక్రాలుగా

ఎనిమిది జాములు చక్రానికి ఆకులుగా

మహాలక్ష్మీ సత్త్వల ఇరుసుగా

సప్తవర్ష్యాశ్వర రధారూఢుడు

ప్రత్యక్ష దైవ శిలారథం

సకల కళాతేజ విలసితం

ఈ శిల్పసుందరీ సౌందర్యకల్పనకు

ఏ శిల్పి యవ్వనాన్ని ధారబోశాడో

ఈ నాగినీభృకుటీ విలాసం

ఏ కళింగరాజ దీక్షా దర్షమో

ఈ మిధున క్రీడా భంగిమల్లో

కుదురుకున్నదే సృష్టి రహస్యమో

ఈ నాట్యకత్తెల కాలి అందియలు

కర్ణపేయ రవళిగా రంజిల్లటం

ఎందరు రసమయ శిల్పకారుల

త్యాగనిరతీ సుకృత ఫలమో

సుప్రభాత సూర్య నేత్రానికి

సిసలైన శిల్పకారుడందించిన కళాంజలిని

కళ్ల నిండా నింపుకుందామనుకున్నాను

మనసుతీరా మాట్లాడదామనుకున్నాను

నిశ్శబ్ద సౌందర్యమే మధురం కదా.

(కోణార్క సూర్యదేవాలయం చూసి)

Page 1 of 7

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter