karunuvనెల్లూరు విభిన్న జీవన విధానాల సమూహం. ఈ జిల్లాలో తూర్పు ప్రాంతం గ్రామాలకు వెళితే పచ్చటి పైర్లు... నిటారుగా పెరిగిన కొబ్బరిచెట్లు... నీళ్ళతో కళకళలాడే కాలువలు... అచ్చం కోనసీమను తలపించేలా వుంటుంది వాతావరణం. ఇక గ్రామాలలో చూస్తే పేరుకు పల్లెటూర్లు అయినా అన్నీ మిద్దెలే. ఎక్కువ శాతం మంది ఆస్తిపరులే. ప్రతి ఇంట్లో కారు, కనీసం బైక్‌... విలాసవంతమైన జీవితం. మరి పడమర పల్లెల్లోకి వెళితే బీడుబారిన భూములు, ఎండిపోయిన పైర్లు, ఇంకిన బావులు, బొంతరాళ్ళతో కట్టిన ఇళ్ళు, బీటలు వారిన కాలువలు... ఇదీ పరిస్థితి. పడమర ప్రాంతమైన ఉదయగిరి చుట్టుపక్కల మండలాలకు వెళితే ఈ రోజుకీ మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది.

నెల్లూరుజిల్లాలో ఎక్కువుగా వలసలు పోయే ప్రాంతం ఏదన్నా వుందంటే అది ఉదయగిరి ప్రాంతమే. ఈ ప్రాంతం వాసులు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో వుంటారు. అంతెందుకు నెల్లూరు నగ రంలో సైతం ఈరోజు ఈ ప్రాంతవాసులే అధికం. ఇక్కడ ప్రతిఏటా నెలకొనే కరువు కాటకాలు, నీళ్ళు లేక వ్యవసాయ పనులు తగ్గిపోవడం, ఉపాధి పరంగా ప్రత్యా మ్నాయ మార్గాలు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఉదయగిరి, సీతారాంపురం, కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, మర్రిపాడు వంటి మండలాల నుండి పెద్దఎత్తున వలసలు పోతుంటారు.

ఈ కరువు ప్రాంతంలో వలసలను నిరోధించడానికి, వ్యవసాయానికి ప్రత్యా మ్నాయంగా ఉపాధి మార్గాలు చూపించ డానికి ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జరిగినా అదంతా కూడా తూర్పు ప్రాంతానికే పరిమితమైపోయింది. ఈ ప్రాంతంలో కనీసం వందమందికిఉద్యోగాలిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు.

''అంగట్లో అన్నీ వున్నా అల్లుడినోట్లో శని'' అన్నట్లు సోమశిల నుండి 200 కిలోమీటర్ల దూరంలో వున్న చెన్నైకు నీళ్ళు పారుతుంటాయి. గట్టిగా పాతిక కిలోమీటర్ల దూరంలో కూడా లేని ఈ మెట్ట మండలాలకు సోమశిల నీళ్ళుం డవు. కారణం ఇది ఎత్తు ప్రాంతం కావడం. వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తయ్యుంటే ఈ మెట్ట ప్రాంతం కొంతవరకన్నా కరువు కోరల నుండి బయటపడి వుండేది. వైయస్సే ఉండుంటే వెలుగొండ పూర్తై ఈ ప్రాంత రూపురేఖలు మారివుండేవి. ఆయన మరణం ఈ ప్రాంతానికి శాపంగా మారిందని చెప్పవచ్చు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా వున్న ఆనం రామనారాయణరెడ్డి సోమశిల నుండి ఈ ప్రాంతానికి సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను మంజూరు చేయించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఈ పనుల్లో ఊపులేదు. ఈ కెనాల్‌ పూర్తయినా పెన్న నీళ్ళు అంది ఈ ప్రాంతపు నేలలకు నీళ్ళందుతాయి. వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడతాయి.

ఎండాకాలం వచ్చిదంటే ఈ మండ లాలలో తాగునీటి సమస్యలు తలెత్తుతాయి. గత ఏడాది వర్షాలు లేవు. చెరువులు, బావులు నిండ లేదు. భూగర్భ జలాలు పెరగలేదు. అరకొర వర్షాలు పడినా ఇంత కాలం తాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఎండలు ముదిరి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉదయగిరి పల్లెల్లో అప్పుడే నీటిఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి. సాగునీళ్ళు అంటే ఎలాగూ ఇవ్వడం లేదు. కనీసం తాగునీళ్ళ సమస్యైనా ముందస్తు జాగ్రత్త చర్యలతో తీర్చాల్సివుంది.

karuvuజిల్లాలోని మెట్ట ప్రాంతాలు కరువు వాతపడ్డాయి. ఒకవైపు నీటి కొరత, మరోవైపు అకాల వర్షాలతో పంట పొలాలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్టలో చెరువులు దొరువుల్లో చుక్కనీరు లేక సేద్యం కుదేలైపోయింది. అప్పుల పాలై రైతన్నలు లబోదిబోమంటున్నారు. సాగునీటి వసతులు అంతంతమాత్రంగానే వుండడంతో ఎంతగా కష్టించి పనిచేసినా పంటలు సక్రమంగా పండక మెట్ట రైతులు పడే అవస్తలు అన్నిన్ని కావు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని అనేక మండలాలు కరువుతో విలవిల్లాడుతున్నా ప్రభుత్వం అన్నదాతల గోడును పట్టించుకోకపోవడం విచారకరం.

ప్రతి ఏడాదీ జిల్లాలోని మెట్ట ప్రాం తాలు కరువుతో అల్లాడుతూనే ఉన్నాయి. లేదంటే అకాల వర్షాలు వచ్చి కొంప ముంచి పోతున్నాయి. గత కొద్ది సంవత్స రాలుగా వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తులు మెట్ట ప్రాంతాల రైతులను అప్పుల సుడిగుండంలోకి నెడుతున్నాయి. అటు సాగునీరు లేక, ఇటు తాగునీరుకు కూడా కష్టాల పాలవుతున్నా రైతుల ఇబ్బం దులను పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరం. ఇక్కడ భూముల్లో అధికశాతం వర్షాధార భూములే. వరుణుడి కరుణ ఉంటే తప్ప ఇక్కడ చేలల్లో పంటలు పండవు. బోర్లు, బావుల కింద పంటలు సాగుచేసుకునే రైతుల పరిస్థితి కూడా దాదాపు అంతే. భూగర్భజలాలు అడు గంటిపోవడంతో పంటపొలాలకు చుక్క నీరు అందక రైతులు దిగాలుపడిపోయారు. సుమారు నాలుగువందల అడుగుల లోతుకు బోరు వేసినా నీటి చుక్క అందక పోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మూగజీవాలకు తాగేందుకు కూడా నీరు దొరక్కపోవడంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా ఎండకు ఎండిన నేలలే తప్ప పచ్చదనం అన్నది కనిపించడం లేదు. కొండలు గుట్టలన్నీ వెదికినా మూగ జీవాలకు గడ్డి దొరకడం లేదు. పాడిపశువులున్న రైతులు ఆ మూగజీవాలను ఎలా కాపాడుకోవాలో తెలియక కంటనీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ కరువులో పంటలు పండక సేద్యానికి చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది నిరుపేద రైతులు సతమతమవుతున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకో వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పొలాల్లో పనులు లేకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న వ్యవసాయ కూలీలు ఇక్కడ పనులు లభించక, ఉన్న ఊరు వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని పనులున్న చోటికి వలసలు పోతున్నారు. మెట్ట చుట్టూ కరువు కమ్మేయడంతో ఈ ప్రాంతాల్లో వేసిన వరి తదితర పైర్లన్నీ అత్యధికశాతం నిలువునా ఎండిపో యాయి. ఒక్క ఉదయగిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోనే వరి సాగు సాధారణ విస్తీర్ణం 3,815 హెక్టార్లుంటే, ఇందులో వరిపంట సాగైంది కేవలం 358హెక్టార్లలో మాత్రమే. ఇదీ దుస్థితి. దీంతో వరి రైతుల కష్టాలకు అంతేలేదు. వరితో పాటు అనేక ప్రాంతాల్లో వేసుకున్న మొక్కజొన్న, జొన్న, రాగి, మినుము తదితర పంటలు కూడా వానలు లేక ఎండిపోయాయి. పండ్ల తోటలు కూడా ఈసారి కనీవినీ ఎరుగని నష్టాలకు గురయ్యాయి. నీరు లేక బత్తాయి, మామిడి, నిమ్మ తదితర తోటలన్నీ ఎండి పోవడంతో రైతన్న కన్నీటిపర్యంతం అవు తున్నాడు. ప్రభుత్వం జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 10 మండలాలలను కరువు మండలాలుగా ప్రకటించిందే తప్ప, కరువు కాటుకు గురైన ఆయా మండలాల్లోని రైతుల స్థితిగతులను అసలు పట్టించుకోవడం లేదు. ఆదుకునే వారు లేక రైతుల జీవన పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇకనైనా కరువు బారిన పడిన మెట్ట ప్రాంత రైతు లను ఆదుకునేందుకు తక్షణచర్యలు తీసు కోవాలని రైతులు కోరుతున్నారు.

కన్నీట ముంచిన...అకాలవర్షాలు

ఒకవైపు నీటిచుక్క లేక, అదనుకు వానలు కురవక పొలాలు ఎండిపోయి రైతులు బాధపడుతుతన్న తరుణంలో, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు ఆయా ప్రాంతాల రైతులను కన్నీట ముంచాయి. కోతకు వచ్చిన పంట భారీవర్షానికి నీట మునిగిపోవడంతో రైతులు కన్నీట మునిగిపోయారు. ఈ నెల 16వ తేది అర్ధరాత్రి దాటాక నాయుడుపేట, వెంకటగిరి, ఓజిలి, మనుబోలు, పెళ్ళకూరు, దొరవారిసత్రం, ఓజిలి తదితర మండలాల్లో అకాల వర్షాలు కురిశాయి. రెండురోజుల పాటు కురిసిన ఈ వర్షాల వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. అనేకచోట్ల పంటలు దెబ్బతినడంతో పాటు, కల్లాల్లో ఆరబెట్టుకుని ఉన్న ధాన్యం కూడా నీటమునిగిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సుమారు 2800 టన్నుల ధాన్యం నీటమునిగి ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ అకాల వర్షాల వల్ల రైతాంగానికి కనీసం 48 కోట్ల దాకా నష్టం ఉంటుందని అంచనా. పంటచేలతో పాటు పండ్లతోటలకు కూడా అపారనష్టం కలిగింది. మామిడిపూత నేలరాలిపోవడంతో మామిడి రైతులు గోడుగోడుమంటున్నారు. అన్ని రకాల పంటలు ఈ అకాలవర్షాలకు అపారంగా నష్టానికి గురయ్యాయి. ప్రభుత్వం వెంటనే అటు కరువు బాధిత రైతాంగానికి, ఇటు అకాలవర్షాలతో నష్టపోయిన రైతాంగానికి చేయూతను అందించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఈ నష్టాల అంచనాలను ప్రభుత్వానికి నివేదించి సత్వరం అన్నదాతలను ఆదుకోవాల్సి ఉంది.

karu2015లో కురిసిన వర్షాలు తప్ప అంతకుముందు మూడేళ్ళుగాని, గత రెండేళ్లలో గాని జిల్లాలో పెద్దగా వర్షాలు పడింది లేదు. ప్రతి ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులే! శ్రీశైలం నుండి వస్తున్న నీళ్ళతో డెల్టాలో పంటలు పండించుకుంటున్నారు తప్పితే జిల్లాలో కురిసిన వర్షాలను ఆధా రంగా చేసుకుని పంటలు పండించడం చాలా తక్కువ. డెల్టాకు కనీసం శ్రీశైలం నుండన్నా నీళ్లొస్తున్నాయి. మెట్ట మండ లాలకు ఆ భాగ్యం కూడా లేదు. కేవలం వర్షాలను నమ్ముకునే మెట్టప్రాంతాలలో వాణిజ్య పంటలు వేసుకోవాలి. వర్షాలు పడకపోతే వేసిన పంటలు అంతే సంగతి. గత కొన్నేళ్ళుగా మెట్ట మండలాలలో రైతుల పరిస్థితి దారుణంగా వుంది. ఈ ఏడాది కూడా మెట్ట ప్రాంతాలలో తీవ్ర కరువు ఏర్పడింది. గత ఏడాది చివర్లో వర్షాలు లేవు. దాంతో వాణిజ్య పంటలు వేయలేకపోయారు. కొందరు రైతులు ధైర్యం చేసి వేసినా సరిగా నీళ్ళు లేక పంటలు ఎండిపోయాయి. జిల్లాలో దాదాపు 30 మండలాలలో తీవ్ర కరువు ఏర్పడింది. పశువులకు మేత కూడా లేని పరిస్థితి. రేపు ఏప్రిల్‌, మే నెలల్లో అయితే త్రాగు నీటికి కూడా అల్లాడాల్సిన దుస్థితి. కేవలం తూర్పు ప్రాంత డెల్టా మండలాలు తప్పించి మిగతా మండలాలలో కరువు నెలకొన్నా ప్రభుత్వం మాత్రం మర్రిపాడు, వింజ మూరు, ఉదయగిరి, కొండాపురం, వరి కుంటపాడు, సీతారాంపురం, కోట, ఓజిలి, బాలాయపల్లి, సైదాపురం, గూడూరు, పొదలకూరు, రాపూరు, అనంతసాగరం, చేజర్ల మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లాలో చాలా తక్కువ మండలాలలో మాత్రమే కరువు ఛాయలు లేవని, దాదాపు జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులున్న దృష్ట్యా జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter