kathiఅతనొక చిన్న నటుడు.. తక్కువ సినిమాలలో నటించాడు... అందులోనూ గుర్తుండిపోయే క్యారెక్టర్‌ లేమీ కావు... అయితే ఇప్పుడతను సినిమాలలో కన్నా న్యూస్‌ఛానెల్స్‌ ద్వారా పాపులర్‌ అయిపోయాడు. రాష్ట్ర మంతా తెలిసేలా గుర్తింపు పొందాడు. అతడే కత్తి మహేష్‌. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ జనసేన అభిమాను లకు కొరుకుడు పడని కొయ్యగా మారిన వ్యక్తి.

రాష్ట్ర రాజకీయాలలో పవన్‌ పాత్ర ఏమిటి అనే దానిపై క్లారిటీ లేదు. పవన్‌ వ్యవహారశైలిని చూసిన ఎవరికైనా అతను చంద్రబాబు పంజరంలో చిలకేననే విషయం ఇట్టే అర్ధమైపోతుంది. కాకాపోతే పవన్‌ అభిమానులే ఇంకా అర్ధం చేసుకోవడం లేదు. పవన్‌ వ్యవహారశైలిపై వైకాపా శ్రేణులు బాగానే ధుమ్మెత్తి పోసాయి. అయితే పవన్‌ను ఆడుకోవడంలో కత్తి మహేష్‌ ముందు వైకాపా నాయకులు కూడా సరిపోవడం లేదు. టీవీ ఛానల్స్‌ చర్చా వేదికలలోనూ, సోషల్‌ మీడియాలోనూ పవన్‌ను కడిగేయడంలో, ఆయనను ప్రశ్నించడంలో కత్తి మహేష్‌ నిముషం కూడా గ్యాప్‌ ఇవ్వడం లేదు. ఒక్కోసారి వితండవాదానికి కూడా దిగుతూ పవన్‌ అభిమానులకు మెంటలెక్కిస్తున్నాడు. పవన్‌పై అతను విపరీత వ్యాఖ్యలు చేసివున్నాడు. అభిమానులకు కోపమొచ్చి కత్తిని తీవ్రస్థాయిలో దూషించడమే కాక అతన్ని చంపుతామని సోషల్‌ మీడియా ద్వారానే బెదిరించారు. కాని, కత్తి మహేష్‌ ఇవేమీ లెక్క చేయకుండా పవన్‌పై మరింతగా రెచ్చిపోతున్నాడు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని పవన్‌కే నేరుగా సవాల్‌ విసురుతున్నాడు. ఈ కత్తిని ఎలా అదుపు చేయాలో తెలియక పవన్‌ జనసేన జుట్టు పీక్కుంటోంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter