tdp flagరాజకీయాలలో అంత మంచితనం పనికిరాదు, మంచితనానికి తోడు కొంత కఠినత్వం కూడా అవసరం. స్వతహాగా మాజీ శాసనసబ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్‌రావు కు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనే మంచివాడు, సౌమ్యుడు అనే పేరుంది. ఆ మంచి తనమే గత ఎన్నికలలో నిలువునా ముంచింది. మళ్ళీ అదే మంచితనం కనబడుతుందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంటే ఉత్సాహంతో పనిచేయాల్సిన తెలుగు తమ్ముళ్లు కావలి నియోజక వర్గంలో అందుకు భిన్నంగా నిరుత్సాహంతో, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల నిర్వహంచిన గ్రామ, వార్డు కమిటీల ఎన్నికల్లో కార్యకర్తల అసహనం బయటపడుతుంది. కారణం పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కార్యకర్తలపై ఆయన దృష్టి సారించకపోవడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలతో నాయకులు చిన్నా పెద్దా తేడా లేకుండా కలసిపోవాలి. అందుకు భిన్నంగా నియోజకవర్గంలో ఆ నలుగురితోనే మాట్లాడుతూ వెళ్లి పోతుండడంతో కార్యకర్తలలో అసంతృప్తి వెలువడుతుందని సమాచారం. క్రింది స్థాయిలో సమస్యలను ఆయనకు తెలుపకపోగా పక్క దారి పట్టిస్తున్నారని వినికిడి. నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ హడావిడి చేసే కొందరు... ఆయన వెళ్ళిపోయాక ఏకంగా అధినాయకుని పైనే విమర్శలు చేయడం నిజమైన అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుండడంతో ఏ క్షణం ఏమి జరుగుతుందోనని మదన పడుతుండటం గమనార్హం. పార్టీలో ఏ కార్యక్రమం నిర్వహించినా అందరితో కలసి చర్చించకపోవడం, మండలాలలో , పట్టణంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలను పట్టించకోకుండా ఒంటెద్దు పోకడతో ఉండడంతో క్రింది స్థాయిలో పార్టీ పట్ల అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో ఏ నాయకులు ఎక్కడ పని చేస్తున్నారు, లోపం ఎక్కడ ఉంది, కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిలో ఉన్నారో తెలుసుకొని సరి చేయాల్సిన అధినాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కార్యకర్తలకు- నాయకులకు మధ్య మరింత దూరం పెరిగేందుకు దోహద పడుతుంది. ఇక రెండు సంవత్సరాలలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నాయకులు క్షేత్ర స్థాయిలో సమస్యలను సరిచేసి వారి మంచి, చెడులకు నేనున్నాననే భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పార్టీపట్ల విధేయులుగా ఉండేందుకు ముందుకు వస్తారని పలువురు తెలియజేస్తున్నారు . పార్టీలో ఆ నలుగురే అనే అబిప్రాయం వీడనాడి అందరూ సమానులే , ప్రతి ఓటరు పార్టీకి అవసరం అనే విధంగా ముందుకు వెళ్లాలని మరికొందరు కోరుతున్నారు.

ఇప్పటికైనా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పడు పరిస్థితులను తెలుసుకొని, లోపాలను గుర్తించి పార్టీకి నష్టం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే బీదాకు తిరుగులేదు. కావలి నియోజకవర్గం రాబోయే రోజులలో టీడీపీకి కంచుకోటగా నిలుస్తుందని విశ్లేషకుల అంచనా...!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter