sridhar reddyప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది మొదలు ఆయనకు ప్రజల మధ్య ఉండడమే ఇష్టం. ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమంటే ఇష్టం. వారి సమస్య లపై పోరాడడం అంటే ఇష్టం. ప్రజలకు దూరంగా ఉండాలంటే మాత్రం ఆయనకు చాలా కష్టం.

2014 ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేగా లేక ముందే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 141రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ పలుకరించి, వారి సమ స్యలు తెలుసుకున్నాడు. 2017 అక్టోబర్‌లో ఎమ్మెల్యేగా 'మన ఎమ్మెల్యే మన ఇంటికి' పేరుతో 105రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టి రూరల్‌ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్ళారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన 105 రోజుల పాదయాత్ర ఈ ఏడాది జనవరి 12వ తేదీన ముత్యాలపాలెం వద్ద ముగియడం తెలి సిందే! ఈ పాదయాత్ర ముగిసి గట్టిగా మూడు నెలలు కాలేదు. ఇప్పుడు ఏకంగా 366రోజుల మహా ప్రస్థానం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 5.37 గంటలకు రామలింగాపురం సెంటర్‌ నుండి ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించనున్నారు. 366రోజులంటే కరెక్ట్‌గా సంవత్సరానికి ఒక రోజు ఎక్కువే! ఏడాది పాటు ఇల్లు వాకిలి భార్యా బిడ్డలను, తన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన మనవరాలిని కూడా వదిలేసి ప్రజల మధ్య తిరగనున్నారు. 366రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 150రోజులు ప్రజల మధ్యనే పల్లెనిద్ర నిర్వహించనున్నారు. 303 సామూహిక సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీ, మహిళ, యువత, విద్యార్థి, రైతులతో వాడవాడలా 1005 చోట్ల ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తారు. నియోజకవర్గంలోని ప్రతి స్కూలు, ప్రతి కాలేజీకి వెళతారు. విద్యార్థు లతో ముచ్చటిస్తారు. గుడి, మసీదు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. మత పెద్దల ఆశీస్సులు తీసుకుని వారి సూచనలు సలహాలు స్వీకరిస్తారు. పాదయాత్ర మధ్యలో ఇంట్లో శుభ కార్యాలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుం టారు. ఈమధ్యలో ఎన్నికలొచ్చినా ప్రజాప్రస్థానం పాదయాత్ర నుండే వెళ్ళి నామినేషన్‌ వేస్తారు. ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన 12వతేదీ మూలా పేట అరుంధతీయవాడకు వెళ్ళి 1005 మంది మహిళల ఆశీర్వాదం తీసుకున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు ఈ 14రోజుల పాటు కూడా ఆయన రూరల్‌లో వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు.

kotam'మన ఎమ్మెల్యే మన ఇంటికి' అంటూ నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాబాట కార్యక్రమం ఈ నెల 12వ తేదీతో ముగిసింది. సెప్టెంబర్‌ 30వ తేదీ విజయదశమి పర్వదినాన నియోజకవర్గానికి ఈశాన్యం ప్రాంతమైన కోడూరుపాడు నుండి ప్రజాబాటను ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు తన ఇంటి ముఖం చూడలేదు. 105రోజుల పాటు ప్రజల మధ్యే నీళ్ళు, నిద్ర, తిండి అంతా కూడా! నియోజకవర్గంలోని అన్ని రూరల్‌ గ్రామాలతో పాటు రూరల్‌లోకి వచ్చే కార్పొరేషన్‌ డివిజన్‌లలోనూ పర్యటించారు. ప్రతి గడప తొక్కారు. ప్రతి ఇంటి తలుపుతట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలపై అధికారులతో మాట్లాడారు. 105రోజుల పాటు ప్రజల మధ్యనే గడిపారు. 12వ తేదీన రామలింగాపురంలోని ముత్యాలపాలెంలో పర్యటించారు. అక్కడే ప్రజాబాట ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

kotamనెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన పర్యటనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు ఆ ప్రజలకు సేవ చేయ డమే పరమావధిగా భావించిన శ్రీధర్‌రెడ్డి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు సమా యత్తమయ్యారు. 105 రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమానికి స్వయంగా ప్రణాళిక రూపొందించుకుని ఇంటింటికీ వెళ్ళి ప్రజలను నేరుగా కలుసుకుని వారితో మాట్లాడి, వారి అవసరాలేమిటో తెలుసుకుని ఆ మేరకు ప్రజల సమస్యలను తీర్చేందుకు సంకల్పించారు. ఈ నెల 13వ తేదితో ఈ మహత్తరమైన ప్రజాబాట కార్యక్రమం 75 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి 23వ డివిజన్‌లోని జనశక్తి నగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఇన్నిరోజులు ఏఏ కార్యక్రమాలను నిర్వర్తించారో తెలియజేశారు. ఈ 75 రోజుల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 38 గ్రామాల్లో ప్రజాబాట పూర్తయిందన్నారు. అదేవిధంగా నగరంలోని 21 కాలనీల్లో ప్రజాబాట ద్వారా ప్రజలను కలుసుకున్నామన్నారు. మొత్తంగా 31,012 ఇళ్ళకు వెళ్ళి, నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నామని, ఇప్పటిదాకా సుమారు లక్షా 10వేల మంది ప్రజలను కలుసుకున్నామని ఆయన వివరించారు. 73 చోట్ల విద్యార్థులతోను, రైతులతోను, పొదుపు మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, చేనేతకారులు, గిరిజనులు, బిసిలు, దళితులు, మైనార్టీలు..ఇలా అన్నివర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నానన్నారు. తాను ప్రజలను కలుసుకున్నప్పుడు అనేకమంది తమకు ఇళ్ళస్థలాలు ఇప్పించి ఆదుకోవాలని, పింఛన్లు ఇప్పించాలని కోరారని, అనేకమందికి ఇంకా రేషన్‌కార్డులు కూడా లేవని, కాలనీల్లో కనీస వసతులు లేవని, పక్కా రోడ్లు కానీ, డ్రైనేజీ సౌకర్యాలు కానీ లేవని తెలిపారన్నారు. మంచి నీటి వసతులు కూడా సరిగా లేవని, అదేవిధంగా నిరుద్యోగ సమస్యతో యువత ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్యలన్నిటినీ ఏరోజుకారోజు ఎస్‌ఎంఎస్‌, వాట్సాఫ్‌ల ద్వారా, తన కార్యాలయ సిబ్బంది ద్వారా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానన్నారు. ఈ సమస్యలు విన్నవించాక కొంతమంది అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నారని, మరికొందరు ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని ఆయన ఆవేదనగా అన్నారు. న్యాయమైన ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు స్పందిస్తే, ప్రజాబాట పూర్తయిన తరువాత వారిని పూలమాలలతో సత్కరిస్తామన్నారు. ప్రజాసమస్యలపై స్పందించకుంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట మధ్యలోనే మెరుపు ధర్నాలు, నిరసన దీక్షలకు దిగుతున్నానన్నారు. ప్రజాబాటలో గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం సాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసమస్యల సాధన కోసం జాతిపిత గాంధీజీ చేసిన ప్రజాఉద్యమం లాంటిదే మన ఎమ్మెల్యే-మన ఇంటికి కార్యక్రమమని ఆయన ఈ సందర్భంగా తెలియ జేశారు. ఏదేమైనా, ఒక ఎమ్మెల్యే ఇలా ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమన్నది ఎంతో అరుదైన విషయమని ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter