kotam sridhప్రజానాయకుడు కావాలంటే వందేళ్ళ రాజకీయ చరిత్ర ఉండాలా? తాతలు, తండ్రులు మంత్రులు, ఎంపీలై వుండాలా? వందలకోట్ల ఆస్తు లేమన్నా ఉండాలా? ఈ ప్రశ్నలకు 'అవును' అనే సమాధానం ఉంటుంది. ఈ 'అవును' అనే సమాధానికి ఉదాహరణగా తాతలు, తండ్రుల వారసత్వంతో మన కళ్ళ ముందే రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. ప్రజానాయకుడు కావాలంటే ఇవన్నీ అవసరం లేదు అనే జవాబుకు మాత్రం నెల్లూరుజిల్లాలో నిలువెత్తు నిదర్శనం గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఓ వ్యక్తి రాజకీయ నాయకుడే కాదు ప్రజలు మెచ్చిన నాయకుడు కూడా కాగలడని నిరూపించుకున్న ఎమ్మెల్యే అతను. మూడున్నరేళ్ల కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాకున్నా అటు ప్రభుత్వంతో పోరాడుతూ, ఇటు అధికారుల చుట్టూ తిరుగుతూ తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నిద్ర లేచింది మొదలు వారితోనే వుంటున్నాడు. తెల్లారింది మొదలు ఆయన సమస్యలను వెదుక్కుంటాడు, వాటి పరిష్కారానికి పంతం పడతాడు. సమస్యలతో బాధపడే ప్రజలను తన కార్యాలయానికి తిప్పించుకోవడం కాదు, సమస్యల్లో వున్న ప్రజల చెంతకు తానే వెళ్లాలన్నది ఆయన విధానం. ఓట్లడిగినప్పుడు ఏ గుమ్మం అయితే ఎక్కాడో, ఎమ్మెల్యే అయ్యాక కూడా అదే గుమ్మం ఎక్కాలని తనను ఓటేసి దీవించిన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆయన తపన. ఈ ఆలోచనతోనే 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' పేరుతో ప్రజల మనసులకు మరింత చేరువయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయదశమి పర్వదినాన నెల్లూరు రూరల్‌ మండలంలోని కోడూరుపాడు గ్రామం నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. నెల్లూరురూరల్‌ గ్రామాలతో పాటు రూరల్‌ పరిధిలోని నెల్లూరు కార్పొరేషన్‌ డివిజన్‌ లలో కూడా 105రోజుల పాటు ఆయన పర్యటి స్తారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ తారు. ప్రతి ఒక్కరిని పలుకరిస్తారు. ప్రతిఒక్కరి సమస్యలు వింటారు. ఈ మూడున్నరేళ్లకాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను చేసిన పనులు వివరి స్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తారు. అన్నపానీ యాలు అన్నీ ప్రజల మధ్యే! ప్రజలు, కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తారు. ఒకరోజు రాత్రి ఏ ఇంటి వద్దయితే 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' కార్య క్రమం పూర్తవుతుందో, పక్కరోజు అదే ఇంటి వద్దనుండి కార్యక్రమం మొదలు పెడతారు. ప్రజలతో పాటు గ్రామాలు, డివిజన్‌లలో వున్న వైసిపి బూత్‌ కమిటి సభ్యుల ఇళ్లకు కూడా వెళతారు. వారితో స్థానిక పరిస్థితులు, సమస్యలపై పది నిముషాలు చర్చిస్తారు. నియోజక వర్గ పరిధిలో జరిగే వివాహాలు, కర్మంత్రాలు వంటి కార్యక్రమాలకు మధ్యమధ్యలో హాజరైనా అసలు కార్యక్రమానికి బ్రేక్‌ వుండదు. ముఖ్యంగా కార్యక్రమాన్ని బాణాసంచా, డప్పులు, పూలదండలు, భారీ జనం వంటి ఆర్భాటాలకు దూరంగా కేవలం ఒక బిడ్డ తన తల్లిదండ్రుల ఇంటికి వస్తున్నంత ఆనందకర వాతావరణం ఉట్టిపడే రీతిలో నిర్వహించాలని కోటంరెడ్డి నిర్ణయించడం విశేషం. ఎమ్మెల్యే కాకముందే 2014 ఎన్నికలకు ముందే ప్రజాదీవెన పేరుతో 141రోజుల పాటు నెల్లూరు నియోజకవర్గంలో గడపగడప తొక్కిన రికార్డు ఆయనకుంది. ఈ రోజు వైసిపి చేపట్టిన గడపగడపకు వైకాపా, తెలుగుదేశం వాళ్ళ ఇంటింటికి టీడీపీ, బీజేపీ వాళ్ళ గుండె గుండెకు బీజేపీ వంటి కార్యక్రమాలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎప్పుడో ఆచరించి చూపినదే! ఆయన కాన్సెప్ట్‌లనే వీళ్ళు అనుసరిస్తున్నారు. 'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి' కార్యక్రమం తర్వాత 2018 ఫిబ్రవరిలో మళ్ళీ రెండో విడత కార్యక్రమాన్ని 366రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించా లని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే 2019 ఎన్నికల దాకా కూడా ఆయన తన సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి వుండదు. కాని, నియోజకవర్గంలో అందరికీ సొంత మనిషే కాబట్టి ఇంటికి వెళ్ళాలన్న బెంగే ఉండదు.

ప్రతి ఒక్కరూ ఆయన మనుషులే, ప్రతి ఒక్కరికి ఆయన సొంత మనిషే కాబట్టి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గమే ఆయనకు ఇల్లు కానుంది.

నాయకులంటే ఎన్నికల ముందు ఓటర్ల కాళ్లకు మొక్కడం, ఎన్నికల తర్వాత వాళ్ల కాలు లాగడం అన్న అభిప్రాయం వుంది. ఎమ్మెల్యే కాక ముందు ప్రజలంటే ఎంత ప్రేమాభిమానంతో వున్నాడో, ఎన్నికల తర్వాత, ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయన తన నియోజకవర్గ ప్రజలపై అంతకంటే మెండైన ప్రేమాభిమానాలు చూపిస్తుండడం అభినందనీయం.

sridharజిల్లాలో నెలరోజులుగా చర్చావేదికగా మారిన బెట్టింగ్‌ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. పోలీసు శాఖ పరంగా చూస్తే వారి లక్ష్యం బుకీల మీద చర్యలు తీసుకోవడమా? లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ కేసులో బుక్‌ చేయడమా అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకటికి మూడుసార్లు ఎస్పీయే స్వయంగా ఈ కేసులో ఎమ్మెల్యేల పాత్రేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేయడం, రెండుసార్లు విచారిం చడం వంటివి జరగడంతో ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? అన్న అనుమానాలు తలెత్తకపోలేదు. అయితే కేసు మొత్తంగా చూస్తే ఎమ్మె ల్యేలు తప్పు చేసుంటే తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే బలవంతంగా ఇరికించాలని చూసినా పోలీసు శాఖే అప్రదిష్టపాలవుతుంది. ఏదేమైనా చట్టపరంగా అది పోలీస్‌శాఖ చూసుకుంటుంది.

ఇదంతా ఒకెత్తయితే క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు కేంద్రంగా వైకాపాలోనే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ప్రత్యర్థులు రాజకీయ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డికి రాజకీయ రెబల్‌ స్టార్‌ అనే పేరుంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనే కాదు, అవసరమైతే సొంత పార్టీ వాళ్లతోనూ పోరాడగలడు. ఒక సాధారణ కుటుంబం నుండి రాజకీయాల్లోకొచ్చాడు. సామాన్యుడిగానే వుంటూ సామాన్యుల ఓట్లతోనే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. గతంలో కాంగ్రెస్‌లో వున్నప్పుడు ప్రజాసమస్యల విషయంలోగాని, అవినీతి అక్రమాల విషయంలోగాని సొంత పార్టీ నాయకులతోనే పోరాడిన చరిత్ర అతనిది. ఇప్పుడు వైకాపాలోనూ అదే పరిస్థితి. ఎప్పుడూ ప్రజల మధ్య వుండే కోటంరెడ్డి అంటే ఇద్దరు నాయకులకు పడదు. ఒకాయన వై.యస్‌, ఆ తర్వాత జగన్‌ ఇమేజ్‌తో గెలుస్తున్న పార్లమెంట్‌ సభ్యుడైతే, ఇంకొకాయన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ చాణక్యంతోనే 'జిల్లా' స్థాయిలో పేరుపొందిన నాయకుడు. వీళ్లిద్దరి కంబెన్డ్‌ టార్గెట్‌ కోటంరెడ్డి. 2014 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డికి నెల్లూరురూరల్‌ సీటు రాకుండా చేయడానికి వీరు చేయని ప్రయత్నమంటూ లేదు. కాని కోటంరెడ్డి శ్రమ, ప్రజల్లో అతనికున్న ఆదరణను గుర్తించి జగనే నేరుగా ఆయనకు సీటిచ్చాడు. ఈ నాయకులిద్దరు కూడా మరోసారి కోటంరెడ్డికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్లు తెలు స్తోంది. బెట్టింగ్‌ కేసులో వైకాపా ఎమ్మెల్యేలు ఇద్దరుంటే వీళ్ళు మాత్రం కేసు నుండి అనిల్‌కుమార్‌ను బయటేయాలని, కోటంరెడ్డిపై కేసు పెట్టుకున్నా ఇబ్బంది లేదని పోలీసు శాఖకే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పార్లమెంట్‌ స్థాయి నాయకుడి వల్ల పార్టీ గబ్బు పడుతోంది. గత ఎన్నికల్లో ఆయన నిర్వాకం వల్లే ఉదయగిరి, కోవూరు సీట్లలో వైకాపా ఓడిపోయింది. ఇలాంటి చెత్త రాకీయాలను వీళ్ళు మానుకోకపోతే అది పార్టీకే తీరని చేటు తెస్తుంది.

mlasనెల్లూరుజిల్లాలో బెట్టింగ్‌ మాఫియాను అంతం చేసే లక్ష్యంతో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మొదలుపెట్టిన ఆపరేషన్‌ అటు చేసి ఇటు చేసి పొలిటికల్‌ ట్రాక్‌ ఎక్కింది.

అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌తో సంబంధాలున్నాయంటూ వైకాపాకు చెందిన నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేయడం, 22వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో వీరిద్దరిని విచారించడం, 27వ తేదీ మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించ డంతో ఈ కేసుకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. నిష్పక్షపాతంగా జరుగుతున్న బెట్టింగ్‌ కేసు దర్యాప్తులో అధికారపార్టీ ఒత్తిళ్లు కనిపిస్తున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

నెల్లూరు, స్టోన్‌హౌస్‌పేట ప్రాంతంలో ఓ పేకాట కేంద్రంపై జరిగిన దాడితో బెట్టింగ్‌ మాఫియా తీగ కదిలింది. నెల్లూ రులో బెట్టింగ్‌ మాఫియా పరపతి, పలుకు బడి గురించి ఎస్పీకి అప్పుడే తెలిసింది. దాంతో ఆయన మొదట ప్రధాన బుకీ కృష్ణసింగ్‌కే గురిపెట్టి అదుపులోకి తీసుకు న్నాడు. తమదైన శైలిలో విచారించడం ద్వారా అతని నుండి రాబట్టాల్సిన సమా చారాన్నంతా కూడా రాబట్టాడు. అతని చ్చిన సమాచారంతోనే 116మంది బుకీ లను, పంటర్లను అరెస్ట్‌ చేయడమే కాకుండా, బెట్టింగ్‌ రాయుళ్లకు సహకరిం చారన్న కారణంతో ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరి సిఐల మీద చర్యలు తీసుకోవడం తెలి సిందే! బెట్టింగ్‌ భాగోతంలో పలువురు టిడిపి, వైసిపి నాయకులను అరెస్ట్‌ చేయడం కూడా జరిగింది.

ఇదంతా ఒకెత్తయితే ఈమధ్య బుకీ కృష్ణసింగ్‌ నుండి వైసిపి ఎమ్మెల్యేలకు 40లక్షలు అందాయని ఓ దినపత్రికలో వార్త రావడం, ఆ వార్త తనను అనుమా నించేదిగా ఉండడంతో నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎస్పీ కార్యా లయానికి వెళ్లి 40లక్షలు తీసుకున్న ఆ ఎమ్మెల్యే పేరు వెల్లడించాలంటూ ఎస్పీ రామకృష్ణను కోరడం తెలిసిందే! ఎస్పీ రామ కృష్ణ కూడా తమ విచారణలో ఎమ్మెల్యే పేర్లు రాలేదని వివరించారు. ఈ కేసు పట్టుబడ్డ బుకీలు, పంటర్ల వరకే పరిమిత మవుతుందనుకున్న తరుణంలో అకస్మా త్తుగా కీలకమలపు తిరిగింది. బెట్టింగ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నంద్యాల ప్రచారంలో వున్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌లకు పోలీసులు స్వయంగా నోటీసులు అందించి వచ్చారు. దీని ప్రకా రమే ఎమ్మెల్యేలిద్దరూ 22వ తేదీ జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజ రయ్యారు. క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌తోనూ, ఫైనాన్షియర్‌ ఎల్‌ఎస్‌ఆర్‌(లేబూరు శ్రీధర్‌ రెడ్డి)తోనూ వున్న సంబంధాలపైనే వీరిని ప్రధానంగా విచారించినట్లు తెలుస్తోంది. ఏఎస్పీ శరత్‌బాబు, మరో ఇద్దరు డిఎస్పీలు విచారణలో పాల్గొన్నారు. కృష్ణసింగ్‌తో ఒకటిన్నర గంట పాటు ఫోన్‌లో మాట్లా డారు కదా అని పోలీసులు అడిగినప్పుడు కోటంరెడ్డి... కృష్ణసింగ్‌తో మూడు, నాలుగు సార్లకు మించి మాట్లాడి వుండనని, అది కూడా తన పుట్టినరోజు నాడు విష్‌ చేయ డానికి, నేను టీవీ లైవ్‌షోలో మాట్లాడిన ప్పుడు బాగా మాట్లాడావని అభినందించ డానికి మాత్రమే చేసుంటాడని, అది కూడా పది నుండి పద్దెనిమిది సెకండ్ల లోపు కాల్‌ మాత్రమే ఉంటుందని సమాధానం చెప్పారు. అప్పుడే పోలీసులు కోటంరెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తే... అతను చెప్పినట్లే కృష్ణసింగ్‌తో మాట్లాడిన కాల్స్‌ పన్నెండు, పద్దెనిమిది సెకండ్లు మాత్రమే వున్నాయని తెలిసింది. 2014లో మేయర్‌గా అజీజ్‌ ఎన్నిక కోసం సిటి ఎమ్మెల్యే అనిల్‌, మీరు గోవాలో పెట్టిన కార్పొరేటర్ల క్యాంప్‌కు కూడా కృష్ణసింగ్‌ ఖర్చు పెట్టాడంట కదా అన్న పోలీసుల ప్రశ్నకు కోటంరెడ్డి క్లారిటీ గానే సమాధానం ఇచ్చాడని తెలిసింది. ఆ క్యాంప్‌ ఖర్చులన్నీ అబ్దుల్‌ అజీజే భరించాడని, అజీజ్‌ వ్యాపారవేత్త కాబట్టి అతనికి కృష్ణసింగ్‌ వద్ద డబ్బు తీసుకో వాల్సిన అవసరముండి ఉండదని చెప్పారు. కృష్ణసింగ్‌ అకౌంట్‌ నుండి మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయా? అని పోలీసులు వేసిన ప్రశ్నకు కోటంరెడ్డి స్పష్టంగానే... అతని ఖాతా నుండి నాకు ఎలాంటి డబ్బు రాలేదు. ఎవరి వద్ద నుండి కూడా నేను ముడుపులు తీసుకోలేదు. కావాలంటే నా అకౌంట్‌నే కాకుండా నా కుటుంబసభ్యుల అకౌంట్లను కూడా పరిశీలించుకోవచ్చని ఆయన చెప్పాడు. ఎల్‌ఎస్‌ఆర్‌తో సంబం ధాలపై పోలీసులు ఆరా తీయగా... తనకు ఎల్‌ఎస్‌ఆర్‌ చిన్నప్పటి నుండి స్నేహితుడని, అప్పుడప్పుడు అతనితో ఫోన్‌లో మాట్లాడ డమే కాకుండా తరచూ అతని ఆఫీసుకు వెళుతుంటానని సమాధానమిచ్చాడు. ఎల్‌ఎస్‌ఆర్‌ ఆఫీసుకు ఇంకా ఎవరెవరు వస్తుంటారని పోలీసులు ఆరా తీయగా మాజీఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, విజయ డెయిరి ఛైర్మెన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకట స్వామినాయుడు, వై.వి.రామిరెడ్డిలు కూడా వస్తుంటారని కోటంరెడ్డి చెప్పాడని సమాచారం. కోటంరెడ్డి తర్వాత అనిల్‌ను విచారించారు. కృష్ణసింగ్‌తో పాటు ఇతర బుకీలతో మీకు సంబంధాలున్నాయా?అనే దానిమీదే అనిల్‌ను విచారించారు. కృష్ణ సింగ్‌ కాదు, ఎవ్వరివద్దా తాను రూపాయి తీసుకోలేదని, రాజకీయాల్లోకి వచ్చాక 30కోట్ల రూపాయల ఆస్తులమ్ముకున్నానని అనిల్‌ సమాధానమిచ్చాడు. ఎమ్మెల్యేలిద్దరిని కూడా కృష్ణసింగ్‌ నుండి మీరు ఆర్ధికంగా ప్రయో జనం పొందారా? అనే దృష్టితోనే పోలీసు విచారణ జరిగినట్లు తెలుస్తోంది.

మొదట వైకాపా ఎమ్మెల్యేలను మాత్రమే విచారణకు పిలవడంతో ఈ కేసు రాజకీయరంగు పులుముకుంది. క్రికెట్‌ బుకీలకు వైసిపి నాయకులతో పాటు తెలుగుదేశం నాయకులతో కూడా సంబం ధాలున్నాయని తెలుస్తోంది. ఈ కేసును రాజకీయ పక్షపాత కోణంలో కాకుండా బెట్టింగ్‌ను అంతమొందించే దిశగా విచా రణ సాగిస్తే ఇంకా కొందరు రాజకీయ నాయకులు తెరమీదకు రావచ్చు.

మొత్తానికి బెట్టింగ్‌ కేసు కీలక మలు పులు తిరుగుతోంది. కేవలం వైసిపి ఎమ్మెల్యేల విచారణకే దీనిని పరిమితం చేస్తే అధికారపార్టీ ఒత్తిళ్లు పనిచేసాయనే అపప్రద పోలీసులకు వస్తుంది. కేసుతో సంబంధం వున్న అందరినీ విచారిస్తే బెట్టింగ్‌ను అంతం చేయాలన్న ఎస్పీ రామ కృష్ణ ఆలోచనకు సార్ధకత చేకూరుతుంది.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మళ్ళీ చెడింది
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
  ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter