kotamరోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బుజబుజనెల్లూరు జాతీయ రహదారి ప్రాంతంలో సర్వీస్‌రోడ్డు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం జి.ఓ జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతవాసులు ఆనందభరితు లవుతున్నారు. నెల్లూరు నగరం ట్రంక్‌రోడ్డు జాతీయ రహదారిలో కలిసే చోట నుండి బుజబుజనెల్లూరు ప్రాంతం మొదటి భాగం వరకు సర్వీస్‌రోడ్డు లేదు. నెల్లూరులో నుండి బుజబుజనెల్లూరులోకి వాహనాలలో వెళ్లే వాళ్ళు చుట్టూ తిరుక్కుని పోలేక రాంగ్‌రూట్‌లో హైవే మీదనే పోతున్నారు. దీంతో అత్యంత వేగంగా వచ్చే వాహనాల వల్ల పలు ప్రమాదాలు జరిగాయి కూడా! నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ సర్వీస్‌ రోడ్డు యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. నగరంలో సర్వీస్‌ రోడ్డు, అండర్‌పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలంటూ 5 నెలలుగా పోరాడుతున్నాడు. ఈ సమస్యను కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తద్వారా వారి నుండి సర్వీస్‌రోడ్లు, అండర్‌ పాసింగ్‌ బ్రిడ్జిలకు హామీ సాధించారు. ఆయన కృషి ఫలితమే ఇప్పుడు బుజబుజనెల్లూరు సర్వీస్‌రోడ్డు పనులు మొదలయ్యాయి.

sridhar reddyవైయస్సార్సీపీ జిల్లా అధ్యక్ష పదవిని కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇవ్వడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. దీనివల్లే ఆయన నెల్లూరులోని జిపిఆర్‌ గ్రాండ్‌ కల్యాణ మండపంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. ఈ సభకు పోకుండా ఆయన తన అసంతృప్తిని చాటుకున్నారు.

పార్టీ అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామా చేసాక, ఈ పదవిని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం అధిష్టానం పిలిచి ఇస్తే బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధపడ్డాడు. అయితే పార్టీ అధిష్టానం అనూహ్యంగా కాకాణికి అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. కాకాణి అధ్యక్షుడు కావడం కోటంరెడ్డికి సుతారం ఇష్టం లేదు. ఆయనకు బదులు ఇంకెవరు అధ్యక్షుడై వున్నా కోటంరెడ్డి మద్దతు పలికుండేవాడు. కాకాణి అంటే ఇష్టం లేకే తన అసంతృప్తిని బయటపెట్టినట్లు తెలుస్తోంది.

kotamరాష్ర్ట విభజన తర్వాత ఏర్పడిన అసెఁబ్లీలో 175మంది ఎమ్మెర్యేలున్నారు. వీరిలో చాలామంది కొత్తవాళ్లే. ఎమ్మెల్యేలమై ఏదో చేసేద్దామని వచ్చినవాళ్లే. కాని ఇప్పుడేమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా వుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే కాదు, అధికారపక్ష ఎమ్మెల్యేలకు కూడా చేయాల్సిన పనులు చాలానే వున్నా అవి చేయడానికి నిధులు లేవు. రాష్ర్ట ప్రభుత్వానికి సింగపూర్ రాజధాని, గోదావరి పుష్కరాలు, పట్టిసీమ, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా వంటివి తప్పితే ఇంకేమీ పట్టడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు అలాగే వున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేలకు గ్రాంట్ ఇవ్వడం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందే. రాష్ర్టంలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇంతటి వ్యతిరేక పరిస్థితులున్న వాతావరణంలో కూడా పనితీరు పరంగా నెల్లూరుజిల్లాలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేనే మొదటి స్థానంలో నిలవడం అధికారపార్టీ మంత్రికి, ఎమ్మెల్యేలకు అవమానం. రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై రహస్య సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటిస్థానంలో నిలిచాడని తేలింది.

కోటంరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి తన సొంత పంథాలో నడుస్తున్నాడు. అపాయింట్ మెంట్లు, వెయిటింగ్ లు లేకుండా ఎవ్వరైనా సరే నేరుగా తనను కలిసే ఒక మంచి పద్ధతికి శ్రీకారం చుట్టాడాయన. ప్రభుత్వం నుండి నిధులొస్తాయి, ఆ నిధులతోనే పనులు చేయాలని మడికట్టుకు కూర్చోలేదు. మొదట ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఉదయం 8గంటలకల్లా తన కార్యాలయంలో ప్రత్యక్షమవడం, ఎవరొచ్చి సమస్య చెప్పినా విని స్పందించడం ఆయన పనతీరుకు కొలమానంగా నిలిచాయి. 5ఏళ్ల పాటు తనకొచ్చే 60లక్షల జీతాన్ని తన నియోజకవర్గంలో విద్య, వైద్యం, మంచినీటి పనులకు కేటాయించి ఇంతవరకు జిల్లాల ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చేసి ఆదర్శంగా నిలిచాడు. తన నియోజకవర్గంలో వికలాంగుల డేటా అంతా సేకరించి వారిళ్లకే స్వయంగా వెళ్లి మూడుచక్రాల సైకిళ్లను అందించడం, పదో తరగతిలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం, నగర శివార్లలో కాలుష్యం బారిన పడుతున్న కాలనీలను గుర్తించి, వాటికి పరిష్కారం సాధించడం, గ్రామాల్లో శ్మశాన సమస్యలపై దృష్టి పెట్టడం, ఉన్నతాధికారులతోనూ, నగర పాలకవర్గంతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తన నియోజకవర్గ పరిధిలో సమస్యలను పరిష్కరించుకుంటుండడం... ఇలా కోటంరెడ్డి చేస్తున్న ఎన్నో పనులు ఆయనను ఒక మంచి ఎమ్మెల్యేగా మలుస్తున్నాయి. మసస్యలు పరిష్కరించాలంటే డబ్బే కాదు, మనసుంటే చాలా మార్గాలుంటాయని చాటిన కోటంరెడ్డికి అభినందనలు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter