kovurజిల్లా రాజకీయాలలోనే కోవూరుకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఈరోజు కాదు, ఏ రోజునుండో ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. వడ్లకు, బలిసిన రెడ్లకు పేరు. చైతన్యవంతులైన ప్రజలున్నారు. విద్యాధికులు అధికం. పాడిపంటలతో అలరారు తున్న ప్రాంతం. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో రాజకీయ చైతన్యంలోనూ అంతే ముందుంటుంది.

అలాంటి నియోజకవర్గం కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. 2004ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం నుండి కాంగ్రెస్‌లోకి మారిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సంచలనాత్మక రీతిలో ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే! అదే సంచలనాత్మక రీతిలో ఆయన 2014లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేసాడు. అయితే ఈసారి కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో దూరి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఎన్నికల్లో కోవూరు సీటు కోసం స్థానిక తెలుగుదేశం నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీలో చేరిన పోలంరెడ్డి ఆ సీటును ఎగరేసుకుపోయాడు.

ఎన్నికలు ఇక రెండేళ్ళలో ఉన్నాయి. ఇప్పుడే సీటు ఎవరికని చెప్పలేరు. కాని, ఈసారి టిక్కెట్‌ టార్గెట్‌గా వర్గపోరు మొదలైంది. ముఖ్యంగా ఇటీవల పోలంరెడ్డి మీదవచ్చిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల నేపథ్యమైతేనేమీ, జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లిస్తే గెలవరని కొన్ని వర్గాలు ఇచ్చిన నివేదిక వల్లనైతేనేమీ చంద్రబాబు ఈసారి పోలంరెడ్డికి సీటివ్వడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనికి తగ్గట్లే ఇటీవల ఏపిఐఐసి ఛైర్మెన్‌ పి.కృష్ణయ్య కోవూరు నియోజకవర్గ వ్యవహారాలలో ఎక్కువుగా తల దూరుస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో సీటును మిస్సయిన పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీ చేయాలనే పంతంతో ఉన్నట్లు తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో 'రెడ్ల' ఆధిపత్యం ఎక్కువ. పి.కృష్ణయ్య, లేదా ఇతర బి.సి వర్గాల నాయకులు ఇక్కడ తట్టుకుని నిలబడడం కష్టం. వైకాపా నుండి 'రెడ్లు' నిలబడకుండా పి.కృష్ణయ్య, లేదా ఇంకొకరికి సీటిచ్చినా ఇబ్బంది ఉండదు. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' అభ్యర్థిని మోటుకోవాలంటే ప్రత్యర్థిగా రెడ్డి అభ్యర్థే ఉండాలి. కాబట్టి పి.కృష్ణయ్య లాంటి ప్రయోగాలు ఇక్కడ సక్సెస్‌ కావు. అలా చేయడమంటే 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా చిరంజీవి, తుపాకుల మునెమ్మను దించినట్లే వుంటుంది. కాబట్టి ఏ పార్టీకైనా ఇక్కడ అభ్యర్థి ఎంపికలో 'రెడ్ల'కే ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.

policeనెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లోనూ, దేవాలయాలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను కోవూరు పోలీసులు ఈ నెల 18వ తేదీ అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 4లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రూరలం డిఎస్పీ వీఎస్ రాంబాబు కోవూరు పోలీసు స్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం శంభునిపాళెంకు చెందిన తంబి సతీష్, నరేష్ సోదరులు, వీళ్ళు గత కొన్నేళ్లుగా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో దొంగతనాలకు అలవాటుపడ్డారు. విడవలూరులోని శివాలయం పూజారి ఇంట్లో ఆ గ్రామంలోని పెనుకొండమ్మ ఆలయంలో బంగారు నగలు దొంగిలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బంగారు నగలు, మోటారు సైకిళ్ళను చోరీ చేస్తూ జల్సాలు చేసుకునే వారు వీరిపై నిఘా ఉంచిన ఐడి పార్టీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. వారి వద్ద నుంచి 32 ర్రాముల బంగారం, ఆరు మోటారు సైకిళ్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన ఐడి పార్టీ పోలీసులను కోవూరు సిఐని, డిఎస్పీ అబినందించారు.

 atmనెల్లూరు జిల్లా కొవూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ఓ ఏటీఎంను పగలకొట్టి, అందులో ఉన్న నగదును అపహరించుకుపోయారు. ఆ క్రమంలో ఏటీఎంలోని సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే ఏటీఎంలో దొంగలు ఎంత నగదు అపహరించుకుపోయారు అనేది బ్యాంక్ అధికారులు వస్తే కాని తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • 'పీకే'దేమీ లేదు
    జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…
  • కాలం కరిగిపోతుంది... ఆశ ఆవిరవుతోంది!
    నిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ…

Newsletter