lokeshగతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా, కాంగ్రెస్‌ ప్రభుత్వం లోనైనా మంత్రులకు కూడా ముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు ఉం డేది. ఒక్కోశాఖపై ఒక్కొక్కరి ముద్ర వుండేది. ఫలానా శాఖ మంత్రి ఎవరంటే వారి పేర్లు ప్రజల నాలుక మీదే వుండేది. హోంమంత్రు లుగా మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, జానారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రిగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆర్ధికశాఖ మంత్రిగా రోశయ్య, రెవెన్యూ మంత్రిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అశోక్‌గజపతిరాజు, పంచశాఖల మంత్రిగా సోమిరెడ్డి... ఇలా మంత్రులు తమ తమ శాఖలలో తమ పనితీరు ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే

వాళ్ళు. ఆ శాఖలపై తమదైన ముద్రను వేసుకునే వాళ్ళు.

మరిప్పుడు కూడా కేబినెట్‌ వుంది. ఈ కేబినెట్‌లో అలాంటి మంత్రులు ఎంతమంది వున్నారు? ఎంతమంది తమ శాఖలోని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు? ప్రస్తుతం ఏ.పి కేబినెట్‌లో చాలామంది మంత్రులు డమ్మీలే! ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు యాక్టివ్‌గా వున్నాడు. సీఎం చంద్రబాబు కూడా ఇరిగేషన్‌ వ్యవహారాలను స్వయంగా పర్య వేక్షిస్తున్నాడు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్ట్‌తో పాటు పట్టిసీమ, పురు షోత్తమపట్నం, ఇంకా పలు ఇరిగేషన్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతు న్నాయి. ఇరిగేషన్‌ వ్యవహారాలలో చంద్ర బాబు, దేవినేనిల మధ్య కో-ఆర్డినేషన్‌ బాగానే వుంది. సీఎం కనుసన్నలలో దేవి నేని ఇరిగేషన్‌ వ్యవహారాలు చక్కబెడుతు న్నాడు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ ద్వారా పదవులు పొందిన అమర్‌నాథ్‌రెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డిలకు వాళ్ళ శాఖల విషయంలో కొంత స్వతంత్రత ఇచ్చారు. ఎందుకంటే వైసిపి నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ శాఖల్లో వేలు పెట్టే సాహసం చేయడం లేదు. మొన్న విస్త రణలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్య తలు చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకుంటూ వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశంకు ఓట్ల రూపంలో లబ్ది చేకూర్చేం దుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. సోమిరెడ్డికి సమర్ధుడని పేరుండడం, చురు కుగా పని చేస్తుండడంతో ఆయన వ్యవహా రాలలోనూ జోక్యం ఉండడం లేదు.

మిగిలిన చాలా మంత్రివర్గ శాఖల్లో చినబాబు లోకేష్‌ ప్రమేయం ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. హోంశాఖ అయితే మంత్రి నిమ్మకాయల రాజప్ప కంటే చంద్ర బాబు, లోకేష్‌ల పర్యవేక్షణలోనే ఎక్కువుగా వుంటోంది. ఉన్నతాధికారుల బదిలీలు ఎక్కువుగా లోకేష్‌ ఆదేశాలతోనే జరుగు తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్‌.ఐ., సి.ఐల బదిలీలకు కూడా లోకేష్‌ వద్దకు వెళ్తున్నారు. హోంమంత్రి సొంతంగా కాకుండా లోకేష్‌ ఆదేశాలకు అనుగుణంగా బదిలీలు చేస్తు న్నాడని సమాచారం. ఇక రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని అయితే ఎప్పుడో డమ్మీని చేసిపెట్టారు. అమరావతి రాజ ధానిలో భూముల సేకరణ అంతా ఆయన పర్యవేక్షణలో జరగాలి. ఆయనతో పని లేకుండా భూముల సేకరణ కానిచ్చారు. ఆఖరకు రెవెన్యూలో ఉన్నతాధికారుల బదిలీపై కూడా ఆయనకు అధికారం లేకుండా చేసారు. హోం, రెవెన్యూలతో పాటు వివిధ శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలు గాని, పనులు కేటాయింపు వంటి వ్యవహారాలుగాని నేరుగా చిన్నబాబు పర్య వేక్షణలోనే జరుగుతున్నట్లు సమాచారం.

lokeshనవ్యాంధ్ర సారధి చంద్రబాబునాయుడు ఆస్తులకే కాదు, ఆయన రాజకీయ చరిత్రకు కూడా వారసుడు లోకేష్‌బాబు. చంద్రబాబు తర్వాత పార్టీని నడపాల్సింది కూడా ఆయనే! మరి రేపు పార్టీని నడపాల్సిన నాయకుడు ఎలా ఉండాలి? ముందు ఆ సమర్ధతను నిరూపించుకోవాలి. పార్టీని, కేడర్‌ను కాపాడుకో గలనన్న నమ్మకాన్ని పార్టీ వారిలో కల్పించాలి.

దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి వున్నప్పుడే జగన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజాక్షేత్రంలో దిగి కడప లోక్‌సభ నుండి ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే ఎంపీగా గెలిచాడు. వై.యస్‌. మరణం తర్వాత కాంగ్రెస్‌నే వదిలేసి బయటకొచ్చి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలలో అలుపెరుగని పోరాటం చేస్తూ తన సామర్ధ్యం నిరూపించుకుంటున్నాడు. ఇక కేసీఆర్‌ రాజకీయ వారసుడిగా రంగంలో వున్న కేటీఆర్‌ మొన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తన టాలెంట్‌ చూపించాడు. అంతకుముందు హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడ్డారు. అలాంటిది మొన్న గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం కేటీఆర్‌ అంతా తానై చక్రం తిప్పాడు. 150 డివిజన్లకు గాను వంద డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి టీఆర్‌ఎస్‌ తెలంగాణ భావిసారధిని తానేనని చాటుకున్నాడు. ఇలా రాజకీయవారసులు అవకాశం వచ్చినప్పుడు తమ ఫెర్ఫార్మెన్స్‌ ప్రదర్శిస్తూ తమ నాయకత్వంపై పార్టీ కేడర్‌లో నమ్మకం కల్పిస్తున్నారు.

కాని ఇంతవరకు లోకేష్‌ అలాంటి ప్రతిభా ప్రదర్శన ఏదీ చూపలేదు. రేపు ఒక పార్టీని నడపాల్సిన నాయకుడై వుండి కూడా ప్రజాక్షేత్రంలో దిగి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో లేక ఎంపీగానో ఎన్నికై వుండొచ్చు. అలాకాకుండా తొలిసారిగా ఎమ్మెల్సీ పదవినే దొడ్డిదారి ద్వారా గవర్నర్‌ కోటాలో తెచ్చుకున్నాడు. ఇక చంద్రబాబు కొడుకు కాబట్టి మంత్రిపదవి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కనీసం లోకేష్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుండో, లేక స్థానిక సంస్థల శాసనమండలి నుండో పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యున్నా ఆయన సత్తా తెలుసుండేది. ఆ అవకాశాన్ని ఆయన వదులుకున్నాడు.

ఇప్పుడు ఆయన నాయకత్వ సమర్ధతను పరీక్షించేందుకు నంద్యాల ఉపఎన్నికల రూపంలో మరో అవకాశం వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ద్వారా కేటీఆర్‌ సామర్ధ్యం బయటపడింది. అలాగే నంద్యాల ఎలక్షన్‌ బాధ్యతను ట్రయల్‌రన్‌గా లోకేష్‌కు అప్పగించి ఉండొచ్చు. కే.ఇ.ప్రభాకర్‌కు నంద్యాల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అసలు కె.ఇ కంటే కూడా లోకేష్‌నే అక్కడ దించి వుండొచ్చు. పూర్తి ఎలక్షన్‌ పర్యవేక్షణ ఆయనపైనే పెట్టివుండొచ్చు. భవిష్యత్‌లో 175 అసెంబ్లీలు, పాతిక లోక్‌సభ స్థానాల ఎన్నికలను పర్యవేక్షించాల్సిన నాయకుడు! ముందుగా కనీసం ఒక అసెంబ్లీలోనన్నా తన సత్తా చాటుకోవాలిగా! కాని, చంద్రబాబు లోకేష్‌కు ఈ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నంద్యాల ఎన్నికల పూర్తి ఇన్‌ఛార్జిగా లోకేష్‌ను నియమించవచ్చు. రేపు నంద్యాలలో తెలుగుదేశం గెలిస్తే ఆ క్రెడిట్‌ లోకేష్‌దే అవుతుంది. పార్టీ కేడర్‌లో కూడా ఇతడు పప్పు కాదు నిప్పు లాంటి కుర్రాడు అనే నమ్మకం ఏర్పడుతుంది.

jaga lokదొడ్డిదారిన వచ్చి వెన్నుపోటు పొడిచి గెలిచిన వాడిని 'వీరుడు' అనరు. ఓడినా, ప్రాణాలను వీడినా ఎదురొడ్డి నిలిచి పోరాడిన వాడినే వీరుడంటారు. దొడ్డిదారిన వచ్చింది విజయం కాదు. శత్రువును నిస్సహాయుణ్ణి చేసి గెలిచింది గెలుపూ కాదు. శత్రువును ధర్మయుద్ధంలో ఓడించడమే అసలైన విజయం. అది యుద్ధమైనా రాజకీయ యుద్ధమైనా?

రాష్ట్ర రాజకీయాలలో ధర్మయుద్దాలకంటే అదర్మ యుద్ధాలనే ఎక్కువుగా చూస్తుంటాం. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ధర్మంగా వుంటే గెలవడం కష్టం కూడా! ఇలాంటి ధర్మయుద్ధం చేసే 2014 ఎన్నికల్లో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారానికి దూరం కావడం చూసాము.

ఇటీవల చంద్రబాబు స్కోత్కర్షను జనం భరించ లేకపోతున్నారు. ఏపికి నేనే బ్రాండ్‌నంటూ ఆయన వేస్తున్న బ్యాండ్‌ను భారంగా భరించాల్సి వస్తోంది. ఇప్పటివరకు చంద్రబాబే అనుకుంటే, ఇప్పుడు ఆయన తలదన్నేలా ఆయన కొడుకు లోకేష్‌ తయారయ్యాడు. తనను తాను రాష్ట్ర నాయకుడిగా చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మాటికొస్తే జగన్‌ మీద పడి ఏడుస్తున్నాడు. అసలు జగన్‌తో లోకేష్‌కు పోలికేంటి? అసలు జగన్‌కు చంద్రబాబుతోనే పోలిక లేదు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీనే ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వాళ్ళు చంద్రబాబు, లోకేష్‌లు. వీళ్ళు సొంతంగా పార్టీని పెట్టలేదు. పార్టీకి కేడర్‌ను నిర్మించలేదు. ఎన్టీఆర్‌ పుణ్యాన రాజకీయ భవిష్యత్‌ లభించింది. అధికారం అనుభవించారు. ఎన్టీఆర్‌ నుండి పార్టీని లాక్కున్నారు. చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చాక రెండుసార్లు గెలిచింది. అది కూడా 1999లో వాజ్‌పేయి ఇమేజ్‌తో, 2014లో మోడీ ప్రభంజనంతో అధికారం సంపాదించుకున్నారు. అంతకుమించి చంద్రబాబుకు సొంతంగా పార్టీని గెలిపించిన ఇమేజ్‌ లేదు. ఇక తండ్రి రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన లోకేష్‌ ఈ మూడే ళ్లలో చూపించిన అద్భుత పెర్ఫార్మెన్స్‌ ఏమీ లేదు. కనీసం ప్రజాక్షేత్రంలో తనను తాను ప్రజానాయ కుడిగా నిరూపించుకోలేకపోయాడు. ప్రత్యక్ష ఎన్ని కల్లో పోటీచేసి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, లేదంటే ఎమ్మెల్సీగానే చట్టసభలలో అడుగుపెట్టే అవకాశం వున్నా, దొడ్డిదారిన శాసనమండలిలోకి ప్రవేశించాడు. తండ్రి కొలువులో మంత్రిగా కుర్చీ వేయించుకున్నాడు.

జగన్‌ ఆ పంథాలో పోలేదు. తన తండ్రి మరణానంతరం సొంత కాంగ్రెస్‌పార్టీ అధినేత్రే అతని మీద కత్తి కట్టింది. ప్రజల్లోకి పోవద్దంది. ప్రజలే తనకు లోకమన్న జగన్‌పై కేసులు పెట్టింది. 16నెలలు జైలులో పెట్టించింది. కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చిన జగన్‌ అన్నీ భరించాడు. జైలు జీవి తాన్ని అనుభవించాడు. ఓ పక్క ఢిల్లీతో తలపడ్డాడు. ఇంకోపక్క రాష్ట్రంలో అభ్యర్థులను ఎదుర్కొన్నాడు. సొంతంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించాడు. సెకండ్‌ క్యాడర్‌లో వున్న కార్యకర్తలను లీడర్లుగా చేసాడు. 2014ఎన్నికల్లో ఒక్కడే పోరాడాడు. ఎన్టీఆర్‌ అంత సినిమా గ్లామర్‌ లేకున్నా తన స్వయం కృషితో 8మంది ఎంపీలను, 68మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. నాలుగు పదులు నిండిన వయసులోనే జగన్‌ సాధించిన ఘనవిజయమిది. చంద్రబాబు ధర్మంగా పోరాడివున్నా, జగన్‌ అధర్మయుద్ధం చేసున్నా 2014 ఎన్నికల్లో జగన్‌దే అధికారం. కాని జగన్‌ ఒక సైద్ధాంతిక విలువల పరిధిని దాటలేదు కాబట్టే ప్రతిపక్షనేతగా మిగిలిపోయాడు.

ఈరోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో చూస్తున్నాం. చిరంజీవి లాంటి వాడే పార్టీ పెట్టిన రెండో సంవత్సరమే కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నాడు. కాని, జగన్‌ తన పార్టీని నిలబెట్టాడు. మూడేళ్లుగా ధీటైన ప్రతిపక్షనేతగా రాణిస్తున్నాడు. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పుడూ ప్రజల ముందుంటున్నాడు.

ఈరోజు జగన్‌ మీద వై.యస్‌. బ్రాండ్‌ లేదు. జగన్‌ తనను తాను నాయకుడిగా నిరూపించు కున్నాడు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రత్యర్థులతో అలుపెరుగని పోరాటం చేస్తూనే ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రజామోదం పొందిన అలాంటి జగన్‌ ఎక్కడ? వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్‌ ఎక్కడ? ఆయనతో ఈయన పోటీ పడడం నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter