loksabhaప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్‌ పిలుపుమేరకు ఐదుగురు వైసిపి లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం తెలిసిందే! ఈ రాజీనామా లేఖలు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వద్ద పెండింగ్‌లో వున్నాయి.

ఇంకో ఏడాదిలోనే దేశమంతా లోక్‌సభ ఎన్నికలు జరుగు తాయి. ఇప్పుడు ఈ ఐదుగురు రాజీనామాలు ఆమోదిస్తే ఆర్నెల్ల లోపు 5 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. మళ్ళీ ఆర్నెల్ల లోపే ఇవే లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆరు నెలల సంబరానికి... ఈలోపు మళ్ళీ ఉపఎన్నికలు... కోట్ల రూపాయల ఖర్చు... అధికార యంత్రాంగం వినియోగం... పెద్దఎత్తున దుబారా... ఈ కోణాలన్నీ ఆలోచించే లోక్‌సభ స్పీకర్‌ వైసిపి ఎంపీల రాజీనామాలను ఆమోదించలేదని తెలుస్తోంది.

కావాలనే వైసిపి ఎంపీల రాజీనామాలను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేయడం లేదని, వైసిపితో బీజేపీ లాలూచీ పడిం దంటూ తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి... తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా

ఉన్నామని ప్రకటించాడు.

ఒకవేళ లోక్‌సభ స్పీకర్‌ వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే పరిస్థితేంటి? ఉపఎన్నికలు తప్పవు. వైసిపికి పాత అభ్యర్థులే! నెల్లూరు లోక్‌సభకు వైసిపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డే! మరి తెలుగుదేశంపార్టీ తరపున ఎవరు? 2014ఎన్నికల్లో పోటీ చేసిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు లోక్‌సభ పోటీకి ఇష్టంగా లేడు. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన జిల్లా మినీమహానాడులో కూడా గతంలో ఉపఎన్నికలు వస్తే మంత్రులే పోటీ చేసారని, నెల్లూరు లోక్‌సభకు ఉపఎన్నిక వస్తే మంత్రులే పోటీ చేయాలంటూ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. సోమిరెడ్డి అందుకు తగ్గట్లుగానే స్పందిస్తూ... పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడం తన నైజమని, పార్టీ ఆదేశిస్తే నెల్లూరు పార్లమెంట్‌లోనే కాదు, కడప పార్లమెంటుకైనా పోటీకి దిగుతా అన్నట్లు చెప్పాడు.

నెల్లూరు లోక్‌సభకు ఉపఎన్నిక వస్తే టీడీపీలో ఎవరూ టిక్కెట్‌ కావాలని అడిగే పరిస్థితి లేదు. చంద్రబాబు ఆదేశిస్తే సోమిరెడ్డి, బీద, నారాయణలాంటోళ్ళకు దిగక తప్పదు. వైసిపి వాళ్ళకంటే జిల్లా టీడీపీ నాయకులే ఉపఎన్నికలు రాకుంటే బాగుండుననుకుంటున్నారు. నిన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పిన దానిబట్టి చూస్తే ఉపఎన్నికలు రావడం అనుమానమే!

LokSabhaగురువారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర విభజన బిల్లును  లోక్‌సభలో  ప్రవేశపెట్టారు. వెంటనే స్పీకర్ మీరాకుమార్ బిల్లు సభలోకి ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. బిల్లును ప్రవేశపెట్టిన తక్షణం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది ఒక్కసారిగా సీమాంద్ర సభ్యులందరూ పెద్దపెట్టున సమైక్య నినాదాలు చేసారు . టేబుల్ పైకి ఎక్కి మైకులు విరగ కొట్టారు. 
 
మిరియాల పొడి స్ప్రే చేసిన లగడపాటి
విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో  మిరియాల పొడి స్ప్రే చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో అయోమయం నెలకొంది. . కళ్లలోంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలోసభ్యులంతా బయటకు పరుగులు తీశారు .టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మైకులు విరిచేశారు. ఆయనను తెలంగాణ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకునే యత్నం చేశారు. ఇరుప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు. కంప్యూటర్ను లగడపాటి ధ్వంసం చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. పెప్పర్ స్ప్రే తో  ఇబ్బందులకు గురైన ఎంపీలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్పే
ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేస్తూంటే తాము అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా లగడపాటిపౌ దాడికి యత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్పే ఉపయోగించారని హర్షకుమార్ అన్నారు.
తమ దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటేనని... ప్రజల కోసమే తాము అలా చేశామని ఆయన పేర్కొన్నారు. లోక్సభ విజువల్స్ బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. 
లోక్ సభలో   సీమాంధ్రకు తమిళ ఎంపీలు మద్దతునిచ్చారు.మంగళవారం సభ ప్రారంభం కాగానే తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు విభజన అనుకూల, వ్యతిరేక నినాదాలు ప్రారంభించారు. సభ నిర్వహణకు సహకరించాలన్న స్పీకర్ మీరాకుమార్ విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. పోడియంలోకి సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు దూసుకువచ్చి నినాదాలు అందుకున్నారు.
సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబట్టి పోడియం వద్ద నినాదాలు చేయగా, వీరికి మద్దతుగా డిఎంకే, అన్నాడీఎంకే సభ్యులు కూడా అక్కడ నినాదాలు చేశారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు వారి వారి స్థానాల్లోనే నిలబడి నిరసనలు తెలిపారు. కాగా, సభ అదుపులో లేని కారణంగా సీమాంధ్ర సభ్యులు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులను చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ సభ్యుల నిరసనలు కొనసాగుతూనే ఉండటంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter