msrపేద గర్భిణీ స్త్రీలు నగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోల కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి, నెల్లూరులోని మాగుంట శరత్‌చంద్రారెడ్డి యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అయిదు ఆటోలను కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ ఆటోలను యువజన సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత్‌చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రసాద్‌ను ఆయన అభినందించారు. ఈ ఉచిత ఆటోలు నగరమంతా తిరుగుతాయని, వాటిపై ఫోన్‌ నంబరు కూడా వుంటుందని, అవసరమైనవారు ఫోన్‌ చేస్తే వెంటనే తమ ఆటో వస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, ప్రసాద్‌, దారా మహేష్‌, మాదా బాబు, జైరాజ్‌, రమేష్‌, నాగార్జున, సాయి తదితరులు పాల్గొన్నారు.

kabbadiఓ చిన్న ప్రోత్సాహంతో రాళ్లను రత్నాలుగా మలచవచ్చు. రవ్వంత సహకారంతో మట్టిలో నుండి మాణిక్యాలను వెలికి తీయొచ్చు. దీనికి ఉదాహరణే వచ్చే ఏడాది థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగనున్న అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన నెల్లూరుజిల్లాకు చెందిన యం.యస్‌.ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ కబడ్డీ జట్టు. సాధారణ వ్యక్తులకు కొంత చేయూత వుంటే శక్తులుగా మారతారనడానికి ఈ కబడ్డీ జట్టు గెలుపే ఉదాహరణ. ఈ నెల 13, 14, 15తేదీలలో గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఆలిండియా స్టూడెంట్స్‌ ఒలింపిక్‌ నేషనల్‌ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరపున పాల్గొన్న నెల్లూరుజిల్లాకు చెందిన యం.యస్‌.ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ జట్టు కబడ్డీ పోటీలలో అత్యంత శక్తివంతమైన మహారాష్ట్ర జట్టును ఒక్క పాయింట్‌ తేడాతో ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. గత 30ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ తరపున ఓ కబడ్డీ జట్టు మొదటి స్థానంలో నిలిచి కప్‌ను సొంత చేసుకోవడం ఇదే ప్రథమం. జాతీయ పోటీలలో విజేతగా నిలిచిన యం.యస్‌.ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ జట్టే బ్యాంకాక్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో భారతదేశం తరపున ఆడబోతోంది. ఇది మన ఏపికి, మన నెల్లూరుజిల్లాకే గర్వకారణం.

ఈ జట్టు విజయ ప్రస్థానం వెనుక వున్నది ఏ పేరు మోసిన కార్పొరేట్‌ కంపెనీయో, ప్రభుత్వ క్రీడా అకాడమీయో, టాప్‌ సినిమాయాక్టర్లో కాదు, నెల్లూరుకు చెందిన పాతికేళ్ల కుర్రాడు. ఈ జట్టు విజయ ప్రస్థానంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ యువకుడే మాగుంట శరత్‌చంద్రారెడ్డి. నెల్లూరు సరస్వతీనగర్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మాగుంట వెంకటనారాయణరెడ్డి కుమారుడు. మాగుంట శరత్‌చంద్రారెడ్డి సేవాసమితి ద్వారా గత కొన్నేళ్లుగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నెల్లూరీయులకు సుపరిచితుడైన యువసేవా స్వాప్నికుడు.

మాగుంట శరత్‌చంద్రారెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో 2015 జనవరిలో నెల్లూరు, విఆర్‌సి మైదానంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆటల పోటీలలో యంయస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ తరపున యం.మణికంఠచక్రవర్తి (కోవూరు), కె.మహేంద్రబాబు(కోవూరు), జి.శ్రీనివాసులు (ముదివర్తిపాలెం), సి.హెచ్‌.ఏ.చక్రవర్తి(కోవూరు), ఎస్‌.నాగార్జున (సిద్ధీపురం), పి.రాజేష్‌(ఇనమడుగు), ఎల్‌.దుర్గాప్రసాద్‌(బుచ్చి), నాగేంద్ర(ఇస్కపల్లి)లతో కబడ్డీ జట్టు ఏర్పడింది. ఈ ఏడాదిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూడెంట్‌ ఒలింపిక్‌ నేషనల్‌ గేమ్స్‌లోనూ కబడ్డీలో యం.యస్‌.ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ జట్టు విజేతగా నిలిచి జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలలోనూ తమ సత్తా నిరూపించుకుని అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. క్రికెట్‌ మాయాజాలంలో మన సాంప్రదాయ క్రీడలు మరుగైపోతున్న తరుణంలో ఇటీవల మళ్లీ కబడ్డీ ఆట ప్రాణం పోసుకుంది. కబడ్డీ పట్ల క్రీడాభిమానుల్లో ఆదరణ పెరుగుతోంది. మన క్రీడల ప్రాభవానికి ఇది శుభారంభం. యంయస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ కబడ్డీ జట్టు మనది. మన నెల్లూరుది. కాబట్టి మనమంతా అండగా నిలుద్దాం... అంతర్జాతీయ పోటీలలోనూ గెలిచి కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter