ycp choopనవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది.

జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే ఎన్ని కల్లో అభ్యర్థులన్న ధీమాలో కూడా వున్నారు. అయితే ఇక్కడ తాము గెలవడం ముఖ్యమా, తమ లీడర్‌ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా అన్న ఆలోచన చేయగలిగితే వీరిలో చాలా మంది వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. తమ గెలుపే ప్రధానం అని స్వార్ధంతో భావిస్తే వీళ్ళు పార్టీని చిక్కుల్లోకి నెట్టే పరిస్థితి ఏర్పడు తుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగా బలంగా వున్నప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థుల పట్ల అసంతృప్తి ఉందన్న వార్త బలంగా వినిపిస్తోంది. జిల్లాలో ఏ నియోజకవర్గమైనా టిక్కెట్టు పొందగలిగితే గెలుపు ఖాయం అన్న ధీమా కొత్త నేతల్లోనే కాదు, జిల్లా ప్రజల్లో కూడా వుంది. సిట్టింగ్‌ల పైన సహజంగానే కొంత అసంతృప్తి వుంటుంది కాబట్టి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చక తప్పదని పి.కె. సర్వే చెబుతోందన్న వార్త కూడా షికారు చేస్తోంది. అయితే జిల్లా అంతటా ప్రస్తుతం వినిపిస్తున్న చర్చ పార్టీకి రానున్న కొత్త నేతలు ఎవరు...? వారి స్థానాలు ఏవి...?

ముందుగా నెల్లూరు పార్లమెంటు విషయానికొస్తే ఇక్కడ ఖచ్చితంగా కొత్త అభ్యర్థి అవసరం వుంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా, జగన్‌కి విధేయుడిగా మంచి మార్కులు సంపాదించు కున్నప్పటికీ ఎంపిగా జిల్లా ప్రజలు ఫెయిల్‌ మార్కులే వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆదాల ప్రభాకర్‌రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో మేకపాటిపై పోటీ చేసి ఓడిపోయిన ఆదాలయితే గెలుపు ఖాయం అన్న అభిప్రాయం చాలామందిలో వున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి వెళ్లాలన్న గట్టి పట్టుదలతో వున్నట్లు సమాచారం.

ఇక వెంకటగిరి విషయానికొస్తే ఇక్కడ కొమ్మి లక్ష్మయ్యనాయుడు పూర్తిగా రిటైర్‌ అయిపోవడంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ సీటును కనిపెట్టుకుని పనిచేసుకుంటున్నాడు. జగన్‌ కూడా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు చెప్తున్నా, ఇక్కడి నుండి మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి పేరు బలంగా వినపడుతోంది. రాంకుమార్‌ అయితే వెంకటగిరితో పాటు గూడూరు, సూళ్లూరుపేట నియో జకవర్గాల్లో కూడా పార్టీకి మేలు జరిగే అవకాశాలు బలంగా వున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మాజీముఖ్యమంత్రి కొడుకుగా నేదురుమల్లి వారసుడిగా జనం ఆయనకు జేజేలు పలుకుతారన్నది వీరి అభిప్రాయం. వెంకటగిరి నియోజకవర్గంలో బలమైన బంధువర్గం గల డిసిసిబి ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి కూడా రంగంలో ఉన్నట్లు తెలు స్తోంది. సీటిచ్చేటట్లైతే వైసిపిలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని సమాచారం.

గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మేరిగ మురళిని నిర్ణయించి గెలిపించే బాధ్యత గౌతంరెడ్డికి అప్పజెప్పినా మురళీరవం నియోజకవర్గంలో అంతగా వినిపించకపోవడంతో ఇక్కడ పనబాక కృష్ణయ్యని తెరపైకి తెచ్చే ఆలోచనలో మేధావులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంగబలం అర్ధబలం అన్నీ ఉన్న కృష్ణయ్య ఇక్కడ గట్టి అభ్యర్థి కావచ్చన్నది అంచనా. ఇక్కడ ఇన్‌ఛార్జ్‌ లుగా పార్టీ గెలుపుకోసం గట్టిగా పనిచేయాలనుకుంటున్న పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి, యల్లసిరి గోపాల్‌ రెడ్డికి, కోడూరు మీరయ్యకి ఈసారి ఎన్నిక పెద్ద సవాల్‌ కాబట్టి అభ్యర్థి విషయంలో వీళ్లు కూడా రాజీపడక పోవచ్చు.

ఇక ఆత్మకూరులో రామనారాయణరెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుస్తాడని అక్కడ ఓటర్లు బాహా టంగానే చెప్తున్నారు. మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని మరువలేకున్నామని, గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నిలబడడం కారణంగా మన స్సాక్షిని చంపుకుని గౌతంరెడ్డికి ఓటేశామని అంటు న్నారు. రామనారాయణరెడ్డి ఈసారి ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఆయనకే ఓటేస్తామని ఒట్టేసి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ వైసిపి నుండి రామ నారాయణరెడ్డి వస్తే ప్రభంజనంలా గెలిచే అవకా శాలు వున్నాయని అంటున్నారు. గౌతం లాంటి విధేయులు జగన్‌ మాట జవదాటే అవకాశం లేదు కాబట్టి, పార్టీ అధికారంలోకి వస్తే గౌతంని యంయల్‌సి చేసి ఆయనను మంత్రిని కూడా చేసే సాన్నిహిత్యం, సహచర్యం జగన్‌కి గౌతంకి మధ్య వుంది. కాబట్టి ఇక్కడి అభ్యర్థిని మార్చడం సులభమే.

కోవూరు విషయానికొస్తే ఇక్కడకూడా పార్టీ బలంగా వుండడమే కాకుండా ప్రసన్నకుమార్‌రెడ్డిపైన సానుభూతి కూడా వుంది. దీంతో సమానంగా పోలంరెడ్డిపైన అసంతృప్తి కూడా ఎక్కువగానే వుంది. అయితే... ఆఖరు నిముషంలో ఏదో విధంగా గెలుపు గుర్రంగా అవతారమెత్తే పోలంరెడ్డి ఆర్ధికబలంతో ఈ సీటుకు ఎసరుపెట్టే ప్రయ త్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రసన్న వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.

సమీకరణలు మారి కొత్త నీరు పార్టీకి వస్తే ఉదయగిరి నుండి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీ చేస్తాడని కూడా వినిపిస్తోంది. ఇక్కడ శేఖర్‌రెడ్డి ఇమేజ్‌ బలంగా ఉన్నప్పటికీ అన్న కోసం త్యాగం చేసే పరిస్థితే వస్తే ఆయన బలికాక తప్పేటట్లు లేదు.

కావలిలో ప్రతాప్‌ జోరుగా ప్రచారం చేసుకుం టున్నప్పటికీ ఇక్కడ వంటేరు వేణుగోపాలరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలు లైన్‌లో వున్నారు. అయితే వీరందరినీ ప్రక్కనబెట్టి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తే వివాదం సద్దుమణుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్న క్రమంలో ఇక్కడ కూడా ఆదాల పేరు వినిపిస్తోంది. అయితే జగన్‌మోహన్‌రెడ్డి పాద యాత్రలో వుండడంతోనూ మరోవైపు హోదా పోరు పతాకస్థాయికి చేరుకోవడంతోనూ జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థుల నిర్ణయం మరికొద్ది నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. మిగిలిన నియో జకవర్గాలలో సర్వేపల్లి మినహా మిగిలిన నెల్లూరు నగరం, రూరల్‌, సూళ్లూరుపేటలలో అభ్యర్థులు దాదాపు ఖరారైపోయినట్లే.

ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. ఇక్కడ అందరి ధ్యేయం ఒక్కటే కావాలి. అది కేవలం వై.యస్‌.జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ సుపరిపాలన అందించాలి. ఇదొక్కటే నినాదం కావాలి. ఇదొక్కటే లక్ష్యం కావాలి. ఇదొక్కటే అంతిమ నిర్ణయం కావాలి. అప్పుడే పార్టీ విజయం నల్లేరుపై నడకలా సాగుతుంది. వేచిచూద్దాం ఏం జరుగుతుందో...!

minisదసరాకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్వరగా ముఖ్యమంత్రి కావాలని తన తనయుడు లోకేష్‌కు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ క్రింద తన కేబినెట్‌లో చేర్చుకు నేందుకే ఈ కూర్పు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే కేవలం లోకేష్‌ ఒక్కడి కోసమే కేబి నెట్‌ను మారిస్తే ఎంత అప్రదిష్ట. ఇందులో భాగంగా వున్నవారిలో కొందరికి మంత్రి పదవులు వూడబెరకడం, ఇంకొందరికి కొత్తగా ఇవ్వడం ఉంటుంది.

పదవులు ఊడేవారి లిస్టులో పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్‌బాబు, పి.నారాయణల పేర్లు వినిపిస్తున్నాయి. కొత్తగా తీసుకునేవారిలో ఆకే అమర్‌నాథ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరుజిల్లాలో అంటే బొజ్జలను తీసేసి అమర్‌నాథ్‌రెడ్డికి ఇస్తే సామాజిక వర్గం పరంగా బ్యాలెన్స్‌ అవుతుంది. క్యాబినెట్‌లో మరో ఇద్దరు రెడ్లకు అవకాశం కల్పించాలనే ఆలోచన వుంది. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం బలంగా వుండేది కడప, కర్నూలు, నెల్లూరుజిల్లాల్లో. ప్రకాశంలోనూ కొంతమేర ప్రభావం వుంది. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డికి ఇస్తే సరిపోతుంది. ఇక నెల్లూరుజిల్లాలో ఖచ్చితంగా రెడ్లను క్యాబినెట్‌లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వుంది. జిల్లా నుండి పి.నారాయణ మంత్రిగా వున్నప్పటికి తెలుగుదేశంపార్టీకి రాజకీయంగా భారీ నష్టం తప్పితే నయాపైసా ఉపయోగం లేదు. మంత్రిగా ఆయన జిల్లా ప్రజలకు, కనీసం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేది లేదు. ఆయన మూలంగా పార్టీకి నాయకులు, కార్యకర్తలు దూరమవుతున్నారు. వచ్చే ఎన్నికల దాకా జిల్లా నుండి మంత్రిగా నారాయణనే కొనసాగనిస్తే జిల్లాలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. జిల్లాలో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలంటే జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన, కేడర్‌తో సత్సంబంధాలున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం మేలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. జిల్లాలో పెద్ద రాజకీయ వర్గం కలిగిన ఆనం సోదరులు పార్టీలో వున్నప్పటికి, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారిని కేబినెట్‌లోకి తీసుకుంటే ఎవరూ హర్షించరు. కాబట్టి జిల్లా నుండి 'రెడ్డి' సామాజికవర్గంలో పట్టు నిలుపుకోవాలంటే సోమిరెడ్డిని మంత్రిని చేయొచ్చు. నారాయణను సిఆర్‌డిఏ ఛైర్మెన్‌గా పంపిస్తేనే సోమిరెడ్డి పదవికి మార్గం సుగమం అవుతుంది.

ఇక ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా మంత్రి రేస్‌లో వున్నాడు. ఆయనను ఎమ్మెల్సీగా నిలబెట్టిందే మంత్రిపదవి ఇస్తామన్న హామీ మీద! మాగుంట శీనయ్య నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో సంబంధం వున్న నాయకుడు. కాబట్టి నారాయణను మంత్రివర్గం నుండి తొలగించకుండా మాగుంట శీనయ్యను మంత్రిని చేస్తే ప్రకాశంతో పాటు నెల్లూరుజిల్లాను కూడా కవర్‌ చేస్తాడంటున్నారు. అయితే ఇది సక్సెస్‌ కాదు. మాగుంట ఫుల్‌టైం రాజకీయవేత్త కాదు. మంత్రిని చేసినా కూడా ఆయన ప్రకాశం జిల్లాలోనే పూర్తిగా నెట్టుకు రాలేడు. ఇక నెల్లూరుజిల్లా రాజకీయాల్నేం చూడగలడు. కాబట్టి అన్ని విధాలా నెల్లూరుజిల్లా నుండి సోమిరెడ్డిని మంత్రిని చేయడమే ఉత్తమమని ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం.

ministersనారా లోకేష్‌ కోసమైనా చంద్రబాబు త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి. అయితే ఒక్క లోకేష్‌నే తీసుకుంటే కేవలం కొడుకు కోసమే మంత్రివర్గ విస్తరణ చేసాడనే చెడ్డ పేరొస్తుంది. కాబట్టి మరి కొందరికి కూడా విస్తరించవచ్చు. కొత్తగా తీసుకునే మంత్రుల్లో ఎస్సీ, బి.సి, మైనార్టీ లతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారని టాక్‌!

రెడ్లకు కనీసం రెండన్నా మంత్రి పదవులు దక్కొచ్చు. చంద్రబాబు కేబినెట్‌లో ఇప్పుడు ఇద్దరు మాత్రమే రెడ్లున్నారు. ఇప్పుడు రెడ్ల ప్రాబల్యం వున్న జిల్లాల మీద చంద్రబాబు దృష్టి పెట్టాడు. ఈ జిల్లాల్లోని వైకాపా ఎమ్మెల్యేలనే ఎక్కువుగా తెలుగు దేశంలోకి లాగుతున్నాడు. మంత్రివర్గంలో రెడ్లకు స్థానం కల్పించాలనుకుంటే కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను పరిగణలోకి తీసుకోవాలి. కర్నూలులో భూమా నాగిరెడ్డి, కడపలో ఆదినారాయణరెడ్డిలు ఇటీవలే వైకాపా నుండి తెలుగు దేశంలో చేరారు. ఆదినారాయణరెడ్డికి డౌటే గాని, భూమా నాగిరెడ్డిని మాత్రం మంత్రి పదవి ఆఫర్‌తోనే తెలుగుదేశంలో చేర్చుకున్నారనే ప్రచారం వుంది. మరి శిల్పా సోదరులు భూమాను గట్టిగా వ్యతిరేకిస్తే చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. రెడ్డి వర్గానికి ఒక మంత్రి పదవిని మాత్రం నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాల నుండి తీసుకోవాలి. ఈ రెండు జిల్లాల నుండి వినిపిస్తున్న పేర్లు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాగుంట శ్రీని వాసులురెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి. న్యాయంగా, ధర్మబద్ధంగా పార్టీకి చేసిన కృషిని పరిశీలనలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాల్సి వుస్తే అందుకు మొదటి అర్హుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎందుకంటే అతను 1992 నుండి తెలుగు దేశంను కనిపెట్టుకునే ఉన్నాడు. పార్టీ అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా జంపింగ్‌లు చేయలేదు. పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు కూడా జిల్లా పార్టీలో అంతా తానై పని చేశాడు. పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీచేస్తూ, పరా జయాలను చవిచూస్తూ అన్ని విధాలుగా నష్టపోయాడు. అయినా తన రాజకీయ అనుభవంతో ప్రతిపక్షంలో వున్నప్పుడు అధికారపార్టీని, ఇప్పుడు అధికారంలో వుంటే ప్రతిపక్షాన్ని పదునైన విమర్శలతో ఎండగడుతూ మంత్రివర్గంలో తనలాంటి సీనియర్‌ అవసరం ఎంతుందో చెప్పకనే చెబుతున్నాడు.

మాగుంట శ్రీనివాసులురెడ్డి చూస్తే కరెక్ట్‌గా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విడిచేసి తెలుగుదేశంలో చేరాడు. ఒంగోలు ఎంపి అభ్యర్థిగా ఓడిపోయాడు. ఇటీవల ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచాడు. చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చినందువల్లే ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడని టాక్‌! మరి చంద్రబాబు ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. ఇటీవలే ఆనం సోదరులు తెలుగు దేశంలో చేరారు. నెల్లూరుజిల్లాలో సోమి రెడ్డి నాయకత్వాన్ని పక్కనపెట్టి ఆనం బ్రదర్స్‌కు అప్పగించేందుకే వారిని పార్టీలోకి తీసుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆనం బ్రదర్స్‌తో జిల్లాలో పార్టీ బలపడు తుందని, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కాం గ్రెస్‌ కేడర్‌ను ఆనం రామనారాయణరెడ్డి పార్టీలోకి లాక్కురాగలడని చంద్రబాబు నమ్ముతున్నాడు. ఆనం రామ నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చనే వూహాగానాలున్నాయి. ఇదే జరిగితే రాజకీయాలలో ఇదో వండర్‌ అవుతుంది. తన పార్టీలో దశాబ్దాల తర బడి చాకిరిచేస్తున్న వారిని ఎండగట్టి పక్కపార్టీ వాళ్లను పిలిచి మంత్రిపదవి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మరి చంద్రబాబు ఆ లెవల్‌కు దిగజారు తాడా? ఏమో... ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగానే వుంది తెలుగుదేశం పరిస్థితి. బలహీన వర్గాల నుండి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా ఆశా వాదుల జాబితాలో ఉన్నాడని తెలుస్తోంది.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter