mahanaduవిజయవాడలోని సిద్ధార్ధ కళాశాల గ్రౌండ్‌ వేదికగా తెలుగుదేశంపార్టీ మూడురోజుల మహానాడు వేడుక ముగి సింది. తెలుగుదేశంపార్టీకి మహానాడు అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక పథకాలకు గాని, పార్టీ కార్యక్రమాలకు గాని ఎంతో అద్భుతమైన తెలుగుపేర్లు పెట్టేవాడు. ఆయన పార్టీ వార్షికోత్సవ వేడుకకు పెట్టిన పేరే మహానాడు.

మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసాలే కాదు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే తెలుగు పిండి వంటలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన పార్టీ కార్య కర్తలను ఆనందపరిచేవాళ్ళు.

సిద్ధార్ధ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడుకు ఏపిలోని 13జిల్లాల నుండే కాకుండా తెలంగాణ నుండి కూడా కార్య కర్తలు తరలివచ్చారు. అయితే ఈ మహానాడులో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ఆత్మపరిశీలన జరగకపోగా చరద్రబాబు భజనకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆయన పరిపాలన అమోఘంగా ఉందంటూ అఘోరించారు. ఈ నాలుగేళ్ళలో ప్రభుత్వ వైఫల్యాలపై విశ్లేషణ జరగలేదు. కార్యకర్తల సమస్యలను ప్రస్తావించలేదు. ఈ నాలుగేళ్ళలో ఒరిజినల్‌ తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది తీవ్ర నిరాశకు లోనై వున్నారు. కొత్తగా చేరిన కాంగ్రెస్‌, వైసిపి నాయకులకు పదవుల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. పాతికేళ్ళు, ముప్ఫై ఏళ్ళ నుండి పార్టీ జెండాలు మోసిన వాళ్ళను పక్కకు తోసేసారు. వాళ్ళకు పార్టీ నుండి ఎటువంటి భరోసా లభించలేదు.

ఈ మహానాడులో కొత్తగా కనిపించిన విషయం కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం. ప్రత్యేకహోదా అక్కర్లేదు, ప్రత్యేకప్యాకేజీ ఇస్తే చాలని చెప్పిన నోటితోనే ప్రత్యేకహోదా ఇవ్వట్లేదని చెప్పి బీజేపీని తిట్టారు.

ఇక మహానాడులో ప్రతిపక్ష నేత జగన్‌ను తిట్టడం, ఆయన లక్షకోట్లు తిన్నాడని చెప్పి అరిగిపోయిన రికార్డ్‌ను వేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ మహానాడు లోనూ అదే జరిగింది. మహానాడు వేదికపై తెలంగాణకు చెందిన నర్సిరెడ్డి అనే నాయకుడు, అలాగే ఎంపీ జె.సి. దివాకర్‌రెడ్డిలు జగన్‌పై చౌకబారు విమర్శలు, పిట్టకథలు చెబుతుంటే వాటిని వింటూ పగలబడి నవ్విన చంద్రబాబు, ఇతర నాయకుల తీరు వెగటు పుట్టించేలా వుంది.

అన్నింటికి మించి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థు లుగా, ఫ్యాన్‌ గుర్తు మీద గెలిచి ప్రలోభాలతో తెలుగుదేశంలో చేరిన ముగ్గురు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ పిట్టకథలను విని నవ్వుతుంటే చూసేవారికి ఎంతో రోతనిపించింది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter