patnamదుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ నెల్లూరు లోక్‌సభసభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ వ్రాసారు. దుగరాజపట్నంకు పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉండడం, అదీగాక ఇస్రో, పులికాట్‌ సరస్సుల వల్ల దుగరాజపట్నం పోర్టుకు అడ్డంకులొచ్చాయి. ఇక అధికారులు విశాఖ జిల్లాలోని నక్కలపల్లిని కూడా వ్యతిరేకించారు. రాష్ట్రంలో పెద్దపోర్టు నిర్మాణానికి అవకాశం వున్నది ఒక్క రామాయపట్నంలోనే! 5కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి, రైల్వేలైన్‌ అందుబాటులో వున్నాయి. దొనకొండ వద్ద నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టుపై సర్వే చేసిన 'రైట్‌' సంస్థ రామాయపట్నం పోర్టుకు ఎన్నో అనుకూల అంశాలున్నాయని, పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యాలతో పోర్టు నిర్మాణం చేపట్ట వచ్చని వెల్లడించిందని మేకపాటి ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలోనే ఒంగోలు ఎంపి వై.వి.సుబ్బారెడ్డి రామాయపట్నం పోర్టు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. కావలి మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి ఈ పోర్టు సాధన పేరుతో పాదయాత్ర చేశారు! ఇప్పుడు వారికి మేకపాటి కూడా జత కావడం రామాయపట్నం పోర్టు అంశానికి బలం చేకూర్చేదే!

gowthamమేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలతో పోలిస్తే వారి కుటుంబంలో మేకపాటి గౌతంరెడ్డే మంచి నాయకుడనిపించుకుంటున్నాడు.

జిల్లా రాజకీయాలలో మేకపాటి కుటుంబం మీద ఒక ముద్ర వుంది. గెలిచిన తర్వాత ప్రజలకు అందు బాటులో ఉండరని, సమస్యలపై పెద్దగా స్పందించరని. 2014ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ నుండి వైకాపా అభ్యర్థిగా దిగిన మేకపాటి గౌతంరెడ్డి మీద కూడా ఇదే ప్రచారం వచ్చింది. అవతల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ప్రభావవంతంగా ఎలక్షన్‌ను ఎదుర్కొని వున్నా లేదా తెలుగుదేశం పార్టీ తరపున మెట్టుకూరు ధనుంజయరెడ్డి లాంటి గట్టి నాయకుడు పోటీ చేసున్నా గౌతం మీద ఆ ప్రభావం పనిచేసుండేది. అయితే ఆరోజు రామ నారాయణరెడ్డి ఎన్నికలను పట్టించుకోక పోవడం, తెలుగుదేశం అభ్యర్థి వీక్‌ కావడంతో గౌతం మీద ఈ ప్రభావం పడలేదు.

అయితే, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గౌతం తమ కుటుంబ సభ్యుల తరహాలో కాకుండా పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజలకు దగ్గరగా వుండడంతో ఫరవాలేదనిపించుకుం టున్నాడు. గ్రామాల్లో తిరుగుతున్నాడు, సమస్యలపై స్పందిస్తున్నాడు. ఆత్మకూరు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సి.సి. కెమెరాలను తన సొంత డబ్బుల తోనే పెట్టించాడు. నేర నియంత్రణలో పోలీసులకు ఇవి బాగా ఉపయోగ పడుతున్నాయి. అసెంబ్లీలోనూ సమస్యలపై చర్చిస్తున్నాడు. అయితే అయిదేళ్లు ఆనం రామనారాయణరెడ్డి కాలంలో నిధుల ప్రవా హాన్ని చూసిన ఆత్మకూరు ప్రజలకు ఇప్పుడు అంతా శూన్యంగా ఉంది. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా గౌతంకు ఆ లోటును పూడ్చడం అలవికాని పని. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రూపాయి పనిచేయలేక చేతులెత్తేసి, కాళ్లు చాపి పడుకుని ఉన్నారు. కొంతలో కొంతన్నా తనకు చేతనైంది చేస్తూ గౌతం ఫర్వాలేదనిపించుకుంటున్నాడు.

antharmadanamనెల్లూరు లోక్సభ అభ్యర్థుల విషయంలో మూడు ప్రధాన పార్టీలలో అంతర్మధనం జరుగుతుంది. పార్లమెంట్కు పక్కా రాజకీయ నాయకులను నిలిపే పరిస్థతి ఎప్పుడో పోయింది. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అండదండలందించే శక్తి సామర్య్థాలున్నా ఆర్థికవేత్తలనే పార్టీలు పార్లమెంటు బరిలో దింపుతున్నాయి.

వైయస్సారం కాంగ్రెస్ పార్టీ చూస్తే సిటింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నాడు. రాజకీయ కోణంలోనే కాదు ఆర్థిక కోణంలో చూసినా ఇంకొకరి కోసం వెదకాల్సిన పనిలేదు. ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తాడా లేక అసెంబ్లీకి వెళతాడా అనేది సందేహంగా వుంది. ఈ మధ్య ఆయన మదిలో అసెంబ్లీ ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుండి చూస్తే ప్రస్తుతం పార్టీలో వున్న నాయకులలో పార్లమెంటుకు పోటీ చేసే ఆర్థిక స్తోమత ఎవరికీ లేదు. ఇక తప్పదనుకుంటే బీద మస్తాన్రావు మాత్రమే అందుకు సరిపోగలడు. ఇక కాంగ్రెస్ నుండి వచ్చే నాయకుల మీదే తెలుగుదేశం పార్టీ ఆధారపడాలి. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడానికి ఆదాల ప్రభాకరరెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన వద్దనుకుంటే వెదుకులాట తప్పదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద కూడా తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. అయితే ఆయన కాకపోతే ఆదాల మీదే ఆధారపడాలి. ఆయన కూడా వద్దంటే ఇక ఉన్న వారిలోనే చూసుకోవాలి.

కాంగ్రెస్కు మాత్రం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పెద్ద సమస్యకాగలదు. పార్టీ నుండి పార్లమెంటుకు పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కొత్త వాళ్లు కూడా ఆ పార్టీ టిక్కెట్ ను ఆశించే పరిస్థతిలేదు. ఈ నేపథ్యంలో ఆనం వివేకానందరెడ్డి పార్లమెంటు బాధ్యత తప్పదనిపిస్తుంది.

మొత్తానికి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఈసారి మూడు పార్టీలకు కూడా కీలకంగా మారనుంది. పార్లమెంట్ అభ్యర్థుల సామర్థ్యం పైనే అసెంబ్లీ ఫలితాలు కూడా కొంత ఆధారపడి ఉంటాయి.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter