meka brosనెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్‌ను వీడి జగన్‌ వెంట నడిచారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది గొప్ప విషయమే!

అంతకుముందే కోవూరు ఎమ్మెల్యేగా వున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జగన్‌ వెంట నడవడం, ఉపఎన్నికల్లో గెలుపొందడం తెలిసిందే! మేకపాటి సోదరులు కూడా జగన్‌ను నమ్మి తమ పదవులు వదులుకున్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసిపి అభ్యర్థులుగా తిరిగి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి జిల్లా పార్టీలో వారే పెద్ద దిక్కుగా వ్యవహరించారు కాబట్టి నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ సీట్లు వాళ్ళకే ఇచ్చారు. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నుండి మేకపాటి గౌతంరెడ్డిలు విజయం సాధించగా, ఉదయగిరి అసెంబ్లీ నుండి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పరాజయం పాలయ్యాడు.

ఇప్పుడు పార్టీలోకి మరికొందరు నాయకులు వస్తున్న నేపథ్యంలో గతంలోలాగే మేకపాటి కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే పరిస్థితి వుందా? అన్న ప్రశ్న ఉదయించింది. ఆ కుటుంబంలో ఇద్దరికి సీట్లు గ్యారంటీ అంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే కుటుంబ పార్టీగా ముద్రపడుతుందనే అభిప్రాయం కూడా వుంది. బయట నుండి వచ్చినవారికి సీట్ల విషయంలో ప్రాధాన్యతనివ్వాలి. సీట్ల అడ్జస్ట్‌మెంట్‌ జరగాలి. కాబట్టి మేకపాటికి వున్న 3 సీట్లు 2 సీట్లకు తగ్గొచ్చు. ప్రస్తుతమున్న ముగ్గురిలో ప్రత్యక్ష ఎన్నికల రంగం నుండి ఎవరు తప్పుకుంటారన్నది ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి.

ఇక ప్రస్తుతం ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి మళ్ళీ కూడా పోటీ చేయడం ఖాయం. నిన్నటివరకు ఆయన పేరు నెల్లూరు లోక్‌సభకే వినిపించింది. తాజా వార్తల ప్రకారం ఆయనను అసెంబ్లీకి పోటీ చేయించాలనే ఆలచోనలో ఆయన కొడుకు గౌతంరెడ్డి వున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజమోహన్‌రెడ్డిని అసెంబ్లీకి గెలిపించి జగన్‌ కేబినెట్‌లో మంత్రిని చేయాలి. ఆయన సీనియర్‌ కాబట్టి మంత్రి పదవి ఇవ్వడం పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎలక్షన్‌ తర్వాత ఇక ఆయన పోటీ చేసే పరిస్థితి వుండదు. లోక్‌సభకు గెలిపించినా ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో, అక్కడ పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. రాష్ట్రంలో మాత్రం అధికారం వచ్చే అవకాశాలు న్నాయి. కాబట్టి తన తండ్రిని అసెంబ్లీకి పంపి తాను లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో గౌతంరెడ్డి వున్నట్లు తెలుస్తోంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter