meka brosనెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్‌ను వీడి జగన్‌ వెంట నడిచారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది గొప్ప విషయమే!

అంతకుముందే కోవూరు ఎమ్మెల్యేగా వున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జగన్‌ వెంట నడవడం, ఉపఎన్నికల్లో గెలుపొందడం తెలిసిందే! మేకపాటి సోదరులు కూడా జగన్‌ను నమ్మి తమ పదవులు వదులుకున్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసిపి అభ్యర్థులుగా తిరిగి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి జిల్లా పార్టీలో వారే పెద్ద దిక్కుగా వ్యవహరించారు కాబట్టి నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ సీట్లు వాళ్ళకే ఇచ్చారు. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నుండి మేకపాటి గౌతంరెడ్డిలు విజయం సాధించగా, ఉదయగిరి అసెంబ్లీ నుండి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పరాజయం పాలయ్యాడు.

ఇప్పుడు పార్టీలోకి మరికొందరు నాయకులు వస్తున్న నేపథ్యంలో గతంలోలాగే మేకపాటి కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే పరిస్థితి వుందా? అన్న ప్రశ్న ఉదయించింది. ఆ కుటుంబంలో ఇద్దరికి సీట్లు గ్యారంటీ అంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే కుటుంబ పార్టీగా ముద్రపడుతుందనే అభిప్రాయం కూడా వుంది. బయట నుండి వచ్చినవారికి సీట్ల విషయంలో ప్రాధాన్యతనివ్వాలి. సీట్ల అడ్జస్ట్‌మెంట్‌ జరగాలి. కాబట్టి మేకపాటికి వున్న 3 సీట్లు 2 సీట్లకు తగ్గొచ్చు. ప్రస్తుతమున్న ముగ్గురిలో ప్రత్యక్ష ఎన్నికల రంగం నుండి ఎవరు తప్పుకుంటారన్నది ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి.

ఇక ప్రస్తుతం ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి మళ్ళీ కూడా పోటీ చేయడం ఖాయం. నిన్నటివరకు ఆయన పేరు నెల్లూరు లోక్‌సభకే వినిపించింది. తాజా వార్తల ప్రకారం ఆయనను అసెంబ్లీకి పోటీ చేయించాలనే ఆలచోనలో ఆయన కొడుకు గౌతంరెడ్డి వున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజమోహన్‌రెడ్డిని అసెంబ్లీకి గెలిపించి జగన్‌ కేబినెట్‌లో మంత్రిని చేయాలి. ఆయన సీనియర్‌ కాబట్టి మంత్రి పదవి ఇవ్వడం పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎలక్షన్‌ తర్వాత ఇక ఆయన పోటీ చేసే పరిస్థితి వుండదు. లోక్‌సభకు గెలిపించినా ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో, అక్కడ పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. రాష్ట్రంలో మాత్రం అధికారం వచ్చే అవకాశాలు న్నాయి. కాబట్టి తన తండ్రిని అసెంబ్లీకి పంపి తాను లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో గౌతంరెడ్డి వున్నట్లు తెలుస్తోంది.

mekapatiనెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి మారడం జరిగింది. నెల్లూరు లోక్‌సభ నుండి తాను పోటీ చేయాలన్న ఆశతో అప్పుడు డీ-లిమిటేషన్‌ కమిటీలో సభ్యుడిగా వున్న స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి నెల్లూరును ఆనుకుని వుండే సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి పార్లమెంటులోకి నెట్టేసి, నెల్లూరుకు 120కిలోమీటర్ల దూరంలో వున్న కందుకూరును నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి తెచ్చారు. ఇంత కష్టపడ్డా కూడా 2009లో ఆయనకు నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వకుండా రాజ్యసభకు పంపించారు.

నెల్లూరు లోక్‌సభ జనరల్‌ అయ్యాక తొలి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. 2009లో వై.యస్‌. అనుకూల గాలిలో గెలిచాడు. 2012లో తిరిగి వైకాపా అభ్యర్థిగా నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలలో దాదాపు 3లక్షల మెజార్టీతో గెలిచాడు. 2014లో తిరిగి వైకాపా అభ్యర్థిగా మూడోసారి ముక్కీ మూలిగి 13వేల మెజార్టీతో గెలిచాడు. అది కూడా ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి ఎలక్షన్‌ వదిలేయబట్టి ఎంపీగా ఈయన బయటపడ్డాడు. అంటే ఆ రెండేళ్లలోనే ఎంపీగా ఆయనపై వ్యతిరేకత బాగా పెరిగింది. లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీలో 5 నియోజకవర్గాలలో వైసిపి గెలిచింది. ఎంపీగా ఆయన మెజార్టీ లక్ష దాటాలి. కాని, క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగి ఆయన మెజార్టీ 13వేలకు పడిపోయింది. 2014లోనే అంత నెగటివ్‌ వుంటే ఇంకో ఐదేళ్ల తర్వాత ఇంకెంత వ్యతిరేకత ఉం డాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా కొత్తవారిని తెరమీదకు తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేకపాటిని ఒంగోలుకో, నరసారావుపేటకో పంపించొచ్చు. ఆ రెండు చోట్లా మేకపాటికి మంచి పేరే వుంది. నెల్లూరు లోక్‌సభ పరిధిలో పంట రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. వీళ్లకు ఆయన సెట్‌ కాడు. కాబట్టి ఆయన మెట్ట లోక్‌సభ లకు పోవడమే మేలు. ఈసారి పార్లమెంట్‌ అభ్యర్థుల సామర్ధ్యం కూడా అసెంబ్లీలపై ప్రభావం చూపుతుంది. పార్లమెంటు అభ్యర్థి గట్టోడైతే అది అసెంబ్లీ అభ్యర్థులకు కూడా కలిసొస్తుంది. కాబట్టి నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా సరైన నాయకుడి కోసం అన్వేషణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

meka fa soవేలకోట్ల ఆస్తులు... ఇంట్లో పదవులు... రాజకీయంగా పలుకుబడి... అయినా ఏం లాభం? మంచి అనేవాళ్లే లేరే? వాళ్లు కరెక్ట్‌ అని చెప్పే మనిషే కనిపించడే! వాళ్లవల్ల ఫలానావాళ్లు బాగుపడ్డారని చూపించడానికి కూడా నలుగురు మనుషులు కనిపించరే! రాజకీయాలలో ఎంత చెడ్డపేరున్న నాయకుడివల్లనైనా కనీసం బాగుపడిన వాళ్లు నలుగురుంటారు. కాని, దాదాపు 3దశాబ్దాల రాజకీయ చరిత్రగల మేకపాటి బ్రదర్స్‌ వల్ల ఆర్ధికంగా నష్టపోయినవాళ్లు తప్పితే బాగుపడ్డ వాళ్ల ఆనవాళ్లు లేవు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్థాయి నుంచి సర్పంచ్‌గా గెలిచే స్థాయికి తగ్గినవాళ్ళే తప్ప, వీళ్ళ వల్ల గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగినవారు కనపడనే కనపడరు!

ఎలక్షన్‌లలో చేసిన అప్పులు ఎగవేయ డంలోనూ, తమ సంస్థ ద్వారా సబ్‌కాం ట్రాక్ట్‌ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగనామం పెట్టడంలోనూ బ్రాండ్‌ అంబా సిడర్‌లు మేకపాటి సోదరులు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏ మారుమూల పల్లెలో చూసినా వీళ్ల బాధితుడు ఒక్కడన్నా ఉం టాడు. ఎలక్షన్‌ లలో అప్పులిచ్చి బాకీలు రానివాళ్లు, సబ్‌ కాంట్రాక్ట్‌లు చేసి వారి నుండి బిల్లులు రాని కాంట్రాక్టర్లు వివరాలు సేకరిస్తే మేకపాటి బాధితుల జాబితా ఓ మున్సిపల్‌ వార్డు ఓటర్ల లిస్టంత ఉం టుంది. ఎందుకంటే వాళ్లు కెఎంసి అనే సంస్థను స్థాపించినప్పటి నుండే కాక, 1983లో మొదటిసారిగా ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీ చేసిన ప్పటి నుండి ఇప్పటివరకు అంతమంది బాధితులు పోగైవుంటారు. వాళ్ల కెఎంసి సంస్థలో సబ్‌కాంట్రాక్ట్‌ వర్క్‌ చేసి బిల్లులు రాబట్టుకోవడమంటే గోడకు వేసిన సున్నాన్ని గీకడమేనన్నది బాధితుల గోడు.

ఇలాంటి బాధితుల జాబితాలో వాళ్ళే నెల్లూరుకు చెందిన కోడూరు వెంకట సనత్‌ కుమార్‌రెడ్డి, మారంరెడ్డి శ్రీహరినాథ్‌ రెడ్డిలు. కెఎంసి సంస్థ ద్వారా సబ్‌కాంట్రాక్ట్‌ పనులు చేసిన పాపానికి ఆర్ధికంగా, మాన సికంగా ఎంతో నష్టపోయారు. వివరాల లోకి వెళ్తే కోడూరు వెంకట సనత్‌కుమార్‌ రెడ్డి, మారంరెడ్డి శ్రీహరిరెడ్డిలు 1999 నుండి 2004 మధ్య సబ్‌కాంట్రాక్టర్‌లుగా చేరి అద్దంకి-నార్కేట్‌ పల్లి, తోకపల్లి-పేరే చర్ల రోడ్ల పనులు చేసారు. ఈ పనులకు సంబంధించి వీరికి 4కోట్ల15లక్షల20వేల రూపాయల బిల్లు రావాలి. ఇక మేకపాటి వాళ్లనుండి డబ్బులు తీసుకోవాలంటే సబ్‌కాంట్రాక్టర్లకు ఎన్ని జతల చెప్పులరిగి పోతాయో లెక్కే వుండదు. సనత్‌కుమార్‌ రెడ్డి, శ్రీహరినాథ్‌రెడ్డిలు కూడా చెప్పులరి గేలా కాదు, మోకాళ్ల చిప్పలు అరిగి పోయేలా కెఎంసి ఆఫీసు చుట్టూ తిరిగారు. ఇదిగో రేపు... అదిగో ఎల్లుండి... అంటూ మేకపాటి సోదరులు సంవత్సరాల పాటు నెట్టుకొచ్చారు. 2004లో పూర్తిచేసిన పనికి 2009 దాకా కూడా బిల్లు ఇవ్వలేదు. 2009 మేలో మేకపాటి గౌతంరెడ్డి వీరిని పిలిపించుకుని నాన్నతో, చిన్నాన్నతో మాట్లాడి త్వరలోనే మీ బిల్లు సెటిల్‌ చేస్తా నని హామీ ఇచ్చాడు. కాని, 2010 ఫిబ్రవరి వరకు ఆఫీసు చుట్టూ తిప్పుకున్నాడే తప్ప, వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళను పిలిపించుకుని నావల్ల కాదు, మా నాన్ననే అడగండని విషయం నుండి జారుకున్నాడు. దీంతో బాధితులు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని కలిసారు. మీకెందుకు 16రోజుల్లో మీ పని పూర్తి చేస్తానని చెప్పిన రాజమోహన్‌రెడ్డి అసలే స్పందించలేదు. మేకపాటి వల్ల జరిగిన అన్యాయంతో న్యాయం కోసం న్యాయస్థానం మెట్లెక్కారు బాధితులు.

కెఎంసి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేతలు, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఈయన తమ్ముడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌ రెడ్డిలపై నెల్లూరు ఆరవ జిల్లా జడ్జి కోర్టులో ఓఎస్‌ నెం.91/2013గా దావా వేసి డిక్రీ పొందారు. దీంతో ఆగ్రహించిన మేకపాటి సోదరులు సదరు బాధితుల ఇళ్లపై తమ అనుచరులతో దౌర్జన్యం చేయించారు. దీనిపై బాధితులు నెల్లూరు రెండవ అద నపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సి.సి.నెంబర్‌ 95/2016గా క్రిమినల్‌ కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణకు నిందితులు ముగ్గురు గైర్హాజరు కావడంతో విచారించిన కోర్టు ఈ ముగ్గురికీ నాన్‌బెయి లబుల్‌ వారెంట్లు జారీ చేసింది.

మేకపాటి సోదరులపై ఈ కేసే కాదు, ఇంకా పలుకేసులు పెండింగ్‌లో వున్నాయి. సబ్‌కాంట్రాక్టర్ల చేత పనులు చేయించుకుని వాళ్లకు సరిగా డబ్బులివ్వరు. ఎలక్షన్‌లలో మద్యం షాపులకు అప్పులుపెట్టి ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు గాని వాళ్ల బాకీలు తీర్చరు. ఉదయగిరి నియోజకవర్గంలో వీరిపై అప్పుల ఎగవేతలో అగ్రగణ్యులనే ముద్ర వుంది. ఇంత చెడ్డపేరున్న వాళ్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తున్నారనే అనుమానం రావొచ్చు. కేవలం దివంగత వై.యస్‌.రాజ శేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్‌ల ప్రజాభి మానం వల్ల మాత్రమే వీళ్లు గెలవగలుగు తున్నారు. వై.యస్‌. బ్రాండ్‌ తీసి పక్కనపెట్టి పోటీ చేసుంటే రాజకీయ తెర నుండి మేకపాటి చిత్రం ఎప్పుడో తొలిగిపోయి వుండేది.

ఇప్పటికే కోట్లు పోగేసారు. పది మందిని ముంచి సంపాదించే కోట్లకన్నా పదిమందికి మంచి చేసే సంపాదనకు విలువ ఎక్కువ. నెల్లూరుజిల్లాలో వీళ్లలాగే ఇంకా కొందరు కోటీశ్వరులు వున్నారు. పదిమంది బ్రతుకుల్లో దీపాలు వెలిగించే ప్రయత్నం చేస్తున్నారేగాని, మేకపాటి వాళ్ల లాగా వెలుగుతున్న దీపాలనార్పడం లేదు. రాజకీయ ముసుగులో ప్రజాసేవకులమని ఫోజులిచ్చే వీళ్ళు ఎప్పటికి మారుతారో ఆ భగవంతుడికే తెలియాలి!

కొసమెరుపు: ఈ కేసు రాజకీయ దురు ద్దేశ్యంతో చేసిందని ఓ హాస్యాస్పదమైన ప్రకటన చేసాడు గౌతంరెడ్డి. 1999- 2004ల మధ్య కాలంలో గౌతం అసలు రాజకీయాల్లోనే లేడు. మరి ఈ కేసు అప్పటి పనికి సంబంధించిదైనప్పుడు... ఇది రాజకీయ దురుద్దేశ్యం ఎలా అవుతుందో ఆయనను ఆయనే ప్రశ్నించుకుంటే బాగుంటుందేమో!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter