empty chairఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ పోస్ట్‌ను. కమిషనర్‌గా వున్న వెంకటేశ్వర్లును గతేడాది డిసెంబర్‌లో బదిలీ చేశారు. విజయవాడ సిసిఎల్‌ఏలో పనిచేస్తున్న హరీష్‌ను కొత్త కమిషనర్‌గా వేసినా ఆయన ఇక్కడకు రావడానికి భయపడ్డారు. బాధ్యతలు తీసుకోవ డానికి వెనుకాడాడు. దీంతో అతను ఇక్కడకు రాడని తేటతెల్ల మైంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో దాదాపు మూడున్నర నెలల నుండి కమిషనర్‌ పోస్ట్‌లో ఇన్‌ఛార్జ్‌లు నడుస్తున్నారు. అలాగే జడ్పీ సిఇఓగా వున్న బి.రామిరెడ్డిపై ఏసిబి దాడి జరిగి ఆయన అరెస్ట్‌ కావడంతో ఆ పోస్ట్‌లో కూడా ఇన్‌ఛార్జే వున్నారు. అలాగే జిల్లా పంచాయితీ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ వున్నారు. జిల్లా అటవీశాఖ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ అధికారి చంద్రశేఖర్‌ కొనసాగుతున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజర్‌గాను, కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు సిఇఓగాను ఇన్‌ఛార్జ్‌లే ఉండడం విశేషం. సోమశిల ప్రాజెక్ట్‌ ఎస్‌.ఇగా 4నెలల నుండి ఇన్‌ఛార్జ్‌ వున్నారు. ఇక పిడబ్ల్యూడి ఎస్‌ఇగా వున్న కోటేశ్వరరావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఇరిగేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఇగా కూడా ఆయనే పనిచేస్తున్నారు. ఆయన రిటైర్‌ అయితే ఈ రెండుశాఖలకు ఎస్‌ఇలను నియమించాల్సి వుంటుంది. పూర్తి స్థాయి అధికారులు లేక ఆయాశాఖల్లో పనితీరు గాడి తప్పుతోంది. అధికారులను నియమించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది.

mlcsవచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుజిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలకు సీపీఎం పార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్సీలనే అభ్యర్థులుగా ప్రకటించింది. ఉపాధ్యాయ నియోజక వర్గానికి ప్రస్తుత ఎమ్మెల్సీ విఠఫు బాల సుబ్రహ్మణ్యంను, పట్టభద్రుల నియోజక వర్గానికి ప్రస్తుత ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించారు.

విఠపు బాలసుబ్రహ్మణ్యం వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు. మొదట పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన, రెండోసారి ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్‌ అవుతుంది. ఇక యండపల్లి శ్రీనివాసులురెడ్డి వరుసగా రెండోసారి అభ్యర్థిత్వం దక్కించుకున్నట్లయ్యింది. సీపీఎం అనుబంధ సంస్థ యూటిఎఫ్‌ ఈ మూడుజిల్లాల్లో బలంగా ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వామపక్ష అభ్యర్థులు సులభంగా నెగ్గుకొస్తున్నారు.

somi magunచంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరిస్తాడని, అందులో తమకు చోటుంటుందని చాలామంది నాయకులు ఆశపడుతున్నారు. బాబు నోట విస్తరణ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు 'ఆ ఒక్కటి అడక్కు' అన్న టైపులో వ్యవహరిస్తూ మిగతావన్నీ మాట్లాడుతున్నాడు.

ఈసారి విస్తరణ అంటూ జరిగితే రెడ్లకు పెద్దపీట వేస్తారని, కనీసం ఇద్దరు లేదా ముగ్గురు రెడ్లను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ కోవలో చూస్తే వైసిపి నుండి వలస వచ్చిన భూమా నాగిరెడ్డి, ఆకే అమర్‌నాథ్‌రెడ్డిలకు ప్రాధాన్యత నివ్వాల్సి వుంటుంది. వీళ్లిద్దరూ కర్నూలు, చిత్తూరు జిల్లాల

వాళ్లు. ఇక నెల్లూరుజిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి మంత్రి పదవుల రేస్‌లో వున్నారు. ప్రకాశం జిల్లా స్థానిక శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడానికి మాగుంట శీనయ్యకు మంత్రి పదవి ఆశ పెట్టారు. చంద్రబాబు ఆ హామీ ఇవ్వకుంటే ఆయన ఎమ్మెల్సీగా పోటీకి దిగేవాడు కాదు. ప్రకాశం జిల్లాలో శిద్ధా రాఘవరావు మంత్రి స్థాయిలో పని చేస్తున్నాడు. కాబట్టి అక్కడ పెద్దగా లోటు కనిపించడం లేదు.

నెల్లూరుజిల్లాకు మాత్రం మంత్రిగా పి.నారాయణ వున్నా, లేనట్లే లెక్క. ఆయన రాజధాని కట్టుబడి, భూముల లెక్కలకు సంబంధించిన మంత్రే కాని నెల్లూరుజిల్లా రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వున్నాడు. జిల్లాలో పార్టీ కేడర్‌కు అండగా నిలవడానికి, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్ల డానికి, అన్ని నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడానికి ఒక యాక్టివ్‌ మంత్రి కావాలి. నారాయణ వల్ల జిల్లాలో ప్రజలకు గాని, ఆయన వుంటున్న పార్టీకి గాని పైసా ప్రయోజనం లేదు. కాబట్టి జిల్లా నుండి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆ

పార్టీ కేడర్‌ కోరిక. జిల్లాలో ఇప్పటికే పార్టీ మునుపటి కన్నా బలహీనంగా వుంది. పార్టీని నారాయణ మీదే వదిలేస్తే ఇంకా చచ్చుబడినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పార్టీలో ఊపు,

ఉత్సాహం కోసం సోమిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అభిప్రాయం బలంగానే వుంది.

అయితే చంద్రబాబులో మంత్రి వర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనే వున్నట్లు లేదు. దీనిని కలబెడితే లేనిపోని తలనొప్పులు తలెత్తుతాయని భయపడుతున్నట్లున్నాడు. మంత్రివర్గాన్ని విస్త రించి, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుండి 'రెడ్ల'కు ప్రాధాన్యత కల్పించకుంటే ఈ జిల్లాల్లో గతంలోలాగే పార్టీ నష్ట పోవడం ఖాయం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter