rakulటాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెగ స్పీడ్‌ చూపించేస్తోంది. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేస్తూ సెన్సేషన్స్‌ సృష్టించేస్తోంది రకుల్‌. రామ్‌ చరణ్‌ తో రెండు సినిమాలు వరుసగా చేసిన తర్వాత.. మహేష్‌ బాబుతో మూవీలో నటిస్తుండడంతో.. అమ్మడికి స్టార్‌ స్టేటస్‌ వచ్చేసినట్లే అనుకున్నా రంతా. కానీ ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ఈ నెలలో విడుదల అవుతున్న విన్నర్‌ మూవీలో సాయిధరం తేజ్‌ తో నటిస్తోంది రకుల్‌. దీని తర్వాత మహేష్‌ బాబుతో చేస్తున్న సినిమా తప్ప ఈ భామ చేతిలో పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలేవిూ లేవు. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ దర్శ కత్వంలో నాగ చైతన్యతో ఓ మూవీ చేస్తోంది రకుల్‌. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీని వాస్‌కి హీరోయిన్‌ గా నటిస్తోంది ఈ భామ. ఇప్పటికే టాప్‌ లీగ్‌ లోకి ఎంటర్‌ అయిపోయిందని అనుకుంటున్న టైం లో.. స్టార్‌ హీరోలతో సినిమాలు లేక పోవడం మాత్రం రకుల్‌ కెరీర్‌ కి లోటు అనే చెప్పాలి. అర్జంటుగా ఒకరిద్దరు స్టార్స్‌ అయినా ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకోలేకపోతే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌కి జోష్‌ తగ్గినట్లే అనుకోవాల్సిందే.

sayamiసయామీ ఖేర్... ఈ పేరు టాలీవుడ్ జనాలకు పెద్దగా సుపరిచితం కాకపోయినా, రేయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ. వైవియస్ చౌదరి పరిచయం చేసిన భామ అయినప్పటికీ టాలీవుడ్ తెరపై తేలిపోయింది. కనీసం బాలీవుడ్ లోనన్నా తన అదృష్టం పరిష్కరించుకుంటుందనుకుంటే, అక్కడా అమ్మడికి నిరాశే ఎదురైంది. దీంతో ఇక చేసేదేమీ లేక అందాల ఆరబోతకు సిద్ధమైపోయింది. మొన్నామధ్య ఓ హాట్ ఫోటో షూట్ చేసి తన అందాలు ఆరబోసి, దర్శకులకు, నిర్మాతలకు తను దేనికైనా సిద్ధమేనని చెప్పకనే చెప్పేసుకుంది. ఇలియానా రేంజ్ లో తనకూ పేరొస్తుందని ఆశించిన ఈ భామకు టాాలీవుడ్ లో నిరాశే ఎదురైంది. చూద్దాం ఈ హాట్ ఫోటో షూట్ అమ్మడికి ఏ మాత్రం ఆఫర్స్ ని వెదికిపెడతాయో.

surabhiఢిల్లీ భామ అయినా.. సౌత్‌ లోనే తన లక్కు పరీక్షించుకుంటోంది సురభి. తమిళ్‌, తెలుగు సినిమాల్లో వరుసగా ఆఫర్స్‌ వస్తున్నాయ్‌ కానీ.. ఈ భామకు బ్రేక్‌ మాత్రం రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్‌ లో 4 టాలీవుడ్‌ లో 4 సినిమాలను రిలీజ్‌ చేసేసింది. వీటిలో హిట్స్‌ కూడా ఉన్నా అమ్మడికి ఉపయోగమేవిూ లేదు. తెలుగులో ఎక్స్‌ ప్రెస్‌ రాజా.. జెంటిల్మన్‌ లాంటి హిట్స్‌ పడ్డా.. అవి కెరీర్‌ కి మాత్రం ఉపయోగపడలేదు.రీసెంట్‌ గా హైద్రా బాద్‌ లో సందడి చేసింది సురభి. ఓ మొబైల్‌ తయారీ కంపెనీకి చెందిన ఫోన్లను లాంఛ్‌ చేయడానికి వచ్చింది. ఈవెంట్‌ బాగానే ఉంది కానీ.. సురభి కూడా బాగానే మెరిసింది. మరి ఛాన్సు ల సంగతేంటి అంటే మాత్రం.. ఆఫర్స్‌ ఉన్నాయిలే అంటూ కవర్‌ చేసేసింది. ఈ ఈవెంట్‌ లో అమ్మడి గెటప్‌ చూస్తే. . గ్లామర్‌ యాంగిల్‌ కి ఈ భామ ఎంత దూరమో అర్ధమవుతుంది. అయితే.. కాసింత భారీ పర్సనాలిటీ కావడంతో.. అలాంటి రోల్స్‌ కుదరవు కానీ.. మరీ నిండుగా కప్పేసుకునే హీరోయిన్లకు తెలు గు మూవీ మేకర్స్‌ అంతగా ఆఫర్స్‌ ఇవ్వ రనే సంగతి జగద్విదితమే. ఈ విషయా న్ని అర్ధం చేసుకున్న బొద్దు భామలు కా సింత సైజులు తగ్గించుకుని మరీ ఆఫర్స్‌ పట్టుకుపోతున్నారు. మరి ఈ విషయం సురభికి ఎప్పుడు అర్ధమవు తుందో!

Page 1 of 7

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • రాటుదేలిన జగన్‌
    ఆవేశం కాదు ఆలోచనతో కూడిన ప్రసంగం... అర్ధం పర్ధం లేని మాటలతో కాదు అర్ధవంతమైన వివరాలతో విమర్శలు... ఏ అంశం చర్చకు వచ్చినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం... ఏ ప్రశ్న వేసినా ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేకపోవడం... మొన్న ముగిసిన…

Newsletter