sayamiసయామీ ఖేర్... ఈ పేరు టాలీవుడ్ జనాలకు పెద్దగా సుపరిచితం కాకపోయినా, రేయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ. వైవియస్ చౌదరి పరిచయం చేసిన భామ అయినప్పటికీ టాలీవుడ్ తెరపై తేలిపోయింది. కనీసం బాలీవుడ్ లోనన్నా తన అదృష్టం పరిష్కరించుకుంటుందనుకుంటే, అక్కడా అమ్మడికి నిరాశే ఎదురైంది. దీంతో ఇక చేసేదేమీ లేక అందాల ఆరబోతకు సిద్ధమైపోయింది. మొన్నామధ్య ఓ హాట్ ఫోటో షూట్ చేసి తన అందాలు ఆరబోసి, దర్శకులకు, నిర్మాతలకు తను దేనికైనా సిద్ధమేనని చెప్పకనే చెప్పేసుకుంది. ఇలియానా రేంజ్ లో తనకూ పేరొస్తుందని ఆశించిన ఈ భామకు టాాలీవుడ్ లో నిరాశే ఎదురైంది. చూద్దాం ఈ హాట్ ఫోటో షూట్ అమ్మడికి ఏ మాత్రం ఆఫర్స్ ని వెదికిపెడతాయో.

sp swarakalaతన గంధర్వగానంతో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగిస్తున్న ప్రసిద్ధ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కీర్తికిరీటంలో మరో అనర్ఘ రత్నం వచ్చి చేరింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన 'స్వర కళా సామ్రాట్‌' బిరుదు ఆయనకు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఈ బిరుదును ప్రదానం చేసి బాలూను ఘనంగా సత్కరించారు. ఈ నెల 2వ తేదీన విఖాఖ ఉత్సవ్‌ సందర్భంగా విశాఖపట్టణంలో భారీఎత్తున జరిగిన సభలో బాలూకి ఈ ఘనకీర్తి లభిం చింది. 1966 డిసెంబర్‌ 15వ తేదీన ఆయన పాట తొలిసారిగా రికార్డింగ్‌ జరిగింది. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో 'ఏమి ఈ వింతమోహం' అనే పాటతో సినీరంగంలో నేపథ్యగాయకునిగా ఆరంగేట్రం చేసిన బాలూ, ఇప్పటిదాకా దాదాపు 50వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధు లను చేశారు. ఒకే ఒక్కరోజులో 19 తమిళ పాటలూ, 16 హిందీ పాటలూ పాడిన ఏకైక గాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగుసినీరంగంలో ఆయన పాడిన పాటలకు లెక్కే లేదు. పాడితే ఈ పాట బాలూయే పాడాలి అన్నట్లుగా ఆయన పాటలెన్నో ప్రసిద్ధి చెందాయి. శంకరాభరణం, రుద్రవీణ, సాగరసంగమం వంటి చిత్రాలకు ఆయన పాడిన పాటలు అన్నీ అద్భుతాలే. ఎన్నో చిత్రాల్లో ఆయన పాడిన మధురగీతాలు, భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు నేటికీ ప్రజలను అలరిస్తూనే వున్నాయి. తెలుగు భాష ఖ్యాతిని, తెలుగుజాతి

విఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ ఆయన ఎన్నో పాటలు పాడడమేకాక, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే ఎన్నో సంగీత కార్యక్రమాల్లో ఆయన వర్థమాన గాన కళాకారులను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటూనే వున్నారు. వీనుల విందు చేసే ఆయన గంధర్వగానం ఇప్పటికే ఆయనకెన్నో విశిష్టమైన అవార్డులూ, ఘనపురస్కారాలూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మరో ఆణిముత్యం వంటి 'స్వర కళా సామ్రాట్‌' బిరుదు లభించడం ఆయన గాన కళాకౌశలానికి నిదర్శనం. ఈ బిరుదు ప్రదానోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఈ బిరుదును ప్రదానం చేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. బాలూకి ఎవరూ పోటీ లేరని, ఆయనకు ఆయనే పోటీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. అనంతరం బాలూకి స్వర కళా సామ్రాట్‌ బిరుదుతో పాటు, అన్నమయ్య విగ్రహాన్ని, ప్రశంసాపత్రాన్ని కూడా బహుకరించి, ఘనంగా సన్మానించారు. బాలూ మాట్లాడుతూ, ఎంతో విశిష్టమైన 'స్వర కళా సామ్రాట్‌' బిరుదును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందుకోవడం తనకు మరువలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter