parliament'వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌' పేరుతో 2018లోనే దేశ వ్యాప్తంగా లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుందనే టాక్‌ నడుస్తోంది. ఉన్నట్లుండి ఎన్నికలను ప్రకటిస్తే అప్పటికప్పుడు సీట్లు వెదుక్కోవడం కష్టం. అందుకే ఆయా పార్టీల్లో వున్న నాయకులతో పాటు ఇతర పార్టీల్లో వుంటూ తటస్థంగా వున్న నాయకులు కూడా తమకు అనువైన నియోజకవర్గాల సీట్లకై పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 ఉండగా అవి 225 అవుతాయని తెలుగు దేశం నాయకులు బుకాయిస్తున్నారు. సీట్లు పెరిగితే ఆయా పార్టీల నుండి తెలుగు దేశంలోకి వచ్చిన వాళ్లందరికీ కూడా సీట్లు సర్దుబాటు చేయొచ్చని చంద్రబాబు ఆలోచన. రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయని చంద్ర బాబు చెప్పడం, ఆ పక్కరోజే పార్ల మెంటులో సీట్ల పెంపు ఇప్పట్లో కుదరదని కేంద్రమంత్రులు ప్రకటన చేస్తుండడం చూస్తున్నాం. సీట్లు పెరగకపోతే మాత్రం ప్రధాన నష్టం చంద్రబాబుకే! అక్కడ సీట్లు దొరకని నాయకులందరూ వైకాపా వైపు పరుగులు తీసే అవకాశాలున్నాయి.

ఇక పార్లమెంటు సీట్లపై అప్పుడే కర్చీఫ్‌లు వేసుకునే కార్యక్రమం మొదలైంది. గత ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దగ్గుపాటి పురంధేశ్వరి ఈసారి విజయ వాడ లోక్‌సభ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. తెలం గాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా నన్న లగడపాటి రాజగోపాల్‌ కూడా మళ్లీ ఎన్నికల్లో నిలబడే ఆలోచనలో వున్నాడు. మొదట ఆయన వైకాపా సీటునే కోరు కున్నప్పటికి, పురంధేశ్వరికి మాటివ్వ డంతో లగడపాటికి కుదరదని చెప్పారని, కాబట్టే ఆయన తెలుగుదేశం సీటు కోసం చంద్రబాబును కలిసాడని సమాచారం. అలాగే వైకాపా గుంటూరు సీటును సినీ నిర్మాత ఒకరు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన గనుక పోటీ చేస్తే ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్‌ మళ్ళీ పోటీ చేయక పోవచ్చు.

కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలకంగా పని చేసి విభజన బిల్లు ద్వారా తెరమరుగైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌, కావూరి సాంబ రావు, జె.డి.శీలం, పళ్లంరాజు, హర్ష కుమార్‌, చింతా మోహన్‌ లాంటి సీనియ ర్లందరూ కూడా రాబోయే ఎన్నికల ద్వారా టీడీపీ లేదా వైకాపాల నుండి రాజకీయ తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter