parliament'వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌' పేరుతో 2018లోనే దేశ వ్యాప్తంగా లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుందనే టాక్‌ నడుస్తోంది. ఉన్నట్లుండి ఎన్నికలను ప్రకటిస్తే అప్పటికప్పుడు సీట్లు వెదుక్కోవడం కష్టం. అందుకే ఆయా పార్టీల్లో వున్న నాయకులతో పాటు ఇతర పార్టీల్లో వుంటూ తటస్థంగా వున్న నాయకులు కూడా తమకు అనువైన నియోజకవర్గాల సీట్లకై పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 ఉండగా అవి 225 అవుతాయని తెలుగు దేశం నాయకులు బుకాయిస్తున్నారు. సీట్లు పెరిగితే ఆయా పార్టీల నుండి తెలుగు దేశంలోకి వచ్చిన వాళ్లందరికీ కూడా సీట్లు సర్దుబాటు చేయొచ్చని చంద్రబాబు ఆలోచన. రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయని చంద్ర బాబు చెప్పడం, ఆ పక్కరోజే పార్ల మెంటులో సీట్ల పెంపు ఇప్పట్లో కుదరదని కేంద్రమంత్రులు ప్రకటన చేస్తుండడం చూస్తున్నాం. సీట్లు పెరగకపోతే మాత్రం ప్రధాన నష్టం చంద్రబాబుకే! అక్కడ సీట్లు దొరకని నాయకులందరూ వైకాపా వైపు పరుగులు తీసే అవకాశాలున్నాయి.

ఇక పార్లమెంటు సీట్లపై అప్పుడే కర్చీఫ్‌లు వేసుకునే కార్యక్రమం మొదలైంది. గత ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దగ్గుపాటి పురంధేశ్వరి ఈసారి విజయ వాడ లోక్‌సభ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. తెలం గాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా నన్న లగడపాటి రాజగోపాల్‌ కూడా మళ్లీ ఎన్నికల్లో నిలబడే ఆలోచనలో వున్నాడు. మొదట ఆయన వైకాపా సీటునే కోరు కున్నప్పటికి, పురంధేశ్వరికి మాటివ్వ డంతో లగడపాటికి కుదరదని చెప్పారని, కాబట్టే ఆయన తెలుగుదేశం సీటు కోసం చంద్రబాబును కలిసాడని సమాచారం. అలాగే వైకాపా గుంటూరు సీటును సినీ నిర్మాత ఒకరు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన గనుక పోటీ చేస్తే ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్‌ మళ్ళీ పోటీ చేయక పోవచ్చు.

కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలకంగా పని చేసి విభజన బిల్లు ద్వారా తెరమరుగైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌, కావూరి సాంబ రావు, జె.డి.శీలం, పళ్లంరాజు, హర్ష కుమార్‌, చింతా మోహన్‌ లాంటి సీనియ ర్లందరూ కూడా రాబోయే ఎన్నికల ద్వారా టీడీపీ లేదా వైకాపాల నుండి రాజకీయ తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

adala beedaఎక్కడైనా మామే కాని వంగతోట కాడ మామ కాదు అనే సామెత వుంది. ఇది రాజకీయాలకు కూడా వర్తి స్తుంది. ఇంట, బయటా గురుశిష్యులు, అన్నదమ్ముల అనుబంధాలుంటాయిగాని, రాజకీయాలలో మాత్రం అలాంటి బంధాలకు తావులేదు. పదవుల విషయం వచ్చేసరికి అన్నదమ్ములే విరోధులవుతారు. మిత్రులే శత్రువులవుతారు. ఇప్పుడు ఇలాంటి సీనే జిల్లా తెలుగు దేశంలోనూ చోటు చేసుకోబోతోంది.

రాష్ట్రంలో రాజ్యసభ రేస్‌ మొదలైంది. వచ్చే నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఏపిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పు డున్న ఎమ్మెల్యేల స్కోర్‌ను లెక్కలోకి తీసు కుంటే తెలుగుదేశంకు మూడు, వైకాపాకు ఒకటి రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. తెలుగుదేశంకు వచ్చే మూడింటిలో ఒక దాని కోసం మాత్రం మన జిల్లా నాయ కులు ట్రై చేసుకుంటున్నారు. వీరిద్దరూ గురుశిష్యులే! మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే, రాజధాని నిర్మాణ కమిటి సభ్యులు బీద మస్తాన్‌ రావులు రాజ్యసభ ప్రయత్నాలలో ఉన్నారు. బి.సి సామాజికవర్గం నుండి తనకు అవకాశం కల్పించాలని బీద మస్తాన్‌రావు కోరుతున్నాడు. 1999 నుండి పార్టీలో వుంటూ ఆర్ధికంగా ఎంతో ఖర్చు పెట్టు కున్నాడు. ఓడినా గెలిచినా పార్టీలోనే వున్నాడు. అయితే ఇటీవలే ఆయన సోదరుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి మళ్లీ అదే ఇంట్లో రాజ్యసభ ఎలా ఇస్తారనే సందేహం కూడా వుంది. అయితే రవిచంద్రకు ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడే ఈ సాకుతో తన రాజ్యసభ ఆశలను నీరుగార్చొద్దని అధిష్టానానికి మస్తాన్‌రావు గట్టిగా చెప్పాడని తెలు స్తోంది. అదీగాక బీద సోదరుల పట్ల చంద్రబాబుకు సానుకూల దృక్పథం వుంది. అందుకని నెల్లూరుజిల్లా నుండి అవకాశం ఉంటే అది బీదకే వుండొచ్చని సమాచారం. ఎందుకంటే రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ జిల్లా నుండి రెడ్డి వర్గానికి చోటు ఇవ్వొచ్చు. కాబట్టి రాజ్య సభను అదే వర్గం వారికి ఇవ్వడని టాక్‌!

కాని రాజ్యసభపై ఆదాల గట్టి పట్టు దలతో ఉన్నాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి కేవలం 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆరోజు నెల్లూరు రూరల్‌ బీజేపీకి ఇవ్వకున్నా, ఆత్మకూరులో గట్టి అభ్యర్థిని పెట్టున్నా ఆదాల బయటపడుండేవాడు. పార్టీ అధి ష్టానం అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లకు ఆదాల బలయ్యాడు. కాబట్టి తనకు న్యాయం చేయాలన్నది ఆయన డిమాండ్‌. నెల్లూరుజిల్లాకు అవకాశమిస్తే రాజ్యసభను తనకివ్వాలని కోరుతున్నాడు. ఈమధ్య పార్టీ కార్యక్రమాలలో కూడా చురుకుగానే వుంటున్నాడు. నెల్లూరు పార్ల మెంటు మరియు నెల్లూరు గ్రామీణ నియో జకవర్గం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ... వైకాపా నాయకులను ఎక్కువ సంఖ్యలో తెలుగుదేశంలో చేర్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఇటీవల కాంగ్రెస్‌ నుండి తెలుగు దేశంలోకొచ్చిన వారికి చంద్ర బాబు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. కాబట్టి ఆ కోటాలో ఏమన్నా ఆదాలకు ఛాన్స్‌ తగిలినా తగలొచ్చు.

adala mekaఇంత జగన్ గాలిలో కూడా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎవరన్నా ఓడిపోయారంటే అంతకంటే నిష్ట దరిద్రుడు ఇంకొకరు ఉండరు. నెల్లూరు లోక్ సభ పరిధిలో ఓటింగ్ సరళిని చూస్తే వైకాపా అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి వుందనిపిస్తుంది.

నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి నియోజకవర్గాలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో ఒక ఓటు ఆదాల, ఒక ఓటు జగన్ కు అనే ప్రచారం ఎక్కువుగా సాగింది. నెల్లూరురూరల్ సీటును బీజేపీకి ఇవ్వడంతో తెలుగుదేశం లోక్ సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేసుకున్నాడు. రూరల్ పరిధిలోని గ్రామాల్లో కూడా అసెంబ్లీ ఓటు జగన్కు, పార్లమెంటు ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వేసిన వాతావరణ కనిపించింది.

సిటింగ్ ఎంపీగా మేకపాటి పై వున్న వ్యతిరేకత ప్రభావం చూపింది. అదే సమయంలో యువకులు, విద్యావంతులపై కొంత మోడీ ప్రభావం పనిచేసి పార్లమెంటు ఓట్లు మాత్రం ఆదాలకే వేసారు. వైసిపికి భారీ మెజార్టీ రావచ్చనుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా లోక్ సభకు మాత్రం అంత మెజార్టీ రాదనేది అంచనా. నెల్లూరు రూరల్, నగర్, కోవూరు, కావలి, కందుకూరు నియోజకవర్గాలలో క్రాస్ ఓటింగ్ లక్షకు దాటితే మాత్రం మేకపాటి గెలుపు డౌటే. పైకి కనిపించినంతగా లేకపోతే కొద్ది మెజార్టీతోనైనా బయటపడే అవకాశముంది.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…

Newsletter