narayanaరాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నెల్లూరోడు... నెల్లూరు నగ రాన్ని అన్నింటా ముందు నిలపాలను కుంటున్నాడు. నగరంలో ఏ పని చేయా లన్నా సమర్ధుడైన అధికారులుండాలి. వారిచేత పనిచేయించుకోవాలి. అవినీతి అధికారులను ఆరు నెలలకు కాదు, ఆరురోజులకే బదిలీ చేసినా ఇబ్బంది లేదు. కాని నిజాయితీగా, నిఖార్సుగా పనిచేసు కుంటున్న వారిని చీటికి మాటికి బదిలీ చేసుకుంటూ పోతేనే చేసే పనుల్లో గందర గోళం నెలకొంటుంది.

నెల్లూరు నగరం అసలే గందరగో ళంగా వుంది. ఎక్కడ చూసినా ఆక్రమ ణలు... ఇరుకు రోడ్లు... విపరీతమైన ట్రాఫిక్‌... పందులు, దోమలతో నరక యాతన. భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ల పనులతో ధ్వంసమైన రోడ్లతో ఇక్కట్లు. అధ్వాన్నపు పారిశుద్ధ్యం... కొండలా పేరుకుపోయిన పన్ను బకా యిలు... ఒక ఆఫీసర్‌కు వీటి మీద అవ గాహన రావాలన్నా, వీటిని పరిష్కరించే మార్గాలు దొరకాలన్నా కొంత సమయం పడుతుంది. వచ్చిన ఆఫీసర్లు కరెక్ట్‌గా రూటు తెలుసుకుని పని మొదలుపెట్టీ పెట్టగానే బదిలీ చేసి పడేస్తున్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్‌ మళ్ళీ వీటన్నింటిని కనుక్కుని పని మొదలుపెట్టేసరికి ఇంకొంత సమయం పడుతుంది.

అసలు మూడున్నరేళ్ల కాలంలో ఆరు మంది కమిషనర్లను మార్చడం ఏమిటి? ఎక్కడ లోపం వుంది? మున్సిపల్‌ మం త్రిగా నారాయణకే ఇది సవాల్‌. తన సొంత కార్పొరేషన్‌లో గట్టి కమిషనర్‌ను వేసుకుని నిలబెట్టుకోలేని మంత్రి ఇతర మున్సిపాల్టీలను ఎలా అభివృద్ధి చేయగల డన్న ప్రశ్న వస్తుంది. అసలు కమిషనర్లను ఎందుకు బదిలీ చేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. కమిషనర్‌గా ఢిల్లీరావు బాగానే పనిచేస్తున్నాడు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌పై శ్రద్ధ పెట్టాడు. పార్కులు అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిచ్చి పని చేస్తు న్నాడు. మున్సిపల్‌ మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేయిస్తున్నాడు. కార్పొరేషన్‌లో ఎంతో కాలం నుండి జరుగుతున్న అక్రమాలకు కళ్ళెం వేసాడు. నెల్లూరు నగరాన్ని అందంగా కనిపించేలా చేయాలనే ఉద్దేశ్యంతో పలు ప్రాంతాలలో గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు వేయించారు. కమిషనర్‌గా ఆయన పనిలో వేగం పెంచే సమయంలో బదిలీ వేటు వేసారు. మున్సిపల్‌ మంత్రి ఇలాకాలోనే ఇలా ఉత్తి పుణ్యానికి కమిషనర్లను మార్చుకుంటూ పోతే మున్సిపల్‌ మంత్రికే చెడ్డపేరొస్తుంది. అధికార వర్గాలలో కూడా నెల్లూరు కార్పొరేషన్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.

nar azizనెల్లూరుజిల్లాలో పనిచేసే అవకాశం వస్తే ఉద్యోగులు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థలో పని చేయాలంటే మాత్రం బెదిరిపోతు న్నారు. పాడేరు ఫారెస్ట్‌కైనా వెళతామం టున్నారు గాని, నెల్లూరు కార్పొరేషన్‌కు వస్తామని మాత్రం చెప్పడం లేదు. నెల్లూరు కార్పొరేషన్‌లో సామాన్య ప్రజలకే కాదు, అధికారులకు సైతం సతాయింపులెక్కు వయ్యాయి. ఎవరి మాట వినాలో తెలి యక, ఎవరి ఆదేశాలను పాటించాలో అర్ధంకాక, ఎవరి మాట వింటే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌లో నాకు తెలియ కుండా ఏమీ జరగడానికి వీల్లేదని మున్సి పల్‌ మంత్రిగా పి.నారాయణ ఇంతకు ముందే హుకుం జారీ చేసి వున్నాడు. నెల్లూరు కార్పొరేషన్‌లో నాయకుడికొక వర్గం వుంది. అజీజ్‌ వర్గం, ఆనం వర్గం, అనిల్‌ వర్గం, ఆదాల వర్గం, సోమిరెడ్డి వర్గం, కోటంరెడ్డి వర్గం... ఇక్కడ పార్టీల ప్రసక్తి లేదు... అంతా వర్గాలమయమే! ఒకరితో ఒకరికి పడదు. అధికారపార్టీలోని అజీజ్‌, ఆనం వర్గాలే ఇటీవల పెద్దఎత్తున కుమ్ములాడుకుని పత్రికలకెక్కాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ జోక్యం చేసుకుని నెల్లూరు కార్పొరేషన్‌లో ''ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగ బోతోంది... నాకు తెలియాలి'' అంటూ ఆర్డర్‌ వేశాడు. శానిటేషన్‌ సిబ్బందిని మేయర్‌ తన ఇష్టానుసారంగా బదిలీ చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో మంత్రి మీద మేయర్‌కు అసహనం మొదలైంది. అదీగాక నెల్లూరులో భూగర్భడ్రైనేజీ, మంచి నీళ్ళకు సంబంధించిన 11వందల కోట్లు హడ్కో నిధుల టెండర్లు కూడా మేయర్‌తో పని లేకుండానే మంత్రుల స్థాయిలో జరిగి పోయాయి. దీంతో ఆల్‌రెడీ ఎసిడిటితో బాధపడుతున్నోడికి పచ్చి మిరపకాయ బజ్జీ తినిపించినట్లయ్యింది అజీజ్‌ పరిస్థితి. ఈ దశలో అతను మంత్రి నారాయణతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. ఇటీవల విజయవాడలో తెలుగుదేశం యువరాజు లోకేష్‌ను కలిసి నెల్లూరు కార్పొరేషన్‌లో తనను ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెడు తున్నది చెప్పుకున్నాడు. తన వెనుక 40వేల మైనార్టీల ఓట్లున్నాయని లోకేష్‌ను నమ్మిం చాడు. ఆయన భరోసాతోనే ఇప్పుడు మంత్రి నారాయణను లెక్కచేయడం లేదు. నెల్లూరు కార్పొరేషన్‌లో ఇక నుండి నాకు తెలియకుండా ఏదీ జరగకూడదు, మంత్రి చెప్పినా సరే.. నా ఆమోదం కానిదే చీమ కూడా కదలకూడదు అనే తరహాలో ఆజ్ఞలు చేశారు.

దీంతో అధికారులు మేయర్‌, ఇతర నాయకుల మధ్య రెండు చెక్కల మధ్య అప్పడంలా నలిగిపోతున్నారు.

tensionపంచాయితీరాజ్ ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా మే 7వ తేదీ తర్వాతే ప్రకటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో అభ్యర్థులు కుదేలయ్యారు. మే 7 దాకా వీళిలక టెన్షన్ తో నిద్రలేని రాత్రిళ్లు గడపక తప్పేటట్లు లేదు. ఫలితాలు ఇప్పుడు ప్రకటించకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించే దానికి ఈ ఎన్నికలను అప్పుడే పెట్టేసుంటే పోలేదా అని పోటీలో వున్న అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు.

న్యాయమూర్తులకు ప్రాక్టికల్ సమస్యలు తెలియవు. వాళ్ల దృష్టి కోణం అంతా రాజ్యాంగ పరిధిలోనే ఉంటుంది. పోటీలో వున్న అభ్యర్థి డిపాజిట్ ధరావత్తు చెల్లించి ఉఁడడంతో పాటు ఎన్నికల కమీషన్ పరిమితి విధించిన లక్షో, రెండులక్షలో ఖర్చుపెట్టి ఉంటారనే లెక్కలో ఉఁటారు. కాని ఇక్కడ లెక్కలు వేరేవిధంగా ఉంటాయి. అధికార ఖర్చు లక్ష అయితే అనధికార ఖర్చు కోట్లలో ఉంటుంది. కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు టెన్షన్ తో ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. ఒక్రటెండురోజులు టెన్షన్ భరించాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది స్థానికసంస్థల అభ్యర్థులు మరో నెలరోజులు టెన్షన్తో గడపాలి.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter