muvvaఒక్కొక్కరికి ఒక్కో సహజ లక్షణం ఉం టుంది. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు పనిష్‌ మెంట్లు ఇచ్చినా ఆ సహజలక్షణాన్ని మార్చు కోలేరు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు కదా... ఈ సహజ లక్షణాలు కూడా అటువంటివే!

మువ్వా రామలింగం... ఈ పేరు వినగానే జిల్లాలో ఎవరికైనా గుర్తొచ్చేది వివాదాలు, అక్రమాలు. ఎక్కడ పనిచేస్తున్నా, లేదా ఎక్కడకి బదిలీపై వెళ్తున్నా ఆయన వివాదాలను చంకలో పెట్టుకుని పోతుంటాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా వుంటూ పలు ఆరోపణలకు గురైన మువ్వాను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. అయితే ఆయన జిల్లాలోనే వుండాలని చెప్పి పైరవీలు చేసి బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ తెచ్చుకుని గత ఏడాది నవంబర్‌ 1న బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే మళ్ళీ అక్కడ వివాదాలకు ఆజ్యం పోశాడు. మువ్వా చర్యలపై ఆగ్రహించిన అక్కడి సిబ్బంది, బిఇడి ట్రైనింగ్‌ విద్యార్థులు, పాఠశాలల విద్యాశాఖ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల నెల్లూరుకొచ్చిన విద్యాశాఖ కమిషనర్‌ సంథ్యారాణి కూడా బి.ఇడి కళాశాల గొడవలపై కలెక్టర్‌ను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాలతో తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ శ్రీమతి ప్రశాంతి బి.ఇడి కళాశాలలో ఏం జరిగిందనే దానిపై విచారించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే మువ్వా రామలింగంను బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బి.ఇడి కళాశాలకు ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌గా డి.ఇ.ఓ శ్యామ్యూల్‌ను నియమించారు.

తన ఉద్యోగ జీవితంలో మువ్వా రామలింగం వివాదాలు లేకుండా పని చేసిన దాఖలాలు లేవు. 1997 ప్రాంతంలో జిల్లా డిప్యూటి డి.ఇ.ఓగా పని చేశాడు. అప్పుడంతా వివాదాలు, అయ్యవార్లతో విభేదాలమయమే. ఆ తర్వాత గుంటూరు, కర్నూలు, ఒంగోలులలో డి.ఇ.ఓగా పని చేసినా గొడవలు, ఏసిబి కేసులు. నెల్లూరుకు వచ్చాక కూడా అదే వివాదాలు... ఇతను మారడంతే!

muvvaనెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి చెబుతారు. అట్లాగే మువ్వా రామలింగంకు కూడా పనిచేసిన ప్రతిచోటా ఒక ట్రాక్‌రికార్డు వుంది. ఏ జిల్లాలో పనిచేసినా వివాదాలే... అవినీతి ఆరోపణలే! అంతెందుకు పదిహేనేళ్ల క్రితమే నెల్లూరులో డిప్యూటీ డిఇఓగా పనిచేశాడు. అప్పుడే కుప్పలకొద్దీ ఆరోపణ లొచ్చాయి. టీచర్ల పట్ల వేధింపులకు పాల్పడేవాడనే పేరొచ్చింది. డిప్యూటీ డిఇఓగా అతనిని భరించి ఉండబట్టే రెండేళ్ల క్రితం అతను నెల్లూరుకు డిఇఓగా వస్తున్నాడంటే జిల్లాలోని టీచర్లందరూ హడలిపోయారు. కాని, ఎవరు ఎన్ని విధాలుగా ఆందోళనలు చేసినా మువ్వా రామలింగం చదువుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును పట్టాడు. గంటా మొదటిసారి నెల్లూరుజిల్లా పర్యటనకు వచ్చినప్పుడు 'మీ అభిమాని' అనే పేరుతో జిల్లా అంతటా ఆయనకు స్వాగతం పలుకుతూ భారీఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. అవన్నీ కూడా మువ్వా రామలింగం సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించినవేనని ఆ తర్వాత తెలిసింది. అలా గంటాకు గంటకొట్టి మువ్వా ఈ జిల్లాకు డిఇఓగా వచ్చాడు. ఒక అధికారి ట్రాక్‌రికార్డు బ్యాడ్‌గా వుందని తెలిసినా, అతనిని డిఇఓగా వేయొద్దని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసినా విద్యాశాఖమంత్రి అతనినే డిఇఓగా వేశాడు. దాని ఫలితంగా జిల్లా విద్యాశాఖలో జరగాల్సిన కంపు అంతా జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ తప్పు మువ్వాదే కాదు, అతని చేతికి తాళాలు ఇచ్చిన మంత్రి గంటాది కూడా!

muvvaఎక్కడ పనిచేస్తున్నా వివాదాలను తన కేరాఫ్‌ అడ్రస్‌గా మలచుకున్న మువ్వా రామలింగం మళ్ళీ నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చాడు. పైస్థాయిలో పైరవీలు జరిపి, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో పట్టుబట్టి మళ్ళీ ఆయన ఈ జిల్లాకే రాగలిగాడు. ఎక్కడున్నా విద్యాశాఖను భ్రష్టు పట్టిం చడంలో మువ్వా రామలింగంకు ప్రత్యేక మైన పేరుంది. పదిహేనేళ్ల క్రితమే ఆయన ఇక్కడ డిప్యూటీ డిఇఓగా పనిచేస్తూ ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. సంతపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌నే కార్యాలయంగా మార్చుకుని ఎన్నో అక్రమా లకు తెరతీశాడు. ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు జరిపాయి. డిఇఓగా పదో న్నతి పొందిన తర్వాత చిత్తూరుజిల్లాలో డిఇఓగా పని చేశాడు. ఈయన అక్రమాల దెబ్బకు అక్కడ జడ్పీ పాలకవర్గ సభ్యులు ఇతని మీద జడ్పీ సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం పెట్టించి బదిలీ చేయించారు. ఆ తర్వాత 2007లో గుంటూరు డిఇ ఓగా, 2008లో కర్నూలు డిఇఓగా పని చేశాడు. గుంటూరులో లంచం తీసు కుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు. కర్నూలు లోనూ ఉపాధ్యాయ సంఘాలతో గొడవలు పడ్డాడు. కొంతకాలం ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2011 జూన్‌లో నెల్లూరు డిఇఓగా వచ్చాడు. 2014 ఏప్రిల్‌ దాకా పని చేశాడు. ఈమధ్య కాలంలో ఉపా ధ్యాయులకు, ఉపాధ్యా సంఘాలకు చుక్కలు చూపించాడు. రామలింగం ఇక్కడున్నంతకాలం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక ఉపాధ్యాయ సంఘం ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన జరిపింది. ఈయన అక్రమాలపై విచారణ జరిపించి అప్పటి కలెక్టర్‌ శ్రీకాంత్‌ ఇతనిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఏడాది పాటు సస్పెన్షన్‌లో వున్న రామలింగం ఆ తర్వాత ప్రకాశం డిఇఓగా పోస్టింగ్‌ తెచ్చు కున్నాడు. ఆ తర్వాత అక్కడా గొడవపడి మున్సిపల్‌ స్కూల్స్‌, ఐఐటి ఫౌండేషన్‌ కోర్సు ఏఓగా బదిలీ అయ్యాడు. గత కొంత కాలంగా ఆయన తిరిగి నెల్లూరుకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా గంటా నెల్లూరు జిల్లాకు తొలి సారి వచ్చినప్పుడు 'మీ మిత్రుడు' పేరుతో జిల్లాలో ఆయనకు భారీఎత్తున స్వాగతం ఫ్లెక్సీలు పెట్టించింది కూడా మువ్వా రామలింగమేనని సమా చారం. జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు, ఆఖరకు జిల్లా తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా గంటా ఆశీ స్సులతో మువ్వా రామలింగం నెల్లూరుకు రావాలన్న పంతం నెగ్గించుకున్నాడు. కాకపోతే జిల్లాలోని ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకే ఇక మనశ్శాంతి ఉండదు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter