rail kuthaఇప్పుడు నలభై ఐదేళ్ల వయసులో వున్నోళ్ళు వారి చిన్నప్పటి నుండి ఒక మాట వింటూనే వుండుంటారు. అదే వెంకటగిరి-నడికుడి మధ్య రైల్వేలైన్‌ వస్తుందని, మన రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరుల మీదుగా రైలు పోతుందని. అప్పటి నుండి వింటున్నాం... ఇప్పుడూ వింటున్నాం... ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా ఇదే మాటను వింటుంటాం...

ఈ రైల్వేలైన్‌కు వాస్తుదోషమో ఇంకేదన్నా లోపమో గాని ఒకడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేస్తుంది. గతంలో యూపిఏ ప్రభుత్వమైనా, నేటి ఎన్డీఏ ప్రభుత్వమైనా ఈ రైల్వేలైన్‌పై సవతి ప్రేమనే చూపిస్తున్నాయి తప్పితే పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చూపడం లేదు. ఈ రైల్వేలైన్‌ను సర్వేలకు పరిమితం చేయడం, అరకొర నిధులు విదిల్చడం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనూ ఈ లైన్‌కు కేవలం 420కోట్ల నిధులే మంజూరు చేయడాన్ని చూస్తుంటే ఇప్పటిప్పట్లో ఇది పూర్తి కావడం అసాధ్యమనిపిస్తోంది.

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దాదాపు 30మండలాల ప్రజలకు ఈ రైల్వేలైన్‌

ఉపయోగపడుతుంది. ఈ మూడు జిల్లాల్లో మెట్టప్రాంతాల నుండి హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి నగరాలకు ప్రయాణ అనుసంధానం ఏర్పడుతుంది. తుఫాన్‌లు, వరదల సమయంలో చెన్నై-విజయవాడ రైల్వేలైన్‌ దెబ్బతిని రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ రైల్వేలైన్‌ ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఎంతో బాగా పనికొస్తుంది. వ్యాపార, వాణిజ్య, ప్రయాణీకుల ఆదాయ పరంగా కూడా ఈ రైల్వేలైన్‌కు చక్కని అవకాశాలున్నాయని సర్వేలలోనూ తేలింది. మరి ఇంతటి ఉపయోగమున్న, ప్రాధాన్యత కలిగిన రైల్వేలైన్‌ను కేంద్రం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నట్లు?

railశ్రీకాళహస్తి - నడికుడి రైల్వేలైన్‌... మూడు దశాబ్దాల కల. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో దీని గురించిన ప్రస్తావన రావడం, ఈ లైనును సర్వేలకే పరిమితం చేయడం పరిపాటిగా మారిపో యింది. ఈ లైన్‌ గురించి ఇప్పటికి ఎన్ని సర్వేలు చేసారో లెక్కేలేదు. ప్రతి ఏటా దీనికి సంబంధించిన అంచనా వ్యయం పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడం, కీలకమైన రైల్వేశాఖ పదవి ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉండడం,

వాళ్లు రైల్వేబడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించకపోవడం వల్ల ఈ రైల్వేలైన్‌ ఇంతకాలం మరుగునపడిపోయింది.

మెట్టప్రాంతపు రైలు మార్గం ఇది. చిత్తూరుజిల్లాలో పాక్షి కంగా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చాలా ఎక్కువ ప్రాంతాల్ని కవర్‌ చేసే లైన్‌ ఇది. ప్రయాణీకులకే కాదు, సరుకు రవాణాకు కూడా ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా తుఫాన్‌ల సీజన్‌లో చెన్నై - విజయవాడల మధ్య రైల్వే లైన్‌ దెబ్బతింటుంది. ఈ సమయంలో శ్రీకాళహస్తి-నడికుడి లైన్‌ ప్రత్యా మ్నాయంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది.

ఇంతటి ప్రాధాన్యత గల లైన్‌ విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. రైల్వేలైన్‌ కోసం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో వెంకటగిరి, డక్కిలి, రాపూరు, పొదలకూరు, చేజర్ల, ఆత్మకూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాల పరిధిలో ఈ రైల్వేలైన్‌ కోసం భూసేకరణ మార్కింగ్‌ జరుగుతోంది. త్వరలో రైల్వేలైన్‌ నిర్మాణానికి టెండర్లు పిలువ వచ్చునని సమాచారం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter