rail kuthaఇప్పుడు నలభై ఐదేళ్ల వయసులో వున్నోళ్ళు వారి చిన్నప్పటి నుండి ఒక మాట వింటూనే వుండుంటారు. అదే వెంకటగిరి-నడికుడి మధ్య రైల్వేలైన్‌ వస్తుందని, మన రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరుల మీదుగా రైలు పోతుందని. అప్పటి నుండి వింటున్నాం... ఇప్పుడూ వింటున్నాం... ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా ఇదే మాటను వింటుంటాం...

ఈ రైల్వేలైన్‌కు వాస్తుదోషమో ఇంకేదన్నా లోపమో గాని ఒకడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేస్తుంది. గతంలో యూపిఏ ప్రభుత్వమైనా, నేటి ఎన్డీఏ ప్రభుత్వమైనా ఈ రైల్వేలైన్‌పై సవతి ప్రేమనే చూపిస్తున్నాయి తప్పితే పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చూపడం లేదు. ఈ రైల్వేలైన్‌ను సర్వేలకు పరిమితం చేయడం, అరకొర నిధులు విదిల్చడం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనూ ఈ లైన్‌కు కేవలం 420కోట్ల నిధులే మంజూరు చేయడాన్ని చూస్తుంటే ఇప్పటిప్పట్లో ఇది పూర్తి కావడం అసాధ్యమనిపిస్తోంది.

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దాదాపు 30మండలాల ప్రజలకు ఈ రైల్వేలైన్‌

ఉపయోగపడుతుంది. ఈ మూడు జిల్లాల్లో మెట్టప్రాంతాల నుండి హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి నగరాలకు ప్రయాణ అనుసంధానం ఏర్పడుతుంది. తుఫాన్‌లు, వరదల సమయంలో చెన్నై-విజయవాడ రైల్వేలైన్‌ దెబ్బతిని రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ రైల్వేలైన్‌ ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఎంతో బాగా పనికొస్తుంది. వ్యాపార, వాణిజ్య, ప్రయాణీకుల ఆదాయ పరంగా కూడా ఈ రైల్వేలైన్‌కు చక్కని అవకాశాలున్నాయని సర్వేలలోనూ తేలింది. మరి ఇంతటి ఉపయోగమున్న, ప్రాధాన్యత కలిగిన రైల్వేలైన్‌ను కేంద్రం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నట్లు?

railway lineమెట్ట ప్రాంతానికి వరంగా మారిన శ్రీకాళహస్తి - నడికుడి రైల్వేలైన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, చేజర్ల, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో రైల్వే అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా భూసేకరణకు ముమ్మరంగా సర్వే నిర్వహించారు. త్వరలోనే ఈ లైన్‌ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణానికి నెల్లూరుజిల్లాలో రెండువేల ఎకరాల భూములను సేకరిస్తున్నట్లు నెల్లూరుజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. వింజమూరు మండలంలోని కాటేపల్లి రైల్వేలైన్‌కు సర్వే చేసిన భూములను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం వింజమూరులోని ఆర్‌ అండ్‌ బి బంగ్లాలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 11మండలాల ద్వారా రైల్వేలైను వెళుతుందన్నారు. అయిదు మండలాల్లో సర్వే పూర్తయిందన్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. మండలంలో 378ఎకరాల భూమి సేకరించాల్సి వుండగా 62.38ఎకరాల పట్టాభూములని, మిగిలినవి ప్రభుత్వ భూములన్నారు. వింజమూరు, చంద్రపడియ సరిహద్దుల్లో వింజమూరు రైల్వేస్టేషన్‌, రావిపాడు, గోళ్లవారిపాలెం వద్ద మరో రెండు స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. రైల్వేశాఖ బృందం త్వరలో కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు. రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రాంతంలో 150మీటర్లు, మిగిలిన చోట్ల 50-55మీటర్లు భూమి సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ వెంకటరమణ, తహశీల్దార్‌ శ్రీరాములు, ఆర్‌ఐ మల్లిఖార్జున, సర్వేయర్‌ మస్తాన్‌బాషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter