chandraఅసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో ఉండగానే ప్రధానిని జగన్‌ కలిసాడన్న వార్త చెవిన పడింది. అక్కడే మనశ్శాంతిగా ఉండలేకపోయాడు. అమెరికా నుండి నేరుగా వచ్చి ఢిల్లీలో దిగగానే తన వెంటవున్న వారిని హైదరాబాద్‌ పంపించేసాడు. తాను మాత్రం ఏడు గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా గడిపాడు. జగన్‌ ప్రధానిని ఎందుకు కలిసాడు, ఏం చెప్పాడు, అసలు అర్ధాంతరంగా జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటన్నది తెలుసుకోవడం కోసమే ఆయన ఆ కొన్ని గంటలు అజ్ఞాతంలో గడిపినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు చంద్రబాబుకు ఢిల్లీలో కూడా గట్టి నాయకుడనే పేరుండేది. 1996లో 13రోజుల ప్రధాని వాజ్‌పేయిని దించేసి యూనైటెడ్‌ ఫ్రంట్‌ కూటమిని కట్టించింది చంద్రబాబే! ఆ తర్వాత 1998, 1999లలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వాల లోనూ కీలక భాగస్వామిగా వున్నాడు. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని జైలులో పెట్టాలంటూ నినదించిన ధైర్యశాలి. గత చరిత్రను చూస్తే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ట్రాక్‌ రికార్డు బాగానే వుంది. అంత పలుకుబడి కలిగిన నాయకుడు జగన్‌ ప్రధానిని కలిసాడని తెలియగానే చలి జ్వరం వచ్చినట్లు వణికిపోయాడు. రాజకీయాలలో ప్రధానిగా వున్నవారిని ఏ పార్టీ నేత అయినా కలవవచ్చనే పద్ధతిని మరచి, జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని మాట్లాడారు. జగన్‌కు అపా యింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన పిఎంఓ కార్యా లయాన్నీ చంద్రబాబు ప్రశ్నించినట్లయ్యింది.

అయినా జగన్‌కు మోడీ అపాయింట్‌ మెంట్‌ ఇస్తే చంద్రబాబు ఇంతగా ఆక్రోశం చెందాల్సిన అవసరం ఏముంది? తను ఏదో అభద్రతాభావంతో ఉండబట్టే ఇలా నోరు పారేసుకుంటున్నాడు. ఏపిలో జరిగిన, జరుగుతున్న అక్రమాలను మోడీకి జగన్‌ చెవిలో వూదాడనే కోపంతోనే ఆయన ఈ అరుపులు అరుస్తున్నాడు.

వాస్తవంలోకి వస్తే చంద్రబాబు అంటే మోడీకి ఏమంత నమ్మకం, గౌరవం లేదు. అవసరాన్ని బట్టి చంద్రబాబు రాజకీయ రంగులు మారుతాయని తెలుసుకోలేనంత అమాయకుడు కాడు మోడీ! ఈరోజు తమతో అవసరం వుంది కాబట్టి అణిగి మణిగి వుంటున్నాడు. రేపు బీజేపీకి రెండు చోట్ల పరాభవాలు ఎదురై, మోడీ క్రేజ్‌ తగ్గిందంటే ఇదే చంద్రబాబు దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కలిపి తృతీయ ఫ్రంట్‌ అనే టెంట్‌ను వేస్తాడు. రాజకీయ స్నేహానికి చంద్రబాబు నమ్మ కస్తుడు కాడు. కాని ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీనే ఎదిరించి, 16నెలలు జైలులో గడిపిన జగన్‌ను రాజకీయంగా నమ్మొచ్చు. అదీగాక జగన్‌కు రాష్ట్రం తప్పితే జాతీయ రాజకీయాల మీద ఆశ, ఆసక్తి ఉండదు. కాబట్టే బీజేపీలో జగన్‌ పట్ల సానుకూల ధోరణి కనిపిస్తోంది.

బీజేపీకి జగన్‌ జత కలిస్తే రాష్ట్రంలో తనకు చుక్కలు చూపిస్తారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ముఖ్యంగా 'ఓటు-నోటు' కేసు బాబు మెడ మీద కత్తిలా వేలాడుతోంది. ఈ కేసును ముందుకు సాగనీయకుండా ఇప్పటివరకు కేంద్రమే ఆదుకుంటోంది. ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌ రికార్డర్‌ కూడా పక్కా సాక్ష్యంగా వుంది. ఇక అమరావతి రాజధాని భూముల సేకరణ దగ్గర్నుండి, పుష్కరాలకు వేలకోట్లు తగలేయడం, పోలవరం పూర్త యితే పనికిరాని పట్టిసీమ, పురుషోత్తమ పట్నం వంటి ప్రాజెక్ట్‌లు కేవలం డబ్బు కోసం చేపట్టినవేననే విషయం తెలియంది కాదు. ఏ రాష్ట్రంలోనైనా మోడీ తాను కాలు పెట్టాలనుకుంటున్నప్పుడు అక్కడ ముందుగా సిబిఐ దాడులు జరగడం చూస్తున్నాం. ప్రస్తుతం మోడీ ఏపిని టార్గెట్‌ చేసాడు. ఇక్కడ బీజేపీకి జగన్‌ లక్ష్యం కాదు. చంద్రబాబును నిర్వీర్యం చేయడమే అసలు ఉద్దేశ్యం. ఈ మూడేళ్లలో చంద్ర బాబుకు కేంద్రం వట్టి మాటలు చెప్పడం తప్ప ఎలాంటి సాయం చేయలేదు. విభజన బిల్లులో చెప్పిన ప్రత్యేకహోదా విషయంలో కూడా ఆయన రాజీపడడం ప్రజల్లో చంద్రబాబు నాయకత్వ స్థాయిని దిగజార్చింది. కేంద్రం ద్వారా చంద్రబాబు రాష్ట్రానికి ఏ పనులూ సాధించలేక పోయాడు, సరికదా అసలే అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఈయన చేసిన ఆర్భాటపు పను లన్నీ కూడా ప్రజలకు పని కొచ్చేవి కావు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్ర మాలపై సిబిఐ విచారణ చేయిస్తే ఎన్నో లొసుగులు బయటపడతాయి. చంద్రబాబు సర్కార్‌ను ప్రజా బోనులో దోషిగా నిల బెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి ఏమంత కష్టం కూడా కాదు.

ఏపిలో తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలన్నా, చంద్రబాబును బలహీన పరచాలన్నా మోడీకి చిటికెలో పని. తన విషయంలో మోడీ ఆ పని చేయకపోవ చ్చని చంద్రబాబుకు ఇంతకాలం బలమైన నమ్మకం ఉండేది. కాని మోడీని జగన్‌ కలిసొచ్చాక, మోడీ చేతికి అతను చంద్ర బాబు గారి అక్రమాల చిట్టా పద్దులు ఇచ్చి వచ్చాక ఆ నమ్మకం కూడా పోయింది. మోడీ ఎక్కడ ఎప్పుడు తనకు ఎసరు పెడ తాడోననే ఆందోళన బాబులో కనిపిస్తోంది.

ap jag chaఏ ఎన్నికలలోనైనా పార్టీల గెలుపుకు ప్రజాదరణ తప్పనిసరి! అయితే ఇది వంద శాతం ప్రభావం చూపుతుందనుకోలేం! ఈ ప్రజాదరణను ఓట్ల రూపంలో మలచుకుంటేనే గెలుపు సాధ్యమవుతుంది. కేవలం గాలివాటాన్ని నమ్ముకుంటేనే గెలుపు రాదు. ఎలక్షన్‌ను వివిధ కోణాలలో చేయాలి. కాళ్లు పట్టుకోవాల్సిన చోట కాళ్లు, గడ్డం పట్టుకోవాల్సిన చోట గడ్డం పట్టుకోవాలి. కులాలు, మతాల రూపంలో ఓట్లు రాబట్టాలి. సెంటిమెంట్లు రెచ్చ గొట్టాలి. నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పాలి. ఇవన్నీ చేయబట్టే, ఎలక్షన్‌ను ఎలక్షన్‌ తీరులో చేయబట్టే 2014 ఎన్నికల్లో తనకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు అధికారంలోకి రాగలిగాడు. ఇవన్నీ చేయలేక పోబట్టే తన సభలకు వచ్చిన జనం ఓట్లేస్తే సరిపోతుం దని గుడ్డి నమ్మకంతో అవకాశాలు ఎక్కువుగా వున్నా జగన్‌ అధికారంలోకి రాలేకపోయాడు.

జగన్‌ తనను తాను నమ్ముకున్నాడు. మిగతా వారిని, సీనియర్‌లను, పార్టీలోకి వస్తామన్న వారిని నమ్మలేదు. కాబట్టే ప్రతిపక్షం పాత్ర దక్కింది. చంద్రబాబు తనను తాను కాదు కదా తన నీడను కూడా నమ్మలేదు. ఎవరెవరికి ఓట్లున్నాయో వాళ్లను నమ్మాడు. వారితో పొత్తులు కుదుర్చుకున్నాడు. వాళ్ల ఇళ్ల వద్ద పడిగాపులు కాసాడు. కాబట్టే అధికార పక్షం దక్కింది.

రాష్ట్రంలో ఈరోజు కూడా చంద్రబాబు కంటే జగన్‌కే ప్రజాదరణ ఎక్కువుగా వుంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీకి 50సీట్లు కూడా రావని, చంద్రబాబు చెప్పి చేయించుకున్న సర్వేలే చెబుతున్నాయి. అయితే దీనిని నమ్మి చంకలు గుద్దుకుంటే జగన్‌ పప్పులో కాలేసినట్లే! 2014 ఎన్నికలకు ముందు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతకంటే దారుణంగానే ఉండింది. సర్వేలు కూడా ఇదే విధంగా చెప్పాయి. కాని, అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చంద్రబాబు తన అనుభవంతో ఎదురీది నెగ్గుకొచ్చాడు. రాజకీయాల్లో అనుభవానికి, అనుభవ రాహిత్యానికీ మధ్య ఎంత తేడా వుందన్నది 2014 ఎన్నికలు స్పష్టం చేశాయి. ఇంకో 20ఏళ్లు మనమే అధికారంలోఉంటామని చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నాడు. ఇది తన మీద నమ్మకంతో అంటున్నది కాదు. జగన్‌ మీద నమ్మకంతో చెబుతున్నది. ఎన్నో అవకాశాలున్నప్పటికీ 2014ఎన్నికల్లో జగన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అధికారపక్షంగా ఈ మూడేళ్లలో చంద్రబాబు ఎన్నో తప్పులు చేశాడు. కాని వాటిని ఎత్తిచూపడంలో ప్రతిపక్షం అంతకంటే అధ్వాన్నంగా వుంది. జగన్‌ నాయకత్వంలో ప్రతిపక్షం ఉన్నంత కాలం తనకు తిరుగులేదని చంద్రబాబు ధీమా! 2019 ఎన్నికల కసరత్తును చంద్ర బాబు ఇప్పటి నుండే మొదలుపెట్టాడు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టు కోవడానికి ఆయన ప్రధానంగా కొన్ని మార్గాలను ఎంచుకున్నాడు. అందులో ప్రధానమైనది డబ్బు. 2014 ఎన్నికల్లో ఇది బాగానే పని చేసింది. 2019 ఎన్ని కల్లో కూడా ఇదే ప్రధాన భూమిక పోషించ నుంది. అందుకు తగిన ఆర్ధిక వనరులు పోగుచేసారని సమాచారం. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పుష్క రాలు... అన్నీ 'పి'తో కలిసొచ్చిన అంశాలే! ఇక రెండోది రాష్ట్రంలో అసెంబ్లీ నియో జకవర్గాల సంఖ్యను పెంచడం. చంద్ర బాబు దీనిపైనే ప్రధానంగా దృష్టిపెట్టి వున్నాడు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంతో రాజీపడింది కూడా రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు కోసమే!

చంద్రబాబు గట్టిగా పోరాడి వుంటే ప్రత్యకహోదాపై కేంద్రం తలొంచాల్సి వచ్చేది. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే కూడా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం బాధ్యతను తనకు అప్పగించడం, రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను 175 నుండి 225కు పెంచడంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీటిలో మొదటి పనైంది. రెండోది డీలిమిటేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టడం. నియోజక వర్గాలు పెరిగితే దానికి తగినట్లుగా అభ్యర్థులు తెలుగుదేశంలో వున్నారు. రాజ కీయంగా, ఆర్ధికంగా బలమైన నాయకు లందరికీ సీట్లు సర్దుబాటు చేయొచ్చు. అదే సీట్లు పెరక్కపోతే తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్లు వైకాపాకు వెళ్లే అవకాశ ముంది. జగన్‌కు ఆ ఛాన్స్‌ ఇవ్వకూడదనే చంద్రబాబు సీట్ల పెంపుకు పాకులాడు తున్నాడు.

ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశ ముంది. అయితే దీనికి పార్లమెంటు ఆమోదం కావాలి. పార్లమెంట్‌లో విప క్షాలు దీనిని తిరస్కరించవచ్చు. అయినా కూడా కేంద్రం ఆర్డినెన్స్‌ ద్వారా నియోజక వర్గాలను పెంచవచ్చు. ప్రతిపక్షంగా వైకాపా దీనిని అడ్డుకోవడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే చంద్రబాబుకు సంబంధించిన కేసులకు న్యాయస్థానాల నుండి ఎటువంటి తీర్పులు వస్తున్నాయో చూస్తూనే వున్నాం.

కాబట్టి రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అంటూ జరిగితే అది చంద్ర బాబుకు రాజకీయంగా ప్రయోజనమే! మరి చంద్రబాబు రాజకీయ ఎత్తులను జగన్‌ ఎంతవరకు తట్టుకుని నిలబడగలడు? వేచి చూడాల్సిందే!

amaravathiఈ దేశంలో ఎందరో మహానాయకులు జన్మించారు. రాజుల కాలం నుండి నేటి ప్రజాస్వామ్య కాలం దాకా ఈ భూమిని ఎంతోమంది మహానుభావులు పరిపాలిం చారు. చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు చేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే పనులు చేపట్టారు. కాని మనకు తెలిసిన చరిత్రలో ఏ రాజు కాని, ఏ పాలకుడు గాని ఇది నేను చేశాను, అది నేను చేశాను అని చెప్పుకో లేదు. 'నేను' అన్న మాటను వదిలేసి 'మనం' అన్న భావనతోనే ముందుకు వెళ్లారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం 'మనం' అన్న పదాన్ని వదిలేసి 'నేను' అన్న మాటకే అంకితమైపోయాడు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే, హైటెక్‌ సిటీని కట్టింది నేనే, సెల్‌ఫోన్‌లు తెచ్చింది నేనే, కంప్యూటర్‌లు కని పెట్టింది నేనే... డబ్బులు లేకుండానే ఎన్నో అద్భు తాలు సృష్టించాం... ఇప్పుడు ప్యాకేజీ వస్తే స్వర్గమే నిర్మిస్తాం, పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే కట్టలేక పోయింది... అందుకే నాకు అప్పగించింది. ప్రపంచ దేశాలకే నేను పాఠాలు చెప్పాను... ఏమిటీ సెల్ఫ్‌ సోదంతా! ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న నాయకుడికి ఈ సొంత భజన అవసరమా? వినడానికే ఇది తన కాళ్లను తాను ఒత్తుకుంటున్నట్లుగా, తన భుజాన్ని తాను శెభాష్‌ అని తట్టు కుంటున్నట్లుగా లేదా? మన గొప్పతనాన్ని అవతలివారు గుర్తిస్తే అది ప్రశంస, మనం చెప్పుకుంటే కంఠశోష! అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం వెలగబెట్టాడని ఈ గొప్పలు. ఆయన అంత అద్భుతంగా పరిపాలించి వుంటే 2004 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినట్లు? అసలు వైయస్‌ అన్న నాయకుడే ఉండుంటే చంద్రబాబు ఎక్కడుండేవాడు!

ఒక నాయకుడి పరిపాలన అద్భుతంగా వుందని ప్రజలు చెప్పుకోవాలి. అంతేగాని తనకు తాను చెప్పుకోకూడదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ ముఖ్య మంత్రి గాని, ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులుగాని ఎవరు కూడా అది నేను చేసాను, ఇది నేను చేసానని చెప్పు కున్న సందర్భాలు లేవు. వాళ్లు చెప్పుకోక పోయినా, వారు చేసిన మంచి పనుల గురించి ఈరోజుకీ మనం చెప్పుకుం టున్నాం. 2014లో సిఎం అయ్యింది మొదలు ప్రజలు నచ్చేలా, మెచ్చేలా చంద్ర బాబు ఏం పనులు చేసాడు. ఆర్భాటంగా గోదావరి, కృష్ణ పుష్కరాలు నిర్వహించాడు. దాదాపు 4వేల కోట్లు వీటికి తగలేసాడు. పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించా ల్సిందే! అయితే వీటి పేరుతో భారీ దుబారానే ఎవరూ హర్షించడం లేదు. పోలవరం పూర్తయితే ఉపయోగం కాని, పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఎందుకోసం చేపట్టారో అందరికీ తేలిసిందే! ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఆయన ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. ఋణమాఫీ వాగ్ధానంతో అధికారంలోకి వచ్చిన ఆయన దానిని పరిపూర్ణంగా అమలు చేయలేదు. దీనిమీద రైతులు ఎంతగా మండిపడుతున్నారో వారి ముందుకు వెళితే తెలుస్తుంది. ఇక చంద్రబాబు ప్రధానంగా పెట్టుకున్న పని రాజధాని. మూడేళ్లుగా ఆ తంతు జరుగు తూనే వుంది. చంద్రబాబు చెబుతున్న సింగపూర్‌ రాజధానిని ఈ తరం వాళ్లు చూడలేకపోవచ్చు. ఆయనకు రాజధాని తప్ప రాష్ట్రం అన్నది ఒకటుందని, దానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉం దన్న ధ్యాసే లేనట్లుగా వుంది. సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోఫాలు, మజ్జిగా ప్యాకెట్లు... ఈ చిల్లరమల్లర పనులేనా... అద్భుతాలు! అన్నింటికి మించి రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించలేక పోవడం ఆయన నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ప్రాంత నాయకులు పోరాడి సాధించు కుంటే, కేంద్రం ఇస్తామన్న ప్రత్యేకహోదాను సాధించుకోలేక, వారిచ్చిన ప్యాకేజీని లొట్ట లేసుకుంటూ తీసుకున్న అసమర్ధ నాయ కత్వం మనది. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రం ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందిందా? విదేశీ పెట్టుబడులొచ్చాయా? కొత్త పరి శ్రమలొచ్చాయా? రాష్ట్రంలో ఏ రంగం ప్రజలైనా సంతృప్తిగా సంతోషంగా వున్నారా? గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వై.యస్‌ పెట్టిన పథకాలకు పేర్లు మార్చడం తప్పితే చంద్రబాబు తన ముద్ర పడేలా ఏవైనా మంచి కార్యక్రమాలు అమలు చేయగలిగాడా? ఇవేమీ చేయక పోయినా అప్పుడెప్పుడో కట్టిన శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుండి నిన్న శ్రీహరికోట నుండి వదిలిన రాకెట్‌ వరకు అన్నీ నా వల్లే అన్నట్లున్న చంద్రబాబు తీరుకు ప్రజలు విస్తుపోతున్నారు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter