narayanaనెంబర్‌ 1... ఏ రంగంలో ఉన్నవారైనా కోరుకునే స్థానం. పారిశ్రామిక రంగంలో నెంబర్‌ వన్‌ కావాలని, సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కావాలని, ఐసిసి క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌.1 స్థానాన్ని చేజిక్కించుకోవాలని... ఇలా ఏ రంగంలో వున్నవారు ఆ రంగంలో నెంబర్‌.1 స్థానాన్ని కోరుకుంటుంటారు. అలాంటి నెం.1 స్థానమే మన నెల్లూరుజిల్లాకు చెందిన మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణకు దక్కింది.

అయితే ఈ నెంబర్‌ వన్‌ ర్యాంకు మంత్రిగా ఆయన పనితీరు ద్వారానో, విద్యాసంస్థల అధినేతగా ఆయన చేసిన విద్యాభివృద్ధి కృషితోనో వచ్చింది కాదు... ఏపి క్యాబినెట్‌లోని సంపన్న మంత్రుల్లో ఆయనే నెంబర్‌ వన్‌. రికార్డుల ప్రకారం అధికారికంగా ప్రకటించిన ఆస్తులు 496కోట్లు. ఇక అనధికారికంగా, బినామీల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయో అంచనా వేయడం కష్టమే! ఆ లెక్కల్లోకి పోతే దేశంలోనే టాప్‌ టెన్‌లో ఉండొచ్చు.

అయితే డబ్బులోనే కాదు, జిల్లాలో తెలుగుదేశం పార్టీని గబ్బు పట్టించడంలోనూ, తాను గబ్బు పట్టడంలోనూ ఆయన నెంబర్‌ వన్‌గానే నిలిచాడు. మంత్రిగా ఆయన పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందన్నది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన ర్యాంకులను బట్టే అర్ధం చేసుకోవచ్చు. మంత్రిగా ఆయన పనితీరుకు చివరి ర్యాంకు రావడం తెలిసిందే! తనకు చివరి ర్యాంకు ఇచ్చినందుకు ఆయన చంద్రబాబు మీద కొంతకాలం అలిగాడు కూడా!

ఇక నెల్లూరు జిల్లా ప్రజలు తమ చరిత్రలో ఇలాంటి మంత్రిని ఎప్పుడూ చూసి వుండరు. బెజవాడ గోపాలరెడ్డిని మొదలుకొని ఏ.సి.సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిల నుండి పసల పెంచలయ్య, పరసారత్నం వంటి దళిత మంత్రులతో పాటు సోమిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారిని మంత్రులుగా చూసారు జిల్లా ప్రజలు. వారందరు కూడా ప్రజలకు అందుబాటులో వుంటూ తమ చేతనైనంత వరకు జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్లను చూసిన కళ్లతో ఇప్పుడు నారాయణను మంత్రిగా చూడాలంటే... ఎవరికీ కూడా ఆయన మంత్రిగా మనసుల్లోకి ఎక్కడం లేదు. ఎప్పుడన్నా ప్రజల్లోకి వస్తే కదా, జనం సమస్యలు వింటే కదా? కేవలం చంద్రబాబు ఏజెంట్‌గా, రాజధాని భూముల డెవలపర్‌గా మాత్రమే ఆయన పని చేస్తున్నాడు. రాజధాని పేరుతో జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మూల స్థంభంగా ఉంటూ అటు డబ్బులోనూ ఇటు గబ్బు పట్టడంలోనూ నెంబర్‌వన్‌ ర్యాంకును పదిల పరుచుకుంటూ జిల్లా ప్రజల మనసుల్లో మాత్రం చివరి స్థానానికి పరిమితమయ్యాడు.

narఆనం వాళ్లు... సూదిని దూర్చే సందిస్తే చాలు... దబ్బలాన్ని కాదు, ఏకంగా దూలాన్నే దూర్చేస్తారు. రాకీయాలలో అంతటి ఘటికులు వాళ్లు. తెలుగుదేశం పార్టీలో వాళ్లు చేరినరోజే అర్ధమైపోయింది... ఆ పార్టీలో వున్న మిగతా నాయకులకు బ్యాండ్‌ పడుతుందని. ఈ వరుసలో ముందు నిలిచినవాడు మేయర్‌ అజీజ్‌!

మున్సిపల్‌ మంత్రి నారాయణ ఏరికోరి వైసిపి నుండి గెలిచిన అజీజ్‌ను తెలుగుదేశంలోకి తెచ్చుకున్నాడు. తన పార్టీకి చెందిన డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ ఆ రోజున్న పరిస్థితుల్లో మేయర్‌గా గెలవడానికి ఛాన్సున్నా, మంత్రి ఆ అవకాశాలకు గండికొట్టి అజీజ్‌ను మేయర్‌ పీఠమెక్కించి, తెలుగుదేశంలోకి తీసుకున్నాడు. అజీజ్‌ కూడా 2015 చివరి దాకా మంత్రి నారాయణ మనిషిగానే మసలుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఎప్పుడైతే ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారో అప్పుడే అజీజ్‌ పవర్‌ తగ్గడం మొదలైంది. ఆనం వివేకా, ఆనం రంగమయూర్‌లు బహిరంగం గానే అజీజ్‌పై విమర్శలకు తెరలేపారు. మంత్రి నారాయణ కూడా వారి నోటికి కళ్లెం వేసే ప్రయత్నం చేయలేదు.

ఇటీవల కార్పొరేషన్‌లో ఇద్దరు శానిటరీ ఉద్యోగుల బదిలీ ఇరు వర్గాల వారికి ప్రతిష్టాత్మకంగా మారడం జరిగింది. వారిద్దరే లక్ష్యంగా మేయర్‌ అజీజ్‌ లక్కీ డిప్‌ ద్వారా శానిటరీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిర్వహించారు. ఈ లక్కీ డిప్‌లో ఆనం వర్గీయులు ఇద్దరికీ చెత్తపోస్టులు వచ్చాయి. దీంతో ఆనం వర్గం మరోసారి మేయర్‌పై విమర్శల యుద్ధాన్ని తీవ్రం చేసింది.

కాగా, ఇటీవల కాలంలో మంత్రి వద్ద అజీజ్‌ కంటే ఆనం మాటకే పరపతి పెరగసాగింది. అజీజ్‌ ఒక డివిజన్‌ స్థాయి నాయకుడు. కాని, ఆనం వర్గంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ అవసరాలున్నాయి. కాబట్టి నారాయణ కూడా ఆనంకే విలువ ఇవ్వసాగాడు. ఈ నేపథ్యంలోనే ఆనం మాట విని, ఆ వర్గానికి చెందిన ఇద్దరు శానిటరీ ఉద్యోగులు తిరిగి వాళ్లు కోరుకున్న స్థానాలకు రాగలిగారు. ఇక తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఏడుగురు సిటీ ప్లానింగ్‌ సిబ్బందిపై సస్పెండ్‌ వేటు వేయడాన్ని కూడా అజీజ్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. తనకు తెలియకుండానే కార్పొరేషన్‌లో అన్నీ జరిగిపోతుంటే ఇక తాను ఎందుకుండడం అన్నట్లుంది ఆయన పరిస్థితి. ఈ బాధంతా ఆయన మొన్న లోకేష్‌ ముందు కూడా వెళ్లగక్కాడు.

ఏదో కొంపలంటుకుపోయినట్లు మేయర్‌గా గెలిచీ గెలవ గానే అజీజ్‌ తెలుగుదేశంలో చేరాడు. అదే వైకాపాలో ఉండుంటే ఆ గౌరవం, ఆ హోదా ఎక్కడికీ పోయేవి కావు. మున్సిపల్‌ మంత్రి సొంత నగరంలో ఆయన ప్రథమపౌరుడిగా వుంటూ తన హోదా, పరపతిని ఎంతగానో పెంచుకుని వుండేవాడు. తెలుగుదేశంలో ఇప్పుడు ఆ విలువ ఎక్కడుంది?

adalaమున్సిపల్‌ మంత్రి పి.నారాయణ వ్యవహారశైలిపై మాజీమంత్రి, నెల్లూరురూరల్‌ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇటీవలకాలంలో బాగా కోపంతో వున్నాడు. మంత్రికి ఆదాలకు మధ్య ప్రత్యక్షయుద్ధాలు, వర్గపోరు, కుమ్ములాటలు, సీట్ల కొట్లాటలు ఏవీ లేవు. ఒకరకంగా చెప్పాలంటే 2014ఎన్నికల సమయంలోగాని, ఆ తర్వాతగాని ఇద్దరూ బాగానే వున్నారు. నారాయణ కూడా ఆదాలకు చాలా ప్రాధాన్యతనిచ్చేవాడు. కాని మంత్రి నారాయణ సొంతంగా చొరవతీసుకుని ఆనం సోదరులను తెలుగుదేశంలోకి తీసుకురావడం తెలిసిందే! అప్పుడే ఆదాలకు మండింది. ఆరోజుకు ఆయన సరేలే అని ఊరుకున్నాడు. ఆ తర్వాత ఆనం సోదరుల ప్రమేయంతో ఆదాల క్రిందే మంటపెట్టే ప్రయత్నం జరిగింది. ఆనం బ్రదర్స్‌ డైరెక్షన్‌లో నెల్లూరు నగరం బాధ్యతలు ఆనం బ్రదర్స్‌ చూసుకునేలా, నెల్లూరు గ్రామీణ ఇన్‌ఛార్జ్‌గా నారాయణను నియమించేలా మాట్లాడుకున్నారు. ఇది తెలిసి ఆదాల సీరియస్‌ అయ్యాడు. జన్మభూమి సభలలో కూడా పాల్గొనకుండా చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టాడు. చివరకు చంద్రబాబు కొత్త మార్పులు లేకుండా ఆదాలనే రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగేలా చేసాడు.

ఇంతవరకు బాగానే వుంది. కాని నారాయణతో కలిసి ఆనం సోదరులు తనకు పొగపెడతారనే భయం ఆదాలలో ఉంది. ఈ నేపథ్యంలో నారాయణతోనే తాడోపేడో తేల్చుకుంటే సరిపోతుందనుకుంటున్నాడు. ఈ తరుణంలోనే నెల్లూరులో అక్రమ కట్టడాల కూల్చివేత సబ్జెక్ట్‌ ఆయనకు అస్త్రంగా దొరికింది. దీనిని పెట్టుకునే నారాయణపై ఆదాల విమర్శలు ఎక్కుపెట్టాడు. విజయవాడలో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని, ప్రజల మధ్య వుండే మేమేం కావాలంటూ ఆయన నారాయణపై గట్టిగానే దాడి చేశాడు. దాదాపు నెల్లూరు నగరం సగభాగం రూరల్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కూల్చివేతల ప్రభావం ఆదాల మీద కూడా పడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా పార్టీపై పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఆనం సోదరులతో అంటకాగుతున్న నారాయణను ఎండగట్టేందుకే ఆదాల ఆయనతో తాడోపేడో తేల్చుకునే పనిలో వున్నాడని తెలుస్తోంది.

Page 7 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter