ganta narayanaస్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో రెండోసారి గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నత విద్యాశాఖామంత్రిగా వుండినాడు. ఒక ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది... అది కూడా ఒక సబ్జెక్ట్‌ పేపర్‌. రెండో ఆలోచన, రెండో వివ రణ లేకుండా పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశాడు. విలువలంటే అవి. నైతిక ప్రవర్తన అంటే అది. ఆరోజు రాజీ నామా చేసిన మంత్రే కాదు, వారికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కూడా నైతిక విలువలకు కట్టుబడిన మనిషి. పరిస్థితులతో రాజీపడని నాయ కుడు. కాబట్టే ఒక నాయకుడు తృణ ప్రాయంగా మంత్రి పదవిని వదులు కోగలిగాడు.

ఇప్పుడు కూడా పార్టీ అదే. కాక పోతే నాయకులు మారారు. నేతృత్వం వహిస్తున్న వాళ్ళు పాటిస్తున్న సిద్ధాం తాలు కూడా మారాయి. విలువలు, నైతిక బాధ్యత అన్నవి అక్కడ కనపడవు. అవతల పార్టీలో గెలిచిన 21మంది ఎమ్మె ల్యేలను తన పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇస్తున్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాంటి నైతిక విలువలు కలిగిన మంత్రులు ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. టెన్త్‌ పేపర్ల లీకేజీకి నైతికబాధ్యత వహిస్తే, ఈ విషయంలో ఆనాటి గాలి ముద్దుకృష్ణమనాయుడు సంఘటను స్ఫూర్తిగా తీసుకుంటే ఈ నెలలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిరోజూ రాజీనామా చేసి వుండాలి.

మన రాష్ట్రంలో విద్యావ్యవస్థ గబ్బు పట్టిపోయిందని, దానికి డబ్బు జబ్బు పట్టిందన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో సర్కార్‌ చదువు చతికిలబడి, కార్పొరేట్‌ చదువులు రాజ్యమేలుతుండడానికి ప్రధాన కారకులలో ఒకరు మంత్రి పి.నారాయణ. ఈరోజు రాష్ట్రంలో పెరిగిన కార్పొరేట్‌ చదువుల సంస్కృతి దెబ్బకు మధ్యతరగతి కుటుంబాలు గుల్లవుతున్నాయి. డబ్బులు పెట్టి చదువులు కొనడం ఒకెత్తయితే, పేపర్ల లీకేజీతో కష్టపడి చదివిన విద్యార్థుల బ్రతుకులు, భవిష్యత్‌ చిత్తవుతుంది. ప్రస్తుతం జరిగిన టెన్త్‌ పరీక్షల్లో పలు సబ్జెక్ట్‌ల ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం తెలిసిందే! మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల నుండే ఈ పేపర్లు లీకవుతున్నట్లు వెల్లడికావడం జరిగింది. నారాయణకు విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడే! కాబట్టి పేపర్ల లీకేజీ విషయంలో వీరిద్దరి పాత్రపై అనుమానం రావడం సహజమే. ప్రతిపక్ష వైకాపా అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై చర్చకు పట్టుబట్టింది. కాని, దీనిపై ప్రభుత్వం పెద్దగా స్పందించకుండా మంత్రులను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అదేమంటే స్కూల్‌ వాటర్‌బాయ్‌, ఇన్విజిలేటర్‌లు ప్రశ్నాపత్రాలను ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టారంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. స్కూల్‌ వాటర్‌బాయ్‌కు ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? పేపర్‌ను వాట్సాప్‌లో పంపేంత ధైర్యాన్ని అతనికిచ్చిందెవరు? ఎందుకోసం, ఎవరు చెబితే వాళ్ళు ఆ పని చేసుంటారు. లోతుగా విచారిస్తే దీని వెనుక సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అన్న విషయం బయటకొస్తుంది. కాకపోతే కష్టపడ్డ విద్యార్థులు ఎటుపోతే మాకేం, మా మంత్రులకు నొప్పి తగలకుంటే చాలు అన్నట్లున్న ప్రభుత్వంలో పేపర్ల లీకేజీతో విద్యార్థుల బ్రతుకు డామేజీ కామనే!

nar patవిజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది చెప్పారు. శాసనమండలిలో అడుగుపెట్టడానికి కాదుకదా ఆ భవనం వైపు చూడడానికి కూడా అర్హత లేని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి అతని స్థానం ఎక్కడో, ఆయన స్థాయి ఏమిటో తెలియపరిచారు. ప్రజల సమస్యలను తమ బాధ్యతగా భావించి పనిచేసే పెద్దమనిషి, పట్టభద్రుడు యండపల్లి శ్రీనివాసులురెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం ద్వారా శాసనమండలికి వున్న

గౌరవాన్ని కాపాడారు. పట్టాభిని ఎమ్మెల్సీని చేసి మేము తలచుకుంటే మేధావులనే కాదు ఇలాంటి వాళ్ళను కూడా శాసనమండలికి పంపించగలం అని చెప్పాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రయత్నాలను తిప్పికొట్టారు.

నేరం నాది కాదంటున్న 'నారాయణ'

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పరాజయంతో ముదురుదోమల శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. చంద్రబాబు వద్ద ఆయన తలెత్తుకునే పరిస్థితి లేకుండాపోయింది. దీనికి కారణం తూర్పురాయలసీమ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పార్టీ నాయకులను ఏ మాత్రం సంప్రదించకుండానే, ఒక్కరిని ఒక్క సలహా కూడా అడగకుండానే చంద్రబాబు దగ్గర తన మాటే చెల్లుబాటు కావాలనే మొండితనంతో ఏకపక్షంగా తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించేసుకున్నాడు. పట్టాభిని తానే గెలిపిస్తానని చంద్రబాబుకు గ్యారంటీ కూడా ఇచ్చి వచ్చాడు. పట్టాభి అభ్యర్థి కావడం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఇష్టం లేదు. అతని వ్యక్తిగత నైజం తెలిసిన వాళ్ళు అతనిని పూర్తిగా వ్యతిరేకించారు. అదీగాక ఎవరన్నా ప్రొఫెషనల్స్‌ను నిలబెట్టాల్సిన పదవికి అతనిని పోటీపెట్టడాన్ని కూడా అంగీకరించలేకపోయారు. అయినా ఈ మూడు జిల్లాల్లో పార్టీ నాయకులు గాని, కేడర్‌గాని పార్టీ పట్ల గౌరవంతో పట్టాభికి మద్దతుగానే పనిచేసారు. లోకల్‌గా అసెంబ్లీ ఎన్నికలను, పంచాయితీ ఎన్నికలను ఎంత ఆసక్తిగా చేస్తారో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అలాగే చేసారు. తెలుగుదేశంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో పని చేశారు. కాబట్టే పట్టాభికి అన్ని ఓట్లు రాగలిగాయి.

మేధావుల ఎలక్షన్‌... రాంగ్‌ సెలక్షన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నది మేధావులు, విద్యావంతుల ఎన్నిక! సమాజంలో గుర్తింపు గౌరవం వున్న వ్యక్తులను దీనికి అభ్యర్థులుగా పెట్టాలి. కాని, మంత్రి నారాయణ ఆత్మవిశ్వాసం శృతిమించి అతి విశ్వాసంగా మారింది. పార్టీలో సీనియర్లు, మేధావులు, వివిధ వృత్తులలో నిష్ణాతులు ఎంతోమంది వుండగా తన నమ్మినబంటు పట్టాభిని అభ్యర్థిగా పెట్టుకున్నాడు. పట్టాభి పట్ల పార్టీ కార్యకర్తలలోనే చాలా వ్యతిరేకత వుంది. ఇక తటస్థంగా వుండే పట్టభద్రులకు కూడా పట్టాభికి ఓటేయాలన్న ఆలోచన పోయింది. వారంతా కూడా మంచిపేరున్న యండపల్లి శ్రీనివాసులురెడ్డి వైపే మొగ్గారు. పట్టాభి మీద ఎంత వ్యతిరేకత వచ్చిందంటే... కౌంటింగ్‌రోజు ఇతను ఓడిపోవాలని చాలామంది పూజలు చేశారు. ఇతను ఎక్కడ గెలుస్తాడోనని చాలామంది టెన్షన్‌ పడ్డారు. అతను ఓడిపోయాడని తెలియగానే చాలామంది పండుగ చేసుకున్నారు. ఇంతకాలం ఒక అభ్యర్థి గెలుపుకోసం ఉత్కంఠతతో ఎదురుచూసిన వాళ్ళను చూసాము, కాని ఒక వ్యక్తి ఓటమి కోసం జనం ఉత్కంఠతతో ఎదురుచూడడం అన్నది పట్టాభి విషయంలోనే జరిగింది. మంత్రి నారాయణ పట్టభద్రుల అభ్యర్థి విషయంలో పారదర్శకంగా ఆలోచించి, కాంగ్రెస్‌పార్టీ నుండి వలస వచ్చిన వాళ్ళకు మాత్రమే పదవులు చెందాలన్న తన పాలసీని పక్కనపెట్టి, పార్టీ కోసం ఒళ్ళు, ఇళ్ళు గుల్లచేసుకున్న వారికి కొంచెం మంచి చేద్దామని ఆలోచించి గత రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఓడిపోయిన సీనియర్‌ న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతురావును అభ్యర్థిగా పెట్టివుంటే ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో ఫలితం ఇంకో విధంగా వుండేది. పార్టీ కేడర్‌ మద్దతుతో పాటు సానుభూతి ఓట్లతోనైనా గెలిచి ఉండేవాడు. అభ్యర్థి ఎంపిక విషయంలో నారాయణ తప్పు నిర్ణయమే ఈరోజు ఓటమికి ప్రధానకారణం.

ఇతరులపైకి నింద

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమితో పాటు స్థానిక ఎమ్మెల్సీలో పార్టీ అభ్యర్థి వాకాటికి మెజార్టీ తగ్గడానికి కారకుడు కూడా నారాయణ. ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికే రాంగ్‌! వీళ్ళిద్దరూ కాంగ్రెస్‌ నుండి వచ్చినవాళ్లే! అది కూడా పార్టీ అధికా రంలోకి వచ్చాక! వాకాటి కంటే ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యుంటే కనీసం 150ఓట్లకు తగ్గకుండా మెజార్టీ వచ్చేది. కాని, మంత్రి పట్టుబట్టి వాకాటికి సీటిప్పించాడు. పార్టీలో అతని మీదున్న వ్యతిరేకత వల్ల మెజార్టీ బాగా తగ్గింది. ఇక మంత్రి గారి పట్టాభి సెలక్షన్‌ కూడా పక్కా రాంగ్‌! తప్పు తన వద్ద పెట్టుకుని మంత్రి ఈ పాపాన్ని పార్టీలోని ఇతర నాయకుల మీదకు నెట్టాలని చూస్తున్నాడు. ఈ రెండుచోట్ల పార్టీ అభ్యర్థు లకు సహకరించలేదంటూ కొందరు నాయ కులపై తప్పుడు ఆరోపణలతో చంద్ర బాబుకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కూడా గ్రౌండ్‌లెవల్లో వాస్తవాలను వదిలేసి, జిల్లాలో పార్టీ కార్యకర్తలను, వారి సమస్యలను ఏనాడూ పట్టించుకోని నారాయణ చెప్పుడు మాట లకు చెవి అప్పగిస్తే జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది.

narayanaదేశ భాషలంతు తెలుగు లెస్స... అని శ్రీకృష్ణ దేవరాయలు అంతటివాడు కీర్తించాడు. తెలుగులోని మాధుర్యాన్ని అతను ఆస్వాదించాడు కాబట్టి ఆ భాషలోని గొప్పతనాన్ని గుర్తించి చెప్పాడు. ఆయన తెలుగు భాషను లెస్స అంటే ఈనాటి పాలకులు మాత్రం 'తెలుగు లెస్‌' అంటున్నారు. అమ్మలాంటి కమ్మనైన భాషను 'మమ్మీ' అనే డమ్మీ లాంగ్వేజ్‌ మోజులో పడి నీరు గారుస్తున్నారు.

ఆంగ్లేయుడు ఈ దేశాన్ని వదిలేసినా ఆంగ్లం ఈ దేశాన్ని వదలలేదు. మన జీవనశైలిలో అదొక భాగమైంది. ఆర్ధిక వ్యవస్థలోనూ, పరిపాలనా విభాగంలోనూ ఆ భాష పాత్రే కీలకం! మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ, వివిధ రాష్ట్రాల వ్యవహారాల మధ్య ఆంగ్లమే అనుసంధాన భాషగా వుంది.

ఆంగ్లాన్ని అభ్యసించడంలో తప్పు లేదు. ప్రియురాలి మోజులో పడి తల్లిదండ్రులను వదిలేసినట్లుగా, ఇంగ్లీష్‌ చదువుల వ్యామోహంలో మాతృ భాషను మృతభాషగా మార్చాలనుకోవడమే ఆందోళన కలిగించే విషయం. ఇంగ్లీష్‌ భాష కోసం ఏ దేశం కూడా తమ సొంత భాషకు పాడె కట్టలేదు. ఈరోజు అభివృద్ధిలో అమెరికాను తలదన్నేలా ఎదిగిన చైనాలో ఇంగ్లీష్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. జర్మనీలో జర్మన్‌, రష్యాలో రష్యన్‌, జపాన్‌లో జపనీస్‌ భాషలే కీలకంగా ఉన్నాయి. ఇంగ్లీష్‌ చదువులు లేనంత మాత్రాన అవి అభివృద్ధి చెందలేదా?

సరే, వాటిని తీసేద్దాం. ఈరోజు భారతీయులు ఎక్కువుగా అమెరికా, బ్రిటన్‌, కెనడా వంటి దేశాలలో స్థిరపడుతున్నారు. మల్టీనేషనల్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఇంగ్లీష్‌ తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్‌ను చదువుకోవడంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. మరి ఇంగ్లీష్‌ కోసం తెలుగుకు తెగులు పట్టించడం ఎంతవరకు సబబు.

దేశంలో ఆయా రాష్ట్రాలు సైతం విద్యా విధానంలో ఇంగ్లీష్‌ను ప్రోత్సహిస్తూనే తమ మాతృభాషలను అభ్యసించడం తప్పనిసరి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తెలుగు అంటే చులకనగా మారింది. ప్రజలు సైతం మమ్మీ, డాడీ సంస్కృతికి అలవాటు పడి తమ బిడ్డలకు తెలుగు భాషను నేర్పించడం మరచిపోతున్నారు.

చదువులు కార్పొరేటీకరణ చెందిన ఈ కాలంలో రాష్ట్రంలో ఆంగ్ల భాషే రాజ్యమేలుతోంది. తెలుగు ఎక్కడన్నా కనిపిస్తుందంటే అది మున్సిపల్‌, జడ్పీ, ప్రభుత్వ బళ్లలోనే! ప్రైవేట్‌ స్కూల్స్‌లో తెలుగు మాట్లాడడమే తప్పు అన్నట్లుగా ఉంటుంది. తెలుగు అంతో ఇంతో వినపడేది సర్కార్‌ చదువుల్లోనే! మున్సిపల్‌ మంత్రి కమ్‌ కార్పొరేషన్‌ మంత్రి నారాయణకు తెలుగు కొంచెం కూడా వినపడడం ఇష్టం లేనట్లుగా వుంది. విద్యార్థుల భవిష్యత్‌ మీద ప్రేమో, లేక తన విద్యా సంస్థలను ఇంకా విస్తరించుకోవచ్చునన్న ఆలోచనో గాని మున్సిపల్‌ బళ్లలో కూడా ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలని జి.ఓ తెచ్చాడు. ఇది విద్యాసంవత్సరం ప్రారంభం కాదు. అర్థ సంవత్సరం పరీక్షలు జరిగాయి. అన్ని క్లాసులు సగం సిలబస్‌ అయిపోయింది. ఇప్పుడు అర్ధాంతరంగా ఇంగ్లీష్‌ మీడియం అంటే పిల్లలు ఏం కావాలి? ఉన్నఫళంగా వాళ్ళు ఇంగ్లీష్‌లో చదవగలరా? దానికి తగ్గ ఇంగ్లీష్‌ మెటీరియల్‌ వుందా? బోధనా సిబ్బంది అందుకు అనుగుణంగా ఉన్నారా? ఇవేమీ ఆలోచించకుండానే మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని రుద్దేయాలనుకున్నాడు. మంత్రిగారి తలతిక్క నిర్ణయాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. చదువులతో వేల కోట్ల వ్యాపారం చేసేవాళ్లకు మాతృభాష విలువ ఏం తెలుస్తుంది మరి!

Page 3 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter