studentsఫ్లెమింగో ఫెస్టివల్‌ ప్రచారం కోసం ఆదివారం నెల్లూరులో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాధ్యతను జాయింట్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌కు అప్పగించగా, ఆయన ఆ పనిని కార్పొరేషన్‌ మేనేజర్‌ రాజేంద్ర నెత్తిమీద పెట్టాడు. అయితే, ఆదివారం ర్యాలీ ప్రారంభ సమయానికి ఎన్‌సిసి విద్యార్థులు ఓ 50 మంది తప్పితే ఇతర విద్యార్థులు పెద్దగా రాలేదు. ఈ ర్యాలీలో పాల్గొని ఫోటోలకు ఫోజులిద్దామని వచ్చిన మంత్రికి అక్కడ విద్యార్థులు రాకపోవడం చూసి అరికాల్లో మండింది. దాని తర్వాత నారాయణ కాలేజీలో మంత్రి నిర్వహించిన సమావేశానికి జేసి ఇంతియాజ్‌ అహ్మద్‌ రాగా, ర్యాలీకి ఎందుకు విద్యార్థులను తీసుకురాలేకపోయారంటూ మంత్రి ఆయనపై చిర్రుబుర్రులాడారు.

నారాయణ విద్యాసంస్థల్లో వేలాదిమంది విద్యార్థులున్నారు. ఆ స్కూళ్ళకు బస్‌లు కూడా వున్నాయి. ఈ సారి ర్యాలీలకు, సభలకు విద్యార్థులను తీసుకురావాలంటే నారాయణ విద్యాసంస్థల విద్యార్థులనే తీసుకువచ్చేవిధంగా అధికారులు మంత్రితో ఒప్పదం చేసుకోవాలి. అప్పుడు అధికారులకు విద్యార్థులను వెదుక్కునే బాధ్యత తప్పుతుంది. నారాయణ విద్యార్థులేమో ర్యాంకులు తెచ్చుకోవాలి, సర్కారు స్కూళ్ళ విద్యార్థులు మాత్రం ర్యాలీలకు హాజరై చదువులు సంకనాకిపోవాలన్నట్లుగా వుంది మంత్రి వ్యవహారం.

narayanరాష్ట్ర మున్సిపల్‌ మంత్రిగా పి.నారాయణ జిల్లా ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు సరికదా, ఆయన మూలంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొందరికి అన్యాయం జరిగిపోతుంది.

జిల్లాలో పెద్దనోట్ల రద్దు వ్యవహారం కూడా ఇలాంటిదే! పెద్దనోట్లు రద్దు తర్వాత జిల్లాలోనే కాకుండా ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారుల వద్ద వున్న బ్లాక్‌మనీనంతా నారాయణ తీసుకున్నాడు. రద్దు నోట్ల ప్రకటన వెలువడగానే వ్యాపారులు రెండో ఆలోచన చేయకుండా నారాయణ ఇంటి ముందు 'క్యూ' కట్టి మరీ డబ్బులిచ్చారు. నేను బాధ్యతగల మంత్రిని, దేశంలో బ్లాక్‌మనీని అదుపు చేయాల్సిన పాలక యంత్రాంగంలో నేనూ ఒక సభ్యుడిని, పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో నా పాత్ర కూడా వుంది అని నారాయణ భావించలేదు. బ్యాగులు, బస్తాల కొద్ది డబ్బు వచ్చేసరికి నారాయణలో వున్న మంత్రి షేడ్‌ తొలగిపోయింది. అతనిలోని విద్యావ్యాపారి మేల్కొన్నాడు. అందినకాడికి బ్లాక్‌మనీని తీసుకున్నాడు. అతను నల్లధనం తీసుకుంటున్న సంగతి మీడియాలో రాకపోయి వుంటే ఇప్పటికి కూడా నిరభ్యంతరంగా నల్లదనం తీసుకుంటుండేవాళ్లు. నారాయణ వద్దకు మొత్తం ఎంత నల్లధనం వచ్చిందన్న దానిపై కరెక్ట్‌ లెక్కలేదు గాని, వ్యాపారులంతా కూడా తమ వద్దకు వచ్చిన డబ్బును నారాయణకే ఇచ్చారన్నది నిర్వివాదాంశం. నారాయణ గనుకే ఈ బ్లాక్‌మనీని తీసుకోకపోయినట్లైతే చాలామంది రియల్టర్లు కోలుకునేవాళ్లు. వడ్డీ వ్యాపారులందరూ కూడా రియల్టర్ల వద్దవున్న స్థలాలు, భూములను తక్కువ రేటుకు కొనడమో, లేదా తాకట్టు పెట్టుకుని తక్కువ వడ్డీకి అప్పులివ్వడమో చేసుండేవాళ్లు. రియల్టర్లు పెద్దపెద్ద వడ్డీల నుండి బయటపడడానికి తక్కువ రేట్లకే స్థలాలు అమ్ముండేవాళ్లు. కాని నారాయణ వద్ద బ్లాక్‌మనీ అంతా బ్లాక్‌ అవడంతో బయట మార్కెట్‌లో పెద్దనోట్లకు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. సామాన్య ప్రజలు కొత్త నోట్లకు అగచాట్లు పడుతుంటే రియల్టర్లు మాత్రం తమ అప్పులు తీర్చుకోవడానికి పాతనోట్లు వున్న నల్లకుబేరులకై అన్వేషిస్తున్నారు.

narayanaత్వరలోనే జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా వామపక్షాలకు కంచుకోటలా మారిన తూర్పు రాయలసీమ(నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు) నియోజకవర్గాలలో ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు యమ ఉత్సాహంతో ఉన్నాడు. అయితే ఆటలో అరటిపండు మాదిరిగా ఎటువంటి ఎన్నికల అనుభవం లేని మంత్రి నారాయణకు ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతను అప్పగించాడు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా చెడకొరికిందనే సామెతను ఇక్కడ నారాయణ అమలులోకి తెచ్చాడు. పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా గౌరవప్రదమైన వ్యక్తులను, మేధావులను, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, స్వచ్ఛంధ సేవకులను పెట్టాలి. నారాయణ ఇవేమీ పట్టించుకోకుండా, మూడుజిల్లాల తెలుగుదేశం ముఖ్యనేతలతో కూడా సంప్రదించకుండా, ఏకపక్షంగా తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా నిర్ణయించాడు. ఈ విషయంలోనే మూడు జిల్లాల తెలుగుదేశం నాయకులు మంత్రిపై ఆగ్రహంతో వున్నారు.

ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఆశిస్తుండగా మంత్రి మాత్రం మాజీమంత్రి పరసా రత్నంను అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ లోపే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ వాళ్లు కూడా

ఉపాధ్యాయస్థానం నుండి తమ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలైన 'అపస్‌' ద్వారా అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయించింది. బీజేపీ అభ్యర్థిని పెడితే తెలుగుదేశం అభ్యర్థికి పడాల్సిన ఓట్లు చీలడం ఖాయం. ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీకి గణనీయంగానే ఓట్లున్నాయి. బీజేపీ అభ్యర్థిని లేకుండా చేయాలని మంత్రి నారాయణ ప్రయత్నిస్తుండగా, బీజేపీ వాళ్లు మాత్రం పట్టభద్రుల స్థానం మీరు తీసుకుని ఉపాధ్యాయుల స్థానాన్ని తమకు వదలమంటున్నారు. కాని మంత్రి మాత్రం ఈ రెండు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టి, తన నేతృత్వంలో గెలిపించి తన సత్తా ఏంటో చంద్రబాబుకు చూపాలనుకుంటున్నాడు. మరి మంత్రివర్యుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Page 4 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter