modiఅందరి సహకారం ఉంటేనే ఎక్కడైనా సరే అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, చివరికి ప్రపంచంలోనైనా సరే..అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అవినీతి, అక్రమాలతో ఎవరికి వారు సొంత ఆర్జనకే జీవితాలను వ్యర్ధం చేసుకోక, సమాజంలో శాంతి సామరస్యాలకి.. అందరి అభివృద్ధికీ అవసరమైన మార్గాలు వేయగలిగినప్నుడే ప్రగతి మన కళ్ళ ముందు కళకళలాడుతుంది. చుట్టూతా చుట్టుముడుతున్న అనేకానేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటూ, అందరి తోడ్పాటుతో అభివృద్ధి పథం వైపు నడిచినప్పుడే ప్రగతి ఫలాలు అందరికీ అందుతాయి. శాంతి సహనంతో..సుఖ సంతోషాలతో ప్రపంచం నడవాలంటే ఇరుకుదారుల్లో ఉన్న మనసును విశాలహృదయంగా మార్చుకోవాలి. అందుకు అన్ని దేశాలు కలసిట్టుగా ముందుకు సాగాలి. అప్పుడే విశ్వమంతా స్వేచ్ఛా స్వర్గంగా మారుతుంది. ఆరోజు రావాలి. ప్రపంచమంతా ఒక్కటై.. మనది వసుధైక కుటుంబం అని అందరూ గర్వంగా, సగర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజును ఎల్లప్పుడూ కాంక్షించేది, విశ్వమానవాళి శాంతిని ఆకాంక్షించేది మన భారత్‌. అందుకే, ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళకు భారతీయ తత్వమే పరిష్కారం అని ప్రధాని మోదీ ప్రపంచస్థాయి వేదికపై స్పష్టం చేసి భారతీయ దార్శనికతను దశదిశలా చాటారు.

దావోస్‌లో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనమిక్‌ పోరం' వార్షిక సదస్సులో భారత్‌ వాణిని అద్భుతంగా, అమోఘంగా వినిపించి అందరి కరతాళ ధ్వనులం దుకున్నారు. 'సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌' (అందరి సహకారంతోనే అద్భుత ప్రగతి) అంటూ.. ప్రస్తుత ప్రపంచానికి భారతీయ తత్వమైన 'వసుధైక కుటుంబం' ఉత్తమమన్నారు. ఇలా భారత్‌ దార్శని కతను ప్రపంచానికి చాటిచెప్పడంతో విశ్వవేదికపై భార తీయ ఔన్నత్య పతాకను మరోసారి రెపరెపలాడించి నట్లయింది. ఈ సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్య్రూడ్యూతో, నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతోను, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఛైర్మన్‌ క్లాస్‌ స్వ్యాబ్‌తోను, స్విస్‌ సమాఖ్య అధ్యక్షుడు అలేన్‌లతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అంతేకాదు, ఈ అంతర్జాతీయ వార్షిక సదస్సులో ప్రారంభప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. దావోస్‌లో 18 దేశాలకు చెందిన 40 దిగ్గజ సంస్థల సారధులతో సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోడీ ఎంతో దార్శనికతతో ప్రసంగించడం ప్రపంచదేశాలను బాగా ఆకట్టుకుంది. భిన్నత్వంలో ఏకత్వమే బలమని ప్రకటించడం, అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సంపదను సృష్టించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారత్‌కు తరలిరావాలని ఆహ్వానించడం అందరినీ బాగా ఆకట్టుకుంది. అపారమైన మానవ వనరులను వినియోగించుకుని, నైపుణ్యాన్ని జోడించి, అవరోధాలను అధిగమించి అద్భుతమైన అవకాశాలను మనకు మనమే సృష్టించుకోవాలని ప్రధాని మోదీ అందరికీ అభివృద్ధి మంత్రం ఉద్బోధించారు.

శతాబ్దాల తరబడిగా ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు, శాంతి సుహృద్భావాలకు నెలవైన భారతావని ఆర్ధిక వాణిజ్యవిధానాల పరంగా రూపాంతరం చెందుతున్న దశలో, ఇలా బయటినుంచి కూడా పెట్టుబడుల్ని స్వాగతించడం అందరికీ సంతోషాన్ని కలిగించేదే. సంపదతో కూడిన శ్రేయస్సు కావాలంటే భారత్‌కు రండి, ఆరోగ్యంతో కూడిన పూర్ణత్వం కావాలంటే భారత్‌కు రండి!, సౌభాగ్యంతో కూడిన శాంతి కావాలంటే భారత్‌కు రండి!.. సహకారమే కానీ విభజనలు, చీలికలు లేని స్వేచ్ఛాపూరిత స్వర్గాన్ని సృష్టిద్దాం రండి!..అంటూ ప్రధాని మోడీ భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించిన తీరు అమోఘం. భారతీయ తాత్విక చింతనను, దార్శనికతలను ఎంతో వివరంగా పేర్కొంటూ ఈ ప్రపంచస్థాయి సదస్సులో భారత్‌ ప్రత్యేకతను చాటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు పెనుసవాళ్ళను ఈ సందర్భంగా ప్రధాని మోడీ అందరి దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ సమతూకాన్ని పాటించకుంటే మానవాళి మనుగడకు పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. తీవ్రమైన వాతావరణ మార్పులతో మంచుఖండాలు కరిగిపోతున్నాయని, ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని ద్వీపాలు మునిగిపోతున్నా యన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏంచేయాలో ప్రపంచం ఆలోచించాలన్నారు. వాతా వరణ మార్పులపై సంపన్నదేశాల ద్వంద్వ విధానానికి చురకలంటిస్తూనే, ఈ విషయంలో అగ్రరాజ్యాలు చిన్నదేశాలకు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపు నివ్వడం ద్వారా ఆయా దేశాలకు కర్తవ్యబోధ చేసినట్లయింది. రక్షణాత్మక వాణిజ్య ధోరణులు మంచిది కాదన్నారు. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవా దులు- చెడు ఉగ్రవాదులు అంటూ ఉండరని అంటూ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తప్పనిసరి అని, ఉగ్ర వాదంపై పోరాడేవారికి భారత్‌ బాసటగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ పురోగతికి, వేగవంతమైన అభివృద్ధికి అన్ని దేశాలు సహకరించాలన్నారు. ప్రపంచానికి వాటిల్లుతున్న ముప్పులను ఎదుర్కొనేందుకు కాలయాపన చేయకుండా అన్ని దేశాలకూ తక్షణ స్పందన అవసరమన్నారు. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం అవరోధాలన్నిటినీ అధిగమించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యమనేది ఒక వ్యవస్థ కాదని.. అది భారతీయ జీవన విధానమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేయాలే కానీ, విభజించడం కాదనీ, ప్రపంచమంతా ఒక్కటే అనే భారతీయ తత్వం..'వసుధైక కుటుంబ విధానం' ఉత్తమమని సగర్వంగా ప్రకటించి అందరి కరతాళధ్వనులందుకున్నారు. అంతేకాదు, ప్రపంచ శాంతికి భారత్‌ ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటుందని, ఐరాస శాంతి పరిరక్షక దళంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే సైనికులే ఎక్కువగా ఉన్నారని ఉదహరించారు. ప్రపంచ ఆర్థిక పురోగతికి భారత్‌ ఎల్లవేళలా సహకరిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. విశ్వవేదికపై భారత్‌ వాణిని అత్యద్భుతంగా వినిపించి, భారత్‌ దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రధాని మోడీ తనకు తానే సాటి అన్పించుకున్నారు.

modi rahulగుజరాత్‌ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్‌లో ఎన్నికలు. అంటే కేవలం నెలరోజులే ఉన్నాయి. డిసెంబర్‌ 9న ఒకసారి, 14న మరోసారి రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది.ఈ ఎన్నికలు నాయకులకు అగ్నిపరీక్ష కానున్నాయి. గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది కనుక, ఇక్కడ మళ్ళీ తమదే గెలుపనే ధీమాతో ఉంది. మొత్తం 33 జిల్లాలున్న గుజరాత్‌ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలివిడతగా 89 స్థానాలకు సంబంధించిన 19 జిల్లాల్లోను, మలివిడతగా 93 స్థానాలకు సంబంధించిన 14 జిల్లాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లో మొత్తం 4,33,37,492 మంది ఓటర్లున్నారు. నవంబర్‌ 14 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. అదేవిధంగా నవంబర్‌ 9న హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నికలు జరిగి, డిసెంబర్‌ 18న హిమాచల్‌ప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుతోపాటే, గుజరాత్‌ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఆ రోజే రెండింటి ఫలితాలు వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి సీనియర్‌ నాయకుడు ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ను తాజాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి అధిష్టానం ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగింది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మిన్నంటుతోంది. అయితే, గుజరాత్‌లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఈసారి ఎన్నికలు జరుగ నున్నాయి. దీంతో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. అధికారంలో ఉన్న బిజెపి తమ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం కోసం కాచుక్కూర్చున్న కాంగ్రెస్‌ ఈసారైనా ఇక్కడ తిష్టవేయాలని ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నాయి. దీంతో, అటు కమలం..ఇటు కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికలు నువ్వా-నేనా అన్నంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. గతంలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 1995 నుంచి ఇక్కడ బిజెపి హవా ప్రారంభమైంది. 1998 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధించడంతో కమలం జెండా రెపరెపలాడింది. 2002, 2007 ఎన్నికల్లోనూ బిజెపిదే ఘనవిజయం. తొలుత అక్కడ కేశూభాయ్‌పటేల్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ బిజెపికి సారధ్యం వహించినా, ఆ తర్వాతకాలంలో ఆ అవకాశం నరేంద్రమోడీకి దక్కడంతో మోడీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక అక్కడి నుంచి మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి గుజరాత్‌ ప్రజల మన్ననలు పొందడంతో, 2012 ఎన్నికల్లోనూ ఇక్కడ బిజెపియే అత్యధికస్థానాలను కైవశం చేసుకుంది. అలా..మోడీ ప్రధాని అయ్యేదాకా కూడా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ గుజరాత్‌ను అభివృద్ధిబాటలో నిలిపారు. అయితే, ఇప్పుడు జరుగనున్న ఈ ఎన్నికలు 2019లో రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక, గుజరాత్‌లో విజయమే లక్ష్యంగా బిజెపి వ్యూహరచన చేస్తోంది. అందులోనూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలోనే పార్టీకి అధ్యక్షులు కానున్నారనే ప్రచారం నేపథ్యంలో, ఈ ఎన్నికలు ఆయనకు, మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మరింత సవాల్‌ కానున్నాయి. దీంతో, గుజరాత్‌ ఎన్నికలు అటు కమలం, ఇటు కాంగ్రెస్‌ అగ్రనాయకులకు అగ్నిపరీక్ష కానున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం, అస్తవ్యస్తంగా ఉన్న జిఎస్టీ ఈ రెండూ కలసి బిజెపికి ఈ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాయన్నది కాంగ్రెస్‌వాదుల ఆశ. అందుకు తగ్గట్లుగానే పెద్దనోట్ల సంగతి ఎలా ఉన్నా, జిఎస్టీ మాత్రం అక్కడి ప్రజల్లో అధికశాతం వ్యాపారవర్గాల్లో అసంతృప్తినే రాజేస్తోందనే చెప్పవచ్చు. జిఎస్టీ వల్ల వ్యాపారాలు మందగించిపోతున్నాయన్నది సర్వత్రా వినపడుతున్న విమర్శే. అందులోనూ గుజరాత్‌లోని అనేకమంది చిన్న, మధ్యతరగతి వ్యాపారులు జిఎస్టీపై బాగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వస్త్ర పరిశ్రమపై విధించిన అయిదుశాతం పన్నును రద్దుచేయాలని కూడా గత కొద్దికాలంగా అక్కడి వ్యాపారులంతా కోరుకుంటున్నారు. కానీ బిజెపి నేతలు వారి బాధలు పట్టించుకోకపోవడంతో వారంతా బిజెపి పట్ల అసంతృప్తితో ఉన్నారని, సరిగ్గా ఈ అంశమే తమకు మేలు చేస్తుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అందుకు తగ్గట్లుగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బిజెపికి ఈసారి ఇక్కడ విజయం దక్కకూడదనే పట్టుదలతో ఉన్నారు. పెద్దనోట్ల రద్దు, అస్తవ్యస్తంగా ఉన్న జిఎస్టీ విధానాలు ప్రజల్లో మోడీ పట్ల అసం తృప్తిని పెంచుతున్నాయని, దీంతో తమ పార్టీకి ఇక్కడ విజయం తప్పకుండా లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుజరాత్‌లో గణనీయమైన సంఖ్యలో ఉన్న సామాజికవర్గాలను తమవైపునకు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్న పటేళ్ళు, ఓబిసిలు, దళితుల ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. పటేళ్ళు..తమను ఓబిసిలో చేర్చి రిజర్వేషన్‌ కల్పించాలని గత రెండేళ్ళుగా గుజరాత్‌లో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా బిజెపి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పటేళ్ళ వర్గం బిజెపికి దూర మవుతోందని, దీని ప్రభావం కూడా బిజెపిపై పడు తుందని, వీటన్నిటి పర్యవసానంగా తమకు ఈసారి గుజరాత్‌లో విజయం దక్కడం ఖాయమని కాంగ్రెస్‌ అంచనాలు వేసుకుంటోంది. అయితే, ఎవరెన్ననుకున్నా గుజరాత్‌లో తమ స్థానం పదిలమని, అభివృద్ధి మంత్రమే తమపార్టీని గెలిపిస్తుందని బిజెపి గట్టి నమ్మకంతో ఉంది. కొంతమంది పటేళ్లు దూరమైనా, మరికొంతమంది ముఖ్యులైన పటేళ్ళను తమపార్టీలో కలుపుకుని బిజెపి మునుపటి ఉత్సాహంతోనే ఎన్నికల రంగంలోకి వస్తోంది. మొత్తమ్మీద గుజరాత్‌ ఎన్నికలు అటు కమలం, ఇటు కాంగ్రెస్‌ అగ్రనాయకులకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ, అమిత్‌షా రాజకీయ చతురత ఈసారి గుజరాత్‌ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తాయోనని రాజకీయవర్గాల్లో ఉత్కంఠగానే ఉంది. చివరికి ప్రజలు ఏపార్టీ వైపు మొగ్గుచూపి విజయాన్ని ప్రసాదిస్తారో మరి..వేచిచూడాల్సిందే!..

bjpనాకు పార్టీ తల్లిలాంటిది. నేను పార్టీని మించిపోయానని అందరూ అంటున్నారు. ఎవరైనా తల్లిని మించిపోగలరా..? గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలో మూడోసారి విజయం సాధించాక ఆనాడు ప్రమాణస్వీకారోత్సవ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలివి. ఆరోజు ఆయన మాటలు పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునేలా వున్నా, వాస్తవంగా మాత్రం ఆ గెలుపు మోడీ వ్యక్తిగత నాయకత్వ సమర్ధత మూలంగా దక్కిందే! పార్టీని ఆరోజు ఆయన మించిపోలేదు. కాని, ప్రధాని అయ్యాక మించిపోతున్నాడు. పార్టీ శ్రేయస్సు, పార్టీ భవిష్యత్‌ కంటే కూడా తన వ్యక్తిగత నాయకత్వ పాపులారిటీకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు. నియంతృత్వ ఏకపక్ష ధోరణులతో బీజేపీని కొందరి పార్టీగానే పరిమితం చేస్తున్నాడు. ముఖ్యంగా పార్టీలో సీనియర్‌ నేతలను ఆయన అణగదొక్కుతున్న తీరు కార్యకర్తలకే నచ్చడం లేదు.

ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే రోజే సీనియర్లను పక్కనపెట్టేసాడు. ఏ ఒక్క సీనియర్‌ నేతను కూడా తన మంత్రివర్గం లోకి తీసుకోలేదు. 65ఏళ్లలోపు వయ స్సున్న వారైతే చురుకుగా పని చేస్తారని భావించి మంత్రి పదవులకు వయసు పరిమితి విధించాడు. యువకులకు అవ కాశమివ్వాలనుకోవడంలో తప్పులేదు గాని, సీనియర్లు అయితే పని చేయలేరనే భావనే తప్పు. సీనియర్ల అనుభవం, అవగాహన పరిపాలనకు ఎంతో అవ సరం. ఈరోజు మోడీ ప్రభుత్వంలో ఆ అవగాహనా లోపం స్పష్టంగా కనిపి స్తోంది. జాతీయ స్థాయి విధానాలపై అవ గాహన వున్న మంత్రులు మోడీ కొలువులో చాలా తక్కువుగా వున్నారు. అన్నీ తెలిసిన వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపించేశారు. జాతీయస్థాయి రాజకీ యాలు, ప్రజల ఆలోచనా విధానాలపై అవగాహన వుండి తదనుగుణంగా సూచ నలు, సలహాలు ఇవ్వగల మంత్రులు ఈరోజు మోడీ కొలువులో లేకుండా పోయారు. కొందరికి అవగాహన వున్నా మోడీకి చెప్పేంత ధైర్యం లేకుండా పోయింది. అలా చెప్పే ధైర్యం లేకే ఎల్‌.కె. అద్వానీ అంతటి అగ్రనేతను కూడా పక్కన పెట్టే పరిస్థితులొచ్చాయి. మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా బాధపడిన విషయం రాష్ట్రపతి పదవికి అద్వానీ పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం. బీజేపీ చరిత్రలో ఆ పార్టీకి ఉపయోగపడ్డ నాయకుడు అద్వానీ. మూడుసార్లు అధికా రంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ బీజేపీకి సారధ్యం వహించి నాలుగోసారి అధికారంలోకి తెచ్చాడు. దేశంలో కాం గ్రెస్‌కు ఆ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాకే మోడీ వచ్చాడు. కాని, అద్వానీ అలాకాదు. ఒక ప్రాంతీయ పార్టీ కంటే కూడా అధ్వాన్నస్థితిలో బీజేపీ వుండగా ఆ పార్టీకి సారధ్యం వహించాడు. వ్యక్తిగత కృషితో పార్టీని 2 సీట్ల నుండి 200 సీట్లకు తీసుకువెళ్లాడు. బీజేపీ అనే మొక్కను నాటి నీళ్ళు పోసింది అద్వానీ. అది కాయలు కాసే నాటికి వాజ్‌పేయి, నరేంద్ర మోడీలు వచ్చి కోసుకుపోయారంతే!

బీజేపీలో సీనియర్లను అంటే పక్కన పెట్టేసారు. పార్టీని పది కాలాల పాటూ అధికారంలో వుండేలా చేయాల్సిన బాధ్యత ప్రధానిగా మోడీపై వుంది. పార్టీ అధికా రంలో నిలబడాలంటే ప్రజల ఆదరణ కోల్పోకూడదు. ప్రజల ఆదరణ వుండా లంటే ఆర్ధిక విధానాలు సక్రమంగా వుం డాలి. కాని ఈ మూడున్నరేళ్లలో మోడీ అనుసరించిన ఆర్ధిక విధానాలు, తీసు కొచ్చిన మార్పులు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చేలా వున్నాయి. మొదట పెద్దనోట్ల రద్దును అందరూ స్వాగతించారు. తీరా చూస్తే దాని ప్రభావం మన ఆర్ధిక రంగంపై బాగానే పడింది. నోట్ల రద్దుతో కుదేలైన దేశ ఆర్ధికరంగంపై జిఎస్టీ గుదిబండ వేశారు. దీని దెబ్బకు ప్రతిఒక్కరూ బలవు తున్నారు. జిఎస్టీని అమలులోకి తెచ్చాకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగ సాగింది. నరేంద్ర మోడీ వచ్చీ రాగానే నోట్ల రద్దు, జిఎస్టీతో తమను చావబాదు తాడని ప్రజలు వూహించలేదు. బీజేపీ నుండి ప్రజలు ఆశించేది ఇది కాదు. ధరలు, పన్నులు తగ్గుతాయనుకున్నారు. రిజర్వే షన్లను సమీక్షించి అర్హులకే చెందేలా చేస్తారనుకున్నారు. వాజ్‌పేయి హయాంలో స్వర్ణచతుర్భుజి ద్వారా జాతీయ రహదా రుల విస్తరణ చేపట్టినట్లు, దేశ మంతటికీ ఉపయోగపడేలా నదుల అనుసంధానం వంటి దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌ను చేపడుతారను కున్నారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ను అమలు లోకి తేవడం, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచడం వంటివి గట్టిగా చేస్తారనుకు న్నారు. కానీ మోడీ ఇవేమీ చేయలేదు.

దేశంలో ఆర్ధిక విధానాలను ఇంత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మొదట వ్యవస్థల్లో వున్న అవినీతిని నిర్మూలించాలి. కుంభకోణాలు లేకుండా చేయాలి. ఈ విషయంలో గత యూపిఏ కంటే మోడీ ప్రభుత్వమే బాగుంది. పన్నుల విధానాన్ని సరళీకృతం చేసి దేశంలో పన్ను చెల్లింపుదారులను ఇంకా పెంచివుండాలి. కాని మోడీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను ఎక్కు వుగా భయపెడుతోంది. మోడీ ఆర్ధిక విధా నాలపై ఇటీవల బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా విరుచుకుపడడం తెలి సిందే! ఈ బాటలోనే మరికొందరు బీజేపీ నేతలు కూడా వున్నారు. వీరందరు మోడీ దెబ్బకు భయపడి నోర్లు తెరవడం లేదు. ముఖ్యంగా యూపిలో బీజేపీ విజయం చూసాక పార్టీలో మోడీని ఎదిరించే ధైర్యం, ప్రశ్నించే తత్వం ఎవరికీ లేకుండా పోయింది. త్వరలో గుజరాత్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినా సొంత పార్టీలోనే మోడీపై నేతల విమర్శల దాడి ఖాయం.

Page 1 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter