ramnarayaతనను, తన అన్నను మోసం చేసిన తెలుగుదేశంకు గుడ్‌బై చెప్పాలని మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయించుకోవడం తెలిసిందే! అయితే ఆయన ఏకపక్షంగా పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకోలేడుగా! ఇంతకాలం తనతో కలసివచ్చిన అనుచరులతోనూ సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఆనం అనుచరులు కేవలం ఆత్మకూరులోనో, నెల్లూరులోనో మాత్రమే లేరు. ఉదయగిరి నుండి సూళ్ళూరుపేట దాకా అన్ని నియోజవర్గాలలోనూ వున్నారు. కాబట్టే ఆయన గత కొన్నిరోజులుగా జిల్లా వ్యాప్తంగా వున్న తన అనుచరులను పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. తెలుగుదేశంలో తమకెదురైన పరిస్థితులను వివరిస్తున్నాడు. కాని ఆయనకంటే ముందే ఆయన అనుచరులు జై జగన్‌ అంటున్నారు. తెలుగుదేశం వీడడానికి, వైసిపిలో చేరడానికి సంసిద్ధమంటున్నారు. ఆనం అనుచరులలో చాలా తక్కువమంది మాత్రమే టీడీపీని వీడాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మెజార్టీ అనుచరుల అభిప్రాయం వైసిపిలో చేరాలనే! అనుచరుల అభిప్రాయ సేకరణ అనే మర్యాదపూర్వక ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి రాజీనామా లేఖ టైప్‌ చేయడం మిగిలింది. అన్నీ కుదిరితే వై.యస్‌. జయంతి రోజైన జూలై 8వ తేదీ ఆయన వైసిపిలో చేరొచ్చని తెలుస్తోంది!

tdpనెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే! వీటిలో వైసిపి సంస్థాగత లోపాల కారణంగా 2 సీట్లు పోయాయి. ఇక నెల్లూరు లోక్‌సభతో పాటూ నెల్లూరుజిల్లాలోని నాలుగు అసెంబ్లీలు కలిసి వున్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోవడం జరిగింది.

ఈ సీన్‌ను బట్టి జిల్లాలో తెలుగుదేశం ఎంత బలహీనంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయ్యింది. ఈ నాలుగేళ్ళ కాలంలో తెలుగుదేశం ఏమన్నా బలం పుంజుకుందా? ఈ నాలుగేళ్ళలో ఆనం సోదరులతో పాటు మెట్టు కూరు ధనుంజయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి వంటి నాయకులు టీడీపీలో చేరారు. వైసిపిలో గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కూడా టీడీపీలో చేరాడు. ఏమన్నా ఒరిగిందా? పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందా? గతంలోకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవ కాశాలు ఏర్పడ్డాయా? తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందా? జిల్లాలో అలాంటి వాతావరణమేదీ కనిపించడం లేదు సరికదా, 2014 కన్నా జిల్లాలో పార్టీ బలహీనపడ్డ వాతావరణం కనిపిస్తోంది.

చంద్రబాబు చిన్నచూపు

మొదట అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా అభి వృద్ధిపై చంద్రబాబు చిన్నచూపు చూసాడు. ఈ జిల్లా అంటే గిట్టనట్లు వ్యవహరించాడు. ఐదేళ్ళ వై.యస్‌. పాలనతో పోల్చి చూసినప్పుడు ఈ జిల్లాకు ఆయన చేసిందేమీ కనిపించలేదు. దాంతో స్వతహాగానే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇక నియోజక వర్గాల వారీగా కూడా పార్టీ బలహీనంగానే ఉంది. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలుంటే(జంపింగ్‌ ఎమ్మెల్యేతో కలిపి) ఆ నాలుగు నియోజకవర్గాలలోనూ వారి పట్ల వ్యతిరేకత వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజక వర్గాలలో తెలుగుదేశాన్ని చంద్రబాబే పడుకోబెట్టాడు. ఏ జిల్లా కేంద్రంలోనూ తెలుగుదేశం నెల్లూరులో వున్నంత బలహీనంగా వుండదేమో! సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా గట్టిగా పోరాడుతున్నాడు. ఇది రైతాంగం ఎక్కువ వుండే నియోజకవర్గం. ప్రభుత్వంపైన అన్నిచోట్లా వుండే వ్యతిరేకత ఇక్కడా వుంది. కాకపోతే సోమిరెడ్డి సొంతంగా గట్టిగా నిలబడుతున్నాడు. కావలిలో బీద సోదరుల నాయకత్వం వల్ల అక్కడ పార్టీ కనిపిస్తోంది. జిల్లాలో టీడీపీ వీక్‌ అనే సంకేతాలు అధిష్టానాన్ని తాకాయి. చంద్రబాబు నెల్లూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

నిలబెట్టుకోవడంలో విఫలం

ముఖ్యంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వదిలిపోతున్నాడన్న విషయం టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. పార్టీలోకి వచ్చిన వాళ్ళను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వివేకా చివరి రోజుల్లో వున్నప్పుడైనా ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించి వుంటే వాళ్ళు పార్టీని వదిలిపోకుండా వుండేందుకు ఆస్కార ముండేది. ఆనంను పార్టీలో నిలబెట్టుకోలేక పోవడ మన్నది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమే! ఆనం పార్టీని వదిలి వైసిపిలోకి పోతే ఆ ఎఫెక్ట్‌ ఆత్మకూరు నియోజక వర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల మీద కూడా పడుతుంది.

తిరుగుబాటులో పెళ్ళకూరు

ఆనం అలా వుండగా కోవూరుకు చెందిన మరో నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా తిరుగుబాటు బాటలో వున్నాడు. ఆయన ఎదురు తిరిగినా కూడా కోవూరులో పార్టీకి నష్టం తప్పదు. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా టీడీపీని వీడే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

నిలబెట్టుకొనే ప్రయత్నాలు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన దశలో తెలుగుదేశం అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి చేజారినట్లేనని ఖరారు చేసు కున్నారు. కాకపోతే వారి కుటుంబంలో వున్న మరో ఇద్దరిని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిని బుజ్జగించే పనిలో కొందరున్నారు. ఎన్నికలనాటికి పార్టీ మారుతాడనే ప్రచారం వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని జాగ్రత్తగా పట్టుకురావాలని నిర్ణయించి ఆయనకు అదనపు బాధ్యతలంటూ కొత్త పదవులు అప్పగిస్తున్నారు.

ఉదయగిరిలో కంభం విజయరామిరెడ్డి చేజారిపో కుండా ఆయనకు రాష్ట్ర స్థాయి పార్టీ పదవిని గాలంగా విసురుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇటీవలే నవనిర్మాణ దీక్షల ముగింపు సభను నెల్లూరుజిల్లాలోనే నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 30న దళిత తేజం ముగింపు సభకు కూడా నెల్లూరునే వేదికగా ఎంచుకున్నారు. దీనికి కారణం నెల్లూరు జిల్లాలో పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలకు పూనుకోవడమే!

cheruvuజిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు తవ్వేస్తుండడంతో అవి మృత్యువుకు ఆవాసాలవుతన్నాయి. అయినా, అధికారయంత్రాంగం పట్టించుకోకపోవడమే విచారకరం.

జిల్లాలో చెరువులు దొరువులు ఇప్పుడు మృత్యువుకు నివాసాలవుతున్నాయి. అక్కడే పొంచివుండి ఎవరు సరదాగా ఈతకు దిగినా వారిని కబళిస్తోంది. దీనికి తోడు, మట్టి కోసమో, ఇసుక కోసమో పెద్దపెద్ద యంత్రా లతో కొంతమంది ఇష్టంవచ్చినట్లు గుంతలు తవ్వే స్తుండడం, ఆ తర్వాత చెరువులకు నీళ్ళొచ్చినప్పుడు, ఉత్సాహంతో ఈతకు దిగినవారు అక్కడ గుంత లున్నాయని తెలియక ఆ గుంతల్లో మునిగి చనిపోవడం తరచూ జరుగుతోంది. సరదా కోసం ఈతకు దిగితే చివరకు చావే ఎదురవుతోంది. గుంతలు తవ్విన ప్రాంతాల్లో ఆ తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా హెచ్చరిక బోర్డులు పెట్టడం వంటి పనులు ఖచ్చితంగా చేయాలని గతంలో జిల్లా ఉన్నతాధికా రులు ఆదేశించివున్నా, ఆచరణకు మాత్రం రావడం లేదు. దీంతో, ఎవరిష్టం వారిదైపోయిందని, ఎవరు ఎక్కడ మునిగి చనిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

సరదాగా ఈతకు దిగితే..ఇక అంతే!

ఈ వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు, యువకులు ఈత కోసం సరదాగా దిగితే..ఇక ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సర దాయే చివరికి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ రెండు నెలల్లోనే ఇప్పటిదాకా ఏడుగురు ఇలా చనిపోయా రంటే పరిస్థితి అర్ధమవుతోంది. గత ఏడాది, అంతకు ముందు.. ఇలా ప్రతిఏడాది వేసవిరోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగిపోతూనే ఉన్నాయి. కానీ, ప్రమా దాల నివారణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ఇటీవల మనుబోలు మండలం కాగితాల పూరులో ఇద్దరు పిల్లవాళ్లు తామరపూల కోసం చెరువులో దిగితే, అక్కడ గతంలో జేసిబితో మట్టితీసిన గుంతలు ఉన్నాయని తెలియక ఆ గుంతల్లో మునిగి చనిపోయారు. వారి తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. ఇదేమండలంలోని గురివిందపూడిలో చెరువులోకి దిగిన బిటెక్‌ విద్యార్ధి అక్కడ గుంతలున్నా యని తెలియక.. ఆ గుంతల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నా జిల్లా అధికారయంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తవ్వకాలపై పర్యవేక్షణ ఏదీ?...

మట్టికోసం, ఇసుక కోసం, గ్రావెల్‌ కోసం ఎవరు ఎక్కడెక్కడ గుంతలు తవ్వుతున్నారో, ఏమేరకు తవ్వు తున్నారో పూర్తిస్థాయి పర్యవేక్షణ లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం కళ్ళు తెరచి, ఆయా గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బందితో సమావేశమై నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, దొరువులు, కాలువల్లో విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండేలా చూడా లని, ఆ చర్యలు కూడా శాశ్వత ప్రాతిపదికపై ఉం డాలని వారు కోరుతున్నారు.

హెచ్చరిక బోర్డులు ఏవీ?....

గుంతలు తవ్వినప్పుడు ''ఇక్కడ గుంతలు తవ్వి వున్నాయి. ఈతకు దిగరాదు.. ప్రమాదకరం''..అని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించాలని, మర ణించినవారి కుటుంబాల నుంచి, ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుని ఎక్కడెక్కడ గోతులు తవ్వివున్నాయో, అవి నిబంధనలకు విరుద్ధమో కాదో పరిశీలించాల్సి వుందని ప్రజలు కోరుకుం టున్నారు. గుంతలు తవ్వినచోట హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయించాలని గతంలోనే జిల్లా ఉన్నతాధి కారులు ఆదేశించివున్నా, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినచోట ఆ హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గోతులు ఎక్కడ తవ్వారో గుర్తించి బోర్డులు పెట్టించాలని, లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

అదేవిధంగా, తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, తమ పిల్లలు ఎక్కడంటే అక్కడ ఈతకు దిగకుండా, తగు జాగ్రత్తతో అనుక్షణం గమనిస్తూ ఉండాలి. పిల్లల భద్రత పట్ల ఏమరుపాటుతో ఉండడం ఏమాత్రం పనికిరాదు. ప్రమాదం జరిగిపోయాక ఎంత బాధపడినా ప్రయో జనం లేదు కనుక, ప్రమాదం జరగముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా

ఉంది. అదేవిధంగా, జిల్లా ఉన్నతాధికార యం త్రాంగం ఇకనైనా ఈ ప్రమాదాలపై దృష్టిసారించాల్సి ఉంది. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారయంత్రాంగం సంబం ధిత నిపుణులు, వివిధశాఖల అధికారులతో సమా వేశమై ముందుజాగ్రత్తలను రూపొందించి, ఈ జలగండాల బారి నుంచి బిడ్డలను కాపాడాల్సివుంది.

Page 1 of 146

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter