empty chairఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ పోస్ట్‌ను. కమిషనర్‌గా వున్న వెంకటేశ్వర్లును గతేడాది డిసెంబర్‌లో బదిలీ చేశారు. విజయవాడ సిసిఎల్‌ఏలో పనిచేస్తున్న హరీష్‌ను కొత్త కమిషనర్‌గా వేసినా ఆయన ఇక్కడకు రావడానికి భయపడ్డారు. బాధ్యతలు తీసుకోవ డానికి వెనుకాడాడు. దీంతో అతను ఇక్కడకు రాడని తేటతెల్ల మైంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో దాదాపు మూడున్నర నెలల నుండి కమిషనర్‌ పోస్ట్‌లో ఇన్‌ఛార్జ్‌లు నడుస్తున్నారు. అలాగే జడ్పీ సిఇఓగా వున్న బి.రామిరెడ్డిపై ఏసిబి దాడి జరిగి ఆయన అరెస్ట్‌ కావడంతో ఆ పోస్ట్‌లో కూడా ఇన్‌ఛార్జే వున్నారు. అలాగే జిల్లా పంచాయితీ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ వున్నారు. జిల్లా అటవీశాఖ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ అధికారి చంద్రశేఖర్‌ కొనసాగుతున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజర్‌గాను, కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు సిఇఓగాను ఇన్‌ఛార్జ్‌లే ఉండడం విశేషం. సోమశిల ప్రాజెక్ట్‌ ఎస్‌.ఇగా 4నెలల నుండి ఇన్‌ఛార్జ్‌ వున్నారు. ఇక పిడబ్ల్యూడి ఎస్‌ఇగా వున్న కోటేశ్వరరావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఇరిగేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఇగా కూడా ఆయనే పనిచేస్తున్నారు. ఆయన రిటైర్‌ అయితే ఈ రెండుశాఖలకు ఎస్‌ఇలను నియమించాల్సి వుంటుంది. పూర్తి స్థాయి అధికారులు లేక ఆయాశాఖల్లో పనితీరు గాడి తప్పుతోంది. అధికారులను నియమించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది.

somiఇటు నెల్లూరుజిల్లా స్థానిక ఎమ్మెల్సీని గెలవడంతో పాటు అటు జగన్‌ సొంత జిల్లా అయిన కడప స్థానిక ఎమ్మెల్సీని కూడా తెలుగుదేశం పార్టీ గెలవడంతో పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ర్యాంకు మెరుగైనట్లుగా భావిస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనున్న దృష్ట్యా ఆయ నకు ఆ దిశగా అవకాశాలు కూడా బలపడ్డాయి. మంత్రివర్గంలో సోమిరెడ్డి అవసరం ఎంత ఉందన్నది ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది.

ఏకకాలంలో సోమిరెడ్డి ఇటు నెల్లూరుజిల్లా ఎమ్మెల్సీ ఎన్నికను చూసాడు, అటు కడపలోనూ ఇన్‌ఛార్జ్‌గా తనదైన రాజకీయ చాణక్యతను ప్రదర్శించాడు. నెల్లూరుజిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం నుండి తన పార్టీ స్థానిక ఓటర్లను నిలుపుకోవడమే కాకుండా వైసిపికి చెందిన పలువురు ఓటర్లను కూడా రాబట్టాడు. పార్టీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి గెలుపుకు గట్టిగానే కృషి చేసాడు.

ఇక కడపజిల్లాకు ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరించిన ఆయన అక్కడ కూడా తన తెలివి తేటలన్నీ చూపాడు. ముఖ్యంగా వైసిపి సభ్యులపై దృష్టిపెట్టాడు. ఎవరిని ఎక్కడ ఎలా నొక్కాలో అలా నొక్కించేసాడు. ఇందుకోసం బంధుమిత్ర బలగాలను కూడా వాడుకున్నాడు. వై.యస్‌. కంచుకోట కడపజిల్లాలో తెలుగుదేశం జెండా ఎగరడంలో సోమిరెడ్డి పాత్ర ఎంతైనా వుందని చెప్పొచ్చు.

ycp leadsఅత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి 87 ఓట్ల తేడాతో గెలిచాడు. వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి గట్టి పోటీనే ఇచ్చి ఓడిపోయాడు. ఓ దశలో వైకాపా గెలుస్తుందనే పరిస్థితి కూడా కల్పించారు. అసలు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా? అనే మీమాంస పరిస్థితి నుండి వైకాపా ఈ స్థాయి పోటీనివ్వడం గొప్ప విష యమే! మారిన సమీకరణల ప్రకారం జిల్లాలో వైకాపాకంటే తెలుగుదేశంకు 150కి పైగా ఓట్లు ఎక్కువ వున్నప్పటికి, అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ధీటుగా పోటీనిచ్చాడు. తెలుగుదేశం వాళ్ళకు రెండు వారాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసాడు. తెలుగుదేశం వాళ్ళు జిల్లాలో అర్ధబలం, అంగబలం మోహరిం చారు. అధికారాన్ని పూర్తిస్థాయిలో వాడు కున్నారు. అధికారులను కూడా వాడేసు కున్నారు. ఇద్దరు మంత్రులు జిల్లాలోనే తిష్టవేశారు. ఇక జిల్లా తెలుగుదేశం నాయకులంతా తామే పోటీ చేసామ న్నంతగా పరుగులుపెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లైతే ఉదయం, సాయంత్రం గ్యాప్‌ లేకుండా సమీక్షలు పెట్టారు. ఇంత చేసినా, తమ క్యాంప్‌లో వైసిపి కంటే దాదాపు 200 మందిని అదనంగా పెట్టు కున్నా గెలిచింది 87ఓట్ల తేడాతో!

అసలు జిల్లాలో వైకాపా నాయకత్వం సరిగా లేక ఇక్కడ ఓడిపోయిందిగాని, పక్కా వ్యూహంతో పనిచేసి వుంటే ఖచ్చి తంగా ఇక్కడ వైకాపా గెలిచిఉండేది. ఇక్కడ ఎన్నికల నిర్వహణలో వైకాపా నాయకులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి మీద ఆ పార్టీ నాయకు ల్లోనే వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకో లేకపోయారు.

జిల్లాలో వైసిపికి మేకపాటి రాజ మోహన్‌రెడ్డి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తు న్నారు. జగన్‌ కూడా జిల్లాలో పార్టీ నిర్ణయాలను ఆయనకే వదిలేస్తున్నాడు. ఆయనకు రాజకీయాలు చేతకావు. గాలి వాటంతో గెలుస్తున్నాడు. అసలు నెల్లూరు జిల్లా రాజకీయాలకే ఆయన సూటు కాడు. అయినా ఇక్కడ చక్రం తిప్పాలనుకుం టాడు. పార్టీలో ఇతరులకు అవకాశ మివ్వడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో సైలంట్‌గా చేసివుండొచ్చు. తెలుగుదేశం అభ్యర్థి రూపంలో జిల్లా వైకాపాకు ఓ మంచి అవకాశం కలిసొచ్చినట్లయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థి అయ్యుంటే వైకాపా ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. వాకాటి కాబట్టి వైకాపాకు ఒక ఛాన్స్‌ ఇచ్చినట్లయ్యింది. కాని వైకాపా వాళ్లే ఆ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నారు. మొదట్లో వైసిపిలో చేరిన అయిదారు మంది ఎంపీటీసీలకే తెగ ప్రచారం చేసారు. తామేదో ఘనకార్యం చేసినట్లు ఫోజులిచ్చారు. దీంతో చంద్రబాబుకు విషయం తెలిసి జిల్లాపై పట్టు బిగిం చాడు. తెలుగుదేశంలో వాకాటికి వ్యతి రేకంగా వున్న నాయకులను కూడా దారి లోకి తెచ్చాడు. వారి చేత వాకాటికి పని చేయించాడు. చంద్రబాబు భయంతో వాకాటి మీద వ్యతిరేకత వున్నా కూడా ఏ నాయకుడూ క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్స హించలేకపోయాడు. అప్పటికే తెలుగు దేశం శిబిరంలో ఉన్నోళ్లు కూడా కొంత వరకు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వాకాటిని వ్యతిరేకించే నాయకులు గాని క్రాస్‌ ఓటింగ్‌ చేయించుంటే తెలుగుదేశం ఓడేది. వైకాపా వాళ్ళు తొలుత చేసిన ఆగిత్యంవల్లే 'దేశం'లోని వాకాటి వ్యతి రేకులు కూడా బాబు గీసిన గీత దాట లేకపోయారు.

Page 1 of 84

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
    విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter