psyckoప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు మాదిరిగానే కనిపిస్తారు... అలాంటిదే ఇప్పుడు 'సైకో' భయం.

ఇటీవల కోవూరు పట్టణంలో ఒక సైకో ఉన్నట్లుండి దాడి చేయడం వంటి సంఘటనల ద్వారా ఎనిమిది మందిని గాయపరిచాడు. దాడి చేసి గాయపరచడం... పారిపోవడం చేస్తున్నాడు. పోలీసులు 'సైకో' కోసం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. అయినా దొరకలేదు. ఈలోపు 'సైకో' జ్వరం జిల్లా అంతటా పాకింది. ఈ జిల్లా లోని అన్ని పట్టణాలు, ఆఖరకు గ్రామాలలో కూడా 'సైకో' భయం నెలకొంది. ఆడవాళ్ళు ఒంటరిగా పోవాలంటే భయపడుతున్నారు. పసివాళ్ళు బయట ఆడుకోవా లంటే జంకుతున్నారు. వీధుల్లో చెత్త ఎరుకునేవాళ్ళను చూసినా, భిక్షమెత్తుకునే వాళ్ళను చూసినా... వీళ్ళేమన్నా 'సైకో'లా అనే ఫీలింగ్‌. ఈమధ్య కోవూరులో ఇదే ఫీలింగ్‌తో స్థానికులు మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని పట్టుకుని చావగొట్టారు. మొన్న నెల్లూరు శ్రీహరినగర్‌లో ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని చూసి ఓ మహిళ 'సైకో సైకో' అంటూ భయంతో కేకలు వేయడంతో అతను పారిపోయాడు. స్థానికులు, పోలీసులు కలిసి ఆ అజ్ఞాత వ్యక్తి కోసం గాలించారు.

పాతికేళ్ళ క్రితం నెల్లూరు జిల్లాలో ఓ పుకారు వ్యాపించింది. ఒక స్త్రీ వచ్చి అర్థరాత్రిళ్ళు తలుపు కొడుతుందని, తలుపు తీసి ఆమెను చూస్తే 'నెత్తురు' కక్కుకుని చనిపోతున్నారని... అప్పుడు ఈ భయంతోనే గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 'ఓ స్త్రీ రేపు రా' అంటూ రంగులతో వ్రాసేవాళ్ళు. అలాంటి వాతావరణమే ఇప్పుడు జిల్లాలో 'సైకో' మూలంగా నెలకొంది. వీలైనంత తొందరగా సైకోను పట్టుకుంటే గాని ఈ భయం నుండి జనం బయటపడరు.

beedaరాజ్యసభ రేసులో చివరివరకు పోరాడిన మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు చివరి క్షణంలో వెనుకబడిపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సున్నితంగా ఆయనను పక్కకు తప్పించాడు. దీంతో ఈసారి రాజ్యసభ పై గంపెడాశలు పెట్టుకున్న బిఎంఆర్‌కు చివరకు నిరాశే మిగిలింది.

2014 ఎన్నికల్లో కావలి నుండి ఓటమి చెందిన మస్తాన్‌ రావును చంద్రబాబు రాజధానికమిటిలో సభ్యులుగా నియమిం చారు. అలాగే ఆయన కావలి ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల కంటే రాజ్యసభకు వెళ్ళడమే మేలనుకున్న మస్తాన్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు గట్టిగానే ప్రయత్నించాడు కాని సఫలం కాలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మెన్‌గా కూడా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. అది కూడా సక్సెస్‌ కాలేదు.

ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ పదవులకు ఎన్నికలొ చ్చాయి. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి టీడీపీకి రెండు, వైసిపికి ఒకటి దక్కాయి. తెలుగుదేశంకు దక్కే రెండు పదవుల్లో ఒకదాని కోసం బీద మస్తాన్‌రావు గట్టిగా ప్రయత్నిం చాడు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు జిల్లా పార్టీ నాయకులు కూడా బీఎంఆర్‌కు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. చివరి వరకు కూడా బీఎంఆర్‌కు రాజ్యసభ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. అయితే చివరి క్షణంలో చంద్రబాబు మొండిచేయి చూపారు. బీదకు రాజ్యసభను ఇవ్వకపోవడానికి చంద్రబాబు చెప్పిన కారణం మీరు రాజ్యసభకు వెళితే కావలిలో ఇక అభ్యర్థి లేడని! ఇది నిజమే. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కావలి తెలుగుదేశంపార్టీకి బీద సోదరులే నాయకులు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా వున్నాడు. ఆయనకు ఇంకా పదవీ కాలం వుంది. బీద మస్తాన్‌రావు కావలి ఇన్‌ఛార్జ్‌గా వుంటున్నాడు. కావలి అసెంబ్లీకి గట్టి అభ్యర్థి బీద మస్తాన్‌రావే! ఆయన రాజ్యసభకు వెళితే కావలికి కొత్త అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఎలక్షన్‌ చేయగల సత్తా వున్నోళ్ళంతా రాజ్యసభకు, శాసనమండలికి వెళితే రేపు ఎలక్షన్‌లలో పోటీ చేసేదెవరు? ఈ కోవలోనే బీఎంఆర్‌ ఆశలు గల్లంతయ్యాయని తెలుస్తోంది.

no helmetఎందుకనో గాని నెల్లూరుజిల్లాలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ప్రయోగం విఫలమవుతూనే వుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్న నిబంధనను గతంలో ఎన్నోసార్లు అమలు చేసారు. దీని కోసం మోటార్‌ వాహనాల షోరూమ్‌లలో హెల్మెట్‌ల అమ్మకాలు కూడా పెట్టారు. బండితో పాటు హెల్మెట్‌ కొనాలనే నిబంధన తెచ్చారు. హెల్మెట్‌ లేని వాహనదారులకు పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే దానిని నిరంతరాయంగా అమలు చేయలేకపోయారు. కొద్దిరోజులు మాత్రమే ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌లు పెట్టుకున్నారు. తర్వాత యధాపరిస్థితే!

కాగా, రవాణాశాఖాధికారులు మరోసారి హెల్మెట్‌ సబ్జెక్ట్‌ను తెరమీదకు తెచ్చారు. ఈ నెల 20వ తేదీ నుండి పెట్రోల్‌ బంకుల వద్ద హెల్మెట్‌ లేని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్‌ పోయరంట. 'నో హెల్మెట్‌ - నో పెట్రోల్‌' నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తామని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తామని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పెట్రోల్‌ బంకు ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో కూడా మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్‌ వాడకం మంచిదే! ప్రజలు, ద్విచక్రవాహనదారులు కూడా దీనికి సహకరిస్తే బాగుంటుంది.

Page 1 of 131

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter